January 29, 2009

శుభసంకల్పం

సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర


హరిపాదాన పుట్టావంటే గంగమ్మా
శ్రీహరిపాదాన పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా
కడలీ .. కౌగిలినీ .. కరిగావంటే .. గంగమ్మా


నీ రూపేదమ్మా
నీ రంగేదమ్మా
నీ రూపేదమ్మా ..నీ రంగేదమ్మా
నడిసంద్రంలో నీ గడపేదమ్మా .. గంగమ్మా


నీలాల కన్నుల్లో సంద్రమే .. హైలెస్సో
నింగి నీలవంతా సంద్రమే .. హైలెస్సో
నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే


**************************************

సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రమణ్యం



సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ
రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలూ (2)


ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలూ
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలూ
ఏకమైనా చోట వేదమంత్రాలూ
ఏకమైనా చోట వేదమంత్రాలు


సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ
రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలూ


హరివిల్లు మా ఇంటి ఆకాశబంతీ
సిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
హరివిల్లు మా ఇంటి ఆకాశబంతీ
వంపులెన్నో కోయి రంపమెయ్యంగ
సినుకు సినుకుగా రాలే సిత్ర వర్ణాలూ


సొంపులన్నీ గుండె గంపకెత్తంగా
సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలూ


తళుకులై రాలేనూ తరుణి అందాలూ
తళుకులై రాలేనూ తరుణి అందాలూ
వక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు !


సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ
రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలూ


తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో


మొవ్వాకు చీర పెడతా .. మొగిలీ రేకులు పెడతా
నన్నే పెళ్ళాడతావా కన్నె సిలకా (2)


అబ్బో ఆశ !
శృంగార పెళ్ళికొడకా .. ఆ .. ఆ .. ఆ
ఇది బంగారు వన్నెసిలకా .. ఆ .. ఆ .. ఆ
శృంగార పెళ్ళికొడక .. బంగారు వన్నెసిలకా
మొవ్వాకులిస్తె రాదు మోజు పడక
మొవ్వాకులిస్తె రాదు మోజు పడకా


తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో


అయ్ .. రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్న దాన
ఏమిచ్చి తెచ్చుకోనె దీపకళికా
రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్న దాన
ఏమిచ్చి తెచ్చుకోనె దీపకళికా


రాయంటి చిన్నవోడా
మా రాయుడోరి చిన్నవోడా
మనసిచ్చి పుచ్చుకోర మావకొడకా
మనసిచ్చి పుచ్చుకోర మావకొడకా
మనువాడతాను గాని మాను అలకా !


తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో

******************************
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర


హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా


సూర్యుడైనా సలవ సెంద్రుడైనా
కోటి సుక్కలైనా అష్ఠదిక్కులైనా
నువ్వైనా అహ నేనైనా
అహ రేవైనా అహ నావైనా
సంద్రాన మీనాల సందమే
హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా


నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో .. ఓ .. ఓ .. ఓ .. హైలెస్సా
నింగి నీలవంతా సంద్రమే .. హైలెస్సో .. ఓ .. ఓ .. హైలెస్సా


నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే
నేల కరిగిపోతె సంద్రమే ..
నేల కరిగిపోతె సంద్రమే .. నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే
నేల కరిగిపోతె సంద్రమే .. నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే


నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే
నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే


Live is a holiday jollyday .. హైలో హైలెస్సా
Spend it a way in a fabuous way .. హైలో హైలెస్సా


Twinkle little star .. I know what you are
జానే భీదో యార్ గోలీతో మార్ (2)


హైలెస్సో హైలెస్సా .. life is a తమాషా
You sing it a హమేషా .. I don’t know సాపాసా
నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే
హైలెస్సో .. ఓ .. ఓ .. ఓ .. హైలెస్సా !


ఆకతాయి పరువాల కొంటెగోలా .. కోటి సంబరాలా
(ఆకతాయి పరువాల కొంటెగోలా .. కోటి సంబరాలా)
ఆపకండి ఈవేళా కూనలాలా .. కొత్త వానలాలా
(ఆపకండి ఈవేళా కూనలాలా .. కొత్త వానలాలా )


కోటి సంబరాలా .. కొత్త వానలాలా
(కోటి సంబరాలా .. కొత్త వానలాలా)
ఛెంగుమంటు గంగ పొంగులెత్తువేళా .. ఆ .. ఆ .. ఆ
హోయ్ .. ఛెంగుమంటు గంగ పొంగులెత్తువేళా
వళ్ళు మరచి పోవాలీ నింగీ నేలా
(వళ్ళు మరచి పోవాలీ నింగీ నేలా)


నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే
నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే

2 comments:

చైతన్య said...

nice songs... haripadana puttante gangamma... song naku chala ishtam!

kaveri said...

Good information telangana
has been information