January 27, 2009

నువ్వొస్తానంటే..నేనొద్దంటానా

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, సుమంగళి

నిలువద్దము నిను ఎపుడైనా..నువు ఎవ్వరు అని అడిగేనా..ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీపేరైనా..నువు కాదని అనిపించేనా..ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా

నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తీయదనం నాపేరేనా
అది నువ్వే..అని నువ్వే చెబుతూ ఉన్నా
లర లాయ్ ల లాయ్ లాయ్ లే.. లర లాయ్ ల లాయ్ లాయ్ లే

హేయ్ .. నిలువద్దము నిను ఎపుడైనా..నువు ఎవ్వరు అని అడిగేనా..ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

హా..ప్రతి అడుగూ..తనకు తానే..సాగింది నీ వైపు నా మాట విననంటు నే ఆపలేనంతగా
భయపడకూ..అది నిజమే..వస్తుంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకూ నీకెవ్వరిచ్చారు హక్కూ

నీప్రేమనే ప్రశ్నించుకో..ఆ నింద నాకెందుకు
లర లాయ్ ల లాయ్ లాయ్ లే.. లర లాయ్ ల లాయ్ లాయ్ లే

నిలువద్దము నిను ఎపుడైనా..నువు ఎవ్వరు అని అడిగేనా..ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

హా..ఇదివరకూ..ఎద లయకూ..ఏ మాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకూ..నను అడుగూ..చెబుతాను పాఠాలు నీ లేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
మంచేతిలో ఉంటే కదా ప్రేమించటం .. మానటం
లర లాయ్ ల లాయ్ లాయ్ లే.. లర లాయ్ ల లాయ్ లాయ్ లే

నిలువద్దము నిను ఎపుడైనా..నువు ఎవ్వరు అని అడిగేనా..ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

నువు విన్నది నీపేరైనా..నిను కాదని అనిపించేనా..ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నా పేరుకు ఆ తియ్యదనం నీ పెదవే అందించేనా
అది నువ్వే..అని నువ్వే చెబుతూ ఉన్నా

No comments: