January 27, 2009

స్వయంవరం (1999)

సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర



మరల తెలుపనా ప్రియా .. మరల తెలుపనా ప్రియా !

ఎదలోయల దాచుకున్న .. మధు ఊహల పరిమళాన్ని
కనుపాపల నింపుకున్న .. చిరునవ్వుల పరిచయాన్ని
మరల తెలుపనా !!



విరబూసిన వెన్నెలలో .. తెరతీసిన బిడియాలని
అణువణువు అల్లుకున్న .. అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో .. పవళించు ఆశలని
చెప్పలేక .. చేతకాక ..
మనసు పడే తడబటుని .. మరల తెలుపనా !!



విచ్చుకోని భావమేదో .. కనుల తెరచి కలయచూసి
మాటరాని మౌనమేదో .. పెదవి మీద ఒదిగిపోయె
ఒక క్షణమే ఆవేదన .. మరు క్షణమే ఆరాధన
తెలియ రాక .. తెలుపలేక ..
మనసు పడే మధుర బాధ నీకు...మరల తెలుపనా ప్రియా !!

No comments: