January 22, 2009

సీతారామయ్య గారి మనుమరాలు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర



బద్దరగిరి రామయ్యా పాదాలు కడగంగా .. పరవళ్ళు తొక్కింది గోదారి గంగా
పాపీకొండలకున్నా పాపాలు కరగంగా .. పరగుల్లు తీసింది భూదారి గంగా
సమయానికి తగూ పాట పాడెనే.. సమయానికి తగూ పాట పాడెనే..
త్యాగరాజుని లీలగా స్మరించునటు.. సమయానికి తగు పాట పాడెనే..


సమయానికి తగు పాట పాడెనే..
ధీమంతుడు ఈ సీతారాముడు సంగీత సంప్రదాయకుడు..
సమయానికి తగు పాట పాడెనే..
సమయానికి తగు పాట పాడెనే..
రారా పలుకరాయని కుమారునే ఇలా పిలువగ నోచని వాడు..
సమయానికి తగు పాట పాడెనే..
సమయానికి తగు పాట పాడెనే..


చిలిపిగా సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చు చిలకంటి మనవరాలు
సదా కలయ తేల్చి సుతుండు చనుదెంచు నంచు ఆడి పాడు శుభ సమయానికి..
తగు పాట పాడెనే..
సద్బక్తుల నడక నేర్చెననే
అమరికగా నా పూజకు నేనే పలుక వద్దనెనే
విముఖులతో చేరబోకుమనెనే
పెదగలిగిన తాణుకొమ్మనెనే

తమషమాది సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజనుతుడు చెంత రాకనే .. సా..

బద్దరగిరి రామయ్యా పాదాలు కడగంగా .. పరవళ్ళు తొక్కింది గోదారి గంగా
చూపుల్లో ప్రాణాలు ఎగదన్నగంగా .. కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగా...
*****************************************************



గానం: జిక్కి, చిత్ర


వెలుగూ రేఖలవారు తెలవారి తామొచ్చి ఎండా ముగ్గులు పెట్టంగా
చిలకా ముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా
మనవలనెత్తే తాత మనువాడ వచ్చాడు మందార పూవంటి మా బామ్మని
..అమ్మమ్మనీ


నొమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామ..సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందామామ..సందామామ


పండంటి ముత్తైదు సందామామా..
పసుపు బొట్టంట మా తాత సందామామ
నొమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామ..సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందామామ..సందామామ


కూచను చెరిగే చేతి కురులపై తుమ్మెదలాడే ఓ లాల.. తుమ్మెదలాడే ఓ లాల
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓ లాల.. గాజులు పాడే ఓ లాల


గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా.. కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెల పాదం తొక్కిన ఘనుడే ఏ లాలా..
ఏలాలో ఏలాలా.. ఏలాలో ఏలాలా


దివిటీల సుక్కల్లో దివినేలు మామా సందామామ..సందామామ
గగనాల రధమెక్కి దిగివచ్చి దీవించు సందామామ..సందామామ


నొమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామ..సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందామామ..సందామామ


ఆ పైన ఏముంది ఆ మూల గదిలోన
ఆరూ తరముల నాటి ఓ పట్టెమంచం


తొలి రాత్రి మలి రాత్రి మూన్నాళ్ళ రాత్రి..ఆ మంచమె పెంచె మీ తాత వంశం...
అరవై ఏళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి..మరలీ రాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవై ఏళ్ళ వాడు నీ రాముడైతే..పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ..పసుపు కుంకుమ కలిపి చేసాడు బ్రహ్మ


ఆనందమానందమాయెనే..మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనే..మా నానమ్మ పెళ్ళికూతురాయెనే


******************************************************
గానం: చిత్ర


కలికి చిలకలకొలికి మాకు మేనత్తా
కలవారి కోడలు కనకమాలక్ష్మీ ! (2)


అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకాజాక్షి


మేనాలు తేలేని మేనకోడలిని
అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకి నే మించు వరస తాతయ్యా
మా ఇంటికంపించవయ్య మావయ్యా !


కలికి చిలకలకొలికి మాకు మేనత్తా
కలవారి కోడలు కనకమాలక్ష్మీ !


ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మ నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే
మా చంటిపాపను మన్నించి పంపూ ..


కలికి చిలకలకొలికి మాకు మేనత్తా
కలవారి కోడలు కనకమాలక్ష్మీ !


మసక బడితే నీకు మల్లెపూదండా
తెలవారితే నీకు తేనె నీరెండా
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో .. తెలుసుకో .. తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయోధ్య నేలేటి సాకేతరామా


కలికి చిలకలకొలికి మాకు మేనత్తా
కలవారి కోడలు కనకమాలక్ష్మీ !

No comments: