Showing posts with label L. Show all posts
Showing posts with label L. Show all posts

March 03, 2011

LBW (Life Before Wedding)

సాహిత్యం: కృష్ణ చైతన్య
సంగీతం: సత్య ప్రసాద్

గానం: కార్తీక్

వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే

ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే

చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ

తన ఊపిరి నను తడమగా .. ఇది మరణములే
చెలి అలకల చిరుకోపము .. ఇక కనపడదే
రాత రాసినా .. పైవాడు ఎవ్వడో
జాలి లేదులే .. నా పైన ఎందుకో

చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ

వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే

ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే

చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ

తడి ఆరని విడి విడి కన్నుల కధ ఇదిలే
తడబడి ఎద విలవిలమనె చెలి తలపులలో
కంటిపాపలా .. కన్నీటి పాటలా
రెప్పపాటులో .. ఏమైంది అంతలా

చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ

వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే
వేదనే ఒక వేదమా .. శోకం శ్లోకం నువ్వే

ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే
ప్రాణం నువ్వే .. ప్రణవం నువ్వే

చెదిరినా .. గతమే ఎదురై రాదూ
చెదిరినా .. గతమే ఎదురై రాదూ

**************************
 
సాహిత్యం: కృష్ణ చైతన్య
సంగీతం: అనిల్.ఆర్

గానం: నరేష్ అయ్యర్, రోహిత్

రెప్పపాటు ఈ క్షణం నువు చేరువై
రెప్పపాటు ఈ క్షణం నువు దూరమై
రెప్పపాటు ఈ క్షణం నా జీవితం
రెప్పపాటు ఈ క్షణం ఇక శాశ్వతం

With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !!

వేకువా చీకటీ ఒకటై కలిసిన వేళా
పరువం మెల్లగా మాయలో మునిగిందా
ఎదురై నువ్విలా కలగనే కన్నుల్లో ఇదో కొత్త పరవశం

దూరాలే దారి చూపి నిన్ను కలుపుతుంటే తెలిసింది ఇది ప్రేమనీ

రెప్పపాటు ఈ క్షణం ..
రెప్పపాటులో ..

రెప్పపాటు ఈ క్షణం నువు చేరువై
రెప్పపాటు ఈ క్షణం నువు దూరమై
రెప్పపాటు ఈ క్షణం నా జీవితం
రెప్పపాటు ఈ క్షణం ఇక శాశ్వతం

With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !!

ఊపిరే ఊసులై ఎదల్నే కలిపిన వేళా
ఒకటై ఇద్దరం జగమే మరిచామే
కమ్మేసిందిలా నను అల్లుకోమంటూ చెలి వింత పరిమళం
ఇన్నాళ్ళు లేని హాయి నన్ను కలుసుకుంటే తెలిసింది ఇది ప్రేమనీ

రెప్పపాటు ఈ క్షణం ..

With you in my life I have seen it all girl !
With you in my life I have got whole wide world !!
With you in my life I have seen it all girl !
You in my Life .. my Life .. my lIfe

****************************************

సాహిత్యం: కృష్ణ చిన్ని
గానం: జావేద్ ఆలి, రమ్య

తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా

కన్నులు రమ్మంటే కలలే రానే రావు కదా
ఏదేమైనా నీతో నువ్వే ఉండాలికా

నా పంతం నాదంటూ ఊరుకోవు కదా
కలతన్నది కన్నీరా .. తరిగే వీలుందారా
ఎడబాటే లేదంటే .. ప్రేమ కాదు కదా !

నాకొద్దు పొమ్మంటే పారిపోదు కదా
వలపన్నది తలపేనా .. తెలిసే రేపుందారా
నాకోసం రమ్మంటే .. ప్రేమ రాదు కదా !

ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా !

తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఆనందం వద్దంటూ నే మాత్రం అంటానా
ఏకాంతం వద్దంటూ నీ మౌనం అంటున్నా

వాలినా పొద్దులో చీకటే .. వేకువై ఉదయమే వెలగదా
!

December 16, 2009

Leader

గానం: నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్
సాహిత్యం: వేటూరి
సంగీతం: మిక్కీ జే మేయర్

అవుననా.. కాదనా.. నాదనా.. ఓ ఓ ఓ
లేదనా .. రాదనా .. వేదనా .. ఓ ఓ ఓ
మూగవైనా .. రాగమేనా
నీటిపైనా .. రాతలేనా

అవుననా.. కాదనా.. నాదనా.. ఓ ఓ ఓ
లేదనా .. రాదనా .. వేదనా .. ఓ ఓ ఓ

తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు
కన్ను నీరూ వెల్లువైతే వెన్నెలే కాబోలూ
నింగి నేలా ఏకమైనా పొద్దులో సింధూరాలు
నీకు నేనూ చేరువైనా ఎందుకో దూరాలు

దొరికిందీ .. దొరికిందీ .. తోడల్లే దొరికిందీ హో
కలిసిందీ .. కలిసిందీ .. కనుచూపే కలిసిందీ (2)

ఇందుకేనా .. ప్రియా
ఇందుకేనా !

అవుననా.. కాదనా.. నాదనా.. ఓ ఓ ఓ
లేదనా .. రాదనా .. వేదనా .. ఓ ఓ ఓ

ఆ .. ఆ .. ఆ .. ఆ
ఆశలన్నీ మాసిపోయీ ఆమనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్నీ బాధలే పూసేలా
పూలజడలో తోకచుక్కా గుట్టుగా ఉయ్యాలూగే
రాసలీలా రక్తధారా బాధలై పోయేలా

తెలిసిందీ .. తెలిసిందీ .. నిజమేదో తెలిసిందీ
కురిసింది .. విరిసింది .. మెరుపేదో మెరిసిందీ (2)

అందుకేనా .. ప్రియా
ఇందుకేనా !

అవుననా.. కాదనా.. నాదనా.. ఓ ఓ ఓ
లేదనా .. రాదనా .. వేదనా .. ఓ ఓ ఓ

April 23, 2009

లక్ష్మి

సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : విశ్వ
గానం : రమణ గోగుల, గంగ

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

హే.. ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
తప్పదు నెగ్గే లేత జవాని..నచ్చాయే నీలో హొయలన్నీ..

నిన్నే నేనే మెచ్చా వాలా..
వినుకోరా హిమ్మత్ వాలా..మెప్పిస్తా అల్లేసియ్యాలా..

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

ఆటే కట్టు నీ బెట్టు కౌగిళ్ళకు తాకట్టు
చాటూ మాటు నీ గుట్టు వొద్దికలో చూపెట్టు
చేస్తూ చిలిపి ఆగడం .. వేస్తా కళ్ళతో శరం
తెస్తా నీలో కలకలం ..దేఖోనా !

హయ్యో కలికి కోమలం .. ఆపై చిలిపి యవ్వనం
దాచేదెట్టా సోకంతా..నాలోనా..లోలోనా !!

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

దేఖో దేఖో నీకేలే నా సోకుల యావత్తూ
రేపో మాపో అంటూనే దాటేయ్యకు నీ వొట్టు
చూసా తమరి వాలకం .. చేసా తుదకు సాహసం
నన్నే చేసుకో వశం .. దీవానా !

ఇట్టా తనువు తగలడం .. ఆపై మనసు రగలడం
చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా !

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

హే.. ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
తప్పదు నెగ్గే లేత జవాని..నచ్చాయే నీలో హొయలన్నీ..

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

*****************************************

సాహిత్యం : శంకర్ మహదేవన్, సుధ
గానం : చంద్రబోస్

హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా
హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
ముడేస్తాను మురళీలోలా..పడేస్తాను నా పాలా..

హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..నీ బోయ్ ఫ్రెండు నేనేగా
హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా

సే సే సత్యభామ..యో.. హుం
ఓసోస్ .. షకలక షకల అలకభామ..యే..చెక్ ఇట్ అవుట్ !

తూహీ మేరా దిల్ మేరా మన్ ఓ జానేమన్
తూహీ జీవన్ మేరే దిల్ కీ ధడకన్ !

ప్రతినిమిషం నీ వశం ఇదే సందేశం
ప్రణయరసం సమర్పిస్తా సమస్తం !

హిందీలో షేరేగాని..మన తెలుగులో కవితవనీ
ఏదైనా ఒకటే బాణీ..సయ్యాటకు సిద్దమనీ

హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..ఊగాలి ఎదలో ఊయలా

మైహూ తేరే సాత్ మేరే యార్ మేరే సాథియా
తూహీ మేరా ప్యార్ ..యే వాదా హమేషా !

నువ్వే అనర్ధం అసాధ్యం మరీ అన్యాయం
నువ్వే అపాయం .. అందమైనా ఉపాయం !

నను పొగిడావా తిట్టావా..గిలిగింతలు పెట్టావా
నడిమధ్యన ఎందుకు గొడవ..నడిపిస్తా నీ పడవ
హే చందమామా రా ఇలా..ఇక జంకేలా..వేయాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
వరిస్తాను వన్నెల బాలా..భరిస్తాను నీగోలా..
ముడేస్తాను మురళీలోలా..పడేస్తాను నా పాలా..

హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..నీ బోయ్ ఫ్రెండు నేనేగా
హే సత్యభామా రా ఇలా..ఇక చింతేలా..నీ బోయ్ ఫ్రెండు నేనేగా

March 06, 2009

Love Today

గానం: హరిహరన్

వేవేల వేవేల.. ప్రియ భామల్లో
పరువాలె విరబూసే.. చిరునవ్వుల్లో
శతకోటి శతకోటి.. నయనాలలో
నీ చూపూ నీ చూపే..నిలదీసిందీ !

Walking in the moon light .. I am thinking of you
Listening to the raindrops .. I am thinking of you
ఒంటరివేళ లోనా.. I am thinking of you
అందరి మధ్య ఉన్నా .. I am thinking of you

ఓ చెలియా..ఓ చెలియా
ఓ చెలియా.. ఓ చెలియా

Walking in the moon light .. I am thinking of you

యవ్వన వనమున పువ్వు నువ్వే
పువ్వులు మెచ్చిన పూజ నువ్వే
పూజకు వచ్చిన దైవం నువ్వే

మెత్తగ గిల్లిన ముల్లు నువ్వే
మనసున కలిగిన బాధ నువ్వే
బాధను మించిన భాగ్యం నువ్వే

ప్రతి ఋతువులో గొంతు కొమ్మలా.. కోయిల నువ్వేలే
ప్రతి సంధ్యలో గుండె గడపలో..ప్రమిదవు నువ్వేలే
నువ్వంటె ఎవరో కాదూ..ప్రేమేలే !

ఓ చెలియ చెలియ చెలియ ఒహో చెలియ చెలియ చెలియ
ఓ చెలియ చెలియ చెలియ ఒహో చెలియ చెలియ చెలియ

.. I am thinking of you !
.. I am thinking of you !!

తెలియక గడిపిన నిన్న నువ్వే
తెలిసి గడిపే నేడు నువ్వే
తెలిసీ తెలియని రేపూ నువ్వే

వెలుగులు నింపిన నింగి నువ్వే
నీడను మోసిన నేల నువ్వే
నింగికి నేలకు నడుమా నువ్వే

ముఖ పరిచయం నాకు పరవశం .. ప్రేమకు బీజాలే
మది అర్పణం మౌన వీక్షణం .. ప్రేమకు విజయాలే
ప్రేమంటే వేరే కాదూ..మనమేలే !

ఓ చెలియ చెలియ చెలియ ఒహో చెలియ చెలియ చెలియ
ఓ చెలియ చెలియ చెలియ ఒహో చెలియ చెలియ చెలియ

ఒంటరివేళలోనా.. I am thinking of you
అందరి మధ్య ఉన్నా .. I am thinking of you

ఓ చెలియా..ఓ చెలియా !
ఓ చెలియా.. ఓ చెలియా !!