సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర
తొలి తొలి బిడియాలా .. పువ్వా .. త్వరపడి పరుగేలా
తొలి తొలి బిడియాలా .. పువ్వా .. త్వరపడి పరుగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై .. పరవాశాన పసి పరువానా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై .. పరవాశాన పసి పరువానా
తొలి తొలి బిడియాలా .. పువ్వా .. త్వరపడి పరుగేలా
చిన్నదాని వయసే .. చెంత చేరి పిలిచే .. తాకితే తడపడుతూ జారేందుకా
నిలవని అలలా .. నిలువున అల్లితే .. మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా
ఆశల తీరాన మోజులు తీర్చెయ్ నా
హద్దు మరి తెంచేస్తే యవ్వనం ఆగేనా
తొలి తొలి బిడియాలా .. పువ్వే .. సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై .. నరముల వీణ మీటే తరుణమిదే
తొలి తొలి బిడియాలా .. పువ్వే .. సొగసుగ నలిగేలా
మధువులు కురిసే .. పెదవుల కొరకే ..ఇరవై వసంతాలు వేచి ఉన్నా
మదిలోని అమృతం పంచడానికేగా ..పదహారు వసంతాలు దాచుకున్నా
ఇకపైన మన జంట కలనైన విడరాదే
మరి కొంటె కల వెంట కన్నె ఎద తేల రాదే
తొలి తొలి బిడియాలా .. పువ్వే .. సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై .. పరవాశాన పసి పరువానా
తొలి తొలి బిడియాలా .. పువ్వా .. త్వరపడి పరుగేలా
**************************************************
గానం: హరిణి
లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్నిప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా
పగటి బాధలన్ని మరిచి పోవుటకు ఉంది కదా ఈ ఏకాంత వేళ
లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్నిప్రాణం
సమగప పమపమా దనిదారిసని సమగప పమపమా సమగప పమపమా దనిదారిసని సమగప సగమా
ఎటో పోయేటి నీలి మేఘం
వర్షం చిలికి వెళ్ళదా
సరిగమమ మపగగ
యేదో అంటుంది కోయెల పాట
రాగం ఆలకించగా
సరిగమమ మపగగ
అన్ని వైపులా మధువనం
పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం
అంద జేయదా అమృతం
లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్నిప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా మరీ వేణు గానం
1 comment:
this song fromwhich movie ?
Post a Comment