October 26, 2008

ఆవకాయ బిర్యాని

సంగీతం : మణికాంత్ కద్రి
గానం : కార్తీక్ , శ్వేతా
సాహిత్యం : వనమాలి

నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిముషాన
ఇన్నాళ్ళకు నీలొ నను దాచిన సంగతి కనుగొన్నా
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన నేనిక లేనా నువ్వైయ్యానా ............

నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే

ఈ క్షణమే.... మనకై వేచి..... మనసులనే ముడి వేసే
కడ దాకా..... నీతో సాగే .....కలలేవో చిగురించే
నిలువెల్లా నాలోనా............ తడబాటే చూస్తున్నా
నిను చేరే వేళల్లో........... తపనేదో ఆగేనా

నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే

**********************************************

గానం : శ్రేయా ఘోశాల్ ,కార్తీక్

దే దన్ననన్ననన్న దే దన్ననన్ననన్న దిన్ననన్ననన్ననన్న దే నన్

వీరుడేనా వీడినేనా నేను కోరుకున్నా
దగ్గరయ్యే వాడేనా.... దాచుకోనా
ఊరు వాడా........ మెచ్చినోడు వీడేనా
నాకు కూడా..... నచ్చినోడు నాకేనా ఏ నాటికైనా

రేపు వైపు ...చూపులేని కళ్ళతోనా కొత్త ఆశే చూస్తున్నా... వాడివలన
లోకమంతా..... ఏకమైనా...... వాడి వెంటే సాగిపోనా నీడలాగ మారిపోనా

నిన్ను నన్ను ఇలా ఏకం చేసే కల తీరేలా దరి చేరేదెలా

చేరువైనా ....దూరమైనా ప్రేమలోన వాడి ఊహే హాయేగా గుండెలోన
జాలువారే ...ఊసులన్నీ ....వాడితోనే పంచుకోనా ఊపిరల్లే ఉండిపోనా

దే దన్ననన్ననన్న దే దన్ననన్ననన్న దిన్ననన్ననన్ననన్న దే నన్
ఏలుకోడా.... ప్రాణమల్లే చూసుకోడా
నన్ను కూడ నాలాగే కోరుకోడా
బాధలోను ..వెంటరాడా ...బంధమల్లే అల్లుకోడా
వీడీపోని తోడుకాడా

దే దన్ననన్ననన్న దే దన్ననన్ననన్న దిన్ననన్ననన్ననన్న దే నన్

*************************************************

గానం : కార్తీక్

అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు
ఇదిగిదిగో కలలను చూపుతూ ఎదలను ఏలే ఎవో వైనాలు
ఎగిరొచ్చే ఆ గువ్వలా చిగురించే ఈ నవ్వులా సాగే సావాసం
ప్రతి హ్రుదయంలో ఆ కల నిజమైతే ఆపేదెలా పొంగే ఆనందం
కలైనా ఇదో కధైనా రచించే ఏవో రాగాలే
ఈ సమయం ఎ తలపులలో తన గురుతుగ విడిచెళుతుందో
ఈ మనసుకు జత ఏదంటే తను ఏమని బదులిస్తుందో

వరమనుకో దొరికిన జీవితం ఋతువులు గీసే రంగుల ఓ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో తన గమ్యాన్నే చేరునో చూపే దారేది
వరించే ప్రతీ క్షణాన్నీ జయించే స్నేహం తోడవనీ
తన గూటిని వెతికే కళ్ళు గమనించవు ఎద లోగిళ్ళు
తలవంచిన మలి సంధ్యల్లో శెలవడిగెను తొలి సందళ్ళు
**********************************************
గానం : నరేష్ అయ్యర్, చిత్ర

నడిచే ఏడు అడుగుల్లో .. అడుగొక జన్మ అనుకోనా

నడిచే ఏడు అడుగుల్లో అడుగొక జన్మ అనుకోనా
వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా
చిలకా గోరువంకా .. చెలిమే మనది కాదా
పిల్లా పాపలింకా .. కలిమే కలిసి రాదా
నేలైనా ఇకపైనా నీ పాదాలైనా .. తాకేనా !

కురిసే పండు వెన్నెల్లో .. కునుకే చాలు వళ్ళో
మెరిసే మేడలెందుకులే .. మదిలో చోటు చాల్లే
ఊగే డోలలూ .. సిరులే పాపలూ
నీతో కబురులే .. నా ముని మాపులూ
ఈ కలలే నిజమయ్యే బ్రతుకే పంచితే చాలూ .. నూరేళ్ళూ !

No comments: