January 23, 2009

పూజ (1976)



సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: దాశరధి

గానం: బాలు, వాణీ జయరాం

ఎన్నెన్నో జన్మల బంధం...నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమతా నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేనూ
ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేనూ

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమతా నాదీ నీదీ

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలీ
నిన్నే చూసిన వేళ నిండును చెలిమీ

ఓహో హొ హొ నువ్వు కడలివైతే నే నదిగ మారి
చిందులు వేసి వేసి వేసి నిన్ను చేరనా.. చేరనా..చేరనా

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ
ఎన్నటికీ మాయని మమతా నాదీ నీదీ

విరిసిన కుసుమము నీవై మురిపించేవూ
తావిని నేనై నిన్నూ పెనవేసేను

ఓహోహో .. మేఘము నీవై..నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి చూసి .. ఆడనా ..ఆడనా ...ఆడనా

ఎన్నెన్నో..ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ..ఎన్నటికీ మాయని మమతా నాదీ నీది

కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి
ఓహో హొ హొ..నీ ఉన్నవేళ ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు ఉండనీ..ఉండనీ..ఉండనీ

ఎన్నెన్నో..
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ..
ఎన్నటికీ మాయని మమతా నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేనూ

*********************************

గానం: బాలు

అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ
నీకోసమే నా జీవితం
నాకోసమే నీ జీవితం

అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ

నీవే లేని వేళ ఈ పూచే పూవులేల
వీచే గాలి వేసే ఈల ఇంకా ఏలనే

కోయిల పాటలతో పిలిచే నా చెలీ
పావుల గలగలలో నడిచే కోమలీ

అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ

నాలో ఉన్న కలలు మరి నీలో ఉన్న కలలూ
అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే

తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా
నీ చిరునవ్వులకై వెతికే నా ఎదా

అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ

*******************************

గానం: వాణీ జయరాం, బాలు

నింగీ నేలా ఒకటాయెలే ..
మమతలూ .. వలపులూ .. పూలై విరిసెలే

నింగీ నేలా ఒకటాయెలే ..

ఓ ఓ హో హో .. ఇన్నాళ్ళ ఎడబాటు నేడే తీరెలే
నా వెంట నీ ఉంటే ఎంతో హాయిలే
హృదయాలు జత చేరి ఊగే వేళలో
దూరాలు భారాలు లేనే లేవులే

నీవే నేనులే .. నేనే నీవులే !

నింగీ నేలా ఒకటాయెలే ..

ఆ ఆ హా హ .. రేయైనా పగలైన నీపై ధ్యానమూ
పలికింది నాలోన వీణా గానమూ

అధరాల కదిలింది నీదే నామమూ
కనులందు మెదిలింది నీదే రూపమూ
నీదే రూపమూ .. నీవే రూపమూ !

నింగీ నేలా ఒకటాయెలే ..
మమతలూ .. వలపులూ .. పూలై విరిసెలే

No comments: