January 07, 2009

ఒకరికి ఒకరు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయా ఘోషల్



నువ్వే నా శ్వాశా..మనసున నీకై అభిలాషా
బ్రతుకైన నీతోనే..చితికైన నీతోనే
వెతికేది నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా.. ఓ ప్రియతమా !



పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు
తారల్లో మెరుపులన్ని దోసిళ్ళో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావు గా
నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని చెప్పాలనే చిన్ని ఆశ
ఓ ప్రియతమా..ఓ ప్రియతమా !



సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపేస్తున్నా అలుపెరగని హృదయ లయలని



ఏచోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా
నీ ప్రేమ సందేశం విని వస్తావనే చిన్ని ఆశ
ఓ ప్రియతమా..ఓ ప్రియతమా !

No comments: