సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్
ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా !
ఎదుట నిలిచింది చూడు..
నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ
అవునో..కాదో..అడగకంది నా మౌనం
చెలివో..శిలవో..తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా !
ఎదుట నిలిచింది చూడు..
నిన్నే చేరుకోలేక..ఎటేళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా..విసుక్కుంది నా కేకా
నీదో..కాదో..రాసున్న చిరునామా
ఉందో..లేదో..ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో..సొంతమైందిలా !
ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా !
ఎదుట నిలిచింది చూడు..
**********************************
ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !
జలజల జడిగా..తొలి అలజడిగా
తడబడు అడుగా..నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా !
ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !
కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే
చిటపటలాడి..వెలసిన వానా
మెరుపుల దాడి..కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడీ !
ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !
ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా
మనసుని నీతో..పంపేస్తున్నా
నీ ప్రతి మలుపూ..తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి..నిన్ను చేరనా !
ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !
జలజల జడిగా..తొలి అలజడిగా
తడబడు అడుగా..నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా !
ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !
*******************************
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లిఖార్జున్
ఉన్నట్టా లేనట్టా.. ఉండుంటే నిన్నెట్టా..చేరాలె సిరి తునకా
విన్నట్టా లేనట్టా.. వింటుంటే నా మాటా.. ఊ కొట్టవే చిలకా
హా .. నిదర చెడిన ఎద కుదుట పడదు కద
ఏదో చేసుంటావే నువ్వు..అమ్మాయీ అన్యాయంగా !
ఉన్నట్టా లేనట్టా.. ఉండుంటే నిన్నెట్టా..చేరాలె సిరి తునకా
విన్నట్టా లేనట్టా.. వింటుంటే నా మాట.. ఊ కొట్టవే చిలకా
తెలుసుకోనీ ఆకాశవాణీ..చెలియ వైనాన్నీ
అడుగుపోనీ ఆ చిన్నదాన్ని.. నన్ను కలవమనీ
ఏ మంత పని ఉందని..పారిపోయింది సౌదామినీ
ఏ సంగతీ చెప్పకా !
హో.. ఉన్నట్టా లేనట్టా.. ఉండుంటే నిన్నెట్టా..చేరాలె సిరి తునకా
మెరుపుతీగా నీ మెలిక నాలో..మిగిలిపోయిందే
చిలిపి సైగ నా మనసు నీతో..వలసపోయిందే
నువు తాకినట్టుండగా..ఓ తడి గుర్తు వదిలావుగా
మరచిపోనివ్వకా !
ఉన్నట్టా లేనట్టా.. ఉండుంటే నిన్నెట్టా..చేరాలె సిరి తునకా
విన్నట్టా లేనట్టా.. వింటుంటే నా మాటా.. ఊ కొట్టవే చిలకా
1 comment:
nice blog...
Post a Comment