August 30, 2010

1940 లో ఒక గ్రామం

సంగీతం: సాకేత్ సాయిరాం
సాహిత్యం: శ్రీకాంత్ అప్పలరాజు
గానం: అనిల్ కుమార్

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా

ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటా
ఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటా
ఏనాడైనా .. ఏ వేళైనా .. నాలోనా
ఏదేమైనా .. ఎవరేమైనా .. నీవేనే

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా !

ఈ వేళ ఎక్కడ ఉన్నావో .. ఏమేమి చేస్తూ ఉన్నావో
నాకేమో మదిలో నీ ధ్యాసే .. నీవేమో ఎపుడూ నా శ్వాసే
కాసంత కుదురే లేదాయే .. రేయంత నిదురే రాదాయే
నువు లేక కనులలో నీరేలే .. నువు రాక నిమిషం యుగమేలే
ఏ మాట విన్నా నీ పిలుపే .. యే చోట ఉన్నా నీ తలపే
విడలేను లే .. విడిపోనులే .. కడదాక నాతో నీవేలే

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా !!

నా కలల వెన్నెల నీవేనే .. నీ కనుల చీకటి కనలేనే
నా మనసు మాటే వినదేమో .. ఈ వలపు మాయే విడదేమో
నేనేమొ చేపగ మారానే .. నీవేమొ నీరై పోయావే
ఓ క్షణము విడి వడి పోయామా.. ప్రాణాలు విలవిల లాడేనే
నీ పేరు మరువను క్షణమైనా .. నీ ప్రేమ విడువను కలనైనా
కను మూసినా .. కను తెరచినా .. నగుమోమే పిలుచును ఏ వేళా

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా !!!

August 18, 2010

చేతిలో చెయ్యేసి

సంగీతం: బంటి
సాహిత్యం: చంద్రబోస్

గానం: హరిహరన్, అల్కా

పిల్లన గ్రోవి నేనై
చల్లని గాలి నువ్వై
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం ! (2)

రాగానికే రూపం ఒచ్చి
రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం !!

మొదటి సారి నిను చూడగానే .. ఆశ్చర్యరాగం
మదిని తెరిచి మాటాడగానే .. ఆహ్వానరాగం
చొరవ చేసి నను చేరగానే .. ఆందోళరాగం
చెలిమి చేయి కలిపేయగానే .. అవలీలరాగం

నవ్వులోన నవనీత రాగం .. సిగ్గులోన గిలిగింతరాగం
ఒంపులోన ఒలికింత రాగం .. ఓపలేని విపరీత రాగం
అణువుఆణువున పలికెను మనలో .. అనురాగ రాగం .. అదే ప్రాణ రాగం !!!

రాగానికే రూపం వచ్చి
రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం !

ఇరువురం దూర దూరముంటే .. ఇబ్బందిరాగం
బంధమై స్పందించుతుంటే .. నిర్బంధరాగం
పెదవి మీటి పెనవేసుకుంటే .. నిశ్శబ్దరాగం
మధుర నిధిని దోచేసుకుంటే .. నిక్షేప రాగం

తనువులోన తారంగ రాగం .. క్షణముకొక్క కేరింతరాగం
కలలోన కల్లోల రాగం .. కలిసిపోతే కళ్యాణరాగం
ఇద్దరమొకటై ముద్దుగ ఉంటే అద్వైత రాగం ..అదే మోక్షరాగం !!!

పిల్లన గ్రోవి నేనై
చల్లని గాలి నువ్వై
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం !!

*********************************************

సాహిత్యం: మౌనశ్రీ మల్లిక్

గానం: కార్తీక్, గీతా మాధురి

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం !
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ

సుధలు చిందు కావ్యం చదివా ఓ నేస్తమా
తెలుగు భాష పరువం నీవే ఓ అందమా
కలలు కనే వయసిది తెలుసా నా ప్రియతమా
కన్నె గుండె అలజడి తెలుసా నా ప్రాణమా

నువ్విలా పాడితే మది వాసంతం
నన్నిలా మీటితే ఎద సంగీతం !
హే నువ్విలా పాడితే మది వాసంతం
హే నన్నిలా మీటితే ఎద సంగీతం !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ !

విరులవాన గానం నాదీ ఓ నాదమా
నవరసాల వదనం నీదీ ఓ వేదమా
సిరులు కురులు సొగసే నాదీ ఓ ప్రణయమా
మరులుగొన్న మనసే నీదీ నా వినయమా

గుండెలో దేవిగా పూజిస్తాలే
కంటిలో పాపగా కొలువుంటాలే !
హో గుండెలో దేవిగా పూజిస్తాలే
హే కంటిలో పాపగా కొలువుంటాలే !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
హె హే మత్తుగా ఉన్నదే నీ అనురాగం

August 17, 2010

తకిట తకిట


సంగీతం: బోబో శశి
సాహిత్యం: భాస్కరభట్ల

గానం: కార్తీక్, చిన్మయి

మనసే అటో ఇటో .. ఎగిరే ఎటో ఎటో
తెలుసా ఇదేమిటో .. ఈ ఎదలో కధేమిటో
తొలి తొలి ప్రేమలోన పడి ముకలేసినది కనుకే ఇంతలా
వెనకకి రాను రాను అని నా మదీ వెతుకుతోందే నిన్నిలా .. నేరుగా ! (2)

ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నీవల్లేగా .. నువు లేకుండా తోచదు నాకే
చుట్టూరా ఎందరు ఉన్నా నీ చుట్టూనే తిరిగేస్తుందే .. ప్రాణం
సరికొత్తగ హరివిల్లేదో అరచేతులకే అందెను చూడూ నమ్మవు గానీ .. ఇది నీవల్లే
ఒట్టేసి చెప్పాలంటే నాలో ఉందీ నేనే కాను .. అంతటా నీ ఊహలే

చెలియా .. చెలియా .. నిజమా .. కలయా
నువు నాకోసం నేన్నీకోసం బహు చిత్రం గా మనబంధం కలిసెను
తరగని సిరులుగ చెరగని గురుతువి నువ్వే !!

నా గుండెల సవ్వడి వింటే నీ పేరే మరి వినిపిస్తుంది గమనించాలే .. గారడి నీదే
ఇకనుంచీ నువ్వూ నేనూ మనమే కాదా ఒకరికి ఒకరం .. తోడూ
కన్నుల్లో కొలువై ఉన్నా కలలో కూడా నీ చిరునవ్వే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే !
మనసిస్తే కాదనవంటూ నమ్మకమేదో నడిపించిందీ నన్నిలా నీ వైపుగా

వలపే వరదై .. నడకే పరుగై
నీ చూపుల్లో నీ మాటల్లో నీ మైకం లో మైమరపే కలిగెను
ఎవరిని చూసిన అది నువ్వనుకుంటానే !!

మనసే అటో ఇటో .. ఎగిరే ఎటో ఎటో
తెలుసా ఇదేమిటో .. ఈ ఎదలో కధేమిటో !!!