Showing posts with label D. Show all posts
Showing posts with label D. Show all posts

April 16, 2010

డార్లింగ్
















సంగీతం: జి.వి.ప్రకాష్
గానం: సూరజ్, ప్రశాంతిని

ఇంకా ఎదో .. ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్ఠాలే తెలిపేందుకూ
సంకెళ్ళతో .. బంధించకూ
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకూ

తనలో నీ స్వరం .. వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా .. ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాలే చూపించకూ

ఇంకా ఎదో .. ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్ఠాలే తెలిపేందుకూ

మేఘాల వళ్ళోనే ఎదిగిందనీ
జాబిల్లి చల్లేనా జడివాననీ
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ
నీకు పూ రేకులే గుచ్చుకోవే మరీ
తీరమే ఓరినా తీరులో మారునా .. మారదూ ఆ ప్రాణం !

ఇంకా ఎదో .. ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్ఠాలే తెలిపేందుకూ

వెళ్ళెళ్ళు చెప్పేసే .. ఏమవ్వదూ
లోలోన దాగుంటే ప్రేమవ్వదూ
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అవదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ..ఇప్పుడే ఆ అందం !

ఇంకా ఎదో .. ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్ఠాలే తెలిపేందుకూ
సంకెళ్ళతో .. బంధించకూ
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకూ

తనలో నీ స్వరం .. వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా .. ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాలే చూపించకూ

April 23, 2009

ధైర్యం

సంగీతం : అనూప్ రూబిన్స్
సాహిత్యం : కులశేఖర్
గానం : కె కె, పూజ & గ్రూప్



నా ప్రాణం నీవు అనీ తెలుసా ఓ ప్రేమా
నా నేరం ప్రేమ అనీ తెలుసా నీకైనా
కలలు చితి మంటై మనసే ఉలికి పడుతున్నా
చిలిపి చిరుగాలై చెలియా ఎదురు చూస్తునా
ఎగసే విరహానా బ్రతుకే బరువైనా
విడిచిపోలెనుగా నా ప్రాణమా
నా ప్రాణం నీవు అనీ తెలుసా ఓ ప్రేమా


ఒక్కసారిలా నువ్వుతాకితే మాసిపోవునే ఈ గాయం
నిన్ను చూదకా ఆకలేయదే చెంత చేరదే ఈ దాహం
నీరు ముంచినా నిప్పు కాల్చినా..చావదు నా ప్రేమా


ప్రణయం ప్రళయం నిలయం ప్రేమా
నయనం నయనం ఫలితం ప్రేమా
మధురం మధురం మననం ప్రేమా
అమరం అమరం అఖిలం ప్రేమా
సతతం సరసం సలిలం ప్రేమా
హౄదయం రచితం చరితం ఈ ప్రేమా


ప్రేమా..ప్రేమా

చల్ల గాలిలో సన్నజాజిలా నిన్ను చేరదా నా పిలుపూ
కన్న బంధమే కంచె వేసినా నిన్ను చేరదా నా మనసూ
కక్ష గట్టినా ..శిక్షలేసినా చావదు నా ప్రేమా


March 30, 2009

దేవా

సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: కార్తీక్




ఓర కన్నుల్తో చూపేస్తే చెలి .. ఊరుకోదే నా మనసూ
దోర నవ్వుల్తో చంపేస్తే చెలి.. ఉండనీదే నా మనసూ
మరువనులే మరువనులే..నిను కలనైనా మరువనులే
తెలియదులే తెలియదులే..ఇది ప్రేమో ఏమో తెలియదులే
మోజైన పిల్లే వస్తే మోహాన ప్రేమే పుట్టిందే..ప్రెమే పుట్టిందే !


ఓర కన్నుల్తో చూపేస్తే చెలి..ఊరుకోదే నా మనసూ

తోటలోని పూవులు అన్నీ పోటీ పడి నీ కూడినవే
ఆకాశాన జాబిలి కూడా నీకే భయపడి దాగినదే
అందం చందం కొత్తగ ఏదో బంధం వేసి పోయినదే
నిన్నే నిన్నే తలచిన వేళ ఆగని తలపు రేగినదే


మగువా నీ నడకల్లో కలహంసే కదిలినదే
చెలియా నీ నవ్వుల్లో హరివిల్లే మెరిసినదే
మనసైన పిల్లే వస్తే మదిలోన ప్రేమే పుట్టిందే..ప్రేమే పుట్టిందే !


ఓర కన్నుల్తో చూపేస్తే చెలి..ఊరుకోదే నా మనసూ


ఎండాకాలం వెన్నెల జల్లై చెలియా నన్ను తడిపినదే
వానాకాలం చలిమంటల్లే వెచ్చగ నన్ను రేపినదే
మగువా మగువా నీ సహవాసం నన్నే కొత్తగ మార్చినదే
సఖియా సఖియా కొంటెగ మనసే వీడని బంధం వేసినదే


పలికే నీ మాటలన్నీ నే విన్న వేదాలా
ఎదలోని తలపులన్నీ ఆ నింగి దీపాలా
వరసైన పిల్లే వస్తే వరదల్లే ప్రేమే పుట్టిందే..ప్రేమే పుట్టిందే !


ఓర కన్నుల్తో చూపేస్తే చెలి .. ఊరుకోదే నా మనసూ
దోర నవ్వుల్తో చంపేస్తే చెలి.. ఉండనీదే నా మనసూ
మరువనులే మరువనులే..నిను కలనైనా మరువనులే
తెలియదులే తెలియదులే..ఇది ప్రేమో ఏమో తెలియదులే

మోజైన పిల్లే వస్తే మోహాన ప్రేమే పుట్టిందే..నా న నా న నా న నా !

February 03, 2009

దళపతి

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: స్వర్ణలత



యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు జూసెనే రాధా
ప్రేమపొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే


యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో ..వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా !


యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు జూసెనే రాధా
ప్రేమపొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

ధర్మక్షేత్రం

సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర



ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ


ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా


ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో


మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా


ఓ .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా


గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో


అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా


హో .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా


అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

January 07, 2009

ధం (Dhum)

సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: హరిహరన్, నందిత



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా

వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలనీ
తోడుగ ఉండి మనసంతా నిండి నడిపించే జతనీ



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా


నువ్వున్నది నాకోసం .. నేనే నీకోసంలా .. నిలిచే మన ప్రేమలా
నువు లేని ప్రతి నిముషం .. ఎదలోని ఒక గాయంలా .. కరిగే ఈ కన్నీటిలా
మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమా .. పరువపు పూలవానలే
ఇరువురి వలపు వంతెనే .. సకలం ప్రేమ సొంతమే



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా



I love you .. I love you .. I love you .. I love you .. I love you !


నిదురంటు మటు మాయం .. కుదురంటూ కరువే
ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం .. ప్రతి ఊసూ మైకం
ప్రతి చూపు పులకింతలే
చెదరని ఇంద్రధనుసులే ఈ ప్రేమా .. తొలకరి వాన జల్లులే
కరగని పండు వెన్నెలే ఈ ప్రేమా .. కలిగిన వేళ హాయిలే



చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలనీ
తోడుగ ఉండి మనసంతా నిండి నడిపించే జతనీ


చల్లగాలికి చెప్పాలని ఉంది మన కధ ఈ వేళా !

December 29, 2008

ద్రోహి

సంగీతం: హరిస్ జయరాజ్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: రఘు కుంచె, నాగ సాహితి


నీ తలపున..నీ తలపునా
నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే
కంటిపాపగ దాచెను హాయే


హ్మ్ .. నాలో రగిలే .. తీయని మంటా .. నేడెందుకనీ
హ్మ్ .. కోరికలన్నీ .. తారకలాయే .. ఏ విందుకనీ


నీ తలపున..నీ తలపునా
నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే
కంటిపాపగ దాచెను హాయే


ఒడిలో రేగు విరహం .. అది కోరెనే చిలిపి సరసం
తగనీ వలపు మోహం .. అది తగవే తీరు స్నేహం
తరగనిదీ .. కరగనిదీ .. వగలన్ని సెగలైన చలీ
తొలిముద్దు నన్నే .. బులిపించగానే .. దినం దినం నిన్నే చూడగా !


నీ తలపున..నీ తలపునా .. నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే .. కంటిపాపగ దాచెను హాయే



బుగ్గలా పాలమెరుపూ .. అది తగ్గలేదింత వరకూ
మోహం రేపు కలగా .. తొలి ఆమనే వచ్చె నాకై
రసికతలో .. కసికతలే .. తెలిపెను చిలిపిగ చెలీ
ముద్దు ముత్యాలన్నీ .. మోవి దిద్దగానే .. ఎగిసెను నాలో ప్రాయమే !


నీ తలపున..నీ తలపునా ..నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే ..కంటిపాపగ దాచెను హాయే


హ్మ్ .. నాలో రగిలే .. తీయని మంటా .. నేడెందుకనీ
హ్మ్ .. కోరికలన్నీ .. తారకలాయే .. ఏ విందుకనీ



***********************************
గానం: చిన్మయి, రఘు కుంచె



మేఘమాల తానే .. నీ చెంతకొచ్చిందీ
రాగమాలలేవో .. నీ కోసం తెచ్చిందీ
చల్లనీ మనసు .. ఇక నీదేనన్నదీ
మల్లెలా మాసం .. నీ మాటేనన్నదీ
నీ ఊర్వశిగా..
నీ ప్రేయసిగా ..
నీ ఊర్వశిగా..నీ ప్రేయసిగా ..



ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా
చిలికి చిలికీ కురిసే జల్లై .. నన్ను ముంచెయ్యవా
ఒంటరి గాయం చేసే ప్రాయం .. క్షణము లాలించవా



ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా

ఎదనే తెలుపూ మాటలిలా .. ఎదుటే పడితే మౌనమయే
తొలుచు తలపు ఇదీ .. పిలుచు చిలక ఇదీ
ఊపిరి నీవై .. నాలోనా శ్వాసించవా

చూపులతోనే .. నను నువ్వే శాసించవా


ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా


కదలని కాలం బరువాయే .. కంటికి నిదురే కరువాయే
నీడను వీడి వెళ్తావా .. నీతోనే తీసుకెళ్తావా
జన్మల బంధం .. నీతోటి .. వేసెయ్యవా
కమ్మని కలలే .. ఇక నిజమూ .. చేసెయ్యవా



ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా
చిలికి చిలికీ కురిసే జల్లై .. నన్ను ముంచెయ్యవా
ఒంటరి గాయం చేసే ప్రాయం .. క్షణము లాలించవా
క్షణము లాలించవా .. క్షణము లాలించవా !

October 26, 2008

దశావతారం (2008)

సంగీతం : హిమేష్ రేషమియ
సాహిత్యం : వేటూరి
గానం : సాధన సర్గం

ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
వెన్న దొంగ వైనా మన్ను తింటివా

కన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా
ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా
జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే

నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే
ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా

స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్
సీతారామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్

నీలాల నింగి కింద తేలియాడు భూమి....తనలోనే చూపించాడు ఈ క్రిష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్ప శేషమే ఎక్కి.....నాట్యమాడి కాలీయుణీ దర్పమణిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానం మేగా.....అజ్ఞానం రూపు మాపే క్రిష్ణ తత్వమేగా
అట అర్జునుడొందెను నీదయ వల్ల గీతోపదేశం

జగతికి సైతం ప్రా ణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే....రేపల్లె రాగం తానం రాజీవమే

హే ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

మత్స్యమల్లె నీటిన తేలి వెదములను కాచి.....కూర్మరూప ధారివి నీవై భువుని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచి నావే....నరసింహుని అంశే నీవై హిరణ్యున్ని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు....క్రిష్ణుడల్లె వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతరాలెన్నెన్నున్నా ఆధారం నేనే

నీ ఓరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మది లోని ప్రేమ నీదే మాధవుడా.....మందార పువ్వే నేను మనువాడరా

ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా

*****************************************************************


సంగీతం : హిమేష్ రెషమియ
సాహిత్యం: వెన్నెలకంటి
గానం : హరిహరన్


ఓం నమో నారాయణాయ
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
హరిని తలచు నా హ్రుదయం నేడు హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవునేం చేస్తారు ఆ యమ కింకరులు


నిలువు నామం దాల్చు తలను నీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
నిలువు నామం దాల్చు తలను నీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
వీర శైవులా బెదిరుంపులకు పరమ వైష్ణవం మోగదులే
ప్రభువు ఆనతికి జడిసేనాడు పడమడి సూర్యుడు పొడవడులే
రాజ్యలక్ష్మి నాధుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడీ విష్ణుదాసుడే
రాజ్యాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజలకు రాజు ఈ రంగరాజనే


నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలగును నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలగును నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలనార్పే సుడిగాలీ వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను తడిపే జడివాన ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట
దైవం కోసం పోరే సమయం లేదంట


రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు