March 13, 2012

సోలో



సంగీతం: మణిశర్మ
గానం: హేమచంద్ర


మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా
తారకవి ఎన్ని తళుకులో .. చాలవే రెండు కన్నులూ
మురిసినవి ఎన్ని మెరుపులో .. చూసి తనలోని వంపులూ


లాగి నన్ను కొడుతున్నా .. లాలిపాడినట్టుందే .. విసుగురాదు ఏమన్నా .. చంటిపాపనా !


మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా


జక్కన .. చెక్కిన .. శిల్పమే ఇక కనపడదే
చైత్రము .. ఈ గ్రీష్మము ..నిను చూడగా సెలవడిగెనులే
సృష్ఠిలో .. అద్బుతం .. నువ్వే కదా కాదనగలరా
నిమిషానికే క్షణాలను .. ఓ లక్షగా మార్చెయమనరా


అలనాటి యుద్దాలే జరుగుతాయేమో ..
నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమో..
శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారేంతలా !


ఆయువై.. నువు ఆశవై .. ఓ ఘోషవై ఇక వినపడవా
ప్రతి రాతిరీ .. నువు రేపటి .. ఓ రూపమై చెలి కనపడవా
తీయని .. ఈ హాయిని .. నేనేమనీ ఇక అనగలనూ
ధన్యోశ్మని .. ఈ జన్మని .. నీకంకితం ముడిపడగలనూ


మనువాడమన్నారు సప్తఋషులంతా
కొనియాడుతున్నారు అష్టకవులే అంతా
తారాగణం .. మనమే అని .. తెలిసిందెలా


మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా
తారకవి ఎన్ని తళుకులో .. చాలవే రెండు కన్నులూ
మురిసినవి ఎన్ని మెరుపులో .. చూసి తనలోని వంపులూ


లాగి నన్ను కొడుతున్నా .. లాలిపాడినట్టుందే .. విసుగురాదు ఏమన్నా .. చంటిపాపనా !




ఇష్క్





 గానం: ప్రదీప్ విజయ్, కళ్యాణి నాయర్ 
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


నిన్నకీ .. నేటికీ .. ఎంతగా .. మారెనో 
నిన్నలో .. ఊహలే .. ఆశలై .. చేరెనో 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


అడుగడుగున నిన్ను కంటున్నా 
అణువణువున నిన్ను వింటున్నా 
క్షణమునకొక జన్మ చూస్తున్నా 
చివరకి నేనే నువ్వు అవుతున్నా 


ఎందుకో .. ఈ తీరుగా మారటం 
ఏమిటో .. అన్నింటికీ కారణం 


బదులు తెలుసుంది ప్రశ్న అడిగేందుకే ! 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


లోలో ఉన్న ఊసు గుండె పైకెళ్ళి 
గుండెల్లోన ఊహ కళ్లపై తేలి 
కళ్ళల్లోన ఆశ నవ్వుపై వాలి 
నవ్వులోన తలదాల్చుకుంటుందీ 


అక్కడే .. ఆగింది ఆ భావనా 
దాటితే .. ఏమౌనో ఏమో అనా 


ఎందుకాలస్యమొక్కమాటే కదా ! 


ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో 
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో 
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో 
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో 


నిన్నకీ .. నేటికీ .. ఎంతగా .. మారెనో 
నిన్నలో .. ఊహలే .. ఆశలై .. చేరెనో