November 13, 2008

గుప్పెడు మనసు (1979)

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: బాలమురళీ కృష్ణ

మౌనమే నీ భాష ఓ మూగ మనసా

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా..తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా..మాయల దెయ్యానివే
లేనిది కోరేవు..ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా..
ఓ మూగ మనసా

*************************************

గానం : బాలు

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా .. నువ్వేనా (2)

ఆ ... నిన్నేనా అది నేనేనా
కల గన్నానా కనుగొన్నానా (2)

అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా .. నువ్వేనా


ఆ ... కళ్ళేనా
కళ్ళేనా హరివిల్లేనా
అది చూపేనా విరితూపేనా (2)

తుళ్ళి తుళ్ళి పడు వయసేనా
నను తొందర వందర చేసేనా
తుళ్ళి తుళ్ళి పడు వయసేనా
నను తొందర వందర చేసేనా

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా .. నువ్వేనా

ఆ ... నువ్వైనా నీ నీడైనా ఏ నాడైనా నా తోడౌనా
నువ్వైనా నీ నీడైనా ఏ నాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా .. నువ్వేనా

నువ్వేనా .. సంపంగి పువ్వున నువ్వేనా !

***************************************

గానం: బాలు, వాణీ జయరాం

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నీ వదనం భూపాలమూ .. నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ .. నువ్వు పాడిందే సంగీతమూ

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

ఇల్లే సంగీతమూ .. వంటిల్లే సాహిత్యమూ
ఈ పిల్లలే నా సాధనం .. ఇంకా వింటారా నా గానం (2)

ఊగే ఉయ్యాలకూ .. నువు పాడే జంపాలకూ
ఊగే ఉయ్యాలకూ .. నువు పాడే జంపాలకూ
సరితూగదు ఏ గానమూ .. నీకు ఎందుకు సందేహమూ

నీకు ఎందుకు సందేహము !

ఉడకని అన్నానికీ .. మీకొచ్చే కోపానికీ
ఏ రాగం బాగుండునో .. చెప్పే త్యాగయ్య మీరేగా (2)

కుత కుత వరి అన్నం .. తై తక తక మను నాట్యం
ఏ భరతుడు రాసిందీ .. నీకా పదునెటు తెలిసిందీ

నీకా పదునెటు తెలిసింది !

నేనా .. పాడనా పాటా
మీరా .. అన్నదీ మాటా

నీ వదనం భూపాలమూ .. నీ హృదయం ధ్రువతాళమూ
నీ సహనం సాహిత్యమూ .. నువు పాడిందే సంగీతమూ

November 12, 2008

గీతాంజలి (1989)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా ..మౌనమైన వేళలా !

ఆమనీ పాడవే హాయిగా.. ఆమనీ పాడవే హాయిగా..

వయస్సులో వసంతమే .. ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే .. రచించెలే మరీచికా
పదాల నా ఎదా .. స్వరాల సంపదా
తరాల నా కధా .. క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేననీ !

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూల రాగాలతో

శుకాలతో పికాలతో .. ధ్వనించినా మధూదయం
దివీ భువీ కలా నిజం .. స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే .. మరింత చేరువై
నివాళి కోరినా .. ఉగాది వేళలో
గతించిపోని గాధ నేననీ !

ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా ..మౌనమైన వేళలా !

ఆమనీ పాడవే హాయిగా.. ఆమనీ పాడవే హాయిగా..

*************************************

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర

ఓ ప్రియా ప్రియా
నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలూ .. రాలు పూల దండలు
నీదో లోకం .. నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలూ .. మాసిపోవు ఆశలూ
నింగీ నేల .. తాకే వేళ
నీవే నేనై పోయేవేళాయె
నేడు కాదులే .. రేపు లేదులే
వీడుకోలిదే .. వీడుకోలిదే !

నిప్పులోన కాలదూ .. నీటిలోన నానదూ
గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ
రాచవీటి కన్నెదీ .. రంగు రంగు స్వప్నమూ
పేదవాడి కంటిలో పేద రక్తమూ

గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా .. ఎదురులేదు ప్రేమకూ
రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికీ .. కృష్ణ రాసలీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవీ
ఆ అనారు ఆశకీ .. తాజ్ మహలు శోభకీ
పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ

నిధి కన్న ఎద మిన్న .. గెలిపించు ప్రేమనే
కధ కాదు బ్రతుకంటె .. బలికానీ ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా .. ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే .. తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా !

ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసీ ..తీర్చమందిలే కసీ
నింగీ నేల .. తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన

లేదు శాసనం .. లేదు బంధనం
ప్రేమకే జయం .. ప్రేమదే జయం !

రెండు రెళ్ళు ఆరు (1986)

సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి

కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే.. ముద్దర వేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్తతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో

చిరుగాలి దరఖాస్తు .. లేకుంటె కరిమబ్బు
చిరుగాలి దరఖాస్తూ .. లేకుంటె కరిమబ్బూ
మెరుపంత నవ్వునా .. చినుకైన రాలునా

జడివాన దరఖాస్తు .. పడకుంటె సెలయేరు
జడివాన దరఖాస్తూ .. పడకుంటె సెలయేరూ
వరదల్లె పొంగునా..కడలింట చేరునా

శుభమస్తు అంటే .. దరఖాస్తు ఓకే !

ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో

చలిగాలి దరఖాస్తు .. తొలిఈడు వినకుంటె
చలిగాలి దరఖాస్తూ .. తొలిఈడు వినకుంటే
చెలి జంట చేరునా .. చెలిమల్లె మారునా

నెలవంక దరఖాస్తు .. లేకుంటె చెక్కిళ్ళు
నెలవంక దరఖాస్తూ .. లేకుంటె చెక్కిళ్ళూ
ఎరుపెక్కి పోవునా .. ఎన్నెల్లు పండునా

దరిచేరి కూడా దరఖాస్తులేలా !

కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్తతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో !

November 10, 2008

మహాకవి క్షేత్రయ్య (1976)

సంగీతం: ఆదినారాయణరావు

గానం: రామకృష్ణ, పి.సుశీల

జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో
నాకెంత సిగ్గాయె బావా బావా నను వీడలేవా

పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో
నీకింత సిగ్గేల బాలా రావా నను చేరరావా

ఆ .. ఆ .. ఆకాశమార్గాన అందాల మేఘాలు పెనవేసుకున్నాయి చూడూ
చిగురాకు సరదాలు చిరుగాలి సరసాలు గిలిగింతలాయేను నేడూ
అందచందాలతో .. ప్రేమ బంధాలతో .. జీవితం హాయిగా సాగనీ !
బాలా రావా నను చేరరావా

ఆ .. ఆ .. ఆ .. ఆకొమ్మపై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పాడేనూ
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద మైమరచి కలలందు కరిగేనూ
ముద్దు మురిపాలతో .. భావరాగాలతో .. యవ్వనం పువ్వులా నవ్వనీ !
బావా బావా నను వీడలేవా

ఆ .. ఆ .. బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు కొనగోటి మీటులే కోరేనూ
నీ లేత అధరాలు ఎంతెంతొ మధురాలు .. ఈ నాడు నా సొంతమాయేనూ
దేవి దీవించెను .. స్వామి వరమిచ్చెను .. ఇద్దరం ఏకమౌదాములే !
బాలా రావా నను చేరరావా

జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో
నాకెంత సిగ్గాయె బావా బావా నను వీడలేవా

పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో
నీకింత సిగ్గేల బాలా రావా నను చేరరావా

అల్లరిబుల్లోడు (1978)

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల

చుక్కల తోటలో ఎక్కడున్నావో .. పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .. నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ

నీలి నీలి నీ కురులా .. నీలాల మేఘాల .. విరిసింది మల్లికా నా రాగ మాలికా
అల్లిబిల్లి నీ కౌగిట .. అల్లుకున్న నీ మమతా .. కొసరింది కోరికా అనురాగ గీతికా

నీ మూగ చూపులలో .. చెలరేగే పిలుపులలో
నీ పట్టువిడుపులలో .. సుడి రేగే వలపులలో
కన్నూ కన్నూ కలవాలీ కలిసి వెన్నెలై పోవాలీ
చీకటి వెన్నెల నీడలలో దాగుడుమూతలు ఆడాలీ !

చుక్కల తోటలో ఎక్కడున్నావో .. పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .. నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ

ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచిఉన్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో

ఈ పూల వానలలో .. తడిసిన నీ అందాలూ
ఆ.. ఆ.. ఈ పూట సొగసులలో .. కురిసిన మకరందాలూ
నీలో తీగలు మీటాలీ నాలో రాగం పలకాలీ
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలీ !

చుక్కల తోటలో ఎక్కడున్నావో .. పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలీ ఎక్కడుంటానూ .. నీ పక్కనే చుక్కనై పలకరిస్తానూ

November 07, 2008

కన్నవారి కలలు (1974)

సంగీతం : వి.కుమార్
సాహిత్యం: రాజశ్రీ
గానం: రామకృష్ణ, పి.సుశీల

మధువొలకబోసే .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ (2)

అడగకనే .. ఇచ్చినచో .. అది మనసుకందమూ
అనుమతినే .. కోరకనే .. నిండేవు హృదయమూ
తలవకనే .. కలిగినచో .. అది ప్రేమబంధమూ
బహుమతిగా .. దోచితివీ .. నాలోని సర్వమూ

మనసు మనసుతో ఊసులాడనీ
మూగభాషలో బాస చేయనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

గగమముతో .. ఆ భ్రమరం .. తెలిపినది ఏమనీ
జగమునకూ .. మన చెలిమీ .. ఆదర్శమౌననీ
కలలు తీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే .. హా .. నీ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహ తహ లాడాల
చెల రేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో !

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

ఊపిరి తగిలిన వేళా .. నే వంపులు తిరిగిన వేళా
నా వీణలో .. నీ వేణువే .. పలికే రాగమాలా

చూపులు రగిలిన వేళా .. ఆ చుక్కలు వెలిగిన వేళా
నా తనువునా .. అణువణువునా .. జరిగే రాసలీలా

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

ఎదలో అందం ఎదుటా .. ఎదుటే వలచిన వనితా
నీ రాకతో .. నా తోటలో .. వెలసే వనదేవతా

కదిలే అందం కవితా .. అది కౌగిలికొస్తే యువతా
నా పాటలో .. నీ పల్లవే .. నవతా నవ్య మమతా

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహ తహ లాడాల
చెల రేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో !

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

కన్నెవయసు (1973)

సంగీతం: సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం


ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే

ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నీ రూపమే దివ్యదీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే

ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే

ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే

ఏ దివిలో విరిసిన పారిజాతమో..ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

పెళ్ళిచూపులు (1983)

సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలు, పి.సుశీల

నిన్నే నిన్నే తలచుకుని.. నిద్దుర పొద్దులు మేలుకుని

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు ఉన్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ..నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు ఉన్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ..నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

'ఏమిటిది?'

'ఇలా ఇద్దరం ముద్దరలు వేస్తే..దేవుడు చల్లగా చూస్తాడు.
తప్పకుండా మనసిచ్చినవాడితో పెళ్ళవుతుంది.'

కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి నేనేనని
పెదవులపైనే ఉండాలని పదములు ఎన్నో పాడాలని

కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి నేనేనని
పెదవులపైనే ఉండాలని పదములు ఎన్నో పాడాలని
బృందావనం తగదనీ..అందరితో తగువనీ
బృందావనం తగదనీ..అందరితో తగువనీ
యమున దాటి వెళ్ళాలని వేచి ఉన్న వెర్రిదాన్ని !

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు ఉన్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ..నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

సీతమ్మంటే నువ్వేననీ రాముడు నేనై ఉండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని

సీతమ్మంటే నువ్వేననీ రాముడు నేనై ఉండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని
పగలు పగలు అనుకునీ..రాత్రి రాత్రి కలగనీ
పగలు పగలు అనుకునీ..రాత్రి రాత్రి కలగనీ
కలే నిజం అవుతుందని కాచుకున్న పిచ్చివాణ్ణి !

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు ఉన్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ..నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

November 06, 2008

ఆత్మబంధువు (1986)

సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.జానకి, బాలు


పట్టి తెచ్చానులే..పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం !

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మల్లి కోసం

మనసున సెగలెగసే..ఏం మాయో వెలుపల చలి కరిచే
వయసుకు అది వరసా..వరసైన పిల్లదానికది తెలుసా
మాపిటికి చలిమంటేస్తా..కాచుకో కాసంతా
ఎందుకే నను ఎగదోస్తా..అందుకే పడి చస్తా

చింతాకులా..చీరా గట్టీ..పూచిందీ పూదోటా
కన్నే పువ్వూ..కన్నూ కొడితే..తుమ్మెదకూ దొంగాటా
దోబూచి నీ ఆటా..ఊహూ !

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..
అహ నా మల్లి కోసం

పొద్దు ఉంది ముద్దులివ్వనా..ఇచ్చాక ముద్దులన్ని మూట గట్టనా
మూటలన్ని విప్పి చూడనా..చూసాక నూటొకటి లెక్కజెప్పనా
నోటికీ నూరైతేనే..కోటికీ కొరతేనా
కోటికీ కోటైతేనే..కోరికలు కొసరేనా

నోరున్నదీ..మాటున్నదీ..అడిగేస్తే ఏం తప్పు
రాతిరయ్యిందీ..రాజుకుందీ..చిటపటగా చిరునిప్పు
అరె పోవే పిల్లా అంతా దూకు..

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..
ఏది ఏది చూడనీవే దాన్ని..
కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ..

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మల్లి కోసం

అమావాస్య చంద్రుడు (1981)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

కళకే కళ ఈ అందమూ
ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ

నీలి కురులు పోటీ పడెను .. మేఘమాలతో
కోల కనులు పంతాలాడే .. గండుమీలతో
వదనమో జలజమో.. నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీ శంఖము !

కళకే కళ ఈ అందమూ

పగడములను ఓడించినవి .. చిరుగు పెదవులు .. హా
వరుస తీరి మెరిసే పళ్ళు .. మల్లె తొడుగులూ
చూపులో తూపులో .. చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు !

కళకే కళ ఈ అందమూ

తీగెలాగ ఊగే నడుమూ .. ఉండి లేనిదీ
దాని మీద పువ్వై పూచీ .. నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో .. కళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము !

కళకే కళ ఈ అందమూ

జ్వాల (1985)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ???
గానం: ఎస్.జానకి

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

ఏవేవో కలలు కన్నాను.. మదిలో
మౌన మురళినై..విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

సుడిగాలులలో మిణికే దీపం
ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో .. ఇదే ఋణానుబంధమో (2)

నీకు నేను బానిసై .. నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరమె చాలు !

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

నా కన్నులలో వెలుగై నిలిచీ
చిరు వెన్నెలగా బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ .. ఓదార్పు చూపినావురా (2)

నాది పేద మనసురా .. కాంచలీయలేనురా
కనుల నీరె కాంచరా!

November 05, 2008

ప్రేమించు-పెళ్ళాడు (1985)


సంగీతం: ఇళయరాజా

గానం: బాలు, ఎస్.జానకి

గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్న ముద్దా
ముద్దూ కావాలా..ముద్దా కావాలా
ఆ విందా..ఈ విందా..నా ముద్దూ గోవిందా !

గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్న ముద్దా

రాదారంత రాసలీలలు..అలు అరు ఇణి
రాగాలైన రాధ గోలలు.. అలు అరు ఇణి
రాధా.. రాధా బాధితుణ్ణిలే..ప్రేమారాధకుణ్ణి లే

హ హ హా జారుపైట లాగనేలరా..అహ అహ
ఆరుబైట అల్లరేలరా..అహా
ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా

గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్న ముద్దా
ముద్దూ కావాలా..ముద్దా కావాలా
ఆ విందా..ఈ విందా..నా ముద్దూ గోవిందా !

వెలిగించాలి నవ్వు మువ్వలూ..అలా అలా
తినిపించాలి మల్లె బువ్వలూ..ఇలా ఇలా ఇలా
రా రా..చూపే లేత శొభనం..మాటే తీపి లాంఛనం

అహా హ హా.. వాలు జళ్ళ ఉచ్చు వేసినా..ఆహా
కౌగిలింత ఖైదు చేసినా..ఆహా
ముద్దు మాత్రం ఇచ్చుకుంటే ముద్దాయల్లె ఉండనా

గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్న ముద్దా
ముద్దూ కావాలీ..ముద్దా కావాలీ
ముద్దూ కావాలీ..ముద్దా కావాలీ
ఆ విందూ..ఈ విందూ..నా ముద్దూ గోవిందా !


*********************************

గానం: బాలు, ఎస్.జానకి

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం

ఆకసానికవి తారలా..
ఆశకున్న విరిదారులా..
ఈ సమయం ఉషోదయమై..మా హృదయం జ్వలిస్తుంటే

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

అగ్నిపత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖలు రాసే మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే

మల్లెకొమ్మ చిరునవ్వులా..
మనసులోని మరు దివ్వెలా..
ఈ సమయం రసోదయమై..మా ప్రణయం ఫలిస్తుంటే

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే


*******************************************

గానం: బాలు, ఎస్.జానకి

వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి వొడిలో కలిసిపోతే కల..వరం
ఇన్ని కలలిక ఎందుకో..కన్నె కలయిక కోరుకొ
కలవరింతే కౌగిలింతై

వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం

నిజము నా స్వప్నం..అహా
కలనో..హొహో..లేనో..హొహో హో
నీవు నా సత్యం..అహా
అవునో..హొహో..కానో .. హొహొ

ఊహ నీవే ..ఆహహాహా.. ఉసురుకారాదా..ఆహా
మోహమల్లే..ఆహహాహా.. ముసురుకోరదా..ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వ గోపాలుని రాధికా
ఆకాశవీణా గీతాలలోన ఆలాపనై నేకరిగిపోనా

వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం

తాకితే పాపం ..హొహో..
కమలం..హొహో..భ్రమరం..హొహో హో
తాగితే మైకం..హొహో
అధరం..హొహో..మధురం..హొహో హో

పాట వెలదీ..ఆహహాహా..ఆడుతూ రావే
తేట గీతీ..ఆహహాహా.. తేలిపోనీవే
పున్నాగ కొవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుకా
చుంబించుకున్న బింభాధరాల సూర్యోదయాలే పండేటి వేళ

వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి వొడిలో కలిసిపోతే కల..వరం
ఇన్ని కలలిక ఎందుకో..కన్నె కలయిక కోరుకొ
కలవరింతే కౌగిలింతై

వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం

మహర్షి (1987)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వెన్నెలకంటి
గానం: బాలు, ఎస్.జానకి


మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
గానమిదీ నీ ధ్యానమిదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిది

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది

ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం
నింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేల

అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
రాగల తీగల్లొ వీణానాదం కోరింది ప్రణయవేదం
వేశారు గుండెల్లొ రేగె గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తారతీరం అంతేలేని ఎంతో దూరం

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
కూడనిదీ జత కూడనిదీ
చూడనిదీ మది పాడనిదీ
చెప్పరాని చ్హిక్కుముడి వీడనిదీ

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది


*************************************

గానం: బాలు

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా

నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం ! హ !
కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యనూ
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యనూ
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంటా
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా

అదరనీ బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమే మహర్షి !

వేడితే లేడి వొడి చేరుతుందా వేట సాగాలి కాదా
వోడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా
అంతమూ సొంతమూ పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండనూ
భీరువల్లే పారిపోను రేయి వొళ్ళో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురు పడునా ఏ అపజయం

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా !


********************************************

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలు, ఎస్.జానకి

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం

వేణువా వీణియా ఏమిటీ రాగము
వేణువా వీణియా ఏమిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా ప్రేమ మహిమా నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం

రంగులే రంగులు అంబరానంతటా
రంగులే రంగులు అంబరానంతటా
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేదీ నాలోన లేదు
ఆవేగమేదీ నాలోన లేదు
ప్రేమమయమూ ప్రేమమయమూ నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భనోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం


**************************************

గానం: బాలు, ఎస్.జానకి

కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కావ్యాలకే..హో
శ్రీకారమై..హో
కస్తూరి తాంబూలమీవే !

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి

మేని సోయగాలు..ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలూ..రాగ రంజితాలు
సరసములో..సమరములూ
సరసులకూ..సహజములూ
ప్రాభవాలలోనా..నవశోభనాల జాణా
రాగదే రాగమై రాధవై

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి

రాగాలనే..హోయ్
బోయీలతో..హోయ్
మేఘాల మేనాలో రానా !

కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కోయిలమ్మ రాగం .. కొండవాగు వేగం
పారిజాత సారం .. ఏకమైన రూపం
అధరముపై..అరుణిమలూ
మధురిమకై..మధనములూ

నందనాలలోన..రసమందిరాలలోన
హాయిగా..సాగగా..చేరగా !

కోనలో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో..
పొన్న పూలవల్లి పాలవెల్లి
వేణిలో..
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో..
అనురాగవల్లి రాగవల్లి

కావ్యాలకే..హో
శ్రీకారమై..హో
కస్తూరి తాంబూలమీవే

కోరుకో..
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో..
కన్నెసోకులన్ని సోకులన్ని
పాడుకో..
ప్రేమ కైతలల్లి కైతలల్లి
వేసుకో..
పాలబుగ్గపైన రంగవల్లి !

November 03, 2008

సీతాకోకచిలుక (1981)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి

గానం: బాలు, ఎస్.పి.శైలజ

ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ !

మాటే మంత్రమూ
మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పూవూ తావిగా
సం యోగాల సంగీతాలు విరిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ..మనసే బంధమూ

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ

ఇది కళ్యాణం కమనీయం జీవితం

*******************************

గానం: ఇళయరాజా, వాణీ జయరాం

స గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమమా పపపా గమప గమగసా
నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మామ గాగ సాస నీస

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ ఒరిసీ మురిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో

తనన ననన ననన ననన తనన ననన నాన
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
తనన ననన ననన ననన తనన ననన నాన

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ..ఆ..ఆ..ఆ

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీజడలో గులాబి కని మల్లెల రవ్వడి అలిగే

నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా
నా పుత్తడి బొమ్మా !

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే !


***********************************

గానం: బాలు, పి.సుశీల

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో.. ఇలలో..
కలలో ఇలలో దొరకని కలయిక

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే

కన్యాకుమరి నీ పదములు నేనే
ఆ..ఆ..ఆ..ఆ
కన్యాకుమరి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారీ నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళా

అలిగిన నా తొలి అలకలు
నీలొ పులకలు రేపీ పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళా

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే

భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళా

పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళా

సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
సాగర సంగమమే !


**********************************************

గానం: బాలు, వాణీ జయరాం

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచె

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాలా
ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కా నవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాలా

మొగ్గ తుంచుకుంటె మొగమాటాలా
బుగ్గ దాచుకుంటె బులపాటాలా
దప్పికంటె తీర్చటానికిన్ని తంటాలా

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వె గోరింకా
తోడుగుండిపోవె కంటి నీరింకా
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేరులే ఇంకా

మిన్నేటి సూరీడు .. ల ల ల లా
మిన్నేటి సూరీడు .. ల ల ల లా

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచె

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

అమరజీవి (1983)

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..కన్నెజాజి ముంగిళ్ళలోనా..కోకిలమ్మ పాటకచేరి !

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..కన్నెజాజి ముంగిళ్ళలోనా..కోకిలమ్మ పాటకచేరి !

పొగడపూలైనా..పొగిడే అందాలే..మురిసే మలిసంజెవేళలో
మల్లీ మందారం .. పిల్లకిసింగారం .. చేసే మధుమాసవేళలో
నా రాగమే నీ ఆరాధనై..చిరంజీవిగా జీవించనా

Happy Birthday to you !

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..కన్నెజాజి ముంగిళ్ళలోనా..కోకిలమ్మ పాటకచేరి !

రెల్లు చేలల్లో..రేయీ వేళల్లో..కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు..బొట్టై ఏనాడు..మురిసే ముత్తైదు శోభతో

నీ సౌభాగ్యమే నా సంగీతమై..ఈ జన్మకీ జీవించనా

Happy Birthday to you!

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..కన్నెజాజి ముంగిళ్ళలోనా..కోకిలమ్మ పాటకచేరి !