Showing posts with label R. Show all posts
Showing posts with label R. Show all posts

October 14, 2009

రెచ్చిపో


Powered by eSnips.com



సంగీతం : మణిశర్మ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : రంజీత్ ,శ్వేతా

తొలి తొలిగా మనసు వెనుక కధ మొదలయినది
తొందరగా బయట పడకా దాచేస్తున్నది
ఎదో ఎదో ఎదోలా ఉంటోంది నీ వల్లేనా
ఈ మైకం కమ్మింది నాకే తెలియక నాలో తికమక
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ

తొలి తొలిగా మనసు వెనుక కధ మొదలయినది
తొందరగా బయట పడకా దాచేస్తున్నది

నా బుజ్జి గుండెలో తుఫానౌతున్నది
అదో రకం పిచ్చెక్కుతున్నది
ఒళ్ళంతా మత్తుగా గమత్తుగున్నది
అమాంతము మారింది పద్దతి
నిన్నే పడగొడతది
మతే చెడగొడతది
మనసే చిలకై ఎగిరిపోతోంది ఏంటిది
ఎగిరి ఎగిరి తిరిగి రమ్మన్నా రాదది

అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ

తొలి తొలిగా మనసు వెనుక కధ మొదలయినది
తొందరగా బయట పడకా దాచేస్తున్నది

నా చీర కట్టుకి సిగ్గెక్కువయినది
నీ చూపులో ఏం మాయ ఉన్నది
పెదాలు ఇప్పుడే తడారుతున్నవి
ఇన్నాళ్ళుగా ఏ రోజూ లేనిది
అలాగే ఉంటాది
అయస్కాంతం లాంటిది
నదిలో పడవై తరలి పోతోంది నా మది
సుడిలో దిగకే పైకి రానివ్వదే అది

అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ

తొలి తొలిగా మనసు వెనుక కధ మొదలయినది
తొందరగా బయట పడకా దాచేస్తున్నది


*******************************************************


సంగీతం : మణిశర్మ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : హేమచందర్ ,శ్వేతా



Give me a chance baby
Give me a chance baby

గాలైనా వద్దులే నీరైనా వద్దులే
నీ ప్రేమే లేనిదే ఈ ప్రాణం వద్దులే

నీ సంగతి తెలుసులే ఎదవ్వేషాలొద్దులే
నువ్వెంత పొగిడినా పడిపోనులే

Give me one chance oh baby
Give me one chance oh baby

చెప్పేదినవే oh baby ooh ooh ya

గాలైనా వద్దులే నీరైనా వద్దులే
నీ ప్రేమే లేనిదే ఈ ప్రాణం వద్దులే

నిన్ను చూడగా పొద్దుతిరుగుడు పువ్వులా
నెమ్మదిగా మరి నా మది నీకై తిరిగిలే
ఇంత మొండిగా వీణ్ణేట్టా పుట్టించావురా
వదిలెయ్ మన్నా వదలడు ఓరి దేవుడా
నా కన్నా ముదురు కదా
ఆ విషయం ఇపుడే తెలిసిందా
వాదించే ఓపిక నాకింక లేదులే
నీ ప్రేమ బుట్టలో పడిపోనులే
Give me one chance oh baby
Give me one chance oh baby

చెప్పేదినవే oh baby ooh ooh ooh ya

No way no way no way no way
don't waste your time ooh oooh ooh ya

జాలే కలగదా రాజీ మాత్రం కుదరదా
మనిషివి కాదా ఏపుగ పెరిగిన చెట్టువా
సోది ఆపవా చూయింగమ్ లా వదలవా
కాన్వెంట్ లోన మాటలు నేర్చిన కోతివా
ఊ అంటే అలుసు కదా
ఏమైనా నువ్వు మారవా నువ్వింక
నాఇష్టం నాదిలే నీ సలహాలొద్దులే
నువు తీసే గోతిలో పడిపోనులే
Give me one chance oh baby
Give me one chance oh baby

చెప్పేదినవే oh baby ooh ooh ooh ya


May 19, 2009

రైడ్



Naa Manasantha ....

సంగీతం : హేమచంద్ర
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : హేమచంద్ర , సునీత

రుందదానిదని నానానే తన్నానే తన్నానే యే
రుందదానిదని నానానే తన్నానే తన్నానే యే హే

నా మనసంతా ఎదోలా ఉన్నదీ
నేనేమన్నా అది విననంటున్నది
నాలో కూడా ఏదో మొదలయినదీ
ఏమ్చెయ్యాలో అర్ధం కాకున్నది

నీ రూపమే ఎటు చూస్తూ ఉన్నా
నీ ధ్యాసలో పడిపోతూ ఉన్నా

తలదిండునే నలిపేస్తూ ఉన్నా
నువ్వేననీ ముద్దిస్తూ ఉన్నా

నీ తలపుల వాగులో నా మనసొక పడవలా
మారిందే ఇంతలో ఏమైందో వింతగా
అలుపన్నది ఎరుగనీ గడియారం ముల్లులా
నీ వెనకే నా మదీ తిరిగిందే కొత్తగా
నిను చూస్తుంటే అస్సలు కునుకే రాదే
నీతో ఉంటే కాలం గడిచిందే తెలియదులే

చెప్పాలంటే అచ్చం నాకూ అంతే
అంతా అంతా నీ వల్లే .......హే

she is a diamond girl a daimond girl
she is a diamond girl a daimond girl

నా కోసం నేరుగా దిగివచ్చిన తారకా
నీ కన్నా ఎక్కువ నాకెవ్వరు కాదుగా
అనుకోనీ వరముగా నీ చెలిమే అందగా
ఇంకేమీ వద్దుగా నువ్వుంటే చాలుగా
నువ్వే నువ్వే నాకిక అన్నీ నువ్వే
నువ్వే నువ్వే నాలో అణువణువున నిండావే
నువ్వే నువ్వే నాలో ఉన్నది నువ్వే
నువ్వే నువ్వే నచ్చావే

రుందదానిదని నానానే తన్నానే తన్నానే యే
రుందదానిదని నానానే తన్నానే తన్నానే యే హే

April 27, 2009

రోమియో





Enthagaa - Shreya Ghoshal


సంగీతం : అగస్త్య
సాహిత్యం : వనమాలి
గానం : శ్రేయా ఘోశాల్


ఎంతగా మరిచాననుకొన్నా
ఏ మూలో తన ఊసులనే తలచే మనసే
గుండెలో తన గురుతులనన్నీ
ఈ క్షణమే చెరిపేస్తున్నా వినదే వయసే


ఎదుటేం చూస్తూ ఉన్నా నవ్వుతున్న తనలా తోచెనా
ఎదలోన ఆశై కరిగి కంటి లోన అలలై తాకెనా


ఎంతగా మరిచాననుకొన్నా
ఏ మూలో తన ఊసులనే తలచే మనసే


మౌనం వీడి పెదవికి మాటే నేర్పి
తొలి స్వరాలు మీటే మదే తనతో పాటే
దూరం దాటి దరికే చేరే లోగా
ఇలా నిరాశ గీతం విధే పలికించేనా


నా రేపటి స్వప్నాలన్నీ....ఆ... నిన్నలలో చూస్తున్నానా
తనలోనే.... కొలువయ్యానా
కనలేకే..... శిలనయ్యానా
అలలెగసే ఎదలయలో అతడేనా ఇక నేనే లేనా


ఎంతగా మరిచాననుకొన్నా
ఏ మూలో తన ఊసులనే తలచే మనసే


రూపం లేని శ్వాసై నాలో చేరి
ఇకీ ప్రపంచమంతా తనే అనిపించాడే
రోజూ నాతో చిలిపిగా స్నేహం చేసి
తనో ముగింపు లేని కధే అవుతున్నాడే


ఆ ప్రేమను కాదనుకోనా...ఈ వేదననే నాదనుకోనా
కాలాన్నే.... నిలదిస్తున్నా
కలలన్నీ.... వెలి వేస్తున్నా
నెడుతున్నా హృదయాన్నే చెరలోన ఎడబాటేదైనా


ఎంతగా మరిచాననుకొన్నా
ఏ మూలో తన ఊసులనే తలచే మనసే

March 02, 2009

రాజమకుటం

సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.లీల


సడి సేయకో గాలి.. సడి సేయబోకే

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే

సడి సేయకే..

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి
మణికిరీటము లేని మహరాజుగాకేమి
చిలిపి పరుగులు మాని కొలిచి పోరాదె

సడి సేయకే..

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి జూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే

సడి సేయకే..

పండువెన్నెల నడిగి పాన్పు తేరాదే
ఈడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడి సేయకో గాలి..

February 10, 2009

రక్షణ

గానం: ఎం.ఎం. కీరవాణి, చిత్ర


ఏ జన్మదో .. ఈ సంబంధమూ
ఏ రాగమో .. ఈ సంగీతమూ


మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో


ఏ జన్మదో .. ఈ సంబంధమూ

ఒకరికోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్ధం వలపు మౌనాక్షరం


పెళ్ళాడుకున్న అందం .. వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం .. పలికించె ప్రేమవేదం
అందాల గుడిలోన పూజారినో .. ఓ బాటసారినో !


ఏ జన్మదో .. ఈ సంబంధమూ

లతలు రెండూ .. విరులు ఆరై .. విరిసె బృందావనీ
కలలు పండీ .. వెలుగులాయే .. కలిసి ఉందామనీ


వేసంగి మల్లె చిలకై .. సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికే .. కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో .. ఈ తోటమాలిదో


ఏ జన్మదో .. ఈ సంబంధమూ
ఏ రాగమో .. ఈ సంగీతమూ


మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో .. ఈ సంబంధమూ

February 03, 2009

రోజా

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుజాత

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే


నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదినే నీవైతే .. అల నేనే
ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే !


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే


నీ చిగురాకు చూపులే .. అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే .. అవి నా బంగారు నిధులే
నీ పాలపొంగుల్లో తేలనీ .. నీ గుండెలో నిందనీ
నీ నీడలా వెంట సాగనీ .. నీ కళ్ళల్లో కొలువుండనీ !


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే ..ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే !


నీ గారాల చూపులే .. నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే .. నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో .. నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో .. నీ పరువాలు పలికించుకో


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే


నదినే నీవైతే .. అల నేనే
ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే !
పరువం వానగా .. నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో .. ఈడు తడిసేనులే

January 27, 2009

రెడీ .. దేనికైనా ! (2008)

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సాగర్, గోపికా పూర్ణిమ


నా పెదవులు నువ్వైతే .. నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే .. కల నేనౌతా


నా పాదం నువ్వైతే .. నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే .. వెలుగే అవుతా


చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి
ఇలా మనం జతై సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ !


నా పెదవులు నువ్వైతే .. నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే .. కల నేనౌతా
నా పాదం నువ్వైతే .. నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే .. వెలుగే అవుతా


కనిపించని బాణం నేనైతే ..తియ తీయని గాయం నేనౌతా
వెంటాడే వేగం నేనైతే .. నేనెదురౌతా !
వినిపించని గానం నేనైతే .. కవి రాయని గేయం నేనౌతా
శృతిమించే రాగం నేనైతే .. జతి నేనౌతా
దివి తాకే నిచ్చెన నేనైతే .. దిగి వచ్చే నిచ్చెలి నేనౌతా !


నిను మలిచె ఉలినే నేనైతే ..
నీ ఊహలు ఊపిరి పోసే చక్కని బొమ్మను నేనౌతా !
నా పెదవులు నువ్వైతే .. నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే .. కల నేనౌతా


నా పాదం నువ్వైతే .. నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే .. వెలుగే అవుతా


వేధించే వేసవి నేనైతే .. లాలించే వెన్నెల నేనౌతా
ముంచెత్తే మత్తును నేనైతే .. మైమరపౌతా
నువ్వో పని భారం నేనైతే .. నిన్నాపని గారం నేనౌతా
నిను కమ్మే కోరిక నేనైతే .. రారమ్మంటా !


వణికించే మంటను నేనైతే .. రగిలించే జంటను నేనౌతా
పదునెక్కిన పంటిని నేనైతే ..
ఎరుపెక్కిన చెక్కిలి పంచిన చక్కెర విందే నేనౌతా !


నా పెదవులు నువ్వైతే .. నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే .. కల నేనౌతా
నా పాదం నువ్వైతే .. నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే .. వెలుగే అవుతా

January 07, 2009

రెయిన్ బో (2008)

సంగీతం: నిహాల్
సాహిత్యం: అనూరాధ
గానం: సునీత, నిహాల్



నా కళ్ళలో .. నీ కల ఇలా
కన్నానులే ప్రియతమా .. ప్రియతమా !
నీ ఆశలే .. నా శ్వాసగా
ఉన్నానులే ప్రాణమా .. ప్రాణమా !


ఇరు హృదయాలా .. ప్రేమావేశం
కడలిగ మారేనా !
చిలిపి తనాలా .. భావావేశం
చరితను మార్చేనా !


నీ కళ్ళలో .. నా కల ఇలా
చూశానులే ప్రియతమా .. ప్రియతమా !
నా ఆశలే .. నీ శ్వాసగా
చేశానులే ప్రాణమా .. ప్రాణమా !



ఇరు హృదయాలా ప్రేమావేశం ..కడలిగ మారేనా !
చిలిపి తనాలా భావావేశం .. చరితను మార్చేనా !



వెన్నెలవంటి వేకువ నీకోసం
వేకువ వెంటే వేడుక నీ యోగం
కన్నుల వెంటే కలగా నీ సాయం
వెన్నెల కాదా వేసవి నా ప్రాయం



నీలో .. నే సగమై
నువ్వే .. రస జగమై



ఇరు హృదయాలా ప్రేమావేశం ..కడలిగ మారేనా !
చిలిపి తనాలా భావావేశం .. చరితను మార్చేనా !



తొందరపడితే తుమ్మెదకానందం
అందనిదా ఈ పువ్వుల మకరందం
అందంగా నువ్వల్లుకుపోతుంటే
అంకితమవనా నీలో ఆసాంతం



జతగా .. తరులతగా
రతిగా .. హారతిగా



ఇరు హృదయాలా ప్రేమావేశం ..కడలిగ మారేనా !
చిలిపి తనాలా భావావేశం .. చరితను మార్చేనా !

December 29, 2008

రావోయి చందమామ

సంగీతం: మణి శర్మ
గానం: బాలు, చిత్ర



స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ .. కాలేవా చేతి రాతలూ


స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే


నీవే ప్రాణం .. నీవే సర్వం .. నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ .. రేయి పగలూ .. హారాలల్లే మల్లెలు నీకోసం


కోటి చుక్కలూ అష్ఠ దిక్కులూ నిన్ను చూచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనే రాలా
కాలాలే ఆగిపోయినా .. గానాలే మూగబోవునా


నాలో మోహం .. రేగే దాహం .. దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం .. గెలిచే బంధం .. రెండూ ఒకటే కలిసే జంటల్లో


మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం ..వాలేదే ప్రణయ గోపురం



స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ .. కాలేవా చేతి రాతలూ


స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే

November 12, 2008

రెండు రెళ్ళు ఆరు (1986)

సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి

కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే.. ముద్దర వేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్తతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో

చిరుగాలి దరఖాస్తు .. లేకుంటె కరిమబ్బు
చిరుగాలి దరఖాస్తూ .. లేకుంటె కరిమబ్బూ
మెరుపంత నవ్వునా .. చినుకైన రాలునా

జడివాన దరఖాస్తు .. పడకుంటె సెలయేరు
జడివాన దరఖాస్తూ .. పడకుంటె సెలయేరూ
వరదల్లె పొంగునా..కడలింట చేరునా

శుభమస్తు అంటే .. దరఖాస్తు ఓకే !

ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో

చలిగాలి దరఖాస్తు .. తొలిఈడు వినకుంటె
చలిగాలి దరఖాస్తూ .. తొలిఈడు వినకుంటే
చెలి జంట చేరునా .. చెలిమల్లె మారునా

నెలవంక దరఖాస్తు .. లేకుంటె చెక్కిళ్ళు
నెలవంక దరఖాస్తూ .. లేకుంటె చెక్కిళ్ళూ
ఎరుపెక్కి పోవునా .. ఎన్నెల్లు పండునా

దరిచేరి కూడా దరఖాస్తులేలా !

కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్తతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో !

October 30, 2008

రక్షకుడు (1997)


గానం: హరిహరన్ (?)

కలలు పంచే కలవాణీ
పెదవి పెదవీ జతకానీ
వలపు కోసం పిలుపులెందుకే
మనసే ..నీదే.. మహరాణీ

కనులకెన్నడు కంటి పాపా భారమెన్నడు కానే కాదూ
నీ చిలిపి నగవు చూస్తు ఉంటే అలుపు సొలుపూ దరికి రావూ
నిన్ను నేనూ ఎత్తుకుంటే ఉడుకు వయసూ వణికేనే
నిన్ను నేనూ హత్తుకుంటే నింగి నేలా కలిసేనే
నీమీదొక్క చూపు పడినా ఎదలో మంట రగిలేనే

కొంటె చూపుల కలవాణీ .. యవ్వన దేశపు యువరాణీ
కౌగిలి కోసం అలుక ఎందుకే
పలుకే రాదా అలివేణీ

కలలు పంచే కలవాణీ
పెదవి పెదవీ జతకానీ

వలపు కోసం పిలుపులెందుకే
మనసే .. నీదే .. మహరాణీ

***************************************

గానం: ఏసుదాస్, (?)

నిన్నే నిన్నే వలచినదీ .. అనుక్షణం తలచినదీ
నిన్నే నిన్నే వలచినదీ .. మనసునే మరచినదీ

కన్నుల కరిగినా యవ్వనవా .. ఒంటరి బ్రతుకే నీదమ్మా
నిన్నటి కధలే వేరమ్మా

నిన్నే నిన్నే పిలచినదీ .. అనుక్షణం తలచినదీ
నిన్నే నిన్నే వలచినదీ .. మనసునే మరచినదీ

పువ్వా పువ్వా నీ ఒడిలో .. ఒదిగిన క్షణం ఎక్కడే ..కలిగిన సుఖం ఎక్కడే
అభిమానం తో తలవంచినా .. ప్రేమకి చోటెక్కడే ..నిలిచితి నేనిక్కడే
కళ్ళల్లోనే ముళ్ళుంటే కనులకి నిదరెక్కడే
వలచిన వారే వలదంటే మనిషికి మనసెందుకే
నిన్నటి వలపే నిజమని నమ్మాను .. నిజమే తెలిసి మూగబోయి ఉన్నాను !

నిన్నే నిన్నే పిలిచినదీ .. అనుక్షణం తలచినదీ
నిన్నే నిన్నే వలచినదీ .. మనసునే మరచినదీ

కళ్ళలోని ఆశా .. కరగదులే
కౌగిలి లోనే చేర్చులే .. నిన్నటి బాధా తీర్చులే

హా .. నిన్నే నిన్నే .. నిన్నే నిన్నే .. నిన్నే నిన్నే

ప్రేమా ప్రేమా .. నా మనసే చెదిరిన మధువనమే ..వాడిన జీవితమే
విరహమనే విధి వలలో .. చిక్కిన పావురమే ..మరచితి యవ్వనమే
కలలోనైనా .. నిన్ను కలుస్తా .. ఆగనులే ప్రియతమా
లోకాలన్నీ .. అడ్డుపడినా .. వీడను నిను నేస్తమా
చీకటి వెనుకే వెలుగులు రావా .. బాధే తొలిగే క్షణమగుపడదా !

నిన్నే నిన్నే పిలిచినదీ .. అనుక్షణం తలచినదీ
నిన్నే నిన్నే వలచినదీ .. మనసునే మరచినదీ

కళ్ళలోని ఆశా .. కరగదులే
కౌగిలి లోనే చేర్చులే .. నిన్నటి బాధా తీర్చులే
హా .. నిన్నే నిన్నే .. నిన్నే నిన్నే .. నిన్నే నిన్నే