January 07, 2009

నీ స్నేహం !

సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్

వేయి కన్నులతో హ్మ్ హ్మ్ హ్మ్..తెరచాటు దాటి చేరదా నీ స్నేహం !

వేయి కన్నులతో వేచి చూస్తున్నా .. తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా .. కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకూ కానుకంటున్నా .. మన్నించి అందుకోవ నేస్తమా !

ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా .. చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననే స్వప్నమేమి కాననీ .. ఒప్పుకుంటె నేరమా తప్పుకుంటె న్యాయమా

ఒక్కసారి … మ్మ్మ్ … ఒక్కసారి … లా ల లా ల …
ఒక్కసారి ఐనా చేయి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా !

వేయి కన్నులతో వేచి చూస్తున్నా .. తెరచాటు దాటి చేరదా నీ స్నేహం

ప్రతి నిముషం నీ ఎదుటే నిజమై తిరుగుతు లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో .. వెతికేది నీలోని నన్నేననీ !

వేయి కన్నులతో వేచి చూస్తున్నా .. తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా .. కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకూ కానుకంటున్నా .. మన్నించి అందుకోవ నేస్తమా !

***************************************************

గానం: కె.కె

ఊరుకో హృదయమా .. ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా .. బయటపడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాల .. ప్రణయమా !

చూపూలో శూన్యమే పెంచుతూ ఉన్నదీ .. జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నదీ .. జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఈ కంటిదో మమత ఈ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి

చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాల .. ప్రణయమా !

దేహమే వేరుగా .. స్నేహమే పేరుగా .. మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా .. ప్రేమనే పెంచగా .. అంకితం చేయనీ అభిమానం
నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా

చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాల .. ప్రణయమా !

No comments: