సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల
అదిగో నవలోకం
వెలసే మనకోసం
అదిగో నవలోకం .. వెలసే మనకోసం (2)
నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై (2)
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం (2)
ఎచట సుఖముందో
ఎచట సుధ కలదో
అచటె మనముందామా !
అదిగో నవలోకం .. వెలసే మనకోసం !
పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ (2)
ఫలించె కోటి మురిపాలూ ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ (2)
ఎచట హృదయాలూ
ఎపుడూ విడిపోవో
అచటె మనముందామా !
అదిగో నవలోకం .. వెలసే మనకోసం !
No comments:
Post a Comment