సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సౌమ్య
కనుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసునీ తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
కనుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నాపేదెలా
నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఎమో ఎలా వేగడం
కనుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
అదిరేటి పెదవుల్ని బతిమాలుకున్నాను మదిలోని మాటేదనీ
తలవంచుకుని నేను తెగ ఎదురుచూసాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే వేళంత తెలవారి పోతుందో ఎమో ఎలా ఆపడం
కనుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసునీ తెలిపేందుకు నా భాష ఈ మౌనం !
కనుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
**********************************
గానం: రాజేష్
ఎటో వెళ్ళిపోయింది మనసూ
ఇలా ఒంటరయింది వయసు
ఓ చల్ల గాలీ ఆచూకి తీసీ కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసూ
ఎటెళ్లిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలీ ఆచూకి తీసీ కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో
ఏ స్నేహమో కావాలనీ ఇన్నాళ్ళుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందనీ నాకెవ్వరూ చెప్పలేదూ
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏవిటో
ఎటో వెళ్ళిపోయింది మనసూ
ఇలా ఒంటరయింది వయసు
ఓ చల్ల గాలీ ఆచూకి తీసీ కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో
కలలన్నవే కోలువుండనీ కనులుండి ఏం లాభమందీ
ఏ కదలికా కనిపించనీ శిలలాంటి బ్రతుకెందుకందీ
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుందీ అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసూ
ఇలా ఒంటరయింది వయసు
ఓ చల్ల గాలీ ఆచూకి తీసీ కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో
No comments:
Post a Comment