August 30, 2009

బాణం




Powered by eSnips.com





సంగీతం : మణి శర్మ
గానం : హేమచంద్ర , సైంధవి


నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది
ఇదేం మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

అవును కాదు తడబాటునీ అంతో ఇంతో గడిదాటనీ
విడి విడి పోనీ పరదాని పలుకై రానీ ప్రాణాన్నీ
ఎదంతా పదాల్లోన్న పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది
ఇదేం మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్ని చిగురై పోనీ శిశిరాన్ని
నీతో చెలిమి చెస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయి ఇలా
మనమే సాక్షం మాటే మంత్రం
ప్రేమే బంధం

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా



*****************************


సంగితం : మణిశర్మ
గానం : శంకర్ మహదేవన్



కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
ఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటం
ఏ క్షణము నిజమై కుదుట పడునో ఆవేశం
ప్రతి రోజు నీలో చిగురేసే ఆశే జతగా
నడిచేనా శ్వాసై నిను గమ్యం చేర్చే దిశగా

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తియమనదా

చెరగదే జ్ఞాపకమేదైనా పసితనం దాటిన ప్రాయాన
సమరమే స్వాగతమిచ్చేనా
కలగనే ఆశయమేదైనా బతుకులో ఆశలు రేపేనా
ఇపుడిలా నీ దరి చేరేనా
ఎదను తాకే గాయలు తాగే నేస్తాలు నీలో
ఎదురు చూసే కాలాలు పూసే చైత్రాలు నీ దారిలో

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా

వెలుగయే వేకులలెన్నైనా వెతికితే లేవా నీలోనా
జగతికే దారిని చూపేనా
గగనమే నీ తొలి మజిలీనా గమనమే ఓ క్షణమాగేనా
విజయమే నీడగ సాగేనా
అలలు రేపే సంద్రాలు దూకే సైన్యాలు నీలో
చెలిమి కోరే లొకాలు చేసే స్నేహాలు ఈ వేళలో

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా


*******************************



గానం : శ్రేయా ఘోషాల్



తననాన నానాన తననాన నానాన

మోగింది జేగంట మంచే జరిగేనంట
మనసంటోంది ఈ మాట
కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా
నను పిలిచినది పూబాట...తనతోపాటే వెళిపోతా
ఆకాశం నీడంతా నాదేనంటోంది
అలలు ఎగసే ఆశ
ఏ చింతా కాసింత లేనే లేదంది
కలత మరిచే శ్వాస

మోగింది జేగంట మంచే జరిగేనంట
మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

పద పదమని నది నడకనీ ఇటు నడిపినదెవరైనా
తన పరుగులో తెలి నురగలో నను నేనే చూస్తున్నా
ప్రతి పిలుపునీ కధ మలుపనీ మలి అడుగలు వేస్తున్నా
అలుపెరుగనీ పసి మనసునై సమయంతో వెళుతున్నా
నలుసంత కూడా నలుపేది లేని
వెలుగుంది నేడు నా చూపునా
ఏ దూరమో ఏ తీరమో ప్రశ్నించనీ పయనంలోన
ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా


మోగింది జేగంట మంచే జరిగేనంట
మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

ఒక చలువన ఒక వెలుగుగా జత కలసినదో సాయం
మనసెరిగిన మధుమాసమై నను చేర్చిందే గమ్యం
కల నిలువని కనుపాపలో కళలొలికినదో ఉదయం
అది మొదలున నను ముసురిన ఏకాంతం మటుమాయం
నా చుట్టూ అందంగా మారిందీ లోకం
ఊహల్లో నైనా లేదీ నిజం
చిరునవ్వుతో ఈ పరిచయం వరమయ్యిలా నను చేరేనా
బదులడగని ఈ పరిమళం నా జన్మనే మురుపించేనా


మోగింది జేగంట మంచే జరిగేనంట
మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట


August 28, 2009

మగధీర





Powered by eSnips.com



సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కీరవాణి, నిఖితా నిగమ్



ఆ ఆ అ ఆ అ ఆ .......................

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడ రాదు నిద్దుర
నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసందుకో దొరా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .........................

సమరములో దూకగా చాకచక్యం నీదేరా.... సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా....అధిపతినై అది కాస్తా దొచేదా
పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా.... చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసందుకో దొరా

శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా.... కుసుమముతో ఖడ్గమే ఆడగా
మగసిరితో అందమే అంటు కడితే అంతేగా... అణువణువు స్వర్గమే ఐపొదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా .....చెరసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా
శత జన్మలైన ఆగిపొని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా........గుండెలొ నగారా ఇక మోగుతోందిరా
నవ సొయగాలు చూడ చూడ రాదు నిద్దుర
ప్రియ పూజలేవొ చేసుకొనా చేతులార సేద తీర

ధీర ధీర ధీర
ధీర ధీర ధీర


*************************************



సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : అనుజ్ గురువారా ,రీటా


పంచదార బొమ్మ బొమ్మ పట్టుకొవద్దనకమ్మా
మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకొవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా
నిన్ను పొందేటందుకే పుట్టానే ఏ గుమ్మా నువ్వు అందక పొతే వృధా ఈ జన్మా
నిన్ను పొందేటందుకే పుట్టానే ఏ గుమ్మా నువ్వు అందక పొతే వృధా ఈ జన్మా

పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంటా యే పువ్వు చుట్టు ముల్లంటా అంటుకుంటే మంటే వళ్ళంతా
తీగ పైన చెయేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట నే వరదలాగ మారితే ముప్పంటా
వరదైనా వరమని బరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిన్ను పొందేటందుకు పుట్టానే ఏ గమ్మా నువ్వు అందక పొతే వృధా ఈ జన్మా

గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఉపిరి అయ్యింది నేల నన్ను నడిపింది ఏమిటంట నీలొని గొప్పా
వెలుగు నిన్ను తాకింది చినుకు కుడా తాకింది పక్షపాతం ఎందుకు నా పై్నా
వెలుగు దారి చుపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలిక నీకేల
అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలొ తోడై నేనొస్తానమ్మా
నిన్ను పొందేటందుకు పుట్టానే ఏ గమ్మా నువ్వు అందక పొతే వృధా ఈ జన్మా



***********************************

సంగీతం : కీరవాణి
సాహిత్యం : కీరవాణి
గానం : దీపు , గీతా మాధురి


బబ్బ బబ్బ బాగుంది బబబబ్బ బాగుంది
బబ్బబబ్బబ బాగుంది
స్...బాగుంది
నా కోసం నువు జుట్టు పీక్కుంటే స్.. బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే స్... బాగుంది
నా కోసం నువ్వు గోడ దూకెయ్యడం బాగుంది
నే కనపడక గోళ్ళు కొరికేయడం బాగుంది

పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచ్చిగ్గా నచ్చావోయ్
పిచి పిచ్హి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచి పిచి పిచ్చిగ్గా నచ్చావోయ్
నా కోసం నువు జుట్టు పీక్కుంటే స్.. బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే స్... బాగుంది

కేవీఆర్ పార్క్ లో జాగింగుకు వెళ్ళావంటూ
విశ్వసనీయ వర్గాల ఇంఫర్మేషన్
స్విస్ వీధుల మంచులో మాట్లాడుతు ఫ్రెంచిలో
బర్గర్ తింటున్నావంటు ఇంటిమేషన్
పాల కడలి అట్టడుగుల్లో
పూల పరుపు మెత్తటి పిల్లో పైన పడుకొనుండుంటావని కాల్కలేషన్
ఘన గోపుర భవంతిలో జనజీవన శ్రవంతిలో
నా వెనకే ఉంటూ దాగుడు మూతలు ఆడడమనుకుంటా నీ ఇంటెంషన్

పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచ్చిగ్గా నచ్చావోయ్
పిచి పిచ్హి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచి పిచి పిచ్చిగ్గా నచ్చావోయ్

ఎవరో ఒక వనితామణిని నువ్వేమోననుకొని పిలిచి
కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి
వెనకడుగేయొద్దుర కన్నా వెనకే ఉందేమో మైనా
ఎదురెదురై పోతారేమో ఇహనో ఎపుడైనా
అనుకుంటు కలగంటూ తనతోనే బ్రతుకంటూ
దొరికీ దొరకని దొరసాని దరికొచ్చేదెపుడంటున్నా
అంటున్నా అంటున్నా

పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచ్చిగ్గా నచ్చావోయ్
పిచి పిచ్హి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచి పిచి పిచ్చిగ్గా నచ్చావోయ్

********************************************


సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : దలేర్ మెహందీ ,గీతా మాధురి


పైట నలిగితే మాయమ్మ ఒప్పుకుంటదేటి
బొట్టు కరిగితే మా బామ్మ ఊరుకుంటదేటి
అదే జరిగితే .......ఓలమ్మో....అదే జరిగితే...అత్తమ్మ తట్టుకుంటదేటి

ఏటి సెప్పనూ .....నానేటి సెప్పనూ.....నానేటి సెప్ప

చెప్పానే చెప్పద్దు ....చెప్పానే చెప్పద్దు వంకా ...తిప్పానే తిప్పుతూ డొంకా
చేతిలో చిక్కకుండా జారిపొకే జింకా పారిపోతే ఇంకా మొగుతాదే ఢంకా
చెప్పానే చెప్పద్దు వంకా ఇవ్వానే ఇవ్వద్దు ధంకా
ఏనాడో పడ్డదంట నీకు నాకు లింకా నువ్వు నేను సింకా ఓసి కుర్ర కుంకా
ఎక్కడ నువ్వెళితే అక్కడ నేనుంటా ఎప్పుడు నీ వెనకే యేయి యేయి ..యేయి యేయి యేయి యేయి

జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
ఇయ్యాల మంగళవారం మంచిది కాదు మానేసేయ్..సేయ్ ...సేయ్... సేయ్

నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టుముడతా పంజరమై
నీ సిగ్గు కొస్తా కొడవలినై నమిలిపిస్తా కవ్వానై.... హేయ్ .షావా అరె షావా అరె షావా షావా షావా షావా
నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టుముడతా పంజరమై
నీ సిగ్గు కొస్తా కొడవలినై నమిలిపిస్తా కవ్వాన్నై
నిప్పుల ఉప్పెనలే ముంచుకు వస్తున్నా నిలువను క్షణమైనా యేయి యేయి .. యేయి యేయి యేయి యేయి
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
అలవాటు లేనే లేదు అయ్యే దాక ఆగేసేయ్

ఏయ్ పిల్లడూ ఏయ్ ఏయ్ పిల్లడూ ఓయ్ పిల్లడూ ఓయ్ ఓయ్ పిల్లడూ
చలెక్కుతున్న వేళ చింతచెట్టు నీడలోకి చురుక్కు మన్న వేళ పాడుబడ్డ మేడలొకి
వాగలోకి వంకలోకి సంతలోకి చాటులోకి నారుమళ్ళతోటలోకి నాయుడోళ్ళ పేటలోకి
ఊల్లిచేను పక్కనున్న రెల్లుగడ్డిపాకలోకి పిల్లడో ...ఏం పిల్లడో
ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దాం వస్తవా

వస్తా బాణాన్నై రాస్తా బలపాన్నై మోస్తా పల్లకినై ఉంటా పండగనై
నీ దారి కొస్తా బాణాన్నై నీ పేరు రాస్తా బలపాన్నై
నీ ఈడు మోస్తా పల్లకినై నీ తోడు ఉంటా పండగనై
పిడుగుల సుడిలోనా ప్రాణం తడబడినా పయనం ఆగేనా యేయి యేయి .. యేయి యేయి యేయి యేయి

జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే

August 04, 2009

స్నేహితుడా



Powered by eSnips.com




సంగీతం : శివరామ్ శంకర్
సాహిత్యం : భాషాశ్రీ
గానం : కార్తీక్ , శ్రేయా ఘోషాల్

Happy version

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎందుకో ఏమిటో చెప్పలేను కానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాల
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పెవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందని


ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ మన బంధం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

*********************************


Sad version

సంగీతం : శివరామ్ శంకర్
సాహిత్యం : భాషాశ్రీ
గానం : కార్తీక్ , శ్రేయా ఘోషాల్



ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేధించి వెళ్ళేటందుకు నేనెవరూ
వింతగా ఉందసలు గుండెలో ఈ సెగలు
దేనికో నీపైనే ఉంటొంది నా ధ్యాశసలు
వినిపిస్తే నీ స్వరము కళ్ళల్లో కలవరము
ఇది ప్రేమంటారో ఏమంటారో ఏమిటో
బాధించే ఈ క్షణము కాదంటు శాశ్వతము
నను ఓదార్చి మైమరపిస్తోంది ప్రాణము

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేధించి వెళ్ళేటందుకు నేనెవరూ

నీడలా నడిచిన స్నేహం దారి చూపమంటే
నిలిచాను రాతి బొమ్మనై
గాలిలా నీరులా సాగే బాటసారి నేను
కలిసావే తీరమల్లే నాకు

ప్రియమైన మోహమో మౌనమా విప్పవే పెదవి్నీ
నా పలుకుల భావమే ప్రేమనీ చెప్పవే అతనికీ

గోపి గోపిక గోదావరి


Get this widget Track details eSnips Social DNA


సంగీతం : చక్రీ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : చక్రీ , కౌసల్యా


నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నైలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగలుస జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరఫున గీత చెరపనా
ఎంత దూరాన నీవున్నా నితోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుందీ వేళ
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల