October 30, 2008

రక్షకుడు (1997)


గానం: హరిహరన్ (?)

కలలు పంచే కలవాణీ
పెదవి పెదవీ జతకానీ
వలపు కోసం పిలుపులెందుకే
మనసే ..నీదే.. మహరాణీ

కనులకెన్నడు కంటి పాపా భారమెన్నడు కానే కాదూ
నీ చిలిపి నగవు చూస్తు ఉంటే అలుపు సొలుపూ దరికి రావూ
నిన్ను నేనూ ఎత్తుకుంటే ఉడుకు వయసూ వణికేనే
నిన్ను నేనూ హత్తుకుంటే నింగి నేలా కలిసేనే
నీమీదొక్క చూపు పడినా ఎదలో మంట రగిలేనే

కొంటె చూపుల కలవాణీ .. యవ్వన దేశపు యువరాణీ
కౌగిలి కోసం అలుక ఎందుకే
పలుకే రాదా అలివేణీ

కలలు పంచే కలవాణీ
పెదవి పెదవీ జతకానీ

వలపు కోసం పిలుపులెందుకే
మనసే .. నీదే .. మహరాణీ

***************************************

గానం: ఏసుదాస్, (?)

నిన్నే నిన్నే వలచినదీ .. అనుక్షణం తలచినదీ
నిన్నే నిన్నే వలచినదీ .. మనసునే మరచినదీ

కన్నుల కరిగినా యవ్వనవా .. ఒంటరి బ్రతుకే నీదమ్మా
నిన్నటి కధలే వేరమ్మా

నిన్నే నిన్నే పిలచినదీ .. అనుక్షణం తలచినదీ
నిన్నే నిన్నే వలచినదీ .. మనసునే మరచినదీ

పువ్వా పువ్వా నీ ఒడిలో .. ఒదిగిన క్షణం ఎక్కడే ..కలిగిన సుఖం ఎక్కడే
అభిమానం తో తలవంచినా .. ప్రేమకి చోటెక్కడే ..నిలిచితి నేనిక్కడే
కళ్ళల్లోనే ముళ్ళుంటే కనులకి నిదరెక్కడే
వలచిన వారే వలదంటే మనిషికి మనసెందుకే
నిన్నటి వలపే నిజమని నమ్మాను .. నిజమే తెలిసి మూగబోయి ఉన్నాను !

నిన్నే నిన్నే పిలిచినదీ .. అనుక్షణం తలచినదీ
నిన్నే నిన్నే వలచినదీ .. మనసునే మరచినదీ

కళ్ళలోని ఆశా .. కరగదులే
కౌగిలి లోనే చేర్చులే .. నిన్నటి బాధా తీర్చులే

హా .. నిన్నే నిన్నే .. నిన్నే నిన్నే .. నిన్నే నిన్నే

ప్రేమా ప్రేమా .. నా మనసే చెదిరిన మధువనమే ..వాడిన జీవితమే
విరహమనే విధి వలలో .. చిక్కిన పావురమే ..మరచితి యవ్వనమే
కలలోనైనా .. నిన్ను కలుస్తా .. ఆగనులే ప్రియతమా
లోకాలన్నీ .. అడ్డుపడినా .. వీడను నిను నేస్తమా
చీకటి వెనుకే వెలుగులు రావా .. బాధే తొలిగే క్షణమగుపడదా !

నిన్నే నిన్నే పిలిచినదీ .. అనుక్షణం తలచినదీ
నిన్నే నిన్నే వలచినదీ .. మనసునే మరచినదీ

కళ్ళలోని ఆశా .. కరగదులే
కౌగిలి లోనే చేర్చులే .. నిన్నటి బాధా తీర్చులే
హా .. నిన్నే నిన్నే .. నిన్నే నిన్నే .. నిన్నే నిన్నే

మల్లెపువ్వు (1978)

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

చిన్న మాటా..ఒక చిన్న మాటా

చిన్న మాటా..ఒక చిన్న మాటా
చిన్న మాటా..ఒక చిన్న మాటా

సందె గాలి వీచే..సన్నజాజి పూచే
జలదరించే చల్లని వేళ..
చిన్న మాటా..ఒక చిన్న మాటా
ఆ.. చిన్న మాటా..ఒక చిన్న మాటా

రాక రాక నీవు రాగా..వలపు ఏరువాక
నా వెంట నీవు..నీ జంట నేను..రావాలి మాఇంటి దాకా
నువ్వు వస్తే..నవ్వులిస్తా
పువ్వులిస్తే..పూజ చేస్తా
వస్తే..మళ్ళీ వస్తే..మనసిస్తే..చాలు
మాట..మాట
చిన్న మాటా..ఒక చిన్న మాటా

చిన్న మాటా..ఒక చిన్న మాటా
చిన్న మాటా..ఒక చిన్న మాటా

కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే
నీ వాలు చూపే..నీలాల మెరుపై విరితేనెలే వెల్లువాయే
అందమంతా..ఆరబోసి..మల్లెపూల పానుపేసి
వస్తే..తోడు వస్తే..నీడనిస్తే..చాలు..
మాట..మాట
చిన్న మాటా..ఒక చిన్న మాటా

చిన్న మాటా..ఒక చిన్న మాటా
చిన్న మాటా..ఒక చిన్న మాటా
సందె గాలి వీచే..సన్నజాజి పూచే
సందె గాలి వీచే..సన్నజాజి పూచే
జలదరించే చల్లని వేళ..

చిన్న మాటా..ఒక చిన్న మాటా

***********************

సాహిత్యం: ఆరుద్ర
గానం: వాణీ జయరాం

నువు వస్తావనీ బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా
నువు వస్తావనీ బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా
వేణువు విందామని..నీతో ఉందామని..నీ రాధా వేచేనయ్యా రావయ్యా..
ఓ..గిరిధర..మురహర..రాధా మనోహరా !

నువు వస్తావనీ బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా రావయ్యా !

నీవూ వచ్చే చోటా..నీవూ నడిచే బాటా
మమతల దీపాలూ వెలిగించానూ.. మమతల దీపాలూ వెలిగించానూ..
కుశలము అడగాలని..పదములు కడగాలని..కన్నీటి కెరటాలు తరలించానూ
ఓ..గిరిధర..మురహర..నా హృదయేశ్వరా !
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా

కృష్ణయ్యా..ఓ కృష్ణయ్యా..
కృష్ణయ్యా..ఓ కృష్ణయ్యా..

నీ పదరేణువునయ్యా..పెదవుల వేణువునైనా
బ్రతుకే ధన్యమనీ భావించానూ.. బ్రతుకే ధన్యమనీ భావించానూ
నిన్నే చేరాలని..నీలో కరగాలని..నా మనసే హారతిగా వెలిగించానూ

గోవింద గోవింద గోవింద గోవింద..గోపాలా !


*********************************

సాహిత్యం: వేటూరి
గానం: బాలు

ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా..నా ప్రేమ కవితా
గగనవీణ సరిగమలు పాడగా..ఆ..ఆ
నీ జఘనసీమ స్వరజతలనాడగా..ఆ..ఆ
ఫెళఫెళలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగార తటిల్లగ కదలగా..కనులు చెదరగా
కదలిరా..కవితలా..వలపుకే వరదలా

ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా !

మల్లెపువ్వులో మధువు పొంగులా వెల్లువైన కవితా
నీ కన్నెవయసు నా ఇంద్రధనుసుగా కదలిరావె నా లలితా
గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా
కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా

నీ అందాలే మకరందాలై..మల్లె సుగంధం నాలో విరిసే
సిగ మల్లె పిలుపులే అందుకో..
సిరి మల్లె తీగవై అల్లుకో..
ఈ మల్లెపూవే నీ సొంతమూ..
కదలిరా..కవితలా..వలపుకే వరదలా

ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా !

వయసుతోటలో మనసుపాటలా వెల్లివిరిసెలే నీ కథా
నా అణువు అణువు నీ వలపు వేణువై ఝల్లుమన్నదీ నా ఎదా
తెలుగుపాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా
పూలఋతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా

నీ ఊహలలో నే ఊర్వశినై..నీ కౌగిలికే నే జాబిలినై
నీ కాలిమువ్వ నా కవితగా..
నా దారి దీయనీ మమతగా..
ఈ మల్లెపూలే నా లలితగా..
కదలిరా..కవితలా..వలపుకే వరదలా

ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా !


********************************

సాహిత్యం: వేటూరి
గానం: బాలు

చక చక సాగే చక్కని బుల్లెమ్మా
మిస మిస లాడే వన్నెల చిలకమ్మ
నీ పేరేమిటో .. నీ ఊరేమిటో
నీ పేరేమిటో .. నీ ఊరేమిటో

గలగల పారే ఏరే నా పేరూ
పొంగులు వారే వలపే నా ఊరూ
చినదాననూ..నే చినదాననూ
చినదాననూ..నే చినదాననూ

కన్నులు చెదిరే వన్నెల చిలకా..నీ వయసే ఎంతా
కన్నులు చెదిరే వన్నెల చిలకా..నీ వయసే ఎంతా
చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంతా..ఊహకు రానంత !

అందీ అందక ఊరించే నీ మనసులోతెంతా..హా !
మమతే ఉంటే..దూరమెంతో లేదూ
నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది

కసి కసి చూపులు చూసే సోగ్గాడా
ముసి ముసి నవ్వులు విరిసే మొనగాడా
నీ పేరేమిటో .. నీ ఊరేమిటో
నీ పేరేమిటో .. నీ ఊరేమిటో

పదమును పాడే వేణువు నా పేరూ
మధువులు చిందే కవితే నా ఊరూ
చినవాడనూ..నే నీవాడనూ
చినవాడనూ..నే నీవాడనూ

వరసలు కలిపే ఓ చినవాడా..నీ వలపే ఎంతా
విలువే లేనిది..వెలకే రానిది..వలపే కొండంత..నా వలపే జీవితమంత !
నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంటా..హో
గుండెల గుడిలో దేవివి నీవంటా..
సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంటా

చల్లని గాలీ సన్నాయి ఊదిందీ
పచ్చిక వెచ్చని పానుపు వేసిందీ
కల నిజమైనదీ..ప్రేమ ఋజువైనదీ
కల నిజమైనదీ..ప్రేమ ఋజువైనదీ


***************************************************

సాహిత్యం: ఆరుద్ర
గానం: బాలు

ఓ ప్రియా..ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ

సఖియా.. నీవెంతటి వంచన చేసావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం

ఓ ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ

తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే

ఓ ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ

******************************

సాహిత్యం: వేటూరి
గానం: బాలు

ఎవరికి తెలుసు.. చితికిన మనసు
చితిగా రగులుననీ
ఎవరికి తెలుసూ

ఎవరికి తెలుసు.. చితికిన మనసు
చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ

మనసుకు మనసే కరువైతే
మనిషికి బ్రతుకే బరువనీ (2)
చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ
జగతికి హృదయం లేదని
ఈ జగతికి హృదయం లేదని
నా జన్మకు ఉదయం లేనే లేదనీ
ఆ..

ఎవరికి తెలుసూ

ఎవరికి తెలుసు.. చితికిన మనసు
చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ

గుండెలు పగిలే ఆవేదనలో
శృతి తప్పినదీ జీవితం (2)
నిప్పులు చెరిగే నా గీతంలో .. నిట్టూరుపులే సంగీతం
నిప్పులు చెరిగే నా గీతంలో .. నిట్టూరుపులే సంగీతం
ప్రేమకు మరణం లేదని
నా ప్రేమకు మరణం లేదని
నా తోటకు మల్లిక లేనే లేదనీ

ఆ..

ఎవరికి తెలుసూ

ఎవరికి తెలుసు.. చితికిన మనసు
చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ



October 29, 2008

ఒరేయ్ .. పండు !

సంగీతం: ఆనంద్ రాజ్ ఆనంద్
సాహిత్యం: భువనచంద్ర
గానం: శ్రేయా ఘోషల్


గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ
గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ..ఎటో వెళ్ళిపోయే మేఘమా ఆగవే
గూటిలో గువ్వనీ..నీటిలో చేపనీ..పలకరించి పోదాం నాకు తోడై సాగవే
ఓ ..నింగి నేల ఏకం అయ్యే చోటే చూసొద్దాం

గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ..ఎటో వెళ్ళిపోయే మేఘమా ఆగవే

ఆకుపచ్చ పట్టుకోక కట్టుకున్న చిలకమ్మా .. ఇలా వచ్చి హలొ చెప్పి పోవా
రెక్క విప్పి దూసుకెళ్ళు గారాల తుమ్మెదా..నన్ను నీతో తీసుకెళ్ళిపోవా
మావి చిగురు మేసే ఓ కోయిలమ్మా..నీ పాట నాకు నేర్పాలమ్మా
వసంతాల వన్నెలన్ని నీతో చూడాలే
గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ..ఎటో వెళ్ళిపోయే మేఘమా ఆగవే

గుండెలోన కుంచె ముంచి కోటి కోటి రంగుల్ని దిద్దినట్టి చిత్రకారుడెవరో
మేలమాడు గాలిలోన కొంగొత్త రాగాలు మేళవించు నాదబ్రహ్మలెవరో
ఓ..ఈ పూల పక్కా వేసింది ఎవరో..ఆ కలువ తాపం తీర్చేదెవరో
నిన్న లేని అందమేదో నేడే చూసాలే

గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ..ఎటో వెళ్ళిపోయే మేఘమా ఆగవే
ఓ ..నింగి నేల ఏకం అయ్యే చోటే చూసొద్దాం

*************************************************

గానం: శ్రేయా ఘోషల్, సోను నిగం

రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా..రాలేవా నాతో ఓ ప్రేమా
రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా..రాలేవా నాతో ఓ ప్రేమా
ఓ నీవు లేక నేను లేను అంటున్నానుగా !

వచ్చాగా..వచ్చాగా..నీడలాగ వచ్చాగా..నువ్వంటే నాకెంతో ప్రేమ
వచ్చాగా..వచ్చాగా..నీడలాగ వచ్చాగా..నువ్వంటే నాకెంతో ప్రేమ
ఓ నీవు లేక నేను లేను అంటున్నానుగా !

రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా..రాలేవా నాతో ఓ ప్రేమా !!

ఇన్నాళ్ళూ నీకోసం ఎంతెంతో వేచాను..
ఈనాడు నువ్వొస్తే మూగబోయానూ
ఇన్నాళ్ళూ నీకోసం ఎంతెంతో వేచాను..
ఈనాడు నువ్వొస్తే మూగబోయానూ
ఏచోట నేనున్నా నీ పేరే తలచాను..
నీ స్నేహం గుండెల్లో దాచుకున్నానూ
ఏదేదో అనుకున్నా..చెప్పలేకపోతున్నా..నీకైనా తెలియదా ఓ ప్రేమా
వచ్చాగా..వచ్చాగా..చెంతకొచ్చి నిలిచాగా..కళ్ళల్లో కన్నీరేలమ్మా
ముందరున్నా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తావుగా !

రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా..రాలేవా నాతో ఓ ప్రేమా !!

నీ మాట వింటుంటే..నిను తాకి చూస్తుంటే..
కలలాగ ఉంటోందీ తెలుసా ప్రాణమా..ఓ..
నీ మాట వింటుంటే..నిను తాకి చూస్తుంటే..
కలలాగ ఉంటోందీ తెలుసా ప్రాణమా..
ఓ..కలకరిగి పోవాలీ..నిజమేదో తెలియాలీ..
ఆపైనే అనుకుంది సాధించాలిగా

నీకోసం .. నీకోసం ..పట్టుపట్టి ఓ నేస్తం .. లోకాన్నే గెలిచేస్తానుగా
ఆరోజే రావాలీ..తనివితీరా చూడాలీ..నీగెలుపే నాదన్నానుగా
ఓ ఇవ్వమంటే ప్రాణమైనా ఇచ్చేస్తానుగా !

రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా..రాలేవా నాతో ఓ ప్రేమా
వచ్చాగా..వచ్చాగా..నీడలాగ వచ్చాగా..నువ్వంటే నాకెంతో ప్రేమ
ఓ నీవు లేక నేను లేను అంటున్నానుగా !

పెద్దరికం (1992)

సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాలు, చిత్ర

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా !

నీ ఆశలన్నీ నా శ్వాసలైనా .. ఎంత మోహమో
ఓ ఓ ఓ .. నీ ఊసులన్నీ నా బాసలైనా .. ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా .. ఆ ఆ ఆ
సుడిగాలినైనా ఒడి చేరనా .. ఓ ఓ ఓ ఓ
నీడల్లే నీ వెంట నేనుంటా .. నా ప్రేమ సామ్రాజ్యమా !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా !

పెదవుల్ని తడితే పుడుతుంది తేనే .. తియ తియ్యగా
ఓ ఓ ఓ .. కౌగిట్లో పడితే పుడుతుంది వానా .. కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసెయ్యనా .. ఓ ఓ ఓ ఓ
ఏకాంత సేవా చేసేయనా .. ఓ ఓ ఓ ఓ
వెచ్చంగ చలి కాచుకోవాలా .. నీ గుండె లోగిళ్ళలో !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !

*************************************

గానం: బాలు, చిత్ర
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా
విలాసాల దారి కాచా ....సరగాలా గాలమేసా
కులాసాల పూలు కోసా....వయ్యారాల మాల వేసా
మరో నవ్వు ఋవ్వరాదటే
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ

మల్లెపూల మంచమేసీ హుషారించనా

జమాయించి జాజిమొగ్గా నిషా చూడనా

తెల్ల చీర టెక్కులేవో చలాయించనా

విర్ర వీగు కుర్రవాణ్ణి నిభాయించనా

అతివకు ఆత్రము తగదటగా
తుంటరి చేతులు విడువవుగా .. మనసు పడే .. పడుచు ఒడీ !
ఓ ఓ ఓ ఓ .. ఓ ఓ ఓ ఓ
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ

కోరమీసమున్న వాడి కసే చూడనా
దోర దోర జామపళ్ళ రుచే చూపనా
కొంగు చాటు హంగులన్నీ పటాయించనా
రెచ్చి రేగు కుర్రదాన్ని ఖుమాయించనా

పరువము పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగా .. తధిగిణతోం మొదలెడదాం !

ఓ ఓ ఓ ఓ .. ఓ ఓ ఓ ఓ
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా

***********************************************

గానం: కె.జె.ఏసుదాస్

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం (2)
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం

ఒడిలో పెరిగిన చిన్నారినీ .. ఎరగా చేసినదా ద్వేషమూ
కధ మారదా ..ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే .. కసిగా శిశువుని కుమ్మితే (2)
అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయేనా !

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం !

విరిసీ విరియని పూదోటలో .. రగిలే మంటలు చల్లారవా
ఆర్పేదెలా .. ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే .. వెలుగే చీకటి మూగితే (2)
పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా !

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం !

తూర్పు వెళ్ళే రైలు (1979)


సంగీతం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

ఏమిటిది ఏమిటిదీ.. ఏదో తెలియనిదీ
ఎప్పుడూ కలగనిదీ ఏమిటిదీఏమిటిదీ .. (2)

హత్తుకున్న మెత్తదనం .. కొత్త కొత్తగా ఉందీ
మనసంతా మత్తు కమ్మి మంతరిచ్చినట్లుందీ
నరనరాన మెరుపు తీగె నాట్యం చేసేస్తుందీ
నాలో ఒక పూల తేనె నదిలా పొంగుతోంది పొంగుతోంది

ఏమిటిదీ .. ఏమిటిది ఏమిటిదీ..

ఈడు జోడు కుదిరిందీ.. తోడు నీడ దొరికిందీ
అందానికి ఈ నాడే అర్ధం తెలిసొచ్చిందీ
పెదవి వెనుక చిరునవ్వూ దోబూచులాడిందీ
చిలిపి చిలిపి తలపు తలచి సిగ్గు ముంచుకొస్తోందీ

ఏమిటిదీ .. ఏమిటిది ఏమిటిదీ.. ఏదో తెలియనిదీ
ఎప్పుడూ కలగనిది కలకానిదీ
ఏమిటిదీ ..

హరే రాం


సంగీతం : Mickey J. Mayer
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్



సరిగా (సరిగా సరిగా).. పడనీ ( పడనీ పడనీ ) ..
ఇపుడే తొలి అడుగూసుడిలో (సుడిలో సుడిలో) ..
పడవై (పడవై పడవై) ..ఎపుడూ తడబడకూ

మాయలో .. మగతలో .. మరుపు ఇంకెన్నాళ్ళు
వేకువై .. వెలగనీ .. తెరవిదే నీ కళ్ళు

కన్న ఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
మన్ను తడి తగలాల్సిందే మునుముందుకు సాగాలంటే
కిందపడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
చలో చలో !

సరిగా (సరిగా సరిగా).. పడనీ ( పడనీ పడనీ ) .. ఇపుడే తొలి అడుగూ !
సుడిలో (సుడిలో సుడిలో) .. పడవై (పడవై పడవై) .. ఎపుడూ తడబడకూ !!

చెక్కే ఉలితో .. నడిచావనుకో .. దక్కే విలువే తెలిసీ
తొక్కే కాళ్ళే .. మొక్కే వాళ్ళై .. దైవం అనరా శిలను కొలిచి

అమృతమే నువు పొందూ .. విషమైతే అది నా వంతూ
అనగలిగె నీ మనసే ఆ శివుడిల్లూ
అందరికీ బ్రతుకిచ్చే .. పోరాటంలో నువు ముందుండు
కైలాసం శిరసొంచీ నీ ఎదలో ఒదిగే వరకూ
చలో చలో !

సరిగా (సరిగా సరిగా).. పడనీ ( పడనీ పడనీ ) .. ఇపుడే తొలి అడుగూ !
సుడిలో (సుడిలో సుడిలో) .. పడవై (పడవై పడవై) .. ఎపుడూ తడబడకూ !!

మాయలో .. మగతలో .. మరుపు ఇంకెన్నాళ్ళువేకువై .. వెలగనీ .. తెరవిదే నీ కళ్ళు

**********************************

గానం: కార్తీక్, హరిణి


లాలిజో .. లాలిజో .. లీలగా లాలిస్తాగా
జోలలో .. జారిపో .. మేలుకో లేనంతగా
ఆపదేం రాదే నీదాకా .. నేనున్నాగా !
కాపలా కాస్తూ ఉంటాగా ..
పాపలా నిదరో చాలింకా .. వేకువ దాకా !
దీపమై చూస్తూ ఉంటాగా ..

కానీ .. అనుకోనీ .. అలివేణీ .. ఏంకాలేదనుకోనీ
వదిలేసీ .. వెళిపోనీ .. ఆరాటాన్నీ (2)

లాలిజో .. లాలిజో .. లీలగా లాలిస్తాగా
జోలలో .. జారిపో .. మేలుకో లేనంతగా

ఊరికే ఉసూరుమంటావే .. ఊహకే ఉలిక్కిపడతావే
చక్కగా సలహాలిస్తావే .. తిక్కగా తికమక పెడతావే

రెప్పలు మూసుంటే .. తప్పక చూపిస్తా ..
రేయంతా .. వెలిగించీ .. రంగుల లోకాన్ని !

కానీ .. అనుకోనీ .. అలివేణీ .. ఏంకాలేదనుకోనీ
వదిలేసీ .. వెళిపోనీ .. ఆరాటాన్నీ (2)
లాలిజో .. లాలిజో .. లీలగా లాలిస్తాగా

జోలలో .. జారిపో .. మేలుకో లేనంతగా

ఎదురుగా పులి కనబడుతుంటే .. కుదురుగా నిలబడమంటావే
బెదురుగా బరువెక్కిందంటే .. మది ఇలా భ్రమపడుతుందంటే

గుప్పెడు గుండెల్లో .. నేనే నిండుంటే
కాలైనా .. పెట్టవుగా .. సందేహాలేవీ

ఆపదేం రాదే నీదాకా .. నేనున్నాగా !
కాపలా కాస్తూ ఉంటాగా ..పాపలా నిదరో చాలింకా .. వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా ..

కానీ .. అనుకోనీ .. అలివేణీ .. ఏంకాలేదనుకోనీ
వదిలేసీ .. వెళిపోనీ .. ఆరాటాన్నీ (2)
లాలిజో .. లాలిజో .. లీలగా లాలిస్తాగా !

జోలలో .. జారిపో .. మేలుకో లేనంతగా

శ్రీదేవి (1970)


సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం: దాశరధి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి


రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులే

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులే

కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
నా మనసు నిన్నే తలచి ఓ యన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసిందీ
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులే

నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో
ఊహూ ..
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో
ఆ .. ఆ
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులే

అందాల పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుసుమం నేనై చెలరేగనా
నీ చేతుల వీణని నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
లా లా ల లాల లాల .. లా లా ల లాల లాల .. లా లా ల లా

చీకటి వెలుగులు (1975)


సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల


చీకటి వెలుగుల కౌగిటిలో .. చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో .. చిందే కుంకుమ వన్నెలూ
ఏకమైనా హృదయాలలో .. ఏకమైనా హృదయాలలో ..
పాకే బంగరు రంగులూ ..

ఈ మెడ చుట్టూ గులాబీలూ .. ఈ సిగపాయల మందారాలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ .. ఈ సిగపాయల మందారాలూ

ఎక్కడివీ రాగాలూ .. చిక్కని ఈ అరుణ రాగాలు
అందీ అందని సత్యాలా .. సుందర మధుర స్వప్నాలా !

తేట నీటి ఈ ఏటి ఒడ్డునా .. నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా .. నాటిన పువ్వుల తోటా
నిండు కడవలా నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ
ప్రతి తీగకు చేయూత నిచ్చీ
ప్రతి మానూ పులకింపజేసీ

మనమే పెంచిందీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా
మనమే పెంచిందీ తోటా .. మరి ఎన్నడు వాడనిదీ తోటా

మరచిపోకుమా తోటమాలీ .. పొరపడి అయినా మతిమాలీ
మరచిపోకుమా తోటమాలీ .. పొరపడి అయినా మతిమాలీ

ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో

మల్లెలతో వసంతం
చేమంతులతో హేమంతం
వెన్నల పారిజాతాలూ
వానకారు సంపెంగలూ

అన్నీ మనకు చుట్టాలే
వచ్చీ పోయే అతిధులే

ఈ మెడ చుట్టూ గులాబీలూ .. ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ .. చిక్కని ఈ అరుణ రాగాలూ

ష్ ..
గలగలమనకూడదూ .. ఆకులలో గాలీ
గలగలమనరాదూ .. అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ ..
నిదరోయే కొలను నీరూ .. కదపకూడదూ
ఒరిగుండే పూలతీగా .. ఊపరాదూ

కొమ్మపై నిట జంటపూలూ
గూటిలో ఇట రెండు గువ్వలూ

ఈ మెడ చుట్టూ గులాబీలూ .. ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ .. చిక్కని ఈ అరుణ రాగాలూ
మరచిపోకుమా తోటమాలీ .. పొరపడి అయినా మతిమాలీ !

శివరంజని (1978)

సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, పి.సుశీల

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవూ

నీ వయసే వసంత ఋతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా..
నీ నగవే సిగ మల్లికగా..
చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయక లో

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవూ

నీ వడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతిగా ..
అందించే నా పార్వతిగా ..
మనమొకటై రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

నవమినాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవూ


*****************************************

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: బాలు

అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..

అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
శివరంజనీ.. శివరంజనీ !

అది దరహాసమా మరి మధుమాసమా
అది దరహాసమా మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశికిరణమ్ములా
అవి చరణమ్ములా శశికిరణమ్ములా
నా తరుణభావనా హరిణమ్ములా

అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ !

ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలూ విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలూ
ఆ నెన్నడుమూ ఆడినచాలు రవళించునూ పదకవితా ప్రభంధాలు

అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ !

నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కసులైనా

వీరమా.. నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా.. నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ..మిన్నులందుకున్నవాడ
ఆ ..
నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తడనూ..
నీ ప్రియభక్తుడనూ

అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ !

*************************************

సాహిత్యం: దశం గోపాలకృష్ణ
గానం: పి.సుశీల

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా (2)

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీవళ్ళు జాగరతే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీవళ్ళు జాగరతే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా

ముస్తాబు అయ్యావు తుమ్మెదా
కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా
మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా
ఆ మాలెవరైకోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా
గుత్తంగ కుట్టావు తుమ్మెదా
వత్తైన పరుపుపై తుమ్మెదా
అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్క వేసి ఉంచావు తుమ్మెదా
ఆ పక్కెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీవళ్ళు జాగరతే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా

October 28, 2008

నేను మీకు తెలుసా


సంగీతం : అచ్చు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరాం పార్థసారధి

ఏమైందో గాని చూస్తూ చూస్తూ .. చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
ఏం మాయవల వేస్తూ వేస్తూ .. ఏ దారి లాగుతుందో తననలా

అదుపులో .. ఉండదే .. చెలరేగే చిలిపితనం
అటూ ఇటూ .. చూడదే .. గాలిలో తేలిపోవడం
అనుమతీ .. కోరదే .. పడిలేచే పెంకితనం
అడిగినా .. చెప్పదే .. ఏమిటో అంత అవసరం

ఏం చేయడం .. మితి మీరే ఆరాటం
తరుముతూ ఉంది ఎందుకిలా !

ఏమైందో గాని చూస్తూ చూస్తూ .. చేజారి వెళ్ళిపోతోంది మనసెలా

తప్పో ఏమో అంటోంది .. తప్పదు ఏమో అంటోంది ..తడబాటు తేలని నడకా
కోరే తీరం ముందుంది .. చేరాలంటే చేరాలి కదా ..బెదురుతు నిలబడకా
సంకెళ్ళుగా .. సందేహం బిగిశాకా ..ప్రయాణం కదలదు గనకా

అలలా అలాగ .. మది నుయ్యాల ఊపే భావం
ఏమిటో పోల్చుకో త్వరగా !

లోలో ఏదో నిప్పుంది .. దాంతో ఏదో ఇబ్బంది ..పడతావటే తొలి వయసా
ఇన్నాళ్ళుగా చెప్పంది .. నీతో ఏదో చెప్పింది కదా .. అది తెలియద మనసా
చన్నీళ్ళతో చల్లారను కాస్తైనా .. సంద్రంలో రగిలే జ్వాలా

చినుకంత ముద్దు .. తనకందిస్తే చాలు అంతే ..అందిగా అందెగా తెలుసా !

ఏం మాయవల వేస్తూ వేస్తూ .. ఏ దారి లాగుతుందో తననలా

అదుపులో .. ఉండదే .. చెలరేగే చిలిపితనం
అటూ ఇటూ .. చూడదే .. గాలిలో తేలిపోవడం
అనుమతీ .. కోరదే .. పడిలేచే పెంకితనం
అడిగినా .. చెప్పదే .. ఏమిటో అంత అవసరం

ఏమైందో గాని చూస్తూ చూస్తూ .. చేజారి వెళ్ళిపోతోంది మనసెలా !
************************************************
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర, బాంబే జయశ్రీ

ఎందుకో మదీ .. నమ్మదే ఇదీ
ముందున్నది .. నిజమంత నిజమే అన్న సంగతీ
అవునా .. అంటున్నదీననిలా విడిచి .. ఏ లోకంలో ఉందీ
మొదలైన సంతోషమో .. తుదిలేని సందేహమో !

నువ్వేనాడో తెలుసునంది మనసు ..ఎలాగో ఏమో
నిన్ను చూడగానే గుండెలో .. ఇదేమి కలవరమో
కలనైన రాని కనువింటి దారి వెలిగించు కాంతి నీకున్నదీ
నడిరేయిలోని నలుపెంత గాని నీదైన వేకువని వింత ఏమిటుందీ

కాలం వెంట కదలలేని శిలగా .. ఎన్నాళ్ళిలాగా
ఎటువైపు అంటే ఏ క్షణం .. జవాబు ఇవ్వదుగా
పడి లేవ లేవ పరుగాపుతావా అడివైన దాటి అడుగేయవా
సుడిలోని నావ కడ చేరుకోవ నువు చూపుతావనే ఆశ రేపుతావా

వహువహు నీకేంటో ఒక ప్రశ్నగా .. నిను నువ్వే వెతుక్కోకలా
నీ ఏకాంతమే కొద్దిగా నాకు పంచగా

నిన్ను ఆగనీక కొనసాగనీక తడబాటు ఏమిటో చెప్పలేని తనువా !

కొత్త బంగారు లోకం


సంగీతం: మిక్కీ జె.మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్వేతా ప్రసాద్

నేననీ..నీవనీ..వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాలా స్వప్నం .. ఇప్పుడెదురయ్యే సత్యం .. తెలిస్తే
అడ్డుకోగలదా వేగం .. కొత్త బంగారూ లోకం .. పిలిస్తే

మొదటిసారి.. మదిని చేరి .. నిదర లేపిన ఉదయమా
వయసులోని .. పసితనాన్ని .. పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా .. మరో పుట్టుకా
అనేటట్టుగా .. ఇది నీ మాయేనా !

నేననీ..నీవనీ..వేరుగా లేమనీచెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాలా స్వప్నం .. ఇప్పుడెదురయ్యే సత్యం .. తెలిస్తే
అడ్డుకోగలదా వేగం .. కొత్త బంగారు లోకం .. పిలిస్తే

పదము నాది .. పరుగు నీది .. రిధము వేరా ప్రియతమా
తగువు నాది. తెగువ నీది ..గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా .. నేనే చేరగా
ఎటూ చూడకా .. వెను వెంటే రానా
నేననీ..నీవనీ..వేరుగా లేమనీ చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాలా స్వప్నం .. ఇప్పుడెదురయ్యే సత్యం .. కలిస్తే
అడ్డుకోగలదా వేగం .. కొత్త బంగారు లోకం .. పిలిస్తే !
*****************************************
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: కార్తీక్

నిజంగా..నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా.. ప్రేమేనా .. ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరీ .. అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై .. నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే రామా .. మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారేదో ఉన్నాదేదో లోనా .. ఏమ్మా ! (2)

నిజంగా..నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా.. ప్రేమేనా .. ఎన్నో వింతలు చూస్తున్నా

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకి ప్రతీ క్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా .. అడుగులు వేస్తూ ..
నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదూ .. గడచిన కాలం ..
ఇంతని నమ్మనుగా !
నిజంగా..నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా.. ప్రేమేనా .. ఎన్నో వింతలు చూస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా ??? .. కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
పెదవికి చెంపా.. తగిలిన చోటాపరవశమేదో తోడౌతుంటే
పగలే అయినా .. గగనం లోనాతారలు చేరెనుగా !

నిజంగా..నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా.. ప్రేమేనా .. ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరీ .. అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై .. నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే రామా .. మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారేదో ఉన్నాదేదో లోనా .. ఏమ్మా ! (2)
************************************
సాహిత్యం: సిరివెన్నెల
గానం: నరేష్ అయ్యర్, కళ్యాణి

ఓ .. కే అనేశా.. దేఖో నా భరోసా
నీకే వదిలేశా .. నాకెందుకులే రభసా (2)

భారమంతా .. నేను మోస్తా .. అల్లుకోవాశాలతా
చేరదీస్తా .. సేవ చేస్తా .. రాణిలా చూస్తా
అందుకేగా .. గుండెలోనే .. పేరు రాశా

తెలివనుకో .. తెగువనుకో .. మగజన్మకలా
కధ మొదలనుకో .. తుదివరకూ .. నిలబడగలదా

ఓ .. కే అనేశా.. దేఖో నా భరోసా
నీకే వదిలేశా .. నాకెందుకులే రభసా (2)

పరిగెడదాం .. పదవె చెలీ
ఎందాక అన్నానా
కనిపెడదాం .. తుది మజిలీ
ఎక్కడున్నా
ఎగిరెళదాం .. ఇలనొదిలీ
నిన్నాగమన్నానా
గెలవగలం .. గగనాన్నీ
ఎవరాపినా

మరోసారి అను ఆ మాటా .. మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం .. నీకోసం .. ప్రాణం సైతం పందెం వేసేస్తా !

ఆ తరుణమూ.. కొత్త వరమూ .. చెంగుముడి వేసిందిలా
చిలిపితనమూ .. చెలిమి గుణమూ .. ఏవిటీ లీల
స్వప్నలోకం .. ఏలుకుందాం .. రాగమాలా

అదిగదిగో .. మది కెదురై .. కనబడలేదా !
కధ మొదలనుకో .. తుదివరకూ .. నిలబడగలదా !!

పిలిచినదా .. చిలిపి కలా
వింటూనే వచ్చేశా
తరిమినదా .. చెలియనిలా
పరుగు తీశా
వదిలినదా .. బిడియమిలా
ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా .. చిక్కు వలా
ఎటో చూశా

భలేగుందిలే నీ ధీమా .. ఫలిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా .. బెదరకుమా ..
త్వరగా .. విడిరా .. సరదా .. పడదామా !

పక్కనుంటే .. ఫక్కుమంటూ .. నవ్వినా నా ప్రియతమా
చిక్కునుంటే .. బిక్కుమంటూ .. లెక్క చేస్తాగా
చుక్కలన్నీ .. చిన్నబోవా .. చక్కనమ్మా !

మమతనుకో .. మగతనుకో .. మతి చెడి పోదా
కధ మొదలనుకో .. తుదివరకూ .. నిలబడగలదా !!

శ్రుతిలయలు

సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఏసుదాస్

తెలవారదేమో స్వామీ
తెలవారదేమో స్వామీనీ తలపుల మునుకలో .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. (2)

తెలవారదేమో స్వామీ
చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు

కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ..

తెలవారదేమో స్వామీ

మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ

ఆ మత్తు నే మది మరి మరి తలచగా..
మరి మరి తలచిగ..
అలసిన దేవేరి .. అలమేలు మంగకూ..

తెలవారదేమో స్వామీ..

మల్లెపువ్వు

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: శ్రేయా ఘోషల్, కార్తీక్

మల్లెపువ్వులో .. మకరందమా
మౌనరాగమే .. ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా

మబ్బు చాటూ.. ఈ జాబిలమ్మ సోకూ
వెన్నెలంతా .. ఓ నాకూ సోకెలే

మల్లెపువ్వులో .. మకరందమా
మౌనరాగమే .. ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా

కలలోనైనా చూడలేదులే .. ఇంతటి అందం ఎన్నడూ
కంట్లో ఉన్నా దొరకలేదులే .. ఈ కనుపాపా ఎన్నడూ

మనసింతేలే .. అది మాయేలే
ఈ పగలైనా ఇక రేయే
ఇది మాయేలే .. ఇది హాయేలే
ఇంతేలే ఇది వింతే

మొన్నలేనిదీ .. నిన్న కానిదీ .. నేడు తోడుగానె ఉందిలే !

మల్లెపువ్వులో .. మకరందమా
మౌనరాగమే .. ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా

కొమ్మచాటునున్నా కన్నె కోయిలా .. కమ్మగ పాడే వేళా
నల్లమబ్బు చూసీ ఏ మయూరమో .. హాయిగ ఆడే వేళా

శృతి నీదేలే .. లయ నాదేలే
ఏ పదమైనా అనురాగాలే
తొలివలపేలే .. అది మెరుపేలే
అంతేలేదిక ఇంతేలే !

నీవు అన్నదీ నేను విన్నదీ .. సుమగానమల్లె ఉందిలే !

మల్లెపువ్వులో .. మకరందమా
మౌనరాగమే .. ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా

మబ్బు చాటూ.. ఈ జాబిలమ్మ సోకూ
వెన్నెలంతా .. ఓ నాకూ సోకెలే

మల్లెపువ్వులో .. మకరందమా
మౌనరాగమే .. ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా

సిద్దు from సికాకుళం

ఈ పాట సంగీతం చాలా బాగా నచ్చేసింది. వీణ ని భలే వాడారు. పాట చిన్నదైనా, ట్యూన్ మాత్రం సూపర్ ! ఈ మధ్య విన్నవాటిలో నాకు నచ్చిన పాట ఇది.

సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: గాయత్రి

తెల్లారి పోనీకూ ఈ రేయినీ
చేజారి పోనీకూ ఈ హాయినీ

మనసు కనక.. మనవి వినక..చెలికి మరి దూరాన ఉంటే ఎలా !

తెల్లారి పోనీకూ ఈ రేయినీ ..చేజారి పోనీకూ ఈ హాయినీ

ఆ నింగి జాబిలమ్మ తోడుగానె ఉందిగా
చుక్కే నీదంటు .. పక్కే రమ్మంటు .. చూస్తావేంటలా !

తెల్లారి పోనీకూ ఈ రేయినీ ..చేజారి పోనీకూ ఈ హాయినీ

ఏ మంత లేనిదాన్ని కానిదాన్ని కాదుగా
ఏలా ఛీ పో లు .. పైపై కోపాలు .. నాపై నీకిలా !

తెల్లారి పోనీకూ ఈ రేయినీ ..చేజారి పోనీకూ ఈ హాయినీ

మనసు కనక.. మనవి వినక..చెలికి మరి దూరాన ఉంటే ఎలా !
తెల్లారి పోనీకూ ఈ రేయినీ ..చేజారి పోనీకూ ఈ హాయినీ

సెల్యూట్

సంగీతం: హరిస్ జయరాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సాధనా సర్గం, బెన్నీ దయాళ్

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పుల కొండలా
రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా
చిన్నారుల చేతికి బొమ్మలా

ఇంతకీ నువ్వొకడివా వందవా
ఎంతకీ నువ్వెవరికీ అందవా !

కొత్తగా లవ్ లో పడుతుంటే .. కొద్దిగా ఇదిలా ఉంటుంది
ముందుగా మనసుకి తెలిసుందే .. ముందుకే నెడుతూ ఉంటుంది
తప్పుకాబోలనుకుంటూనే .. తప్పుకోలేననుకుంటుంది
నొప్పిలో తీపి కలుస్తుందే .. రెప్పలో రేపు కురుస్తుందీ

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పుల కొండలా ..రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా .. చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వొకడివా వందవా ..ఎంతకీ నువ్వెవరికీ అందవా !

తడవక నడిపే .. గొడుగనుకోనా
అడుగుల సడిలో .. పిడుగైనా
మగతను పెంచే .. మగతనమున్నా
మునివనిపించే .. బిగువేనా
ముళ్ళలా నీ కళ్ళలా నను గిల్లిపోతున్నవా
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా
నాకేమౌతావో చెప్పవ ఇపుడైనా !

చెప్పమని అడిగేం లాభంలే .. ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే కొచ్చిన్లే .. ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై .. కుదురుగా ఉంచని తొందరలే
దరిమిలా అంతా నీవల్లే .. అంటు నిలదీసే నిందల్లే

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

బిత్తరపోయే .. బెదురొదిలించూ
కొత్తగ తెగువే .. కలిగించూ
కత్తెర పదునై .. బిడియము తెంచూ
అత్తరు సుడివై .. నను ముంచూ

చెంప కుట్టే తేనె పట్టై ముద్దులే తరమనీ
చెమట పుట్టే పరుగు పెట్టీ హద్దులే కరగనీ
అని అడగాలన్నా అడిగెయ్ లేకున్నా !

చెప్పమని అడిగేం లాభంలే .. ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే కొచ్చిన్లే .. ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై .. కుదురుగా ఉంచని తొందరలే
దరిమిలా అంతా నీవల్లే .. అంటు నిలదీసే నిందల్లే

హో .. నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా ..రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా .. చిన్నారుల చేతికి బొమ్మలా

ఇంతకీ నువ్వొకడివా వందవా హా ..ఎంతకీ నువ్వెవరికీ అందవా !
ఇంతకీ నువ్వొకడివా వందవా ఆ ఆ ..ఎంతకీ నువ్వెవరికీ అందవా !

*************************************************

సాహిత్యం: సాహితి
గానం: బాంబే జయశ్రీ, బలరాం, సునీతా సారధి

ముద్దుల ముద్దుల కన్నె నేనేరా
సిరివెన్నెల వేళల వేచి ఉన్నారా
సిగ్గుల మొగ్గల హొయలు నావేరా
నును బుగ్గల నిగ్గులు గిల్లుకోరారా

నిన్నే కనీ .. నీ నవ నవ ఊహల తేల
నీ తోడునై .. ఓ తరగని వరముగ కోరా !

ముద్దుల ముద్దుల కన్నె నేనేరా
సిరివెన్నెల వేళల వేచి ఉన్నారా
సిగ్గుల మొగ్గల హొయలు నావేరా
నును బుగ్గల నిగ్గులు గిల్లుకోరారా

ఎదలో .. నీ ఎదలో .. తేనొలికిన అలికిడి కానా

జతలో .. నీ జతలో .. నే నిలువున మైమరచేనా

ఒడిలో .. నీ ఒడిలో .. చురు చురుకుగ ప్రియముడి పడనా

లయలో .. నీ లయలో .. సుమ ఊయలలే ఊగెయ్ నా


నాలో దాగున్నా .. సుఖమేదొ ఈ వేళా

నువు నాకు తెలిపావే .. గిలిగింతలయ్యేలా


నీతో ఇలా .. హే చిలిపిగ కలబడి పోనీ

ఇన్నాళ్ళుగా .. నా కలయిక కలయిక కానీ !


ముద్దుల ముద్దుల కన్నె నీవేలే

నీ వెచ్చని ముద్దుకి కాచుకున్నాలే

సిగ్గుల మొగ్గల హొయలు చూశానే

నును బుగ్గల నిగ్గులు గిల్లుకుంటానే


ఓ వహు వహు వహు వహు నీలో

ఓ వహు వహు వహు వహు నాలో .. మోహం

ఓ వహు వహు వహు వహు నీలో

ఓ వహు వహు వహు వహు నాలో .. తాపం తాపం !


చలిలో .. వెన్నెలలో .. నిను ఒకపరి తాకితె చాలూ

చెలినీ .. చెక్కిలిపై .. చిరు ముద్దే పెడితే చాలూ

మదిలో .. నా మదిలో .. నీ మృదుపరవశమే చాలూ

అదిగో .. క్షణమైనా .. నీ కౌగిట వాలితె చాలూ


చాలులే అన్నా .. సరిపోదు సంతోషం

నా నిదురలో అయినా .. విడిపోదు నీ విరహం


వయారమా .. నీ సొగసులు పొగడగ తరమా

విశాలమౌ .. నీ నడుమిక అది నా వశమా !


ముద్దుల ముద్దుల కన్నె నేనేరా

సిరివెన్నెల వేళల వేచి ఉన్నారా

సిగ్గుల మొగ్గల హొయలు చూశా

నేనును బుగ్గల నిగ్గులు గిల్లుకుంటానే


నిన్నే కనీ .. నీ నవ నవ ఊహల తేలనీ తోడునై ..హ్మ్ .. హ్మ్ !

భద్రకాళి

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల, కె.జె.ఏసుదాస్

చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ.. నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ .. ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ.. లాలిపాట పాడేనూ

నీ ఒడిలో నిదురించీ .. తీయనీ కలగాంచీ
పొంగి పొంగి పోయానూ .. పుణ్యమెంతో చేశానూ
నీ ఒడిలో నిదురించీ .. తీయని కలగాంచీ
పొంగి పొంగీ పోయానూ .. పుణ్యమెంతో చేశానూ

ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా
ఈనాటి ఈ బంధం ఏ నాడు విడదమ్మా
అమ్మ వలె రమ్మనగా .. పాప వలె చేరేవూ
నా చెంత నీవుంటే .. స్వర్గమేమి నాదౌనూ
గాయత్రి మంత్రమునూ .. జపించే భక్తుడనే
కోరుకున్న వరములనూ .. ఇవ్వకున్న వదలనులే

స్నానమాడి శుభవేళా .. కురులతో పువ్వులతో
దేవి వలె నీవొస్తే .. నా మనసు నిలువదులే
అందాల కన్నులకూ .. కటుకను దిద్దేనూ
చెడు చూపు పడకుండా .. అగరు చుక్క పెట్టేనూ

చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ.. నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ .. ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ.. లాలిపాట పాడేనూ
జోలాలీ .. జోలాలీ .. జోలాలీ .. జోలాలీ ..జో జో జో !

వయసు పిలిచింది (1978)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆరుద్ర

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

ఇలాగే ఇలాగే సరాగమాడితే..
lovely song !
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

వయసులో వేడుందీ.. మనసులో మమతుంది
వయసులో వేడుందీ.. మనసులో మమతుంది
మమతలేమో సుధామయం .. మాటలేమో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో ..

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

కంటిలో కదిలేవూ..జంటగా కలిసావు
కంటిలో కదిలేవూ..జంటగా కలిసావూ

నీవు నేనూ సగం సగం .. కలిసిపోతే సుఖం సుఖం
తనువూ మనసూ తనివిరేపునే

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

భావమే నేనైతే.. పల్లవే నీవైతే
భావమే నేనైతే.. పల్లవే నీవైతే
ఎదలోనా ఒకే స్వరం .. కలలేమో నిజం నిజం
పగలూ రేయీ ఏదో హాయీ ..

ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే ..
ఊయలూగునే .. ఆహ హాహ హా !


*************************************************

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

హే.. ముత్యవల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే .. మంచి సోటే మనకు కుదిరిందిలే

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే

కురిసే సన్నని వానా .. సలి సలిగా ఉన్నది లోనా
కురిసే సన్నని వానా .. సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లోనా

జరగనా కొంచెం .. నేనడగానా లంచం
చలికి తలలు వంచం .. నీ వళ్ళే పూలమంచం
వెచ్చగ ఉందామూ మనమూ

హే .. పైటలాగా నన్ను నువ్వూ కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే

పండే పచ్చని నేలా .. అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా .. అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే

పులకరించు నేలా .. అది తొలకరించు వేళా
తెలుసుకో పిల్లా .. ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ .. మనదీ

హే .. కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపోవా

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే

నవ్వని పువ్వే నువ్వూ .. నునువెచ్చని తేనెలు ఇవ్వూ
దాగదు మనసే .. ఆగదు వయసే

ఎరగదే పొద్దూ .. అది దాటుతుంది హద్దు
ఈయవా ముద్దూ .. ఇక ఆగనే వద్దు
ఇద్దరమొకటవనీ .. కానీ

హే .. బుగ్గ మీదా మొగ్గలన్నీ దూసుకోనీ
రాతిరంతా జాగారమే చేసుకోనీ

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే .. మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే


*****************************************

గానం: వాణీ జయరాం

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా .. సరదా పడితే వద్దంటానా .. హయ్య !

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా .. సరదా పడితే వద్దంటానా .. హయ్య !

నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
దాచినదంతా నీ కొరకే
దాచినదంతా నీ కొరకే

నీ కోరిక చూపే .. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో కోర్కే !

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా .. సరదా పడితే వద్దంటానా .. హయ్య !

నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం
పరుగులు తీసే నా పరువం

నీ కధలే విందీ .. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది నీకూ నాకే జోడందీ !

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా .. సరదా పడితే వద్దంటానా .. హయ్య !

ఎర్రగులాబీలు (1979)


సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, ఎస్.జానకి

ఎదలో తొలివలపే..విరహం జత కలిసే
మధురం ఆ తలపే..నీ పిలుపే

ఎదలో తొలివలపే..విరహం జత కలిసే
మధురం ఆ తలపే..నీ పిలుపే

ఎదలో తొలివలపే..

రోజాలతో పూజించనీ..విరితేనెలే నను త్రాగనీ
నా యవ్వనం పులకించనీ..అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ
కధలే నడిపిందీ

ఎదలో తొలివలపే..విరహం జత కలిసే
మధురం ఆ తలపే..నీ పిలుపే

ఎదలో తొలివలపే..

పయనించనా నీ బాటలో..మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలిరేయినీ..కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే
సాగే..చెలరేగే

ఎదలో తొలివలపే..విరహం జత కలిసే
మధురం ఆ తలపే..నీ పిలుపే

ఎదలో తొలివలపే..విరహం జత కలిసే
మధురం ఆ తలపే..నీ పిలుపే

ఎదలో తొలివలపే..


*************************************

సాహిత్యం: ఆత్రేయ
గానం: బాలు, ఎస్.జానకి

ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నను కోరీ
ఆశే రేపింది నాలో..అందం తొణికింది నీలో.. స్వర్గం వెలిసింది భువిలో

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నిను కోరీ
ఆశే రేపింది నీలో..అందం తొణికింది నాలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

లతనై..నీ జతనై..నిన్నే పెనవేయనా
కతనై..నీ కలనై..నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతమూ
న న న న నా .. నీకెందుకు ఈ అనుబంధమూ
న న న న న న న న నా..

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నను కోరీ
ఆశే రేపింది నీలో..అందం తొణికింది నాలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

పెదవినీ..ఈ మధువునూ..నేడే చవిచూడనా
నవ్వనీ..ఇక లేదనీ..నీకూ అందివ్వనా
వయసుని వయసే దోచేదీ
న న న న నా .. అది మనసుని నేడే జరిగేదీ
న న న న న న న న నా..

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నిను కోరీ
ఆశే రేపింది నాలో..అందం తొణికింది నీలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

పంతులమ్మ (1977)


సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి

గానం: బాలు, పి.సుశీల


మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం ఆ.. ఆ
ఆ.. ఆ
యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాల దశ దిషాంతాల సుమ సుగంధాల బ్రహ్మార నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

జాబిలి కన్నా నా చెలి మిన్నా పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చెరగలనో
మనసున మామతై కడతేరగలనూ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ
తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమనీ
కలిసే దాకా అనుకోలేదు తీయని స్నేహమనీ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
సంసారం సంగీతం

****************************


గానం: బాలు

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఎలదేటిపాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే

తొలిపూత నవ్వే వనదేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే

అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే


****************************

గానం: బాలు

ఎడారిలో కోయిలా
తెల్లారనీ రేయిలా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

'పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే..
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే !'

ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే శిల అయితే మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే విరబూసినా మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూత
రగిలింది ఈ రాలుపూతా.. విధిరాతచేతా.. నా స్వర్ణసీతా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

'కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్ !
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ !!'

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాటా.. చెలిలేని పాటా.. ఒక చేదుపాటా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

****************************

గానం: పి.సుశీల


మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ
మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడై నాడు..ఆ..

తలచిన వారికి తారకరాముడు
పిలిచిన పలికే చెలికాడు సైబోడు
కోలువై ఉన్నాడు కోదండరాముడు
మన తోడుగా .. నీడగా .. రఘురాముడు

మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

కడకు బోయను ఆది కవిని చేసిన పేరు
గరళ కంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపర సాధనకు ఇరువైన పేరు
శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు
హనుమ ఎదలొ భక్తి ఇనుమడించిన పేరు
రామ రామ అంటే కామికమే తీరు
కలకాలము మమ్ము కాపాడు పేరు

మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ