October 26, 2008

అష్టా చమ్మా (2008)

సంగీతం : కల్యాణి మల్లిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రీరామచంద్ర , మానసవీణ

నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో
నావ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో
చూస్తూనే ఉన్నా ఆ ఆ ఆఅవునా అంటున్నా ఆ ఆ ఆ

అయబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను ను ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వేలే

నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో

పరవాలేదు పరువేమి పోదే పరాదాలోనే పడి ఉండరాదే
పరుడేం కాదు వరసైనా వాడే బిడియం దేనికే హ్రుదయమా
చొరవే చేస్తే పొరపాటు కాదే వెనకడుగేస్తే మగజన్మ కాదే
తరుణం మించి పొనీయరాదె మనసా ఇంత మొహమాటమా
మామూలుగా ఉండవే......ఏ సంగతీ అడగవే

అయబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ఆ ను ను ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వేలే

నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో
నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో

పసిపాపాయి కేరింత కొంత గడుసమ్మాయి కవ్వింత కొంత
కలిసొచ్చింది కలగన్న వింత కనకే ఇంత ఆశ్చర్యమా
ఊళ్ళో ఉన్న ప్రతి కన్నె కంట ఊరించాలి కన్నీటి మంట
వరమె వచ్చి నా కొంగు వెంట తిరిగిందన్న ఆనందామా
కొక్కోరోకో మేలుకో.......కైపెందుకో కోలుకో

అయబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వేలే
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో
చూస్తూనే ఉన్నా ఆ ఆ ఆ.......అవునా అంటున్నా ఆ ఆ ఆ

ఆయబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ఆయబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా ను ను ను నువ్వా నువ్వా నువ్వాను
ను ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వేలే

*********************************************************

సాహిత్యం: సిరివెన్నెల
గానం : శ్రీకృష్ణ

ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటే ఈ చిన్నారీ నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఓ ఓ .......ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూశాక నిన్ను వేశాక కన్ను వెనెక్కేలాగ తీసుకొను
ఎం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వోద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలొ నిలేసే గళ్ళ బాటలొ
నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడటం అంతే


ఓ ఓ.......
నా నేరం ఏముందే ఎం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా
మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా
పూవ్వంటీ రూపం నాజూగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్ళంటీ కోపం వొళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవీ లేవీ అంత కొత్తేం కాదమ్మా


***************************************

సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రీకృష్ణ , సుష్మా


హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి....
ఎందుకు నీతో పేచి
ఇచ్చేదేదొ ఇచ్చి .......
వచ్చెయ్ నాతో రాజీ
కోలకంటి చూపా కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా తాళవాప్ర తాపా
బెదరకే పాపా ......
వదలని కైపా
నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొ్చ్చి .....కీడేంచి మేలెంచి
హెల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
ఎందరినేం మారుస్తాం....ఇంద్రజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం....మన్మధ మంత్రం వేద్దాం
రేయి లాంటి మైకం కప్పుకొని ఉందాం
మాయదారి లోకం కంట పడదందాం
మన ఏకాంతం ...
మనకే సోంతం
ఆష్ట దిక్కులన్ని దుష్ట శక్తుల్లల్లే కట్టకట్టుకొచ్చి చుట్టుముట్టుకుంటే యుద్ధానికి సిద్దం అనుకుందాం
పద్నాలుగు లోకాలను మొత్తం....ముద్దుల్లో ముంచేద్దాం
ఆరా తీసేవాళ్ళు పారా కాసేవాళ్ళు దారంతా ఉంటారు ఔరా జాగర్త

పిల్లకి మెళ్ళో పుస్తే కట్టేదెప్పుడంట పిల్లికి మెళ్ళొ గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవె చిట్టీ.....
చంపకు ఊదరగొట్టి
దగ్గర దగ్గర ఉండి......
తగ్గదు బాదర బంది
ఆవురావురందీ ఆకలాగనందీ
ఆవిరెక్కువుందీ అంటుకోకు అందీ
తట్టుకోడమెల్లా....
ముట్టుకుంటే డిల్లా
విస్తరాకు నిండ విస్తరించి ఉన్న విందు చూసి కూడా పస్తులుండమని ఎవ్వరిది శాశించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం.....ఐనా పెడతా శాపం

హెల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి...ఎందుకు నీతో పేచి
అచ్చేదేదో ఇచ్చి.....వచ్చేయ్ నాతో రాజీ
కోలకంటి చూపా కొత్త ఏటిచేపా
పూలవింటి తూపా తాళవాప్ర తాపా
బెదరకె పాప......
వదలని కైపా
నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి.....కీడేంచి మేలేంచి
హల్లో అంటూ పిలిచి కల్లోల్లం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

No comments: