February 25, 2009

బలిపీఠం

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల



కుశలమా .. నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా .. మరీ మరీ అడిగాను
అంతే .. అంతే .. అంతే


కుశలమా .. నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళు వదలలేకా .. ఎదో ఎదో వ్రాసాను
అంతే .. అంతే .. అంతే


చిన్న తల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలిపైన పాపాయికి ఒకటీ
తేనెలూరు పెదవుల పైన దేవిగారికొకటీ


ఒకటేనా.. ఆ ఆ ..ఒకటేనా
హ హ ..ఎన్నైనా .. హాయ్ .. ఎన్నెన్నో


మనసునిలుపుకోలేకా .. మరీ మరీ అడిగానూ
అంతే .. అంతే .. అంతే


కుశలమా .. హాయ్ !

పెరటిలోని పూల పానుపు .. త్వరత్వరగా రమ్మందీ
పొగడనీడ పొదరిల్లూ.. దిగులు దిగులుగా ఉందీ


ఎన్ని కబురులంపేనో..ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైనా..నీలిమబ్బు పాయలపైనా
అందేనా.. ఒకటైనా
అందెనులే .. తొందర తెలిసెను

అంతఃపురం (1999)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం: చిత్ర



అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా


అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా


నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా


ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా


గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకనీ .. వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని .. చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లలరల్లరి సాగించాలి


ఏకమై .. ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా !


అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక


నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా


ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా


కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని .. బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని .. కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు .. చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు .. హాహాకారం


మళ్ళీ మళ్ళీ ..
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం


అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా


నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా


ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

**********************************************

గానం: చిత్ర

కళ్యాణం కానుంది కన్నె జానకీ
వైభోగం రానుంది రామచంద్రుడికీ
దేవతలే దిగి రావాలీ.. జరిగే వేడుకకీ

రావమ్మా సీతమా .. సిగ్గు దొంతరలో
రావయ్యా రామయ్యా .. పెళ్ళి శోభలతో

వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా
ఊరేగే పువ్వుల్లో .. చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే .. అన్నీ నీ కోసమే !

వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా

నాలో ఎన్ని ఆశలో .. అలల్లా పొంగుతున్నవీ
నీతో ఎన్ని చెప్పినా .. మరెన్నో మిగులుతున్నవీ
కళ్ళల్లోనే వాలీ నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
ఆ గగనాన్నే ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో

నక్షత్రలన్నీ ఇలా కలలై వచ్చాయీ
చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా !

వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా

ఇట్టే కరుగుతున్నదీ మహాప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నదీ ఎలా కాలాన్ని ఆపడం
మదిలా మంటే నేడు తీయని శృతిగా మారి ఎటో పోతుంటే
కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తను వస్తుందే

ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి
పాపాయి చేసి .. నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా !

ఆకాశం అంతఃపురమయ్యిందీ
నాకోసం అందిన వరమయ్యిందీ
రావమ్మా మహరాణి ఏలాలీ కాలాన్నీ
అందీ ఈ లోకమే .. అంతా సౌందర్యమే !

ఆకాశం అంతఃపురమయ్యిందీ
నాకోసం అందిన వరమయ్యిందీ

జల్సా

సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: టిప్పు, గోపికా పూర్ణిమ



గాల్లో తేలినట్టుందే .. గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే


వళ్ళు ఊగినట్టుందే .. దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే


ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకీ
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకీ


హే .. నిదుర దాటి కలలే పొంగె .. పెదవి దాటి పిలుపే పొంగె .. అదుపుదాటి మనసే పొంగే నాలో
గడపదాటి వలపే పొంగె .. చెంపదాటి ఎరుపే పొంగె .. నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో


రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకీ
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకీ


గాల్లో తేలినట్టుందే .. గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వళ్ళు ఊగినట్టుందే .. దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే


తలపుదాటి తనువే పొంగె .. సిగ్గుదాటి చనువే పొంగె .. గట్టుదాటి వయసే పొంగె లోలో
కనులుదాటి చూపే పొంగె .. అడుగు దాటి పరుగే పొంగె .. హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో


తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికీ
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికీ


*********************************************
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె


My heart is beating .. అదోలా
తెలుసుకోవా .. అదీ
ఎన్నాళ్ళీ waiting .. అనేలా
తరుముతోందీ .. మదీ


పెదవిపై పలకవే .. మనసులో ఉన్న సంగతీ
కనులలో వెతికితే దొరుకుతుందీ !


Tea spoon .. Ton బరువవుతుందే
Full moon .. నన్ను ఉడికిస్తుందే
Cloud nine .. కాళ్ళకిందకొచ్చిందే
Landmine .. గుండెలో పే ..లిం .. దే !


My heart is beating .. అదోలా
తెలుసుకోవా .. అదీ
ఎన్నాళ్ళీ waiting .. అనేలా
తరుముతోందీ .. మదీ


Hey ! I wanna be with you forever
Hey ! I wanna live with you forever


పెనుతుఫాను ఏదైనా .. మెరుపుదాడి చేసిందా
మునుపులేని మైకానా .. మదిని ముంచి పోయిందా


ఊరికినే పెరగదుగా ..ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా .. నాలో నిలువెల్లా !
తలపులలో చొరబడుతూ .. గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ .. తెల్లార్లూ ఒంటరిగా వేగాలా !!


cell phone నీ కబురు తెస్తుంటే .. sten gun మోగినట్టు ఉంటుందే
Crampton fan గాలి వీస్తుంటే .. cyclone తాకినట్టు ఉం .. టుం .. దే !


My heart is beating .. అదోలా
తెలుసుకోవా .. అదీ
ఎన్నాళ్ళీ waiting .. అనేలా
తరుముతోందీ .. మదీ


ఎపుడెలా తెగిస్తానో .. నామీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో .. నీ మీద ఉన్న అభిమానం


త్వరత్వరగా తరిమినదే .. పద పద మని పడుచు రధం
ఎదలయలో ముదిరినదే .. మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే .. మనసున విరిసిన కలలవనం
తహతహగా తడిమినదే .. దమ్మరదం అంటూ తూలే ఆనందం


freedom దొరికినట్టు గాలుల్లో .. welcome పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఈ విల్లో .. ప్రాణం దూసుకెళ్ళి పో ..తుం .. దే !


My heart is beating .. అదోలా
తెలుసుకోవా .. అదీ
ఎన్నాళ్ళీ waiting .. అనేలా
తరుముతోందీ .. మదీ


మంత్ర

సంగీతం: ఆనంద్
సాహిత్యం: ఆనంద్
గానం : సుచిత్ర



ఊహల్లోనా ఒదిగిన ఆశే నీవై .. అలజడి పుట్టిస్తావు ప్రియ మదనా
హృదయం లోనా కరగని ధ్యాసే నీవై .. తపనలు పెంచేస్తావు ఇది తగునా


శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావూ .. అంతేలేని వరాలనందిస్తావూ
మాయో హాయో నీకిది తగునా .. నేనే నీవైపోతున్నా
నీలో సాగే శ్వాసల సెగతో .. హే హే హే


ప్రతిక్షణం అలై జ్వలించే సోయగం
తపించదా ఇలా వరిస్తే సాహసం
ప్రతిక్షణం అలై జ్వలించే సోయగం
తపించదా ఇలా వరిస్తే సాహసం


పొంగే నదినై .. సుదూరాలే దాటుతున్నా
సాగే సుధనై .. సరాగాలే పాడుతూ
వెంటాడే నీడై నను ఇలా .. వేధిస్తావేలా రసికరా .. మదనా !


ఊహల్లోనా ఒదిగిన ఆశే నీవై .. అలజడి పుట్టిస్తావూ ప్రియ మదనా

ప్రియా మధూకరా .. మధించే ఆశలా
సఖీ సమీరమై కురిస్తే ఏలరా

ప్రియా మధూకరా .. మధించే ఆశలా
సఖీ సమీరమై కురిస్తే ఏలరా


మూస్తే కళ్ళే .. మరోలోకం చేరుతున్నా
వీచే గాలై .. అలా పైకి తేలగా


నా ధ్యానం నీవై దాహమాయె .. ఏదేదో చేస్తావేంటలా .. వరమా !

ఊహల్లోనా ఒదిగిన ఆశే నీవై .. అలజడి పుట్టిస్తావు ప్రియ మదనా
హృదయం లోనా కరగని ధ్యాసే నీవై .. తపనలు పెంచేస్తావు ఇది తగునా
శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావూ .. అంతేలేని వరాలనందిస్తావూ
మాయో హాయో నీకిది తగునా .. నేనే నీవైపోతున్నా


నీలో సాగే శ్వాసల సెగతో .. హే హే హే


****************************************************
గానం: మధుమిత
సాహిత్యం: భువనచంద్ర



Ya. Are u ready? Come ! Do it now !

M .. A .. N .. T .. R .. A
వేసేస్తా లవ్ మంత్రాలే .. మహ .. మహ ..మహ .. మహ!


My heart is very hot ! check it out !

అందంతో పందెం వేస్తా .. అందరిని నేనోడిస్తా
నాతోనే పేచీకొస్తే .. ఓడించి నే చూపిస్తా
మాటకుందో అందం .. చేతకుందో అందం
అందం అంటే ఫిగరే కాదోయ్ .. మనసుది కూడా ఓ నేస్తం
లైఫో గోల్డెన్ కప్పు .. లవ్ చెయ్ కుంటే తప్పు
మళ్ళీ మళ్ళీ రాదోయ్ టీనేజ్ .. ఓపెన్ చెయ్యి నీలో ఫీలింగ్
మారో మస్తీ మారో .. దిల్ సే మిలనా యారో
దిక్కులు చూస్తే వేస్టైపోదా .. లైఫే ఓ దిల్ దారో


my love .. my love .. my love my love .. You Love my love ..
ఈహా .. మహా మహా మహా .. my heart will get you !


She drives you crazy ..
nah nah nah nah nothing .. you got it take it easy
She is got me raising ..


చూపించొద్దు మీలో డాబు .. బాబు .. బాబు

మదిలో మెదిలే ఆశేదో .. ఆఫేదో .. నిను చూస్తుంటే

I am a ga ga ga ga naughty gal .. వేసేస్తా లవ్ మంత్రాలే ..
దిల్ యే బోలే ధగ్ ధగ్ ధగ్ .. ధగ్ ధగ్ ధగ్ .. నిను చూస్తుంటే !


ఏదేమైనా I don’t care.. I don’t care .. I don’t care !

You count from number one .. I am all in one !
మా కళ్ళల్లొనా ఉందో గన్ .. పేల్చామంటే not a fun
రాదా ఫీవర్ హ హ .. మేమంటుంటే న న


లుక్కు తోనే గుండె టచ్ చేసావంటూ చెప్పేతంటా

మీ కళ్ళమేమై .. నీ ఆశ మేమై .. మైకం తెస్తే .. హరే రామా !
మహ .. మహ ..మహ .. మహ .. మహ .. మహ ..మహ .. మహ


my heart is very hot .. my heart is very hot .. my heart is very hot !

సందేహాలేలా .. play on the music music .. చూపిస్తాం మాలో మాజిక్
సరాదాలావేళా .. సాగించేసెయ్ ఏదో గోలా .. గోల .. గోల


మదిలో మెదిలే ఆశేదో .. ఆఫేదో .. నిను చూస్తుంటే

I am a ga ga ga ga naughty gal .. వేసేస్తా లవ్ మంత్రాలే ..
దిల్ యే బోలే ధగ్ ధగ్ ధగ్ .. ధగ్ ధగ్ ధగ్ .. నిను చూస్తుంటే !


ఏదేమైనా I don’t care.. I don’t care .. I don’t care

నెలవంక

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి

" ఈ కోవెల వాకిలిలో .. ఏదో అడుగు సవ్వడి ..
ఏ దేవుడు దయతో నా ఎదలో .. అడుగిడు .. వడి వడి "


కనుబొమ్మల పల్లకిలోనా ..
కన్నెసిగ్గు వధువయ్యిందీ .. విరి మొగ్గల మధువయ్యిందీ
హరివిల్లై పెదవి వదలినా ..
చిరునవ్వే వరమయ్యిందీ .. సిరిమువ్వల వరదయ్యిందీ


నీ కన్నుల వెన్నెల చూసీ ..
మనసే చిరుతరగయ్యిందీ .. కృష్ణవేణి పరుగయ్యిందీ
దయ నిండిన గుండెను చూసీ ..
తనువే ఒక పులకయ్యిందీ .. నును సిగ్గుల మొలకయ్యిందీ


కనురెప్పల గొడుగును వేసీ .. తోడునీడనౌతాను
అడుగులకే మడుగులుగా .. నా అరచేతులు పడతాను


నీ జడలో మొగలిరేకునై .. బతుకు పంచుకుంటాను
నీ జడలో మొగలిరేకునై .. బతుకు పంచుకుంటానూ !


కనుబొమ్మల పల్లకిలోనా ..
కన్నెసిగ్గు వధువయ్యిందీ .. విరి మొగ్గల మధువయ్యిందీ
హరివిల్లై పెదవి వదలినా ..
చిరునవ్వే వరమయ్యిందీ .. సిరిమువ్వల వరదయ్యిందీ


అంతరంగమిదుగో స్వామీ .. నేడు మీకు నెలవంటానూ
మూగబడిన నా గుండెలలో .. రాగలహరివనుకుంటానూ
అవధిలేని అంబరమే .. నా ఆనందపు పరిధంటానూ
అవధిలేని అంబరమే .. నా ఆనందపు పరిధంటానూ !


నీ కన్నుల వెన్నెల చూసీ ..
మనసే చిరుతరగయ్యిందీ .. కృష్ణవేణి పరుగయ్యిందీ
దయ నిండిన గుండెను చూసీ ..
తనువే ఒక పులకయ్యిందీ .. నును సిగ్గుల మొలకయ్యిందీ

ఇండియన్ బ్యూటీ

Music: Joy Calvin
గానం: చిత్ర , ప్రియశ్రీ
సాహిత్యం : సినారె



ప్రియతమా ప్రియా .. తెలుపనీ నిజం
ప్రియతమా ప్రియా .. తెలుపనీ నిజం


నాలోని రాగాలు మీటీ .. నీలాల గగనాలు దాటీ
నాలోని రాగాలు మీటీ .. నీలాల గగనాలు దాటి
స్వరం స్వరం శృతి చేసి .. క్షణం క్షణం పెనవేసి
నా మేని సగమైన నీవూ .. నా ఊపిరే ప్రియా !


ప్రియతమా ప్రియా .. తెలుపనీ నిజం

చినుకు చినుకై .. చిగురు చిగురై తొలకిరించింది ప్రేమా
కనుల గుడిలో .. కలల వొడిలో కలవరించింది ప్రేమా
ఎవరైనా .. ఏమన్నా .. ఏకమైనాములే


కాలాన్ని విడిచీ .. లోకాన్ని మరచి .. కలిసి ఉందాములే
కరిగి పోదాములే !


ప్రియతమా ప్రియా .. ప్రియతమా ప్రియా

నిన్ను చూసీ .. నన్ను మరీచి .. నిలిచిపోయాను నేనూ
మొలక నవ్వూ .. చిలకరించీ .. ముద్దులొలికావు నీవూ
ఆ నింగి .. ఈ నేలా .. అండగా ఉండగా


సరినేని జాతగా .. మనసైన శృతిగా .. సాగేములే తోడుగా
బ్రతుకంత సైదోడుగా


ప్రియతమా ప్రియా .. తెలుపనీ నిజం
ప్రియతమా ప్రియా .. తెలుపనీ నిజం


నాలోని రాగాలు మీటీ .. నీలాల గగనాలు దాటీ
నాలోని రాగాలు మీటీ .. నీలాల గగనాలు దాటి
స్వరం స్వరం శృతి చేసి .. క్షణం క్షణం పెనవేసి
నా మేని సగమైన నీవూ .. నా ఊపిరే ప్రియా !


ప్రియతమా ప్రియా .. ప్రియతమా ప్రియా !

Mr. మేధావి


సంగీతం : చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చిత్ర



కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !


చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే
నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా !!


అందంగా అందంగా .. పెనవేస్తూ బంధంగా
చేస్తుందీ చిత్రంగా .. బ్రతుకంతా మధురంగా
మది వేగం పెరిగితె ప్రేమా
హృదిరాగం పలికితె ప్రేమా
ఎదలేకం ఐతే మౌనం తొలిప్రేమా !


దిల్ మే ప్యార్ హై .. మన్ మే ఇష్క్ హై

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !


ఉండదుగా .. నిదరుండదుగా .. మరి ఊహల వలనా
ఇక అల్లరులే శృతిమించెనుగా .. ప్రతి రేయిలో కలనా
ఇది అర్ధం కానీ మాయా .. ఏదో తీయని బాధా


చెప్పకనే చేరీ అది చంపేస్తుందీ మైకానా
స్వప్నాలే చల్లీ ఇది ముంచేస్తుంది స్వర్గానా


ఊహకు కల్పన ప్రేమా
మది ఊసుల వంతెన ప్రేమా
ఈ గుప్పెడు గుండెలో ఉప్పెన ఈ ప్రేమా !


దిల్ మే ప్యార్ హై .. మన్ మే ఇష్క్ హై

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !


తొందరగా వివరించాలీ ఈ తీయని దిగులూ
మరి ఒప్పుకుని అందించాలి తన నవ్వుతో బదులూ
సరికొత్తగ ఉందీ అంతా .. అరె ఎన్నడులేనీ వింతా


తానుంటే చాలూ వాసంతం నాకై వస్తుంది
ఆనందం అంతా దాసోహం నాకే అవుతుంది


ఇది గుసగుసలాడే ప్రేమ
నను త్వరపెడుతుంది ప్రేమ
తొలిసారిగ అందితె హాయే ఈ ప్రేమా !


కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !


చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే
నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా !!

మజ్ఞు

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం



ఇది తొలిరాత్రీ .. కదలని రాత్రీ
ఇది తొలిరాత్రి .. కదలని రాత్రి
నీవు నాకు .. నేను నీకు .. చెప్పుకున్న .. కధలరాత్రీ
ప్రేయసి రావే .. ఊర్వశి రావే
ప్రేయసి రావే .. ఊర్వశి రావే


ఇది తొలిరాత్రి .. కదలని రాత్రి
నీవు నాకు .. నేను నీకు .. చెప్పుకున్న .. కధలరాత్రీ
ప్రేయసి రావే .. ఊర్వశి రావే
ప్రేయసి రావే .. ఊర్వశి రావే


వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలూ మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలూ మూయమన్నదీ


ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
దీపమేమో విరబడి నవ్వుతున్నదీ
నీ రాక కొరకు తలుపు .. నీ పిలుపు కొరకు పానుపు
పిలిచీ పిలిచి వేచి వేచి ఎదురురు చూస్తున్నవీ !


ప్రేయసి రావే .. ఊర్వశి రావే !
ప్రేయసి రావే .. ఊర్వశి రావే !!


వెన్నెలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
ఆ .. ఆ .. వెన్నెలంతా అడవిపాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ


అనురాగం గాలిలో దీపమైనదీ
మమకారం మనసునే కాల్చుతున్నదీ
నీ చివరి పిలుపు కొరకు .. ఈ చావు రాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ


ప్రేయసి రావే .. ఊర్వశి రావే !
ప్రేయసి రావే .. ఊర్వశి రావే !!
ఇది తొలిరాత్రి .. కదలని రాత్రి
నీవు నాకు .. నేను నీకు .. చెప్పుకున్న .. కధలరాత్రీ
ప్రేయసి రావే .. ఊర్వశి రావే
ప్రేయసి రావే .. ఊర్వశి రావే

నిరీక్షణ (1986)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:

గానం: ఎస్.జానకి

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నీవు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా
యమునా ఎందుకె నీవు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

వెన్నంటి వెంటాడి వస్తాడే ముద్దూ
కన్నట్టే గీటేసి పెడతాడె కిస్సూ (2)
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడె
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడె
దారివ్వకే చుట్టూ తారాడుతాడే

పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బా ఏం పిల్లడే..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

శిఖిపింఛమఊళన్న పేరున్నవాడే..
శృంగారరంగాన కడతేరినాడే (2)
రేపల్లెలోకల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే

మురళీలోకుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నీవు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా
యమునా ఎందుకె నీవు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ


***************************************************

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కె.జె.ఏసుదాస్

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే నెతికానే

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపం లో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈ నాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం .. ఎన్నాళ్ళకు చేరం .. తీరందీ నేరం !

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే ..ఏడ బోయావే

తానాలే చేసాను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటీ నా కళ్ళలొ కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం .. ఇన్నేళ్ళకు వ్యర్ధం .. చట్టందే రాజ్యం !

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే నెతికానే

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే


*************************************

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.జానకి

ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో .. ఆనాడే తెలిసిందదీ
ఆవేశం ఏనాడు కలిగెనో .. ఆనాడే తెలిసిందదీ

ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ (2)

ఏ పువ్వూ ఏ తేటిదన్నది .. ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది .. ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు .. అందాలే దాసోహమనవా
మందారం విరబూయు పెదవులు .. మధువులనే చవిచూడమనవా

పరువాలే .. ప్రణయాలై
స్వప్నాలే .. స్వర్గాలై
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను

ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో .. ఆనాడే తెలిసిందదీ
ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ

ఏ మేఘం ఏ వాన చినుకై .. చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండె లోతున .. ఏ గీతం పలికించునో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనవా
కౌగిలిలో చెరవేసు మదనుని కరిగించీ గెలిపించమనవా

మోహాలే .. దాహాలై
సరసాలే .. సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలవేని నిలువలు

ఆకాశం ఏనాటిదో .. అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో .. ఆనాడే తెలిసిందదీ

February 20, 2009

అంతులేని కథ (1976)

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కె.జె.ఏసుదాస్

దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ

దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ
ఇక ఊరేల సొంత ఇల్లేలా
ఇక ఊరేల సొంత ఇల్లేలా ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

నన్నడిగి తలితండ్రి కన్నారా..ఆ ఆ ఆ
నన్నడిగి తలితండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా

ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ

శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా

తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

తెలిసేట్లు చెప్పేది సిద్దాంతం
అది తెలియక పోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా

ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ


***********************************

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.జానకి

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ (2)
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ (2)
జరిగిన నాడే తెలియును కొన్నీ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ !

భక్తకన్నప్ప (1976)

సంగీతం: ఆదినారాయణ రావు-సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: రామకృష్ణ, పి.సుశీల

ఆకాశం దించాలా..నెలవంకా తుంచాలా..సిగలో ఉంచాలా
ఆకాశం దించాలా..నెలవంకా తుంచాలా..సిగలో ఉంచాలా

చెక్కిలి నువ్వూ నొక్కేటప్పటి చక్కిలిగింతలు చాలు
ఆకాశం నా నడుమూ..నెలవంకా నా నుదురూ..సిగలో నువ్వేరా

పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే..తెస్తానే
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే..తీస్తానే

ఆ...పట్టు తేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా

అంతేనా..అంతేనా
అవును..అంతేరా

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా

సూరీడూ ఎర్రదనం సింధూరం చేస్తానే..చేస్తానే
కరిమబ్బూ నల్లదనం కాటుక దిద్దేనే..దిద్దేనే

ఆ..నీ వంటి వెచ్చదనం నన్నేలే సూరీడూ
నీ కంటి చల్లదనం నా నీడ..నా గూడూ

అంతేనా..అంతేనా
అవును..అంతేరా

హహ..మెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలా..తలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా !


*************************************************

సాహిత్యం: ఆరుద్ర
గానం: రామకృష్ణ, పి.సుశీల

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)

అరె సిన్నోడా ..
ఆకుచాటున పిందె ఉందీ .. చెట్టూ సాటున సిన్నాదుందీ
ఓ ఓ ఓ ఆకుచాటున పిందె ఉంది .. చెట్టూ సాటున సిన్నాదుందీ
సక్కని సుక్కని టక్కున ఎతికీ దక్కించుకోరా .. దక్కించుకోరా

దక్కించుకోరా .. దక్కించుకోరా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అరె సిన్నమ్మీ ..
మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఓ ఓ ఓ మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా

మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా

ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
ఓ ఓ ఓ సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా

కొప్పూ లోనీ మొగలీ పువ్వూ గుప్పుమందే .. ఒప్పులకుప్పా
ఓయ్ గుప్పుమందే .. ఒప్పులకుప్పా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
ఓ ఓ ఓ సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని

దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే .. నాకు నువ్వే
నీకు నేనే .. నాకు నువ్వే !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)

February 18, 2009

అంతం

సంగీతం : RD బర్మన్
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

సాహిత్యం : సిరివెన్నెల


నీ నవ్వు చెప్పింది నాతో .. నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో .. ఇన్నాళ్ళ లోటేమిటో


ఓ లా ల లా ల .. ఓ లా ల లా లా ల ..

నీ నవ్వు చెప్పింది నాతో .. నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో .. ఇన్నాళ్ళ లోటేమిటో


నాకై చాచిన నీ చేతిలో .. చదివాను నా నిన్ననీ
హో .. నాకై చాచిన నీ చేతిలో .. చదివాను నా నిన్ననీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపునీ


పంచేందుకే ఒకరు లేని .. బ్రతుకెంత బరువో అనీ
ఏ తోడుకీ నోచుకోని .. నడకెంత అలుపో అనీ


నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ .. నడిరేయి కరిగించనీ


నా పెదవిలో ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితానా తొలిముగ్గు పెడుతుందనీ


ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
హా .. ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువూ మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో


సరిగా అదే శుభముహూర్తం .. సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం .. పొందేటి బంధాలకు
హా .. లా ల లా ల .. ఓ లా ల లా లా ల ..


నీ నవ్వు చెప్పింది నాతో .. నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో .. ఇన్నాళ్ళ లోటేమిటో

February 14, 2009

క్షత్రీయ పుత్రుడు

సంగీతం : ఇళయరాజా
గానం : SP బాలు ,జానకి


సన్నజాజి పడకా...
మంచ కాడ పడకా..


సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే

సన్నజాజి పడకా మంచె కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది
మాయనీ ఊసే పొంగి పాటై రావే


సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే

కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్నీ
దండే కట్టి దాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు యెండల్లొన చిన్నబోతే
పండించగ చెరుకున్న నీ దరికి
అండ దండ నీవేనని పండగంత నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే
కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
గుండే పంచే వెళయినది రావే
దిండే పంచే వెళయినది రావే

సన్నజాజి పడకా మంచ కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే

February 10, 2009

ఆటోడ్రైవర్

సంగీతం: దేవా
గానం : హరిహరన్, సుజాత



చందమామా .. చందమామా .. సింగారాల చందమామా

చందమామా .. చందమామా .. సింగారాల చందమామా
చందమామా .. చందమామా .. సాయంత్రాల చక్కనమ్మా
వస్తావా..కలిసొస్తావా..కవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా .. మనసిస్తావా .. కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగీ నేల తాళాలేసే .. మేళాలెన్నడో
నిన్నూ నన్నూ ఊరేగించే .. మేఘాలెక్కడో

చందమామా .. చందమామా .. సింగారాల చందమామా

కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు తెల్ల ముగ్గు వేసుకుంటాలే
వీటికంటా రేగే మంటా చేస్తే ఉంటా నిన్నే జంటా చేసుకుంటాలే

ఊరించేటి అందాలన్నీ .. ఆ .. ఆ.. ఆ ..
ఊరించేటి అందాలన్నీ .. అరేసాక ఆరాతీసా
చీకట్లోని చిన్నందాలా .. చిత్రాలెన్నో దాచాలే
గుడిసైనా చాలే మనసుంటే
గుడికన్నా పదిలం కలిసుంటే
దాయి దాయీ దాయి దాటి పోనీకులే

చందమామా .. చందమామా .. సింగారాల చందమామా

తుళ్ళీంతాడే గోదారల్లే ఏరూ నీరూ నీవూ నేనై పొంగిపోదామా
ఆ .. ఆ .. చుక్క కళ్ళ నీలాకాశం జబిల్లమ్మ జాడే ఉంటే పున్నమై పోదా
మల్లెగాలి పాడే లాలీ .. ఆ .. ఆ.. ఆ ..
మల్లెగాలి పాడే లాలీ .. గిల్లీ గింత పెట్టే వేళా
సన్నా జాజి సయ్యాటల్లో .. కన్నె మోజు చూసాలే
చెలికాడా నీడై నిలుచుంటా
జవరాలా అవుతా నీ జంటా
చెయి చేయి చేయి దాటి పోనీకు వాయీ

చందమామా .. చందమామా .. సింగారాల చందమామా

చందమామా .. చందమామా .. సాయంత్రాల చక్కనమ్మా
వస్తావా..కలిసొస్తావా..కవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా .. మనసిస్తావా .. కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగీ నేల తాళాలేసే .. మేళాలెన్నడో
నిన్నూ నన్నూ ఊరేగించే .. మేఘాలెక్కడో

ప్రేమికుడు

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ

గానం: ఉన్ని కృష్ణన్


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

ఈ పూటా .. చెలి నా మాటా .. ఇంక కరువైపోయెనులే
అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే


ఇది స్వర్గమా .. నరకమా .. ఏమిటో తెలియదులే
ఈ జీవికీ .. జీవనమరణమూ .. నీ చెతిలో ఉన్నదిలే


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జోల పాడీ కాలి మెటికలు విరిచేనే
వీచేటి చలిగాలులకి తెరచాపై నిలిచేనే


నా ఆశలా .. ఊసులే .. చెవిలోన చెబుతానే
నీ అడుగులా .. చెరగని గురుతులే .. ప్రేమ చరితను అంటానే


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే


ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

అతడు

సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విశ్వ



అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే..అతడే..అతడే..అతడే


ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే


Life has made it stronger
It made him work a bit harder
He got to think and act a little wiser
This world has made him a fighter


కాలం నను తరిమిందో శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరం లో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ..
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ..
పెను నిప్పై నివురును చీల్చుతూ..
జడివానై నే కలబడతా..


పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !!
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !!


తన ఎదలో పగ మేల్కొలుపుతూ..
వొది దుడుకుల వల ఛేధించుతూ..
ప్రతినిత్యం కధనం జరుపుతూ..
చెలరేగే ఓ శరమతడూ..


Life started to be faster
Made him had a little think smoother
He's living on the edge to be smarter
This world has made him a fighter


******************************************


సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత


అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా..
తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ


తెలిసిందే అడగాలా..
అడగందే అనవేలా..
చెవిలో ఇలా..చెబితే చాలా !


అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం


కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో
విసిరేస్తున్నా నిను విడి వెనుకకు రాదేమో
నిదరోతున్నా ఎదురై కనబడతావేమో
కదలాలన్నా కుదరని మెలి పెడతావేమో


అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో


మన సలహా మది వినదు కదా..
తెలుసు కదా .. ఆ.. ఆ.. ఆ
తెలిసే ఇలా చెలరేగాలా..


అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం


సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా


తప్పుకో..కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా వెంటా
వప్పుకో..నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా


నడపదుగా నిను నది వరదా..
తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ
తెలిసే ఇలా..ముంచెయ్యాలా !!


అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా..
తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ


తెలిసిందే అడగాలా..
అడగందే అనవేలా..
చెవిలో ఇలా..చెబితే చాలా !
**************************



సాహిత్యం: సిరివెన్నెల
గానం: మహలక్ష్మి, రంజిత్



చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా..జంటే రామ్మా..జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా


నో నో..ఇకసారిటు చూడూ..
నో నో .. నీ సొమ్మేం పోదూ..
నో నో.. ముద్దంటే చేదా.. ఆ .. ఆ
నో నో..నాతో మాటాడు..
నో నో..పోనీ పోటాడూ..
నో నో..సరదా పడరాదా..దా..దా..దా..దా


చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా

వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో
కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో


కల్లో వస్తే సర్లే గాని తల్లో
హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో


దేఖోనా..సిగ్గుని కొద్దిగ సైడుకి నెట్టా..ఓకేనా ఏం బాగా లేనా
దాగేనా..కొంగుకు లొంగని సంగతులెన్నో..చూస్తున్నా వర్ణాల వాన


అంత గొప్పగా నచ్చానా..నో..నో
ఇంత చెప్పినా డౌటేనా..న న న నా
ఇల్లారా..కళ్ళారా..చూస్తావా ఇంకా..ఎన్నో..ఎన్నో..ఎన్నో


చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
కొమ్మల్లోని మొగ్గై ఉండే దానా..దానా..
నీలో చాలా విద్యే ఉందే జాణ..జాణ
గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్నా..నిన్నా..
నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా..తున్నా..


చిత్రం గా చందన చర్చలు చెయ్యకు నాతో..విన్నాలే శృంగార వీణా
తియ్యం గా చెంపలు మీటే కోరిక పుడితే..కానీలే నే కాదన్నానా


ఊపిరాడదే నీ వళ్ళో .. నో నో
ఉండిపోకలా దూరం లో .. నో నో


ముస్తాబై వచ్చేవా..ముద్దిచ్చే ఉద్దేశం తో..ఆహా..ఆహా

చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా..జంటే రామ్మా..జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
**************************************************


సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, ఎస్.పి.బాలసుబ్రమణ్యం



నీతో చెప్పనా .. నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా !
గారం చేసినా .. నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా !!


నేనే నేనుగా .. లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
నా కన్నులా .. నీదే వెన్నెలా ఓ ఓ ఓ


నీతో చెప్పనా .. నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా !


ఇంకొంచం అనుకున్నా .. ఇకచాల్లే అన్నానా
వదలమంటె ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాలా పైపైనా .. పడతావేం పసికూనా
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా


మగువ మనసు తెలిసేనా మగజాతికీ
మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి


గారం చేసినా .. నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా !


ఒదిగున్నా ఒరలోనా .. కదిలించకె కుర్రదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టు జారెనా
పెదవోపని పదునైనా .. పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా


సొంత సొగసు బరువేనా సుకుమారికీ
అంత బిరుసు పరువేనా రాకుమరుడంటి నీ రాజసానికి


గారం చేసినా .. నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా !


నేనే నేనుగా .. లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
ఓ .. నా కన్నులా .. నీదే వెన్నెలా ఓ ఓ ఓ


****************************************

సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రేయా ఘోషల్


పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో .. వాకిళ్ళలో
వెవేల వర్ణాల వయ్యారి జాణ


అందమైన సిరివానా .. ముచ్చటగ మెరిసే సమయానా
అందరాని చంద్రుడైనా .. మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా


మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా
ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగా
తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యేనా


చందనాలు చిలికేనా .. ముంగిళ్ళో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా .. మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా


నవ్వుల్లొ హాయి రాగం
మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం
ఇంతమంది బృంద గానం
ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం


పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పోగా హోరెత్తి పొతున్న గానా బజానా


చెంగు మంటు ఆడేనా .. చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైనా .. మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా


****************************************

సాహిత్యం: సిరివెన్నెల
గానం: కవితా కృష్ణమూర్తి, కార్తీక్



పిలిచినా రానంటవా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా !


తెలివిగా చేరే తోవా
తెలియనే లేదా బావా
అటు ఇటూ చూస్తూ ఉంటావా
ఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా !!


సమయం .. కాదంటావా
సరదా .. లేదంటావా
సరసం .. చేదంటావా బావా !


చనువే .. తగదంటావా
మనవే .. విననంటావా
వరసై .. ఇటు రమ్మంటే .. నా మాట మన్నించవా !


డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
హేయ్ .. డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా


కలలుంటే సొగసే కనపడదా.. మనసుంటే తగు మార్గం దొరకదా
రాననకా .. రాననకా .. రాననకా ..
అనుకుంటే సరిపోదే వనితా .. అటుపై ఏ పొరబాటో జరగదా
రమ్మనకా .. రమ్మనకా .. రమ్మనకా ..


పెరిగిన దాహం తరగదే .. పెదువుల తాకందే
తరిమిన తాపం తాళదే .. మదనుడి బాణం తగిలితే


చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయీ అబ్బాయీ
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నానులే !


Break it down !

హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ !
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ !


పిలిచినా రానంటవా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా !


మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా
చేరవుగా .. చేరవుగా .. చేరవుగా ..
ఇరకాటం పెడతావె ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా
ఆగవుగా .. ఆగవుగా ..ఆగవుగా ..


దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా మతిచెడిపోదా మరదలా


వరాల బాలా వరించువేళా .. వరించనంటూ తగువేలా
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా


Everybody ..

నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా జవరాలా
నిగారమిట్టా జిగేలనాలా .. జనం చెడేలా జవరాలా

మన్మధుడు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుమంగళి, వేణు




గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం .. నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం .. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తీయని తరుణం ఇదీ !

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా
మనసా మనసా మనసా
మనసా మనసా మనసా
ఓ మనసా !

పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ
నువ్వు ఇపుడన్నదీ నేనెప్పుడూ విననిదీ
నిన్నిలా చూసి పయనించి .. వెన్నెలే చిన్నబోతుంది
కన్నులే దాటి కలలన్ని .. ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో .. ఇదంతా .. నిజంగా కలలాగే ఉంది !

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నదీ
ఎక్కడా జరగనీ వింతేమి కాదే ఇదీ
పరిమళం వెంట పయనించీ .. పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ .. పరిచయం తోడు కోరింది

దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది !

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం .. నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం .. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తీయని తరుణం ఇదీ !

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా
మనసా మనసా మనసా
మనసా మనసా మనసా
ఓ మనసా !



****************************************


గానం: ఎస్.పి.చరణ్


నేను నేనుగా లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా (2)


పూల చెట్టు ఊగినట్టు .. పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టూ ఓ చిరు నవ్వు
తేనె పట్టు రేగినట్టు .. వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరేనువ్వు


నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా...ఓ .. హొ .. హో .. ఓ !


నేను నేనుగా లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా


చుట్టుపక్కలెందరున్నా .. గుర్తు పట్టలేక వున్నా
అంత మంది ఒక్కలాగే కనబడతుంటే
తప్పు నాది కాదు అన్నా .. ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజం ఏదో నాకు వింతే


కళ్ళను ఒదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే..ఓ .. హొ .. హో .. ఓ !


నేను నేనుగా లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా


***************************************

సాహిత్యం: భువనచంద్ర
గానం: దేవిశ్రీ ప్రసాద్



హే .. అందమైన భామలూ
అరె లేత మెరుపు తీగలూ
హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు


అరె సిల్క్ చుడీదారులూ .. కాజీవరం చీరెలూ
రెచ్చగొట్టి రేపుతున్నయ్ వెచ్చని మోహాలు
హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)


హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)


Oh baby just give me love
Oh baby just take it now (2)


హే నువ్వేనా నా కల్లోకొచ్చిందీ
నా మనసంతా తెగ అల్లరి చేసిందీ
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్ నా
నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసెయ్ నా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసెయ్ నా

హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా

హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)
హేయ్ .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ


Oh baby just give me love
Oh baby just take it now
Oh baby I wannit now
Oh baby take it right now


హేయ్ కల్యాణీ నచ్చిందే నీ ఓణీ ..నీ తోడే కోరిందే జవానీ
ఎర్రని బుగ్గలకీ వేసెయ్ నా గాలాన్ని
నీ వొంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నో ఎన్నో అందాలున్న ఈ లోకంలో చిన్నారీ
అన్నిట్లోకి నువ్వే మిన్న కద సుకుమారీ


హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)


హే .. అందమైన భామలూ
అరె లేత మెరుపు తీగలూ
హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు


హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే
హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)

హృదయాంజలి

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర




మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


మానసవీణా .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


పచ్చదనాలా .. పానుపు పైనా ..అమ్మై నేలా జో కొడుతుంటే
పచ్చదనాలా .. పానుపు పైనా ..అమ్మై నేలా జో కొడుతుంటే


మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


పున్నమి నదిలో విహరించాలి .. పువ్వుల వళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి .. తొలకరిజల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరి మజిలీ
వేకువ వెనువెంట నేలకి తరలీ
కొత్త స్వేచ్చకందించాలి .. నా హృదయాంజలీ !


మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


తూగే ..
వాగునా నేస్తం చెలరేగే ..
వేగమే ఇష్ఠం అలలాగే ..
నింగికే నిత్యం ఎదురేగే ..
పంతమే ఎపుడూ నా సొంతం (2)


ఊహకు నీవే .. ఊపిరి పోసీ .. చూపవే దారీ ఓ చిరుగాలీ
కలలకు సైతం .. సంకెల వేసీ .. కలిమి ఎడారీ దాటించాలీ
తుంటరి తూనీగనై తిరగాలీ
దోసెడు ఊసులు తీసుకు వెళ్ళీ
పేద గరిక పూలకు ఇస్తా .. నా హృదయాంజలీ !


మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం
మానసవీణా .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం


పచ్చదనాలా .. పానుపు పైనా .. అమ్మై నేలా జో కొడుతుంటే
పచ్చదనాలా .. పానుపు పైనా .. అమ్మై నేలా జో కొడుతుంటే
మానసవీణ .. మౌన స్వరానా
ఝుమ్మని పాడే .. తొలి భూపాళం !


తూగే ..
వాగునా నేస్తం చెలరేగే ..
వేగమే ఇష్ఠం అలలాగే ..
నింగికే నిత్యం ఎదురేగే ..
పంతమే ఎపుడూ నా సొంతం !

క్రిమినల్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి


తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో


తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది !


తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో


ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే .. నీవుగా .. ప్రాణమే .. నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ !


తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో

Darling !
Every breath you take.. Every move you make
I will be there with you !
What would I do with out you..
I want to love you .. forever .. and ever .. and ever !!


ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే .. మారినా .. కాలమే .. ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ !


తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో


తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది !


తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో !

నిన్న నేడు రేపు

సంగీతం: అనిల్
సాహిత్యం : వేటూరి
గానం: గౌతం భరద్వాజ్



ఊహల్లో ఉయ్యాలే ఊగాలే నీ జంట
కాదంటే అవునంటూ పడ్డాలే నీ వెంట


నిన్ను చూసాక అమ్మాయీ .. కలలకే నిదుర రాదే
ఎలా గడపాలి ఈ రేయి ..


మాటలే రాని ఈ మౌనం .. ప్రేమగా మారిపోతే
పాటలా నన్ను చేరిందే ..


చలిలో వణికే కవితై ప్రేమా !

ఊహల్లో ఉయ్యాలే ఊగాలే నీ జంట
కాదంటే అవునంటూ పడ్డాలే నీ వెంట


నిన్ను చూసాక అమ్మాయీ .. కలలకే నిదుర రాదే
ఎలా గడపాలి ఈ రేయి ..


మాటలే రాని ఈ మౌనం .. ప్రేమగా మారిపోతే
పాటలా నన్ను చేరిందే ..


చలిలో వణికే కవితై ప్రేమా !

*********************************

గానం: హర్షిక, రంజిత్





తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో
ఒడిచాటూ .. గొడవల్లో.. సుడిరేగే చిలిపితనమూ


ఏటవాలు ఈతల్లో జతేగా
ఏకాస్త మోమాటం లెదుగా
నీరే నిప్పల్లే మారెనే
అందాలలో చలి తీరెనే


తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో
ఒడిచాటూ .. గొడవల్లో.. సుడిరేగే చిలిపితనమూ


వణుకుల చిలకా.. వాలిందీ నాపై
తొలకరి చినుకై.. చల్లగా
ఏ కోరికో తొలిచే .. నీ కోసమే పిలిచే.. ఓ ఓ


నీ కౌగిలే గిలిగిలిగా .. కవ్వింతలడిగిందిలే
లేలేత నా వయసే .. నీ చేతిలో బతికే


తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో
ఒడిచాటూ .. గొడవల్లో.. సుడిరేగే చిలిపితనమూ


నడుమున మెలికే నాట్యాలై నాలో ..తెలియని తపనే రేగిందిలే
నీ సాయమే అడిగా .. ఆ హాయిలో మునిగా


నాజూకులో తొలిరుచులే .. ఈ నాడు తెలిసాయిలే
ఈ గాలి ప్రేయసిలా .. రాగాల నా కలలా


తడి వేడి .. తపనల్లో.. చెలరేగే సుఖమేదో
ఒడిచాటూ .. గొడవల్లో.. సుడిరేగే చిలిపితనమూ

రక్షణ

గానం: ఎం.ఎం. కీరవాణి, చిత్ర


ఏ జన్మదో .. ఈ సంబంధమూ
ఏ రాగమో .. ఈ సంగీతమూ


మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో


ఏ జన్మదో .. ఈ సంబంధమూ

ఒకరికోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం


పెళ్ళాడుకున్న అందం .. వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం .. పలికించె ప్రేమవేదం
అందాల గుడిలోన పూజారినో .. ఓ బాటసారినో !


ఏ జన్మదో .. ఈ సంబంధమూ

లతలు రెండూ .. విరులు ఆరై .. విరిసె బృందావనీ
కలలు పండీ .. వెలుగులాయే .. కలిసి ఉందామనీ


వేసంగి మల్లె చిలకై .. సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికే .. కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో .. ఈ తోటమాలిదో


ఏ జన్మదో .. ఈ సంబంధమూ
ఏ రాగమో .. ఈ సంగీతమూ


మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో .. ఈ సంబంధమూ

February 03, 2009

ప్రియురాలు పిలిచింది !

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : ఎ.ఎం.రత్నం, శివగణేష్
గానం: చిత్ర


దోబూచులాటేలరా ..
దోబూచులాటేలరా .. గోపాలా ..
దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా


ఆ యేటుగట్టు నేనడిగా
చిరుగాలినాపి నేనడిగా
ఆ యేటుగట్టు నేనడిగా
చిరుగాలినాపి నేనడిగా
ఆకాశాన్నడిగా .. బదులేలేదూ
ఆకాశాన్నడిగా .. బదులేలేదూ


చివరకి నిన్నే చూసా .. హృదయపుగుడిలో చూసా
చివరకి నిన్నే చూసా .. హృదయపుగుడిలో చూసా
దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా !


నా మది నీకొక ఆటాడుబొమ్మయా
నా మది నీకొక ఆటాడుబొమ్మయా

నాకిక ఆశలు వేరేవి లేవయ .. ఎదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించరా గోపాలా
నీ అధరాలు అందించరా గోపాలా
నీ కౌగిలో కరిగించరా .. నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం .. నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం .. నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరీ వన్నె మార్చుకో
ఊపిరి నీవై సాగ .. పెదవుల మెరుపునూ కాగ .. చేరగ రా !


దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా !

గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పువ్వున కన్నె నీ మతమా
నేనొక్క స్త్రీ నే కదా గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికె నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ .. ఎపుడూ నీవే అండ .. కాపాడరా !


దోబూచులాటేలరా .. గోపాలా .. నా మనసంత నీవేనురా !


*****************************************
గానం: శంకర్ మహదేవన్


లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటె
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె
ఏమి చేయ .. మందువే !


గంధపు గాలిని తలుపులు ఆపుట .. న్యాయమా .. న్యాయమా !
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె .. మౌనమా .. మౌనమా !!


చెలియా నాలో ప్రేమని తెలుపా .. ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయా .. నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటె
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె ..
ఏమి చేయమందువే ..
ఏమి చేయమందువే ..


గంధపు గాలిని తలుపులు ఆపుట .. న్యాయమా .. న్యాయమా !
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె .. మౌనమా .. మౌనమా !!


చెలియా నాలో ప్రేమని తెలుపా .. ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయా .. నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటె
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె ..
ఏమి చేయమందువే ..
ఏమి చేయమందువే ..


హృదయమొక అద్దమనీ .. నీ రూపు బింబమనీ
తెలిపేను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింపా .. తాడేది లేదు సఖీ
అద్దాల ఊయల బింబమూగె చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా .. లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో వెంటాడీ ఇక వేటాడొద్దే !


లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటె
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె ..
ఏమి చేయమందువే ..
ఏమి చేయమందువే ..


గంధపు గాలిని తలుపులు ఆపుట .. న్యాయమా .. న్యాయమా !
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె .. మౌనమా .. మౌనమా !!


తెల్లారి పోతున్నా .. విడిపోని రాత్రేదీ
వాసనలు వీచే నీ కురులు సఖీ
లోకాన చీకటైనా .. వెలుగున్న చోటేదీ
సూరీడు మెచ్చే నీ కనులె చెలీ
విశ్వసుందరీమణులే వచ్చీ .. నీ పాద పూజ చేస్తారే

నా ప్రియసఖియా ఇక భయమేలా నా మనసెరిగీ నా తోడుగ రావే
ఏమి చేయమందువే ..
ఏమి చేయమందువే ..


ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే ..న్యాయమా .. న్యాయమా !
ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే .... మౌనమా .. మౌనమా !!
ఏమి చేయమందువే !

చెలి


సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాంబే జయశ్రీ

మనోహరా .. నా హృదయమునే .. ఓ మధువనిగా .. మలిచినానంట
రతీవరా .. అ తేనెలనే .. ఓ తుమ్మెదవై .. తాగిపొమ్మంటా
మనోహరా .. నా హృదయమునే .. ఓ మధువనిగా .. మలిచినానంట
రతీవరా .. అ తేనెలనే .. ఓ తుమ్మెదవై .. తాగిపొమ్మంటా

నా యవ్వనమే నీ పరమై పులకించే వేళా
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా

జడి వానై ప్రియా నన్నే చేరుకోమ్మా .. శృతి మించుతోంది దాహం
ఒక పానుపుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి .. నను జయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా

ఎన్నటికీ .. మాయదుగా .. చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసీ .. చెలరేగిపొవాలీ దేహం

మనోహరా .. నా హృదయమునే .. ఓ మధువనిగా .. మలిచినానంట
సుధాకరా .. అ తేనెలనే .. ఓ తుమ్మెదవై .. తాగిపొమ్మంటా

ఓ ప్రేమా ప్రేమా !
సందె వేళా స్నానం చేసి నన్ను చేరీ .. నా చీర కొంగుతో వళ్ళు
నువు తుడుస్తావే అదు కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేకా .. వెనకాల నుండి నన్ను
హత్తుకుంటావే అదు కావ్యం
నీకొసం .. మదిలోనే .. గుడి కట్టినానని తెలియనిదా
ఓ సారీ .. ప్రియమారా .. ఒడి చేర్చుకోవా నీ చెలినీ

మనోహరా .. నా హృదయమునే .. ఓ మధువనిగా .. మలిచినానంట
రతీవరా .. అ తేనెలనే .. ఓ తుమ్మెదవై .. తాగిపొమ్మంటా
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళా
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా

రోజా

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుజాత

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే


నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదినే నీవైతే .. అల నేనే
ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే !


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే


నీ చిగురాకు చూపులే .. అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే .. అవి నా బంగారు నిధులే
నీ పాలపొంగుల్లో తేలనీ .. నీ గుండెలో నిందనీ
నీ నీడలా వెంట సాగనీ .. నీ కళ్ళల్లో కొలువుండనీ !


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే ..ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే !


నీ గారాల చూపులే .. నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే .. నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో .. నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో .. నీ పరువాలు పలికించుకో


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే


నదినే నీవైతే .. అల నేనే
ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే !
పరువం వానగా .. నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో .. ఈడు తడిసేనులే

మెరుపు కలలు

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, సాధనా సర్గం



వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే ! (2)


వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా … (2)


ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సయ్యన్న మందారం
ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సయ్యన్న మందారం
చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం


పిల్లా .. పిల్లా ..
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..
పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
ఏ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా !


వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా …


ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
ఇది గిల్లీ గిల్లీ వసంతమే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ


పిల్లా .. పిల్లా ..
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు !


వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే !
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగాపంపిస్తా …

దళపతి

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: స్వర్ణలత



యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు జూసెనే రాధా
ప్రేమపొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే


యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో ..వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా !


యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు జూసెనే రాధా
ప్రేమపొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

ఆత్మబంధం

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
గానం: చిత్ర, ఎస్.పి.బాలసుబ్రమణ్యం


ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
వట్టి ఊహ కాదనీ.. ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టుపెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని


ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
వట్టి ఊహ కాదనీ.. ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టుపెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని


ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి


ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ
ఆమావాస్య కొలువై మోయమంటూ రేయినీ
సుదూరాల తారల్నీ .. సుధాశాంతి కాంతుల్నీ
వలలు వేసి తెచ్చా కంటికొనలో నింపనీ


చెదరని చెలిమికి సాక్ష్యమా .. హృదయము తెలుపగ సాధ్యమా
మాయని మమతల దీపమా .. ఉదయపు తళుకులు చూపుమా

నా జాబిలి నీవేనని ..
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి


తుదేలేని కధ కానీ .. గతం కాని స్వప్నాన్నీ
ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ
నువే ఉన్న కన్నులతో .. మరేవంక చూడననీ
రెప్ప వెనుక నిన్నే ఎల్ల కాలం దాచనీ
యుగములు కలిగిన కాలమా .. ఈ ఒక ఘడియను వదులుమా


చరితలు కలిగిన లోకమా .. ఈ జత జోలికి రాకుమా
స్వప్నం చిగురించిందని ..


ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి


వట్టి ఊహ కాదనీ.. ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టుపెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఇంకొక్కసారి ..
ఇంకొక్కసారి ..



********************************
గానం: చిత్ర , ఎస్.పి.బాలసుబ్రమణ్యం



ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారి పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా !


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా


ఇంకిపోని గంగలా .. కంటినీరు పొంగినా
చల్లబడకుందీ ఎడారీ .. ఎదలో
జ్ఞాపకాల జ్వాలలో .. రేపులన్ని కాలినా
కొండె ఊపిరింకా మిగులుందీ


చల్లనీ నీ కళ్ళలో .. కమ్మనీ కల నేను
చెమ్మగిల్లనీయకుమా .. కరిగిపోతానూ


దాయి దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారి పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా !


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా


గుక్కపట్టి ఏడ్చినా .. ఉగ్గు పట్టవేమనీ
తప్పు పట్టి తిట్టేవారేరీ .. తండ్రీ
అమ్మ వట్టి మొద్దురా .. జట్టు ఉండొద్దురా
అంటూ ఊరడించే నన్నేరీ


చెప్పరా ఆ గుండెలో .. చప్పుడే నేనని
జన్మలెన్ని దాటైనా .. చేరుకుంటాననీ


దాయి దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారి పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా !


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారి పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా !

ధర్మక్షేత్రం

సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర



ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ


ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా


ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో


మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా


ఓ .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా


గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో


అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా


హో .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా


అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా