నువ్వు నాకు గుర్తొస్తే.. ఎవ్వరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప... నువ్వు నా పక్కన ఉంటే అసలు నేనే ఉండను, నువ్వు తప్ప
March 03, 2010
మంత్రిగారి వియ్యంకుడు (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, జానకి
ఏమని నే .. చెలి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
తోటలలో .. పొదమాటులలో .. తెర చాటులలో
ఏమని నే .. మరి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
నవ్వు .. చిరునవ్వు .. విరబూసే పొన్నలా
ఆడు .. నడయాడు .. పొన్నల్లో నెమలిలా
పరువాలే పార్కుల్లో .. ప్రణయాలే పాటల్లో
నీ చూపులే నిట్టూర్పులై .. నా చూపులే ఓదార్పులై
నా ప్రాణమే నీ వేణువై .. నీ ఊపిరే నా ఆయువై
సాగే .. తీగసాగే .. రేగిపోయే .. లేత ఆశల కౌగిట
ఏమని నే .. మరి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
చిలకా .. గోరింకా .. కలబోసీ కోరికా
పలికే .. వలపంతా .. మనదేలే ప్రేమికా
దడపుట్టే పాటల్లో .. నీ దాగుడు మూతల్లో
నవ్విందిలే బృందావనీ .. నా తోడుగా ఉన్నావని
ఊగే .. తనువులూగే .. వణకసాగే .. రాసలీలలు ఆడగ
ఏమని నే .. మరి పాడుదునో
తొలకరిలో .. తొలి అల్లరిలో .. మన అల్లికలో
ఏమని నే .. చెలి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
January 07, 2010
ఓం శాంతి
సంగీతం: ఇళయరాజా
గానం: కునాల్ గంజావాలా, సునిధి చౌహాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ
జంటగా జంటగా నువ్వు కలిసాకా
ఇంతగా ఇంతగా చేరువవుతున్నాకా
ఊగుతూ ఊగుతూ ఈ ఊహలే ..
ఉలికి పడుతుంటే ఓ హో హొ హో .. మదికి కుదురేదే ఓ హో హొ హో
చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ
నూరేళ్ళ వలపు కధా .. ఇపుడు అది మొదలు కదా
రోజుకో జన్మనే చూపుతుందా
లోలోన కలల సుధా .. కనులలో కురిసినదా
చూపులో కాంతులే నింపుతుందా
నడకలకు తెలియదు దూరం .. నీకు తెలుసా
నవ్వులకు లేదిక బంధం .. ఏంటి వరసా
పదపదమని .. ఈ ప్రతిక్షణముని
తరమకు ఈ వేళా .. ఆగనీ !
చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ
జంటగా జంటగా నువ్వు కలిసాకా
ఇంతగా ఇంతగా చేరువవుతున్నాకా
ఊగుతూ ఊగుతూ ఈ ఊహలే ..
ఉలికి పడుతుంటే ఓ హో హొ హో .. మదికి కుదురేదే ఓ హో హొ హో
చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ
మేఘాలు మెరిపు వలా .. మనసుపై విసిరెనిలా
తీయనీ తలపులే తుళ్ళిపడవా
రాగాల చురుకు అలా .. పరుగులను తడిమెనిలా
మాటగా మాటలే బయటపడవా
ఎవరికీ హాయే లేదూ ఇంతవరకూ ..
చివరి ఊపిరిలో కూడా హాయి మనకూ ..
మనసొక సగం .. తనువొక సగం
చెరిసగమవుతున్నాం .. ఇద్దరం !
చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
చిలిపి కోరికే ఎందుకమ్మా .. చీటికీ మాటికీ
**************************
Sad Version:
చిన్న పోలికే లేదు ప్రేమా .. నిన్నకీ నేటికీ
ఎదకి భారమే ఎందుకమ్మా చీటికీ మాటికీ
జంటలో జంటలో నువ్వు విడిపోతే
ఇంతగా ఇంతగా నవ్వు కరువైపోతే
ఆగదే ఆగదే నా పాదమే ..
వెతకమంటుందే నీ ప్రేమనే ..వెలగవంటుందే నువ్వు లేకనే
April 22, 2009
వసంత కోకిల
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హౄదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
కొండవీటి దొంగ
సాహిత్యం : వేటూరి
గానం : యస్.పి.బాలు, చిత్ర
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
తొలిముద్దు జబు రాసా చెలికే ఎపుడో
చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతు నిచ్చి కొమ్మకీ
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకీ
మల్లె వీణ లాడెనేమొ బాల నీలవేణికీ
మెచ్చీ మెచ్చీ చూడసాగె గుచ్చే కన్నులూ
గుచ్చీ గుచ్చీ కౌగిలించే నచ్చే వన్నెలూ
అంతేలే..కధంతేలే..అదంతేలే..
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
హంసలేఖ పంపలేక హిమస పడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా రేణు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలూ
వళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలూ
అంతేలే..కధంతేలే..అదంతేలే..
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
March 02, 2009
మౌనగీతం
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి
Hello !
Hi.
Good morning !
Good morning.
How do you do?
Fine. Thank you.
How about joining me?
Ok, with pleasure.
పరువమా .. చిలిపి పరుగు తీయకూ
పరువమా .. చిలిపి పరుగు తీయకూ
పరుగులో .. పంతాలు పోవకూ
పరుగులో .. పంతాలు పోవకూ
పరువమా ..
చిలిపి పరుగు తీయకూ
ఏ ప్రేమ కోసమో .. చూసే చూపులూ
ఏ కౌగిలింతకో .. చాచే చేతులూ
తీగలై .. హో .. చిరుపూవులై పూయ
గాలిలో .. హో .. రాగాలుగా మ్రోగా
నీ గుండె వేగాలు తాళం వేయా !
పరువమా ..
చిలిపి పరుగు తీయకూ
ఏ గువ్వ గూటిలో .. స్వర్గం ఉన్నదో
ఏ చెట్టు నీడలో .. సౌఖ్యం ఉన్నదో
వెతికే .. హో .. నీ మనసులో లేదా
దొరిక్తే .. హా .. జత కలుపుకో రాదా
అందాక అందాన్ని ఆపేదెవరూ !
పరువమా ..
చిలిపి పరుగు తీయకూ
February 25, 2009
అంతఃపురం (1999)
సాహిత్యం : సిరివెన్నెల
గానం: చిత్ర
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకనీ .. వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని .. చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లలరల్లరి సాగించాలి
ఏకమై .. ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా !
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని .. బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని .. కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు .. చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు .. హాహాకారం
మళ్ళీ మళ్ళీ ..
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
**********************************************
గానం: చిత్ర
కళ్యాణం కానుంది కన్నె జానకీ
వైభోగం రానుంది రామచంద్రుడికీ
దేవతలే దిగి రావాలీ.. జరిగే వేడుకకీ
రావమ్మా సీతమా .. సిగ్గు దొంతరలో
రావయ్యా రామయ్యా .. పెళ్ళి శోభలతో
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా
ఊరేగే పువ్వుల్లో .. చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే .. అన్నీ నీ కోసమే !
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా
నాలో ఎన్ని ఆశలో .. అలల్లా పొంగుతున్నవీ
నీతో ఎన్ని చెప్పినా .. మరెన్నో మిగులుతున్నవీ
కళ్ళల్లోనే వాలీ నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
ఆ గగనాన్నే ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రలన్నీ ఇలా కలలై వచ్చాయీ
చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా !
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా
ఇట్టే కరుగుతున్నదీ మహాప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నదీ ఎలా కాలాన్ని ఆపడం
మదిలా మంటే నేడు తీయని శృతిగా మారి ఎటో పోతుంటే
కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తను వస్తుందే
ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి
పాపాయి చేసి .. నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా !
ఆకాశం అంతఃపురమయ్యిందీ
నాకోసం అందిన వరమయ్యిందీ
రావమ్మా మహరాణి ఏలాలీ కాలాన్నీ
అందీ ఈ లోకమే .. అంతా సౌందర్యమే !
ఆకాశం అంతఃపురమయ్యిందీ
నాకోసం అందిన వరమయ్యిందీ
నిరీక్షణ (1986)
సాహిత్యం:
గానం: ఎస్.జానకి
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నీవు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా
యమునా ఎందుకె నీవు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా
నల్లా నల్లని వాడు..నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
వెన్నంటి వెంటాడి వస్తాడే ముద్దూ
కన్నట్టే గీటేసి పెడతాడె కిస్సూ (2)
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడె
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడె
దారివ్వకే చుట్టూ తారాడుతాడే
పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బా ఏం పిల్లడే..
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
శిఖిపింఛమఊళన్న పేరున్నవాడే..
శృంగారరంగాన కడతేరినాడే (2)
రేపల్లెలోకల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే
మురళీలోకుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నీవు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా
యమునా ఎందుకె నీవు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా
నల్లా నల్లని వాడు..నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
***************************************************
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కె.జె.ఏసుదాస్
సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే నెతికానే
సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపం లో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈ నాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం .. ఎన్నాళ్ళకు చేరం .. తీరందీ నేరం !
సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే ..ఏడ బోయావే
తానాలే చేసాను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటీ నా కళ్ళలొ కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం .. ఇన్నేళ్ళకు వ్యర్ధం .. చట్టందే రాజ్యం !
సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే నెతికానే
సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
*************************************
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.జానకి
ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో .. ఆనాడే తెలిసిందదీ
ఆవేశం ఏనాడు కలిగెనో .. ఆనాడే తెలిసిందదీ
ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ (2)
ఏ పువ్వూ ఏ తేటిదన్నది .. ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది .. ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు .. అందాలే దాసోహమనవా
మందారం విరబూయు పెదవులు .. మధువులనే చవిచూడమనవా
పరువాలే .. ప్రణయాలై
స్వప్నాలే .. స్వర్గాలై
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను
ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో .. ఆనాడే తెలిసిందదీ
ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఏ మేఘం ఏ వాన చినుకై .. చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండె లోతున .. ఏ గీతం పలికించునో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనవా
కౌగిలిలో చెరవేసు మదనుని కరిగించీ గెలిపించమనవా
మోహాలే .. దాహాలై
సరసాలే .. సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలవేని నిలువలు
ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో .. ఆనాడే తెలిసిందదీ
February 14, 2009
క్షత్రీయ పుత్రుడు
గానం : SP బాలు ,జానకి
సన్నజాజి పడకా...
మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది
మాయనీ ఊసే పొంగి పాటై రావే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్నీ
పండు వెన్నెలంటి ఈడు యెండల్లొన చిన్నబోతే
పండించగ చెరుకున్న నీ దరికి
అండ దండ నీవేనని పండగంత నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే
కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
గుండే పంచే వెళయినది రావే
దిండే పంచే వెళయినది రావే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
February 03, 2009
దళపతి
సాహిత్యం: రాజశ్రీ
గానం: స్వర్ణలత
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు జూసెనే రాధా
ప్రేమపొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో ..వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా !
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు జూసెనే రాధా
ప్రేమపొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
ధర్మక్షేత్రం
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో
మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా
ఓ .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో
అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా
హో .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
January 21, 2009
మంత్రిగారి వియ్యంకుడు (1983)
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి, బాలు
ఏమని నే చెలి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
తోటలలో .. పొదమాటులలో .. తెరచాటులలో
ఏమని నే మరి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
నవ్వూ .. చిరునవ్వూ .. విరబూసే పొన్నలా
ఆడు .. నడయాడు .. పొన్నల్లో నెమలిలా
పరువాలే పాన్పుల్లో .. ప్రణయాలే పాటల్లో
నీ చూపులే నిట్టూర్పులై .. నా చూపులే ఓదార్పులే
నా ప్రాణమే నీ వేణువై .. నీ ఊపిరే నా ఆయువై
సాగే తీగ సాగే .. రేగిపోయే .. లేత ఆశల కౌగిట
ఏమని నే మరి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
చిలకా .. గోరింకా .. కలబోసే కోరికా
పలికే వలపంతా మనదేలే ప్రేమికా
దడపుట్టే పాటల్లో .. ఈ దాగుడుమూతల్లో
ఏ గోపికో దొరికిందనీ .. ఈ రాధికే మరుపాయెనా
నవ్విందిలే బృందావనీ .. నా తోడుగా ఉన్నావనీ
ఊగే .. తనువులూగే .. వణకసాగే .. రాసలీలలు ఆడగ
ఏమని నే మరి పాడుదునో
తొలకరిలో .. తొలీల్లరిలో .. మన అల్లికలో
ఏమని నే చెలి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
January 09, 2009
అశ్వమేధం
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఆశా భోన్స్లే
శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
కౌగిట్లొ రద్దే ప్రాతఃకాలం
వలపమ్మ జల్లే వానాకాలం
సిగ్గమ్మ కొచ్చే పోయే కాలం (2)
ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
చేగాలికే చెదిరే నడుమే .. పూగాలికే పొదలా వణికే
ఊరింపుతో ఉడికే పెదవే .. లాలింపుగా పెదవే కలిపే
సన్నగిల్లే .. చెలి వెన్ను గిల్లే
ఆకలింతే .. తొలి కౌగిలింతే
చలి అందాలన్నీ చందాలిస్తా .. ఓ ఓ ఓ
శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
కౌగిట్లొ రద్దే ప్రాతఃకాలం
వలపమ్మ జల్లే వానాకాలం
సిగ్గమ్మ కొచ్చే పోయే కాలం
శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
నూనూగుగా తగిలే తనువే .. నాజూకుగా తపనై రగిలే
నీ వంపులో ఒదిగే తళుకే .. కవ్వింపులే కసిగా అలికే
జివ్వుమంటే .. ఎద కెవ్వుమంటే
జవ్వనాలే .. తొలి పువ్వు పూసే
పొద పేరంటాలే ఆడించేస్తా .. ఓ ఓ ఓ
శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
కౌగిట్లొ రద్దే ప్రాతఃకాలం
వలపమ్మ జల్లే వానాకాలం
సిగ్గమ్మ కొచ్చే పోయే కాలం
ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
ఆ .. శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
**************************
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం (2)
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైకముళ్ళ రేవులో దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో !
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
కొప్పులోన సంపెంగంట .. ఆ పువ్వు మీద నా బెంగంట
తొలి రేకూ సోకూ నీకే ఇస్తా
నవ్వు జాజి పూలేనంట .. నేను తుమ్మెదల్లె వాలేనంట
మరు మల్లే జాజీ మందారాలా పానుపేస్తానంట
మురిపాలు పోస్తాలే !
వేసుకుంటా గడియా .. విడిపోకు నన్నీ ఘడియా
దాస్తే చూస్తావు చూస్తే దోస్తావు అల్లారు అందాలు హోయ్ !
కుడి ఎడమ …
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైకముళ్ళ రేవులో దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో !
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
కంచి పట్టు చీరే కట్టీ .. నిను కంచె లాగ నేనే చుట్టీ
అరె చెంగే కాస్తా చేనే మేస్తా
వెన్నపూస మనసే ఇచ్చీ .. చిరు నల్లపూస నడుమే ఇస్తే
అరె కవ్వం లాగా తిప్పీ తిప్పీ .. కౌగిలిస్తానంట .. నను కాదు పొమ్మన్నా !
తొలిసారి విన్నా మాటా .. ప్రతి రేయి నా పాటా
నీతో పేచీలు రాత్రే రాజీలు నా ప్రేమ పాఠాలు హొయ్ !
కుడి ఎనక ..
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైకముళ్ళ రేవులో దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో !
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి ఘుమ ఘుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
*****************************************
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి
ఏందెబ్బ తీసావురా .. ఓయబ్బ నచ్చావురా
ఓ బాలికా .. మెచ్చానులే
నీ కోరికే .. గ్రహించానులే
అల్లాడి పోయాను రా
ఆహా .. ఏందెబ్బ తీసావురా .. ఓయబ్బ నచ్చావురా
బాలయ్యా .. కన్నె బెంగ తీరేదారేదయ్యా
బావయ్యా .. సిగ్గు చీర దోస్తే దోస్తేనయ్య
రాధమ్మా .. పొన్న చెట్టు నీడల్లోనే చుమ్మా
అత్తమ్మా .. వెన్న దుత్త దాస్తావే గుమ్మా
ఏలయ్యా ఇంత తొందరా .. గోలయ్యా కాంత ముందరా
ఓ లమ్మీ నీది బంధరా .. వళ్ళమ్మీ ఇవ్వు నా ధరా
అమ్మాయీ ఆగడం .. అబ్బాయీ రేగడం
రమ్మనలేకా .. ఇమ్మనలేకా .. పొమ్మని లేకా .. కమ్మని కేకా
ఏందెబ్బ తీసావురా .. ఓయబ్బ నచ్చావురా
నీజబ్బా .. నిబ్బరాలు బాగా చూసేస్తున్నా
జాకెట్టై .. ఉబ్బరాల పాగా వేసేస్తున్నా
హాయబ్బా .. కన్నె మబ్బు నేనై కమ్మేస్తున్నా
నీ గాలై .. సోకు పూల వానై కాటేస్తున్నా
ఓలమ్మీ వళ్ళు భద్రమే .. పొంగొస్తే తుంగభధ్రమే
కుర్రాడా కూత చాలురా .. గుడివాడా కోతలాపరా
నీ కొంప ముంచటం .. నీ గంప దించటం
కోతలు కావే .. చేతలు లేవే .. మోతలు రేపే .. మోజులు నావే
ఏం దెబ్బ చూసావులే .. ఓ యబ్బ ముందుందిలే
ఓ ప్రేమికా .. మెచ్చానురా
నే ఘాటుగా .. వరించానురా
పెళ్ళాడుకుందాములే
ఏం దెబ్బ చూసావులే .. అహ ఓ యబ్బ నచ్చావురా
**************************************
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి
చెప్పనా ఉన్న పని .. చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకూ పాత పని .. చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
నువ్వు అదరహం .. నవ్వు ముదరహం
పువ్వుల కలహం .. యవ్వన విరహం .. నీపై మోహం !
చెప్పనా ఉన్న పని .. చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకూ పాత పని .. చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
నున్నబడినా నీ మెడపై వెన్నెలే చెమటా
సన్నబడినా నీ నడుమే మీటనీ అచటా
ఎంత తిమ్మిరిగా ఉంటే అంత కమ్మనిదీ
ఎంత కమ్మనిదో ప్రేమా అంత తుంటరిదీ
చూపులో ఉంటాయి ఊటీలూ .. షేపులో అవుతాయి బ్యూటీలూ
వంటిలో ఉంటుంటే డిగ్రీలూ .. చంటిలో వస్తాయి యాంగ్రీలూ
మల్లెపూలే నిద్రలేకా మండిపోతుంటే
లవ్ లవ్ !
చెప్పనా ఉన్న పని .. చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకూ పాత పని .. చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
నువ్వు అదరహం .. నవ్వు ముదరహం
పువ్వుల కలహం .. యవ్వన విరహం .. నీపై మోహం !
చెప్పనా ఉన్న పని .. చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకూ పాత పని .. చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
ఎర్రబడినా నీ కనులా నీడలే పిలుపూ
వెంటబడినా నీ కధలా అర్ధమే వలపూ
పచ్చి కౌగిలినే నీతో పంచుకోమందీ
గుచ్చి గుత్తులుగా అందం గుంజుకోమందీ
గిచ్చితే పుడతాయి గీతాలూ .. చీకటే పులకింతే గీతాలూ
చూడనీ అందంగ ఆగ్రాలూ .. జోడుగా శుభస్య శీఘ్రాలూ
చందమామే చెమ్మ లేక ఎండిపోతుంటే
లవ్ లవ్ !
చెప్పనా ఉన్న పని .. చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకూ పాత పని .. చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
నువ్వు అదరహం .. నవ్వు ముదరహం
పువ్వుల కలహం .. యవ్వన విరహం .. నీపై మోహం !
చెప్పనా ఉన్న పని .. చెయ్యనా కాస్త పని
జంటగా పని ఉందమ్మో
చెప్పకూ పాత పని .. చేసుకో కొత్త పని
ఇంతకీ పని ఏందయ్యో
****************************************
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఆశా భోన్స్లే
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
ఇంక ఏదేమైనా రావే మైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అదరాలి నాలో అందం .. అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం .. మురిపాలు పిండేస్తే
ఒక మాటో .. అర మాటో .. అలవాటుగా మారే వేళ
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
చలువరాతి హంస మేడలో ఎండే చల్లనా
వలువ చాటు అందె గత్తెలో వయసే వెచ్చనా
వసంతపు తేనె తోనే .. తలంటులే పోయనా
వరూధినీ సోయగాలా .. వరాలు నే మీటనా
నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం
నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం
నువ్వు కవ్విస్తుంటే నవ్విందీ రాగం
రెండు గుండెల్లోనా తప్పిందీ తాళం
మురిసింది తారా మూగాకాశంలో ..
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసి రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
ఇంక నేనేమైనా నీకేమైనా గాలై వీచి కూలే ప్రేమ తెలుసా
విధి నిన్ను ఓడిస్తుంటే .. వ్యధలాగ నేనున్నా
కధ మారి కాటేస్తుంటే .. కొడిగట్టి పోతున్నా
ఎడబాటే ఎద పాటై చలి నీరుగా సాగే వేళ
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
మనసులోన తీపి మమతలూ ఎన్నో ఉంటవీ
ఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా అవీ
ఎడారిలో కోయిలమ్మ .. కచేరి నా ప్రేమగా
ఎదారినా దారిలోనే .. షికారులే నావిగా
కన్నె అందాలన్ని పంపే ఆహ్వానం
కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం
స్వర్గలోకంలోనే పెళ్ళీ పేరంటం
సందె మైకంలోనే పండే తాంబూలం
మెరిసింది తారా ప్రేమాకాశంలో ..
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
ఇంక ఏదేమైనా రావే మైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అదరాలి నాలో అందం .. అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం .. మురిపాలు పిండేస్తే
ఒక మాటో .. అర మాటో .. అలవాటుగా మారే వేళ
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసి రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
December 29, 2008
ఆదిత్య 369
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: బాలు, ఎస్.జానకి
రాసలీల వేళ..రాయబారమేలా
మాటే మౌనమై మాయజేయ నేల
రాసలీల వేళ..రాయబారమేలా
కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయె వేసవీ చల్లె పగటి వెన్నెలా
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిటా అందమైన జాబిలీ
తేనె వానలోన చిలికె తీయనైన స్నేహమూ
మేని వీణ లోన పలికె సోయగాల రాగమూ
నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని
రాసలీల వేళ..రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేల
రాసలీల వేళ..రాయబారమేలా
మాయచేసి దాయకూ సోయగాల మల్లెలూ
మోయలేని తీయనీ హాయి పూల జల్లులూ
చేరదీసి చెంతకూ భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకూ ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు
రాసలీల వేళ..రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేల
రాసలీల వేళ..రాయబారమేలా
ఓ పాపా లాలి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా (2)
వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసలు నన్నే మరిపించే !
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే !
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా (2)
అభినందన
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావే
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
గాయాన్నైనా మాన నీవు
హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కానీదు
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావే
ఎదుటా నీవే యెదలోన నీవే
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింత బలముందా
*******************************************************************************
గానం : బాలు , జానకి
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మధునితో జన్మ వైరం సాగినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో
*************************************************************************
గానం : బాలు
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతము ఏదీ లేని గానము
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా అదే ఆశ గా
అదే బాసగా అదే ఆశ గా
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
గుణ
గానం : బాలు,శైలజ
కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలొ
ఒహోకమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
గుండెల్లో గాయమేదొ చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా
మౌనరాగం
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా .. ఏల అదేలా
ఆవేదనే .. ఈనాటికీ .. మిగిలింది నాకూ !
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా
తామరలపైనా నీటిలాగా .. భర్తయూ భార్యయూ కలవరంటా
తోడుగా చేరీ బ్రతికేందుకూ .. సూత్రమూ మంత్రమూ ఎందుకంటా
సొంతం అనేది లేకా .. ప్రేమ బంధాలు లేకా .. మోడంటి జీవితం ఇంకేలా ! హ !
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళ
వేదికై పోయే .. మన కధంతా .. నాటకం ఆయెనూ మనుగడంతా
శోధనై పోయే .. హృదయమంతా .. బాటలే మారెనే పయనమంతా
పండిచవే వసంతం .. పంచవేలా సుగంధం .. నా గుండె గుడిలో నిలవాలీ .. రా !
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా .. ఏల అదేలా
ఆవేదనే .. ఈనాటికీ .. మిగిలింది నాకూ !
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా
December 27, 2008
పల్లవి అనుపల్లవి
గానం : SP బాలు, జానకి
ల ల లా లల లా లల లా లలాలా
కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో
వినిపించెను శ్రీ రాగం
కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం
నీ నవ్వులో విరిసె మందారము
నీ చూపులో కురిసే శృంగారము
నీ మాటలో ఉంది మమకారము
నా ప్రేమకే నీవు శ్రీకారము
పరువాలు పలికేను సంగీతము
నయనాలు పాడేను నవ గీతము
నేనే నీకు కానా ప్రాణం
నీవే నాకు కావా లోకం
కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం
నీ గుండె గుడిలో కొలువుండనీ
నీ వెంట నీడల్లే నను సాగని
నీ పూల ఒడిలో నను చేరనీ
నీ నుదుట సింధురమై నిలవనీ
చెవిలోన గుసగుసలు వినిపించనీ
ఎదలోన మధురిమలు పండించనీ
నీలో నేనే కలగా ఉంటూ
రోజూ స్వర్గం చూడాలంట
కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో
వినిపించెను శ్రీ రాగం
December 23, 2008
ఏప్రిల్ 1 విడుదల (1991)
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర
ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ .. మగతావినీ .. ముడి వేయనీయవా
కాదనీ .. అనలేననీ .. గడి అయిన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
(హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ)
ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !
(మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే భద్రామి శుభకే త్వం జీవ శరదస్యకం
త్వం జీవ శరదస్యకం .. త్వం జీవ శరదస్యకం !)
కాంక్షలో కైపు నిప్పూ .. ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా .. మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం .. గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం .. మరయాగ వాటికా
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !
నిష్ఠగా నిన్ను కోరీ .. నీమమే దాటినా
కష్ఠమే సేద తీరే .. నేస్తమే నోచనా
నిద్రహం నీరు గారే .. జ్వాలలో నించినా
నేర్పుగా ఈది చేరే .. నిశ్చయం మెత్తనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో
ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ .. మగతావినీ .. ముడి వేయనీయవా
కాదనీ .. అనలేననీ .. గడి అయిన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
(హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ)
ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !
**************************************************
గానం: మనో, చిత్ర
ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !
మెత్తగా వళ్ళో .. పెట్టుకో కాళ్ళూ
ఉందిగా అంక పీఠం .. ఆడపుట్టుకే అందుకోసం
గట్టిగా పట్టుకో .. భక్తిగా అద్దుకో
పుచ్చుకో పాద తీర్ధం .. పాద పూజలే ఆది పాఠం
చాకిరీ చెయ్యనా బానిసై .. నీ సేవలే చెయ్యనా పాదుషా
దీవెనే తీసుకో బాలికా .. నీ జీవితం సార్ధకం పొమ్మికా
మొక్కులే తీరీ .. అక్కునే చేరీ .. దక్కెనే సౌభాగ్యం
చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !
నచ్చెనే నారీ .. వచ్చెనే కోరీ ..
తెచ్చెనే ప్రేమ సౌఖ్యం .. సాటి లేనిదీ ఇంటి సఖ్యం
మెచ్చెనే చేరీ .. ముచ్చటే తీరీ
ఇచ్చెనే ప్రేమ రాజ్యం .. అంతులేనిదే సంతోషం
స్వప్నమే సత్యమై వచ్చెనేమో .. వెచ్చగా సర్వమూ పంచగా
స్వర్గమే సొంతమై దక్కెనేమో .. అచ్చటా ముచ్చటా తీర్చగా
మక్కువే మీరీ .. ముద్దులే కోరీ .. అందెనా ఇంద్రభోగం
ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !
*******************************************
గానం: మనో, చిత్ర
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా (2)
నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా
షోలే ఉందా ?
ఇదిగో ఇందా ..
చాల్లే ఇది జ్వాల కాదా..
తెలుగులో తీశారే బాలా !
ఖైదీ ఉందా?
ఇదిగో ఇందా..
ఖైదీ కన్నయ్య కాదే ..
వీడికి అన్నయ్య వాడే !
జగదేకవీరుడి కధా..ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల .. అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా
ఒకటా రెండా .. పదులా వందా
బాకీ ఎగవేయకుండా .. బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా .. మతి పోయిందా
చాలే నీ కాకి గోలా .. వేళా పాళంటూ లేదా
ఏవైంది భాగ్యం కధా? కదిలిందా లేదా కధా?
వ్రతమేదో చేస్తుందంటా .. అందాక ఆగాలటా
సౌఖ్యంగా బ్రతకాలీ .. సౌఖ్యాలే పొందాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా
December 18, 2008
స్వర్ణకమలం (1988)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి
కొత్తగా రెక్కలొచ్చెనా .. గూటిలోనీ గువ్వపిల్లకీ
మెత్తగా .. రేకు విచ్చెనా ..
మెత్తగా .. రేకు విచ్చెనా .. కొమ్మచాటు నున్న కన్నెమల్లెకి
కొమ్మచాటు నున్న కన్నెమల్లెకి
కొత్తగా రెక్కలొచ్చెనా .. మెత్తగా రేకు విచ్చెనా ..
కొండదారి మార్చిందీ కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చిందీ కలికి ఏటి నీరు
కొండదారి మార్చిందీ .. కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చిందీ .. కలికి ఏటి నీరు
బండరాళ్ళ హోరుమారీ పంటచేల పాటలూరి
బండరాళ్ళ హోరుమారీ పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగణి ఊగేలా
సిరి చిందు లేసింది కనువిందు చేసింది
కొత్తగా రెక్కలొచ్చెనా ..
మెత్తగా రేకు విచ్చెనా ..
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలీ
ఎదురులేక ఎదిగింది మధురగాన కేళి
వెదురులోకి ఒదిగింది .. కుదురులేని గాలీ
ఎదురులేక ఎదిగింది .. మధురగాన కేళి
భాషలోన రాయలేనీ రాసలీల రేయిలోని
అబ్బా !
భాషలోన రాయలేనీ రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శృంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
కొత్తగా రెక్కలొచ్చెనా .. గూటిలోనీ గువ్వపిల్లకీ
మెత్తగా .. రేకు విచ్చెనా ..
మెత్తగా .. రేకు విచ్చెనా .. కొమ్మచాటు నున్న కన్నెమల్లెకి
కొమ్మచాటు నున్న కన్నెమల్లెకి
కొత్తగా రెక్కలొచ్చెనా .. మెత్తగా రేకు విచ్చెనా !
*******************************************
గానం: ఎస్.జానకి
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ ఆలోకం అందుకోనా
ఆదమరిచీ ఈ కలకాలం ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా .. వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా .. సందెల్లో రంగులెన్నో చిలికెయ్ నా
పిల్లగాలే పల్లకీగా .. దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం .. నవరాగాలే .. నాట్యమాడెనుగా !
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ ఆలోకం అందుకోనా
ఆదమరిచీ ఈ కలకాలం ఉండిపోనా
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం .. స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం .. ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగానా .. చందమామా మందిరానా
నా కోసం .. సురభోగాలే .. వేచి నిలిచెనుగా
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ ఆలోకం అందుకోనా
ఆదమరిచీ ఈ కలకాలం ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
****************************************************
గానం: వాణీ జయరాం, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
గురుః బ్రహ్మా
గురుః విష్ణుః
గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవే నమః
ఓం నమో నమో నమఃశివాయ !
మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయా
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయా
ఓం నమో నమో నమఃశివాయ !!
శూరినే నమో నమః కపాలినే నమః శివాయా
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయా
అందెల రవమిది పదములదా ..
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా .. అమితానందపు ఎద సడిదా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా !
అందెల రవమిది పదములదా ..
మువ్వలు ఉరుముల సవ్వడులై .. మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై .. మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై .. మేని విసురు వాయువేగమై
హంగ భంగిమలు గంగ పొంగులై .. హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీలా .. రసఝరులు జాలువారేలా
జంగమమై జడ పాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా ..
నయన తేజమే నకారమై ..
మనో నిశ్చయం మకారమై ..
శ్వాస చలనమే శికారమై ..
వాంచితార్ధమే వకారమై ..
యోచన సకలము యకారమై ..
నాధం నకారం
మంత్రం మకారం
స్తోత్రం శికారం
వేధం వకారం
యజ్ఞం యకారం
ఓం నమః శివాయ !
భావమె భౌనపు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా .. తాండవ మాడే వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగా .. పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా .. అమితానందపు ఎద సడిదా
అందెల రవమిది పదములదా !
*******************************************
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
నటనాంజలితో బ్రతుకును తరీంచనీవా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
పడమర పడగలపై .. మెరిసే తారలకై
పడమర పడగలపై .. మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరీ
తూరుపు వేదికపై .. వేకువ నర్తకివై
తూరుపు వేదికపై .. వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోదు ఎక్కడా
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
జలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
గగన సరసి హృదయంలో ..
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
************************************
గానం: ఎస్.పి.శైలజ
చేరి యశోదకు శిశువితడూ
చేరి యశోదకు శిశువితడూ
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడూ
చేరి యశోదకు శిశువితడూ
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడూ
చేరి యశోదకు శిశువితడూ
సొలసి చూచినను సూర్య చంద్రులను
లలివేద చల్లెడు లక్షణుడూ
సొలసి చూచినను సూర్య చంద్రులను
లలివేద చల్లెడు లక్షణుడూ
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలికించు సురల గనివో ఇతడూ
కలికించు సురల గనివో ఇతడూ
చేరి యశోదకు శిశువితడూ
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడూ
చేరి యశోదకు శిశువితడూ
***************************
గానం: ఎస్.పి.శైలజ
ఆంగికం .. భువనం యస్యా
వాచికం .. సర్వ వాన్మయం
ఆహార్యం .. చంద్ర తారాదితం
వందే సాత్వికం శివం
రజతాద్రినే .. తాండవమాడే .. నటరాజూ తాండవమాడెనే
నటరాజూ తాండవమాడెనే
రజతాద్రినే .. తాండవమాడే .. నటరాజూ తాండవమాడెనే
నటరాజూ తాండవమాడెనే
****************************************
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళూ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళూ
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళూ
లయకే నిలయమై నీ పాదం సాగాలీ
మలయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ
తిరిగే కాలానికీ
ఆ ..ఆ .. ఆ ..ఆ..
తిరిగే కాలానికీ తీరొకటుందీ
అది నీ పాఠానికి దొరకను అందీ
నటరాజ స్వామి జటా జూటి లోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముందీ
విలువేముందీ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళూ
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళూ
దూకే అలలకూ ఏ తాళం వేస్తారూ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారూ
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరూ
ఆ .. ఆ .. ఆ .. ఆ ..
వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ
హద్దులు దాటరాదు ఆశల వాహినీ
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముందీ
విలువేముందీ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
*********************************