సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే..అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే..అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
నిగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి.. దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
ఆ.. నిగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి.. దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా..కలువ భామ అది వింతే పున్నమిగా
ఆ.. చందమామ అవునంటే వెన్నెలగా..కలువ భామ అది వింటే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా..చేరువైతే
ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక.. చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక.. చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతీ నక్షత్రం ..తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
ఆ.. ఆకసాన అరుధంతీ నక్షత్రం ..తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
మనసిచ్చిన మలిసంధ్యలు కుంకుమలై కురిసీ నుదుట తిలకమై మెరిసే వేళా..చేరువైతే..
ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
***************************************************************
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా !
'నా ఉద్యోగం పోయిందండి.'
'తెలుసు .. అందుకే .. '
రాలేదు ఈ వేళా కోయిలమ్మా .. రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా
రాలేదు ఈ వేళా కోయిలమ్మా .. రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా .. ఎందుకమ్మా !
పిలిచినా రాగమే .. పలికినా రాగమే కూనలమ్మకీ
మూగ తీగ పలికించే వీణలమ్మకీ (2)
బహుశా అది తెలుసో ఏమో
బహుశా అది తెలుసో ఏమో జాణ కోయిలా .. రాలేదు ఈ తోటకీ ఈ వేళా !
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా అందుకేనా .. అందుకేనా !
గుండెలో బాధలే .. గొంతులో పాటలై పలికినప్పుడూ
కంటిపాప జాలికి లాలీ పాడినప్పుడూ (2)
బహుశా తను ఎందుకనేమో .. ల ల లా ల ల ల ల ల లా లా
బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిలా .. రాలేదు ఈ తోటకీ ఈ వేళా !
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రానేలా నీవుంటే కూనలమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రానేలా నీవుంటే కూనలమ్మా
No comments:
Post a Comment