January 14, 2009

కొంచెం ఇష్టం కొంచెం కష్టం


konchem ishtam konchem kashtam



సంగితం : శంకర్ ,ఎహసాన్ ,లోయ్
సాహిత్యం : చంద్రబోస్
గానం : క్లింటన్ సెరెజా ,హేమచంద్ర ,రమణ్ మహదేవన్, షిల్పా రావ్



ఎగిరే ఎగిరే ......ఎగిరే ఎగిరే
చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో
పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో
ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో
fly high in the sky

ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా


మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇపుడే
ఏపుడూ చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇచటే
ఓ ..ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం ఈ క్షణమే జీవితం
తెలిసింది ఈ క్షణం
మౌనం కరిగెనే మాటలు సూర్యుడి ఎండలో
స్నేహం దొరికెనే మబ్బుల చంద్రుడి నీడలో
ప్రాణం పొంగెనే మెరుపుల తారల నింగిలో

fly high in the sky
ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా


తెలుపు నలుపే కాదురా పలురంగులు ఇలా సిద్దం
మదిలో రంగులు అద్దరా మన కధలకు అదే అర్ధం
ఓ ....సరిపోదోయ్ బతకడం నేర్చేయ్ జీవించడం
గమనం గమనించడం పయనంలో అవసరం
చేసెయ్ సంతకం నడిచే దారపు నుదుటిపై
రాసెయ్ స్వాగతం రేపటి కాలపు పెదవిపై
పంచెయ్ సురినిరం కాలం చదివే కవితపై

fly high in the sky
ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా



***********************************************************
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శంకర్ మహదేవన్ ,శ్రేయా ఘోశాల్



ఆనందమా ...ఆరాటమా..... ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి


ఓ...........పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా

ఓ ...........కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున



ఆ.......................ఓ...........
ఎద సడిలో చిలిపి లయ
తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ


ప్రియా...ప్రియా

ఒక క్షణము తోచనీవుగా

కాస్త మరుపైన రావుగా

ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా



ఓ .....నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా

ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా

ఓ.....అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా

కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా


ఆనందమా ...ఆరాటమా..... ఆలోచనా ఏవిటో

పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి

దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో

తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ...........పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన
ఓ....... ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా


ఏకాంతమే నీ సొంతమై

పాలించుకో ప్రణయమా

కౌగిలే కోటలాఏలుకో బంధమా



***********************************************************************


గానం : శంకర్ మహదేవన్

సాహిత్యం : సిరివెన్నెల




ఉల్కులే ఊడే ఊడే ఉల్కులే ఊడే ఊడే ఉల్కులే ఊడే ఊడే ఓఓఓఓ



భజభజరా ప్రేమికా .......పట్టుకో చెలి పాదం

బాపురే బాలికా.......తీయకే నా ప్రాణం

అనుకుంటే సరా ఒకటే ఊదరా

చెబితే వినదా ఉరికే తొందర


కొంచెం ఇష్టం ఉంటే .....కొంచెం కష్టం అంటే

ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా

ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా
కూటితో కొండెత్తమంటే సరేలే అననా


అనగనగా జాలిగా సాగనీ మన గాథ

ఎంతకీ తేలదా ఏమిటీ యమ బాధ

ప్రతి సారి ఇలా మొదలైతే ఎలా

సుడిలో పడవై కడ తేరేదెలా

కొంచెం ఇష్టం ఉంటే...కొంచెం కష్టం అయినా

కంచి దాకా చేర్చలేనా నిను నా వెనుక

ఎంత ఇష్టం ఉంటే అంత కష్టం ఉందే

ఆగిపోని హంస పాదం ఆవకే చిలకా



ఎన్నడూ చేరమే తిన్నగా తుది తీరం

ఆపే ఆపదా కాదే పూపొద

బెదురెందుకట నేనున్నా కదా

కొంచెం ఇష్టం వెంట...కొంచెం కష్టం వెంట

ప్రేమ దేశం చేరాల్సిందే అనుకో సజనా

ఎంతో దూరం ఉన్నా ఎంత కాలం అయినా

ప్రేమ కోసం పరుగులు తీద్దాం పదవే లలనా


రాజునే బానిసా చెయ్యదా చెలి బంధం

సమయంతో సదా సమరం చేయదా

వలచే హృదయం గెలిచే తీరదా

కొంచెం ఇష్టం పుడితే......కొంచెం కష్టం పెడితే

అంతు చూసే పంతం అవదా పొంగే ఆశ

కోరే మజిలీ దాకా పోరే గజనీ లాగా

ఓటమంటే కోట చేరే బాటనుకోరా

మతి చెడితే భామరో మనది కాదిక లోకం

మునిగితే ప్రేమలో తేలనీయదు మైకం

మెడలో ఈ ఉరి పడుతున్నా మరి

ఇది పూదండే అనదా ఊపిరి

కొంచెం ఇష్టం ఉన్నా.....కొంచెం కష్టం అయినా

తేనెపట్టే రేపుతుంది ఈ అల్లరీ

ఇంతకు ముందే ఉన్న ఎందరి హిస్టరి విన్నా

నువ్వు నేనే ఈవ్ అండ్ ఆడం అంతే సరి


*********************************************************************


గానం : శ్రేయా ఘోశాల్ , సోనూ నిగం

సాహిత్యం : సిరివెన్నెల


అంతా సిద్ధంగా ఉన్నది.....మనసెంతో సంతోషమన్నది

ఆలస్యమెందుకన్నదీ...ఇలా రా మరి

అబ్బాయిగారి పద్ధతి ....హద్దు మీరేట్టుగానే ఉన్నది

అల్లాడిపోదా చిన్నదీ.....చాల్లే అల్లరి

కధలో తదుపరి...పిలిచే పద మరి

మనువే కుదిరి..మురిపెం ముదిరీ

మనకిష్టమైన కష్టమైన ఊగిపోదా మరి



అంతా సిద్ధంగా ఉన్నది...హద్దు మీరేట్టుగానే ఉన్నది

ఆలస్యమెందుకన్నదీ...సరేలే మరి




పైట పడి ఎదిగిన వయసా

ఓయ్ ఏంటి కొత్త వరస

బయటపడకూడదు సొగసా

పోవోయ్ చాల్లే నస

పైట పడి ఎదిగిన వయసా

బయటపడకూడదు సొగసా.....తెలుసా

మండిపోదా ఒళ్ళు పరాయి వాళ్ల కళ్లు

నిన్నంతలాగ చూస్తే అలా

ఎందుకంత కుళ్లు

నువ్వైనా ఇన్నిన్నాళ్ళునన్ను కొరకలేదా అచ్చం అలా

కనుకే కలిశా బంధమై బిగిశా

నీకు ఇష్టమైనా కష్టమైనా వదలనంది అది

అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది

ఆలస్యమెందుకన్నదీ...ఇలా రా మరి



చెంపలకు చెప్పవే సరిగా

సిగ్గుపడమని ఒక సలహా

హో....చెంపలకు చెప్పవే సరిగా

సిగ్గుపడమని ఒక సలహా....చెలియా
కన్నె పిల్ల బుగ్గ కాస్తైన కందిపోక

పసిపాపలాగ ఉంటే అలా

ముందరుంది ఇంకా ఆ ముద్దు ముచ్చట

కంగారు పెట్టకపుడే ఇలా

ఉరికే సరదా...చెబితే వింటదా

నీకు ఇష్టమైనా...కష్టమైనా...ఒప్పుకోదు అది





అంతా సుఖంగా ఉన్నది....మనసెంతో సంతోషమన్నది

ఆలస్యమెందుకన్నదీ...ఇలా రా మరి...




***************************************************************************

గానం : ఉన్ని కృష్ణన్

సాహిత్యం : సిరివెన్నల


ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చేయ్యొదిలేస్తావో
స్నేహమా చెలగాటమా
ఎప్పుడు నీ ముడి వేస్తావో.....ఎప్పుడెలా విడదీస్తావో.....ప్రణయమా పరిహాసమా
శపించే దైవమా దహించే దీపమా
ఇదే నీ రూపమా ప్రేమా


ఫలిస్తే పాపమా.....కలిస్తే లోపమా......గెలిస్తే నష్టమా ప్రేమా
ఈ..కలత...చాలే మమత
మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..మరలి రాని గతముగానే మిగిలిపోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు..చెప్పక తప్పదు వీడ్కోలు
ఊరుకో..ఓ హృదయమా
నిజం నిష్టూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి చెప్పవే ప్రేమా
ఫలిస్తే పాపమా...కలిస్తే కోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా

వెంటరమ్మంటూ.....తీసుకెళ్తావు......నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావు

జంటకమ్మంటూ ఆశపెడతావు
కలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావు
చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే
మౌనమా...మమకారమా
చూపుల్లో శూన్యమా...గుండెల్లో గాయమా..మరీ వేధించకే ప్రేమా
ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చేయొదిలేస్తావో
స్నేహమా చెలగాటమా
ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..ప్రణయమా పరిహాసమా


2 comments:

చైతన్య said...

nice blog :)

Gopal Koduri said...

పల్లకిలో ఈ పాటలన్నిటికీ ధన్యవాదాలు :)