January 27, 2009

ఐతే


సాహిత్యం: సిరివెన్నెల

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడూ .. ఓ వానా నువు వస్తానంటే

నిధులకు తలుపులు తెరవగ ఒక ఆలీబాబా మనకే ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లవుద్దీన్ చాపే ఉంటే
చూపదా మరి ఆ మాయా దీపం .. మన ఫేటే ఫ్లైట్ అయ్యే రన్ వే

నడి రాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా
ఉరికినె ఉరిస్తావె మిత్రమా
సరదాగ నిజమైతే నష్టమా

మోనాలిసా మొహమ్మీదే .. నిలుస్తావా ఓ చిరునామా.. ఇలా రావా !

వేకువనే మురిపించే ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులూ
లోకం లో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులూ
ఇలాగేనా ప్రతీ రోజూ..ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

No comments: