October 27, 2008

సాగరసంగమం (1983)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, ఎస్.జానకి


మౌనమేల నోయి
మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా .. వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా .. వెలిగే కన్నులా
తారాడే హాయిలో...

ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయీ

పలికే పెదవీ వణికింది ఎందుకో .. వణికే పెదవీ వెనకాల ఏవిటో
కలిసే మనసులా .. విరిసే వయసుల
కలిసే మనసులా .. విరిసే వయసుల
నీలి నీలి ఊసులూ .. లేత గాలి బాసలు
ఏమేమో అడిగినా

మౌన మేల నోయి ఈ మరపు రాని రేయీ...

హిమమే కురిసే చందమామ కౌగిటా .. సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా
ఇవి ఏడడుగులా .. వలపూ మడుగులా
ఇవి ఏడడుగులా .. వలపూ మడుగులా
కన్నె ఈడు ఉలుకులూ .. కంటి పాప కబురులూ
ఎంతెంతో తెలిసినా

మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా .. వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా .. వెలిగే కన్నులా
తారాడే హాయిలో...

ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయీ !


*************************************

గానం: బాలు, ఎస్.పి.శైలజ

వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
మువ్వా గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే

ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె

చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే

నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే

ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..
మా ముద్దూ గోవిందుడే !


************************************

గానం: బాలు, ఎస్.పి.శైలజ

గా..మా..నీ..
గ మ గ స .. మ గ స .. గ స .. నీ సా ని ద మ గ..
ద మ గ..మ గ ..స రీ సా నీ..గ మ గా నీ ..
గ మ గ మ దా మ..ద నీ ద ని సా ని రీ..

వేదం అణువణువున నాదం
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసా నందీ రాగలై
వేదం..వేదం అణువణువున నాదం
ఆ..

సాగరసంగమమే ఒక యోగం
నిరిసని దమగా.. గగ మద రిసనీ.. నిరిసని దమగా మదనిసరీ స గా రి మ గ ద మ గ ని సా నిదని సమదగ రిగస
సాగరసంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆమధనం ఒక అమృతగీతం జీవితమే చిర నర్తనమాయే
పదమలు తామే పేదవులు కాగా..
పదమలు తామే పేదవులు కాగా..
గుండియలే అందియలై మ్రోగా

వేదం అణువణువున నాదం !

మాతృ దేవో భవా..
పితృ దేవో భవా..
ఆచార్య దేవో భవా..ఆచార్య దేవో భవా..
అతిధి దేవో భవా..అతిధి దేవో భవా !

ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురు పాయె కుదురైన నాట్యం
గురుదక్షిణైపోయే జీవం

నటరాజ పాదాన తల వాల్చనా
నయనాభిషేకాన తరియించనా

నటరాజ పాదాన తల వాల్చనా
నయనాభిషేకాన తరియించనా

సుగమమూ..రసమయ..
సుగమము రసమయ నిగమము భరతము గానా

వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసా నందీ రాగలై

వేదం..వేదం అణువణువున నాదం

జయంతి పే సుకృతినొ రస సిద్దా కవీశ్వరాః
నాస్తితేషామ్యషకాఃయే
చరామరణజం..భయం..నాస్తి
జరా మరణజం..భయం..నాస్తి
జరా మరణజం..భయం !


******************************

గానం: బాలు, ఎస్.పి.శైలజ

వాగర్ధావివ సంపృప్తౌ
వాగర్ధప్రతిపక్తయే
జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం
వందే పార్వతీప రమేశ్వరం

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
భావములో ఆ.. భంగిమలో ఆ.. గానములో ఆ.. గమకములో ఆ..
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
ఆ..ఆ..ఆ

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం

నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం
భరతమైన నాట్యం .. ఆ..బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
భరతమైన నాట్యం .. ఆ.. బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం

నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం
నటరాజ పాద సుమరజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర..

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ


********************************************

గానం: ఎస్.జానకి

ఓం..ఓం..ఓం..
ఓం నమఃశివాయా!
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయ లయనిలయా

ఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!

పంచభూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచభూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
సా.గా.మ.దనిస..
దగమద..ని సా గ మ
గ గ గా..స స స ని గా మదసని స మ గ

నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా.. ఆ..ఆ
నీ మౌనమే ..
దషోప నిషక్తులై ఇల వెలయా

ఓం.. ఓం .. ఓం నమఃశివాయా..

త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై

అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా

ఓం.. ఓం
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయ లయనిలయా

1 comment:

Unknown said...

Its really superb site But...New posts enduku post cheyyadam ledu..