February 03, 2009

ధర్మక్షేత్రం

సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర

ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ

ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో

మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా

ఓ .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో

అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా

హో .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

No comments: