December 29, 2008

గులాబి

సంగీతం : శశీ ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల
గానం : శశీ ప్రీతంఏ రోజైతే చూసానో నిన్ను..ఆ రోజే నువ్వు అయిపొయా నేను
కాలం కాదన్నా ఏదూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా

నీ కష్టం లో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఒదార్పౌతాను


కాలం ఏదో గాయం చేసింది
నిన్నే మాయం చేసానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది
శోకం పిండి జో కొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా


 
ఆఆ ..నీతో గడిపిన ఆ నిముషాలన్ని
నాలో దాగే గుండెల సవ్వడులే
జరిగే వింతే నే నమ్మేదెట్టాగా
నువు లేకుంటే నేనంటు ఉండనుగా


 
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లొ ..నీ రూపే నా వేచే గుండెల్లో


నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టం లో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఒదార్పౌతాను

 
*****************************************************


గానం : సునీత


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ


ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము...గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది


నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనె ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

ఆదిత్య 369

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: బాలు, ఎస్.జానకిరాసలీల వేళ..రాయబారమేలా
మాటే మౌనమై మాయజేయ నేల
రాసలీల వేళ..రాయబారమేలా


కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయె వేసవీ చల్లె పగటి వెన్నెలా
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిటా అందమైన జాబిలీ


తేనె వానలోన చిలికె తీయనైన స్నేహమూ
మేని వీణ లోన పలికె సోయగాల రాగమూ


నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని

రాసలీల వేళ..రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేల
రాసలీల వేళ..రాయబారమేలా


మాయచేసి దాయకూ సోయగాల మల్లెలూ
మోయలేని తీయనీ హాయి పూల జల్లులూ
చేరదీసి చెంతకూ భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకూ ఊరుకోదు ఈ క్షణం


చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా


చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు

రాసలీల వేళ..రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేల
రాసలీల వేళ..రాయబారమేలా

ఓ పాపా లాలి

సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యంమాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా (2)


వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసలు నన్నే మరిపించే !


మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరాముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే !మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా (2)

రావోయి చందమామ

సంగీతం: మణి శర్మ
గానం: బాలు, చిత్రస్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ .. కాలేవా చేతి రాతలూ


స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే


నీవే ప్రాణం .. నీవే సర్వం .. నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ .. రేయి పగలూ .. హారాలల్లే మల్లెలు నీకోసం


కోటి చుక్కలూ అష్ఠ దిక్కులూ నిన్ను చూచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనే రాలా
కాలాలే ఆగిపోయినా .. గానాలే మూగబోవునా


నాలో మోహం .. రేగే దాహం .. దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం .. గెలిచే బంధం .. రెండూ ఒకటే కలిసే జంటల్లో


మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం ..వాలేదే ప్రణయ గోపురంస్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ .. కాలేవా చేతి రాతలూ


స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే

అభినందన

సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు


 
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావేమరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం


గాయాన్నైనా మాన నీవు
హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కానీదు


ఎదుటా నీవే యెదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావే
ఎదుటా నీవే యెదలోన నీవేకలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను


స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింత బలముందా
 
*******************************************************************************


గానం : బాలు , జానకి
 


మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలోనీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో


మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలోమొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మధునితో జన్మ వైరం సాగినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడోమంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో
 


*************************************************************************

గానం : బాలు


అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా


కధైనా కలైనా కనులలో చూడనా

అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా


కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతము ఏదీ లేని గానముఅదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా


కధైనా కలైనా కనులలో చూడనా

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా అదే ఆశ గా
అదే బాసగా అదే ఆశ గా
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడనుఅదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా


అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా

గుణ

సంగీతం : ఇళయరాజా
గానం : బాలు,శైలజకమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

ఉహాలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలొ


ఒహోకమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమేగుండెల్లో గాయమేదొ చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనదిమమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా


శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా

నీరాజనం

సంగీతం :ఓ.పి నయ్యర్
గానం :బాలు, జానకిఆ ఆహా హా
ఆ ఆహా హా
ఓహో ఓహో ఓహో


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
ఈ జన్మ లొ మరి ఆ జన్మలో...ఈ జన్మ లొ మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే ....

నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను

ఆహహా .. ఆహహా
ఆహహా .. ఆహహా
ఆహహా .. ఓహోహో
ఓహోహో... ఆహాహా


ఏ హరివిల్లు విరబూసినా ..నీ దరహాశమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా...నీ చరణాల శ్రుతి మింటినీ
నీ ప్రతీ రాకలో ఎన్ని శశిరేఖలో ..నీ ప్రతీ రాకలో ఎన్ని శశిరేఖలో


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
ఈ జన్మ లొ మరి ఆ జన్మలో...ఈ జన్మ లొ మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే ....


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
 
ఓహో హో ఆహాహా ఆహాహా ఓహోహో


నీ జతగూడి నడయాడగా ..జగమూగింది సెలయేరులా
ఒక క్షణమైనా నిను వీడినా ..మది తొణికింది కన్నీరుగా


మన ప్రతి సంగమం ఎంత హ్రుదయంగమం
మన ప్రతి సంగమం ఎంత హ్రుదయంగమం


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
ఈ జన్మ లొ మరి ఆ జన్మలో ...ఈ జన్మ లొ మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే ....


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను

వర్షం

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.చరణ్, సుమంగళిమెల్లగా .. కరగనీ .. రెండు మనసుల దూరం
చల్లగా .. తెరవనీ .. కొంటె తలపుల ద్వారం


వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపీ తడిపీ తనతో నడిపీ హరివిల్లును వంతెన వేసిన శుభవేళా !


ఈ వర్షం సాక్షిగా .. తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా .. కలపనీ బంధం !


మెల్లగా .. కరగనీ .. రెండు మనసుల దూరం
చల్లగా .. తెరవనీ .. కొంటె తలపుల ద్వారం

నీ మెలికెలలోనా .. ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుముల లోనా .. నీ పిలుపును వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా


మతి చెడే .. దాహమై .. అనుసరించి వస్తున్నా
జతపడే .. స్నేహమై .. అనునయించనా


చలిపిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా !
ఈ వర్షం సాక్షిగా .. తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా .. కలపనీ బంధం !


ఏ తెరమరుగైనా .. ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరుచినుకైనా .. నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే ఋణపడిపోనా ఈ పైనా


త్వరపడే .. వయసునే .. నిలుపలేను ఇకపైనా
విడుదలే .. వద్దనే .. ముడులు వేయనా


మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా !

ఈ వర్షం సాక్షిగా .. తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా .. కలపనీ బంధం !

మెల్లగా .. కరగనీ .. రెండు మనసుల దూరం
చల్లగా .. తెరవనీ .. కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపీ తడిపీ తనతో నడిపీ హరివిల్లును వంతెన వేసిన శుభవేళా !


ఈ వర్షం సాక్షిగా .. తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా .. కలపనీ బంధం !


***********************************

గానం: టిప్పు, ఉష


హే లంగా వోణీ .. నేటితో రద్దైపోనీ .. డుం డుం డుం
సింగారాన్నీ .. చీరతో సిద్దం కానీ .. డుం డుం డుం
నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాయీ
చిందులే ఆపగా ముళ్ళు వెయ్యనీసర్లే కానీ .. చక్కగా పెళ్ళైపోనీ .. డుం డుం డుం
అల్లర్లన్నీ .. జంటలో చెల్లైపోనీ .. డుం డుం డుం
మెత్తనీ పగ్గమై పట్టుకో ప్రాయాన్నీ
సొంతమై అందమే అప్పగించనీహే లంగా వోణీ .. నేటితో రద్దైపోనీ .. డుం డుం డుం
సింగారాన్నీ .. చీరతో సిద్దం కానీ .. హ !


ఓ .. చూడు మరీ దారుణం .. ఈడునెలా ఆపడం
వెంటపడే శత్రువయే సొంత వయ్యారం
హే .. ఒంటరిగా సోయగం .. ఎందుకలా మోయడం
కళ్ళెదురే ఉందికదా ఇంత సహాయం


పుస్తే కట్టీ .. పుచ్చుకో కన్యాధనం
హె హె హే .. శిస్తే కట్టీ తీర్చుకో తియ్యని ఋణం

హే లంగా వోణీ .. నేటితో రద్దైపోనీ ..
సింగారాన్నీ .. చీరతో సిద్దం కానీ ..


హే సోకు మరీ సున్నితం .. దాన్ని ఎలా సాకటం
లేత నడుం తాళదు నా గాలి దుమారం
కస్సుమనే లక్షణం .. చూపనిదే తక్షణం
జాలిపడే లాలనతో లొంగదు భారం


హే ఇట్టే వచ్చీ అల్లుకో ఇచ్చేవిచ్చీ
ఆర్చే తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ


హాయ్ హాయ్ హాయ్ లంగా వోణీ .. నేటితో రద్దైపోనీ ..
సర్లే కానీ .. చక్కగా పెళ్ళైపోనీ ..
నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాయీ
చిందులే ఆపగా ముళ్ళు వెయ్యనీ

మౌనరాగం

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యంమల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా .. ఏల అదేలా
ఆవేదనే .. ఈనాటికీ .. మిగిలింది నాకూ !


మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా

తామరలపైనా నీటిలాగా .. భర్తయూ భార్యయూ కలవరంటా
తోడుగా చేరీ బ్రతికేందుకూ .. సూత్రమూ మంత్రమూ ఎందుకంటా
సొంతం అనేది లేకా .. ప్రేమ బంధాలు లేకా .. మోడంటి జీవితం ఇంకేలా ! హ !


మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళ

వేదికై పోయే .. మన కధంతా .. నాటకం ఆయెనూ మనుగడంతా
శోధనై పోయే .. హృదయమంతా .. బాటలే మారెనే పయనమంతా
పండిచవే వసంతం .. పంచవేలా సుగంధం .. నా గుండె గుడిలో నిలవాలీ .. రా !


మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా .. ఏల అదేలా
ఆవేదనే .. ఈనాటికీ .. మిగిలింది నాకూ !


మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా

సీతారామకళ్యాణం (1986)

సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: బాలు, పి.సుశీలరాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారీ
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో (2)


కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండుగేమో
చిననాటి స్నేహమే అందెనేమో
అది నేటి అనురాగ బంధమేమో


తొలకరి వలపులలో పులకించు హృదయాలలో (2)
ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు


ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో ..
ఎన్నెన్ని భావాలో !


రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారీ

కలలలోన తీయగా గురుతు తెచ్చుకో


చూసాను ఎన్నడో పరికిణీ లో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో


వన్నెల వానల్లో వనరైన జలకాలలో (2)
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహం లో


ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో ..
ఎన్నెన్ని కౌగిళ్ళో !


రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారీ
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో

బొమ్మన బ్రదర్స్ .. చందన సిస్టర్స్ (2008)

సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తీక్, శ్వేతచెలీ .. తొలి కలవరమేదో
ఇలా .. నను తరిమినదే
ప్రియా .. నీ తలపులజడిలో
ఇంతలా .. ముంచకే .. మరీ !


పొద్దున్నేమో ఓ సారీ ..
సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?


ముగ్గే పెడుతూ ఓ సారీ ..
ముస్తాబవుతూ ఓ సారీ ..
ఏదో అడగాలనిపిస్తోంది .. What shall I do?


కొత్తగా .. సరికొత్తగా .. చిరుగాలి పెడుతోంది కితకితా
ముద్దుగా .. ముప్పొద్దులా .. వయసుడిగిపోతుంది కుతకుతా

ఏమైనా ఈ హాయి తరి తరికిటా !


తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!


పొద్దున్నేమో ఓ సారీ ..
సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?అతిధిగ వచ్చే నీకోసం స్వాగతమౌతానూ
చిరునవ్వుగ వచ్చే నీకోసం పెదవే అవుతానూ
చినుకై వచ్చే నీకోసం దోసిలినౌతానూ
చిలకై వచ్చే నీకోసం చెట్టే అవుతానూ


చాటుగా .. ఎద చాటుగా .. ఏం జరిగిపోతుందో ఏమిటో
అర్ధమే .. కానంతగా .. ఎన్నెన్ని పులకింతలో
తొలిప్రేమ కలిగాక అంతేనటా !


తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!


అలలా వచ్చే నీకోసం సెలయేరౌతానూ
అడుగై వచ్చే నీకోసం నడకే అవుతానూ
కలలా వచ్చే నీకోసం నిదురే అవుతానూ
చలిలా వచ్చే నీకోసం కౌగిలినౌతానూ


పూర్తిగా .. నీ ధ్యాసలో .. మది మునిగిపోతోంది ఎందుకో
పక్కనే .. నువ్వుండగా .. ఇంకెన్ని గిలిగింతలో
నాక్కూడా నీలాగే అవుతుందటా !


తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!


పొద్దున్నేమో ఓ సారీ ..
సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?


ముగ్గే పెడుతూ ఓ సారీ ..
ముస్తాబవుతూ ఓ సారీ ..
ఏదో అడగాలనిపిస్తోంది .. What shall I do?


కొత్తగా .. సరికొత్తగా .. చిరుగాలి పెడుతోంది కితకితా
ముద్దుగా .. ముప్పొద్దులా .. వయసుడిగిపోతుంది కుతకుతా
ఏమైనా ఈ హాయి తరి తరికిటా !

ద్రోహి

సంగీతం: హరిస్ జయరాజ్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: రఘు కుంచె, నాగ సాహితి


నీ తలపున..నీ తలపునా
నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే
కంటిపాపగ దాచెను హాయే


హ్మ్ .. నాలో రగిలే .. తీయని మంటా .. నేడెందుకనీ
హ్మ్ .. కోరికలన్నీ .. తారకలాయే .. ఏ విందుకనీ


నీ తలపున..నీ తలపునా
నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే
కంటిపాపగ దాచెను హాయే


ఒడిలో రేగు విరహం .. అది కోరెనే చిలిపి సరసం
తగనీ వలపు మోహం .. అది తగవే తీరు స్నేహం
తరగనిదీ .. కరగనిదీ .. వగలన్ని సెగలైన చలీ
తొలిముద్దు నన్నే .. బులిపించగానే .. దినం దినం నిన్నే చూడగా !


నీ తలపున..నీ తలపునా .. నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే .. కంటిపాపగ దాచెను హాయేబుగ్గలా పాలమెరుపూ .. అది తగ్గలేదింత వరకూ
మోహం రేపు కలగా .. తొలి ఆమనే వచ్చె నాకై
రసికతలో .. కసికతలే .. తెలిపెను చిలిపిగ చెలీ
ముద్దు ముత్యాలన్నీ .. మోవి దిద్దగానే .. ఎగిసెను నాలో ప్రాయమే !


నీ తలపున..నీ తలపునా ..నా మనసు కవితైపోయే
నీ రెప్పలే .. కను రెప్పలే ..కంటిపాపగ దాచెను హాయే


హ్మ్ .. నాలో రగిలే .. తీయని మంటా .. నేడెందుకనీ
హ్మ్ .. కోరికలన్నీ .. తారకలాయే .. ఏ విందుకనీ***********************************
గానం: చిన్మయి, రఘు కుంచెమేఘమాల తానే .. నీ చెంతకొచ్చిందీ
రాగమాలలేవో .. నీ కోసం తెచ్చిందీ
చల్లనీ మనసు .. ఇక నీదేనన్నదీ
మల్లెలా మాసం .. నీ మాటేనన్నదీ
నీ ఊర్వశిగా..
నీ ప్రేయసిగా ..
నీ ఊర్వశిగా..నీ ప్రేయసిగా ..ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా
చిలికి చిలికీ కురిసే జల్లై .. నన్ను ముంచెయ్యవా
ఒంటరి గాయం చేసే ప్రాయం .. క్షణము లాలించవాఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా

ఎదనే తెలుపూ మాటలిలా .. ఎదుటే పడితే మౌనమయే
తొలుచు తలపు ఇదీ .. పిలుచు చిలక ఇదీ
ఊపిరి నీవై .. నాలోనా శ్వాసించవా

చూపులతోనే .. నను నువ్వే శాసించవా


ఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా


కదలని కాలం బరువాయే .. కంటికి నిదురే కరువాయే
నీడను వీడి వెళ్తావా .. నీతోనే తీసుకెళ్తావా
జన్మల బంధం .. నీతోటి .. వేసెయ్యవా
కమ్మని కలలే .. ఇక నిజమూ .. చేసెయ్యవాఉండలేనీ విరహం కనవా .. గుండెల్లో చోటియ్యవా
మరిగె మదినే తలగడ చేసీ .. జోలలు పాడెయ్యవా
చిలికి చిలికీ కురిసే జల్లై .. నన్ను ముంచెయ్యవా
ఒంటరి గాయం చేసే ప్రాయం .. క్షణము లాలించవా
క్షణము లాలించవా .. క్షణము లాలించవా !

గమ్యం

సంగీతం: ఇ.ఎస్.మూర్తి, అనిల్.ఆర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుజాతసమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకే


సమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకే


తీరం ఇలా తనకు తానే
తీరం ఇలా తనకు తానే ..వెతికి జతకి చేరే క్షణాలలో !


సమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకేచంటిపాపలా .. అనుకుంటూ ఉండగానే
చందమామలా .. కనుగొన్నా గుండెలోనే
తనలో చిలిపితనం .. సిరివెన్నెలే అయేలా
ఇదుగో కలలవనం .. అని చూపుతున్న లీలలో

సమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకేపైడిబొమ్మలా .. నను చూసే కళ్ళలోనే
ఆడజన్మలా .. నను గుర్తించాను నేనే
తనకే తెలియదనీ .. నడకంటే నేర్పుతూనే
నను నీ వెనక రానీ .. అని వేడుతున్న వేళలోసమయమా .. చలించకే
బిడియమా .. తలొంచకే (2)********************************
గానం: రంజిత్


ఎంతవరకూ .. ఎందుకొరకూ .. వింతపరుగూ .. అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే .. బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే .. గుర్తుపట్టే గుండెనడుగూప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా !
తెలిస్తే ప్రతీ చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా !!


ఎంతవరకూ .. ఎందుకొరకూ .. వింతపరుగూ .. అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే .. బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే .. గుర్తుపట్టే గుండెనడుగూకనపడేవెన్నెన్ని కెరటాలూ .. కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరూ
మనకిలా ఎదురైన ప్రతివారూ .. మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూసరిగా చూస్తున్నదా .. నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో .. విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలీ .. వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్నూ మిన్నూ నీరూ అన్నీ కలిపితే నువ్వే కదా కాదా !ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా !
తెలిస్తే ప్రతీ చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా !!


మనసులో నీవైన భావాలే .. బయటకనిపిస్తాయి దృశ్యాలై
నీడలూ నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే .. స్నేహితులు నీకున్న ఇష్ఠాలే
ఋతువులూ నీ భావ చిత్రాలేఎదురైన మందహాసం .. నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం .. నీ మకిలి మదికి భాష్యం
పుటకా చావూ .. రెండే రెండూ .. నీకవి సొంతం కావూ .. పోనీ
జీవితకాలం .. నీదే నేస్తం .. రంగులు ఏంవేస్తావో .. కానీ !

December 27, 2008

పల్లవి అనుపల్లవి

సంగీతం : ఇళయరాజా
గానం : SP బాలు, జానకి


ల ల లా లల లా లల లా లలాలా

కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో
వినిపించెను శ్రీ రాగంకనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహంనీ నవ్వులో విరిసె మందారము
నీ చూపులో కురిసే శృంగారము
నీ మాటలో ఉంది మమకారము
నా ప్రేమకే నీవు శ్రీకారము

పరువాలు పలికేను సంగీతము
నయనాలు పాడేను నవ గీతము


నేనే నీకు కానా ప్రాణం
నీవే నాకు కావా లోకం
 
కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం


 
నీ గుండె గుడిలో కొలువుండనీ
నీ వెంట నీడల్లే నను సాగని
నీ పూల ఒడిలో నను చేరనీ
నీ నుదుట సింధురమై నిలవనీ
చెవిలోన గుసగుసలు వినిపించనీ

ఎదలోన మధురిమలు పండించనీ

నీలో నేనే కలగా ఉంటూ
రోజూ స్వర్గం చూడాలంటకనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం
నీ చేరువలో నీ చేతలలో
వినిపించెను శ్రీ రాగం
 

December 24, 2008

నీకోసం (1999)

సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సాహితి

గానం: రాజేష్, కౌసల్య

నీకోసం .. నీ కోసం
నీకోసం .. నీ కోసం

ఎపుడూ లేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో ..
నీకోసం .. నీ కోసం
ఈ లోకమిలా .. ఏదో కలలా .. నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ

నీకోసం .. నీ కోసం
నీకోసం .. నీ కోసం

నాలో ఈ ఇదీ .. ఏ రోజూ లేనిదీ
ఏదో అలజడీ .. నీతోనే మొదలిదీ
నువ్వే నాకనీ .. పుట్టుంటావనీ
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా

నీకోసం .. నీ కోసం
నీకోసం .. నీ కోసం

నాలో ప్రేమకీ .. ఒక వింతే ప్రతీదీ
వీణే పలుకనీ .. స్వరమే నీ గొంతుదీ
మెరిసే నవ్వదీ .. మోనాలీసదీ
ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ

ఎపుడూ లేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో ..
నీకోసం .. నీ కోసం
ఈ లోకమిలా .. ఏదో కలలా .. నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ

నీకోసం .. నీ కోసం
నీకోసం .. నీ కోసం

అంకురం (1992)

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, బాలు


ఎవరో ఒకరూ..
ఎపుడో అపుడూ..
ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపు

ఆ..ఆ..
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుక వచ్చు వాళ్ళకూ బాట అయినదీ

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

కదలరు ఎవ్వరూ..వేకువ వచ్చినా
అనుకొని కోడి కూత నిదురపోదుగా
జగతికి మేలులొల్పు మానుకోదుగా

మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగా నేల దారికీ
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ !

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

చెదరకపోదుగా చిక్కని చీకటీ
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికీ
దానికి లెక్క లేదు కాళరాతిరీ

పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్ప వెనక ఆపనీ కంటి నీటినీ
సాగలేక ఆగితే దారి కరుగునా
జాలి చూపి తీరమే దరికి చేరునా !!

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

యుగములు సాగినా..నింగికి తాకకా
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా

ఇంత వేడి ఎండతో వళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడూ కళ్ళూ మూయడా
నల్లమబ్బు కమ్మితే చల్లబారడా !!!

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ !

పెళ్ళిపుస్తకం

బాపు-రమణ గారి చిత్రాలలో 'పెళ్ళిపుస్తకం' కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 'శ్రీరస్తూ శుభమస్తూ..శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం' అనే పాట పలకని పెళ్ళి కాని, ఆ పాట లేని పెళ్ళి కాసెట్ కాని, సీడీ లేవంటే అతిశయోక్తి కాదు. నాకు బాపూ గారి బొమ్మలంటే ప్రాణం , రమణ గారి మాటలంటే ఇష్థం. తెలుతనం నిండుగా కనిపిస్తుంది వీరి చిత్రాలలో. మధ్య తరగతి జీవితం, ఆలుమగల మధ్య అనురాగం బాపూ గారు చూపించినట్లుగా ఇంకెవరూ చూపించలేరేమో!

దివ్యవాణి ఆల్చిప్పల్లాంటి కళ్ళు కానీ, రాజేంద్రప్రసాద్ మాటల చమత్కారాలు కానీ, గుమ్మడి గారి 'నేనూ..' అని మొదలెట్టే మాటలు కానీ..ఒకటేమిటి అన్నీ అన్నీ ఎంతో బాగా నచ్చాయి నాకు. చివరగా చెప్తున్నానని కాకుండా, 'మామ' కె.వి.మహదేవన్ గారి బాణీలు అధ్బుతం !

సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి

సరికొత్త చీర..
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించి నాను
మనసూ మమత..పడుగూ పేక చీరలో చిత్రించి నాను
ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా...

ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు..ముళ్ళూ వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు ..అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కల బోస్తా..నీ కొంగుకు చెంగున ముడి వేస్తా
ఈ అందాలన్నీ కల బోస్తా..నీ కొంగుకు చెంగున ముడి వేస్తా

ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా...

చుర చుర చూపులు ఒక మారూ..నీ చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారూ..నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు
నువ్వు ఏ కళనున్నా మహ బాగే..ఈ చీర విశేషం అలాగే
నువ్వు ఏ కళనున్నా మహ బాగే..ఈ చీర విశేషం అలాగే

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించి నాను
మనసూ మమత..పడుగూ పేక చీరలో చిత్రించి నాను
ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత
నా వన్నెల రాశికీ సిరి జోతా...

*************************************

December 23, 2008

ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి


గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ .. మగతావినీ .. ముడి వేయనీయవా
కాదనీ .. అనలేననీ .. గడి అయిన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
(హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ)

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !

(మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే భద్రామి శుభకే త్వం జీవ శరదస్యకం
త్వం జీవ శరదస్యకం .. త్వం జీవ శరదస్యకం !)

కాంక్షలో కైపు నిప్పూ .. ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా .. మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం .. గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం .. మరయాగ వాటికా

కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !

నిష్ఠగా నిన్ను కోరీ .. నీమమే దాటినా
కష్ఠమే సేద తీరే .. నేస్తమే నోచనా
నిద్రహం నీరు గారే .. జ్వాలలో నించినా
నేర్పుగా ఈది చేరే .. నిశ్చయం మెత్తనా

సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ .. మగతావినీ .. ముడి వేయనీయవా
కాదనీ .. అనలేననీ .. గడి అయిన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ
(హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ)

ఒంపుల వైఖరీ .. సొంపుల వాకిలీ .. ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ .. అల్లరి ఆకలీ .. ఎందుకు పోకిరీ చాలు మరీ .. హో !


**************************************************

గానం: మనో, చిత్ర

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా

చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !

మెత్తగా వళ్ళో .. పెట్టుకో కాళ్ళూ
ఉందిగా అంక పీఠం .. ఆడపుట్టుకే అందుకోసం
గట్టిగా పట్టుకో .. భక్తిగా అద్దుకో
పుచ్చుకో పాద తీర్ధం .. పాద పూజలే ఆది పాఠం

చాకిరీ చెయ్యనా బానిసై .. నీ సేవలే చెయ్యనా పాదుషా
దీవెనే తీసుకో బాలికా .. నీ జీవితం సార్ధకం పొమ్మికా
మొక్కులే తీరీ .. అక్కునే చేరీ .. దక్కెనే సౌభాగ్యం

చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !

నచ్చెనే నారీ .. వచ్చెనే కోరీ ..
తెచ్చెనే ప్రేమ సౌఖ్యం .. సాటి లేనిదీ ఇంటి సఖ్యం
మెచ్చెనే చేరీ .. ముచ్చటే తీరీ
ఇచ్చెనే ప్రేమ రాజ్యం .. అంతులేనిదే సంతోషం

స్వప్నమే సత్యమై వచ్చెనేమో .. వెచ్చగా సర్వమూ పంచగా
స్వర్గమే సొంతమై దక్కెనేమో .. అచ్చటా ముచ్చటా తీర్చగా
మక్కువే మీరీ .. ముద్దులే కోరీ .. అందెనా ఇంద్రభోగం

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !


*******************************************

గానం: మనో, చిత్ర

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా (2)

నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

షోలే ఉందా ?
ఇదిగో ఇందా ..
చాల్లే ఇది జ్వాల కాదా..
తెలుగులో తీశారే బాలా !

ఖైదీ ఉందా?
ఇదిగో ఇందా..
ఖైదీ కన్నయ్య కాదే ..
వీడికి అన్నయ్య వాడే !

జగదేకవీరుడి కధా..ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల .. అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

ఒకటా రెండా .. పదులా వందా
బాకీ ఎగవేయకుండా .. బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా .. మతి పోయిందా
చాలే నీ కాకి గోలా .. వేళా పాళంటూ లేదా

ఏవైంది భాగ్యం కధా? కదిలిందా లేదా కధా?
వ్రతమేదో చేస్తుందంటా .. అందాక ఆగాలటా
సౌఖ్యంగా బ్రతకాలీ .. సౌఖ్యాలే పొందాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

December 18, 2008

స్వర్ణకమలం (1988)

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి

కొత్తగా రెక్కలొచ్చెనా .. గూటిలోనీ గువ్వపిల్లకీ
మెత్తగా .. రేకు విచ్చెనా ..
మెత్తగా .. రేకు విచ్చెనా .. కొమ్మచాటు నున్న కన్నెమల్లెకి
కొమ్మచాటు నున్న కన్నెమల్లెకి

కొత్తగా రెక్కలొచ్చెనా .. మెత్తగా రేకు విచ్చెనా ..

కొండదారి మార్చిందీ కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చిందీ కలికి ఏటి నీరు

కొండదారి మార్చిందీ .. కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చిందీ .. కలికి ఏటి నీరు

బండరాళ్ళ హోరుమారీ పంటచేల పాటలూరి
బండరాళ్ళ హోరుమారీ పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగణి ఊగేలా
సిరి చిందు లేసింది కనువిందు చేసింది

కొత్తగా రెక్కలొచ్చెనా ..
మెత్తగా రేకు విచ్చెనా ..

వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలీ
ఎదురులేక ఎదిగింది మధురగాన కేళి
వెదురులోకి ఒదిగింది .. కుదురులేని గాలీ
ఎదురులేక ఎదిగింది .. మధురగాన కేళి

భాషలోన రాయలేనీ రాసలీల రేయిలోని
అబ్బా !
భాషలోన రాయలేనీ రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శృంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

కొత్తగా రెక్కలొచ్చెనా .. గూటిలోనీ గువ్వపిల్లకీ
మెత్తగా .. రేకు విచ్చెనా ..
మెత్తగా .. రేకు విచ్చెనా .. కొమ్మచాటు నున్న కన్నెమల్లెకి
కొమ్మచాటు నున్న కన్నెమల్లెకి

కొత్తగా రెక్కలొచ్చెనా .. మెత్తగా రేకు విచ్చెనా !

*******************************************

గానం: ఎస్.జానకి

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ ఆలోకం అందుకోనా
ఆదమరిచీ ఈ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ

మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా .. వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా .. సందెల్లో రంగులెన్నో చిలికెయ్ నా
పిల్లగాలే పల్లకీగా .. దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం .. నవరాగాలే .. నాట్యమాడెనుగా !

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ ఆలోకం అందుకోనా
ఆదమరిచీ ఈ కలకాలం ఉండిపోనా

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం .. స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం .. ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగానా .. చందమామా మందిరానా
నా కోసం .. సురభోగాలే .. వేచి నిలిచెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ ఆలోకం అందుకోనా
ఆదమరిచీ ఈ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ


****************************************************

గానం: వాణీ జయరాం, ఎస్.పి.బాలసుబ్రమణ్యం

గురుః బ్రహ్మా
గురుః విష్ణుః
గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవే నమః

ఓం నమో నమో నమఃశివాయ !

మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయా
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయా

ఓం నమో నమో నమఃశివాయ !!

శూరినే నమో నమః కపాలినే నమః శివాయా
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయా

అందెల రవమిది పదములదా ..
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా .. అమితానందపు ఎద సడిదా

సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా !

అందెల రవమిది పదములదా ..
మువ్వలు ఉరుముల సవ్వడులై .. మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై .. మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై .. మేని విసురు వాయువేగమై

హంగ భంగిమలు గంగ పొంగులై .. హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీలా .. రసఝరులు జాలువారేలా

జంగమమై జడ పాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన ప్రకృతి ఆకృతి పార్వతి కాగా

అందెల రవమిది పదములదా ..

నయన తేజమే నకారమై ..
మనో నిశ్చయం మకారమై ..
శ్వాస చలనమే శికారమై ..
వాంచితార్ధమే వకారమై ..
యోచన సకలము యకారమై ..

నాధం నకారం
మంత్రం మకారం
స్తోత్రం శికారం
వేధం వకారం
యజ్ఞం యకారం
ఓం నమః శివాయ !

భావమె భౌనపు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా .. తాండవ మాడే వేళా

ప్రాణ పంచమమె పంచాక్షరిగా .. పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా

అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా .. అమితానందపు ఎద సడిదా

అందెల రవమిది పదములదా !


*******************************************

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
నటనాంజలితో బ్రతుకును తరీంచనీవా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించి రావా

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా

పడమర పడగలపై .. మెరిసే తారలకై
పడమర పడగలపై .. మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరీ
తూరుపు వేదికపై .. వేకువ నర్తకివై
తూరుపు వేదికపై .. వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ

నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ

శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోదు ఎక్కడా
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా

ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా

జలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
గగన సరసి హృదయంలో ..
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించి రావా


************************************

గానం: ఎస్.పి.శైలజ

చేరి యశోదకు శిశువితడూ
చేరి యశోదకు శిశువితడూ
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడూ

చేరి యశోదకు శిశువితడూ
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడూ
చేరి యశోదకు శిశువితడూ

సొలసి చూచినను సూర్య చంద్రులను
లలివేద చల్లెడు లక్షణుడూ
సొలసి చూచినను సూర్య చంద్రులను
లలివేద చల్లెడు లక్షణుడూ
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలికించు సురల గనివో ఇతడూ
కలికించు సురల గనివో ఇతడూ

చేరి యశోదకు శిశువితడూ
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడూ
చేరి యశోదకు శిశువితడూ


***************************

గానం: ఎస్.పి.శైలజ

ఆంగికం .. భువనం యస్యా
వాచికం .. సర్వ వాన్మయం
ఆహార్యం .. చంద్ర తారాదితం
వందే సాత్వికం శివం

రజతాద్రినే .. తాండవమాడే .. నటరాజూ తాండవమాడెనే
నటరాజూ తాండవమాడెనే
రజతాద్రినే .. తాండవమాడే .. నటరాజూ తాండవమాడెనే
నటరాజూ తాండవమాడెనే


****************************************

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళూ

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళూ
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళూ

లయకే నిలయమై నీ పాదం సాగాలీ
మలయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ
తిరిగే కాలానికీ
ఆ ..ఆ .. ఆ ..ఆ..
తిరిగే కాలానికీ తీరొకటుందీ
అది నీ పాఠానికి దొరకను అందీ
నటరాజ స్వామి జటా జూటి లోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముందీ
విలువేముందీ

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళూ
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళూ

దూకే అలలకూ ఏ తాళం వేస్తారూ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారూ
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరూ
ఆ .. ఆ .. ఆ .. ఆ ..
వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ
హద్దులు దాటరాదు ఆశల వాహినీ
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముందీ
విలువేముందీ

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు


*********************************

December 16, 2008

మేఘసందేశం (1982)

సంగీతం: రమేష్ నాయుడు

సాహిత్యం: వేటూరి
గానం: కె.జె.ఏసుదాస్

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికీ .. మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై .. తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై .. తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని .. కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో .. ఉలిపిరి చినుకుల బాసలతో+
విన్నవించు నా చెలికీ .. విన్న వేదనా నా విరహ వేదనా

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా

రాలుపూల తేనియకై .. రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై .. రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో .. రుధిర భాష్పజల ధారలతో
ఆ..ఆ..ఆ..ఆ

విన్నవించు నా చెలికీ .. మనోవేదనా నా మరణయాతనా

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికీ .. మేఘసందేశం మేఘసందేశం


*****************************************

సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల


ఆకులో ఆకునై .. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా (2)

గలగలనే వీచు చిరుగాలిలో కెరటమై
గలగలనే వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనే పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై

ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా

ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై .. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై
ఈ అడవీ దాగిపోనా హా .. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా !


***************************************

సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని .. నీవు వచ్చు మధుర క్షణమేదో (2)

కాస్త ముందుతెలెసెనా ప్రభూ

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందరమందారకుంద సుమదళములు పరువనా
సుందరమంద అరకుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా .. చాలు !

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని .. నీవు వచ్చు మధుర క్షణమేదో
కాస్త ముందుతెలెసెనా ప్రభూ ...

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావూ
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావూ
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసమున నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసీ

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని .. నీవు వచ్చు మధుర క్షణమేదో
కాస్త ముందుతెలెసెనా ప్రభూ ...


**************************************

గానం: కె.జె.ఏసుదాస్

సిగలో .. అవి విరులో .. అగరు పొగలో అత్తరులో
మగువా సిగ్గు దొంతరలో .. మసలే వలపు తొలకరులో (2)

సిగలో .. అవి విరులో ..

ఎదుటా .. నా ఎదుటా ..ఏవో సోయగాల మాలికలూ
ఎదుటా .. నా ఎదుటా ..ఏవో సోయగాల మాలికలూ
మదిలోనా .. గదిలోనా
మదిలోనా .. గదిలోనా .. మత్తిల్లిన కొత్త కోరికలూ
నిలువనీవు నా తలపులూ .. మరీ మరీ
ప్రియా .. ప్రియా
నిలువనీవు నా తలపులూ .. నీ కనుల ఆ పిలుపులూ !

సిగలో .. అవి విరులో .. అగరు పొగలో అత్తరులో
మగువా సిగ్గు దొంతరలో .. మసలే వలపు తొలకరులో

సిగలో .. అవి విరులో ..

జరిగీ .. ఇటు ఒరిగీ .. పరవశాన ఇటులే కరిగీ
జరిగీ .. ఇటు ఒరిగీ .. పరవశాన ఇటులే కరిగీ
చిరునవ్వుల అర విడినా .. చిగురాకు పెదవుల మరిగీ
చిరునవ్వుల అర విడినా .. చిగురాకు పెదవుల మరిగీ
మరలిరాలేవు నా చూపులూ .. మరీ మరీ
ప్రియా .. ప్రియా
మరలిరాలేవు నా చూపులూ.. మధువుకై మెదలు తుమ్మెదలూ

సిగలో .. అవి విరులో .. అగరు పొగలో అత్తరులో
మగువా సిగ్గు దొంతరలో .. మసలే వలపు తొలకరులో

సిగలో .. అవి విరులో


****************************************

సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ
సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మవ్వంపు నటనాల మాతంగినీ
కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల !

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరిమల్లినీ
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

మంచుపల్లకి (1982)

సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి

మేఘమా దేహమా .. మెరవకే ఈక్షణం

మెరిసినా కురిసినా .. కరుగు నీ జీవనం

మేఘమా దేహమా .. మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం


మెరుపులతో పాటు ఉరుములుగా
దని రిస రిమ దని స దని ప గ

మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచు పల్లకిగా

మేఘమా దేహమా .. మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా .. కరుగు నీ జీవనం

పెనుగాలికి పెళ్ళి చూపు
పువ్వు రాలిన వేళా
కల్యాణంఅందాకా ఆరాటం .. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో ...

మేఘమా దేహమా .. మెరవకే ఈక్షణం

మెరిసినా కురిసినా .. కరుగు నీ జీవనం

శుభోదయం (1980)

సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మా .. రగమేమో తీసినట్టు ఉందమ్మా
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మా .. రగమేమో తీసినట్టు ఉందమ్మా
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ ..మువ్వ గోపాలా
మువ్వ గోపాలా ..మువ్వ గోపాలా అన్నట్టుందమ్మా

అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ .. రాతిరేల సంత నిదుర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ .. రాతిరేల సంత నిదుర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ ..
ముద్దుమురిపాలా .. మువ్వగోపాలా
నీవు రావేలా అన్నట్టుందమ్మా

మనసు దోచుకున్న ఓయమ్మా .. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా .. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా
ముద్దుమురిపాల
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
మువ్వగోపాలా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
నీవు రావేలా

కంచికి పోతావా కృష్ణమ్మా .. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
పొంచి వింటున్నావా .. కృష్ణమ్మా
అన్ని మంచి వార్తలే కృష్ణమ్మా !


*******************************************

గానం: పి.సుశీల

మందార మకరంద మాధుర్యమునదేలు
మధుపంబు పోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకు

ఆ .. ఆ చింత నీకేలరా
ఆ చింత నీకేలరా
ఆ చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

సొంతమైన నీ సొగసులేలక .. పంతమేల పూబంతి వేడగ
సొంతమైన నీ సొగసులేలక .. పంతమేల పూబంతి వేడగ
ఆ చింత నీకేలరా

సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్ని
కరిగించి కౌగిళ్ళ తినిపించగా

ఆ .. ఆ చింత నీకేలరా
నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

ఆవంక ఆ వెన్నెలమ్మా .. ఈ వంక ఈ వన్నెలమ్మా
ఆవంక ఆ వెన్నెలమ్మా .. ఈ వంక ఈ వన్నెలమ్మా
ఏ వంక ఏమి నెలవంక నేనమ్మ .. నీకింక అలకెందుకమ్మా !

ప్చ్ ప్చ్ ప్చ్ .. అయ్యో !
లలిత రసాల పల్లవ కారియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర మరుగునే
సాంద్ర నిహారములకు .. వినుత గుణశీల మాటలు వేయునేలా

ఆ చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

December 14, 2008

సీతారాములు (1980)

!Funny Song !
:-)


సంగీతం: సత్యం
సాహిత్యం: ???
గానం: బాలు, జయప్రద


హ్మ్..
ఏవండోయ్ శ్రీమతి గారూ.. లేవండోయ్ పొద్దెక్కిందీ
ఏవండోయ్ శ్రీమతి గారూ.. లేవండోయ్ పొద్దెక్కిందీ
ఇల్లు ఊడ్చాలి..కళ్ళాపు చల్లాలి..నీళ్ళు తోడాలి..ఆపై కాఫీ కాయాలీ


ఏవండోయ్ శ్రీమతి గారూ లేవండోయ్ పొద్దెక్కిందీ !

'అబ్బ ! ప్లీజ్..ఒక్క గంటండీ !

గంటా గంటని అంటూ ఉంటే లోనుంచి ఆకలి మంటా
మంటా మంటని గిజ గిజ మంటే అమ్మా నాన్నతో తంటా
మంటను మరిచేసి..తలుపులు మూసేసి..దుప్పటి ముసుగేసి
సరిగమ పాడేసి..ఆఫీసుకు నామం పెడితే ఆడ బాసుతో తంటా


'హ్మ్..who is that రాక్షసి ?'

ఉన్నది ఒక శూర్పణఖా..లేటైతే నొక్కును నా పీకా
ఆపై ఇచ్చును ఒక లేఖా..ఆ లేఖతో ఇంటికి రాలేక
నలిగి నలిగి..కుమిలి కుమిలి..చచ్చి చచ్చి..బ్రతికి బ్రతికి


' అయ్యబాబోయ్ !'

'అందుకే ..'
ఏవండోయ్ శ్రీమతి గారు లేవండోయ్ పొద్దెక్కిందీ..అబ్బా !


'కాఫీ.. కాఫీ..'
కాఫీ.. కాఫీ.. అంటూ ఉంటే ఉలకరు పలకరు ఏంటంటా
వంటా వార్పు చేసేది ఇంటికి పెళ్ళామేనంట


'Ofcourse ..నాకు రాదే ! ఒక్కసారి చేసి చూపించండీ'

పాలను మరిగించీ..గ్లాసులో పోసేసీ
పౌడరు కలిపేఅసీ..స్పూనుతో తిప్పేసి
వేడిగా నోటికి అందిస్తే..


'Nonsence! చెక్కెర లేదూ '

అబ్బా ! అరవకు అరవకు ఓ తల్లీ..
అరిస్తే ఇల్లే బెంబెల్లి..ఇరుగుపొరుగు బైదెల్లీ..నిన్నూ నన్నూ చూసెళ్ళి..
ఇంటా బయటా..ఊరు వాడా..గుస గుసలాడేస్తే


'నిజంగా ? '

'నీ తోడు..అందుకే..'
ఏవండోయ్ శ్రీమతి గారూ .. ఆగండోయ్ చల్లారండీ !

ప్రేమించుకుందాం .. రా ! (1997)

సంగీతం: మహేష్
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాలు, చిత్ర


సూర్యకిరీటమే నీవా..చంద్రసుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ ఛాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసినీ..కావేరీ


సూర్యకిరీటమే నీవా..చంద్రసుమానివే నీవా !

పెదవితాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమా..నీ సరి ఎవ్వరు లేరె భామా
నీతోనె పుట్టింది ప్రేమా


కణ్వ శకుంతలే నీవా..కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వన వాసినీ..కావేరీ


సూర్యకిరీటమే నీవా..చంద్రసుమానివే నీవా !

సొగసుభారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరుగని తేనె పువ్వా..సౌందర్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేర రావా


సూర్యకిరీటమే నీవా..చంద్రసుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ ఛాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసినీ..కావేరీ

సుభాష్ చంద్ర బోస్

సగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, శ్రేయా ఘోషల్


మావా..ఆ..ఓ మావా..ఆ
జాజిరి జాజిరి జాజిరి..జాజిరి జాజిరి జాజిరి


జాజిరి జాజిరి..జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా (2)


జాజిరి జాజిరి..జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా


పచ్చనాకు మీద ఆన
పసుపు కొమ్ము మీద ఆన
పరమాత్ముని మీద ఆన
పరువాల మీద ఆన
ప్రేమవు నువ్వే..పెనిమిటి నువ్వే..మావా !


జాజిరి జాజిరి..జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి..జాజిరి జాజిరి భామా
ఎనకటి జనమలో మనమే ఎంకీ నాయుడు బావ


సుక్కా పొద్దు ఆరతిలో..సిరుముద్దు పూజలలో
నా సామివి నువ్వే వడి గుడిలో
సల్లాగాలి మేళం లో..సరసాల తాళం లో
నాదానివి నువ్వే గుండెలలో


హా..ఉన్న సొగసు మీద ఆన
లేని నడుము మీద ఆన
నువు లేక ఉండలేని ప్రాణాల మీద ఆన
నేను నువ్వే నావీ నీవే మావా


ఓ భామా..ఆ..ఓ భామా..ఆ
జాజిరి జాజిరి..జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా


కుంకుమబొట్టే నలుపాయే..నా కాటుక ఎరుపాయే
కరగాలని నీ బిగి కౌగిలిలో
సీకటి సెట్టే సిగురైతే..సిగురంతా ఎలుగైతే
నిలవాలిక ఎలుగుల సీమలలో


ఆ..బ్రహ్మరాత మీద ఆన
భరతమాత మీద ఆన
మువ్వన్నెల మీద ఆన
మన బంధం మీద ఆన
నలుపులు మనవే..గెలుపులు మనవే మావా


ఓ భామా..ఆ..ఓ భామా..ఆ
జాజిరి జాజిరి..జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా


జాజిరి జాజిరి..జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా


జాజిరి జాజిరి..జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా


****************************************************************************


గానం: మల్లిఖార్జున్, గంగ


నీ ఇంట్లో అమ్మా నాన్న పక్కింట్లోకెళ్ళాకా
వెళ్ళాకా వెళ్ళాకా పక్కింట్లోకే వెళ్ళాకా
మా ఇంట్లో అమ్మా నాన్న పొరుగింట్లోకెళ్ళాకా
వెళ్ళాకా వెళ్ళాకా పొరుగింట్లోకే వెళ్ళాకా


నేనేమో ఈలేసి..నీకేమో జాలేసి..నాదారి కొచ్చేసాక
దూరాన్నే గెంటేసి..నువు నేను జంటేసి..ఓ దారి పట్టేసాక
ఏమిటవుతుంది..అదంతా ఎంతో సస్పెన్సూ
ఏమిటవుతుంది..కధంతా ఎంతో సస్పెన్సూ


నీ ఇంట్లో అమ్మా నాన్న పక్కింట్లోకెళ్ళాకా
వెళ్ళాకా వెళ్ళాకా పక్కింట్లోకే వెళ్ళాకా
మా ఇంట్లో అమ్మా నాన్న పొరుగింట్లోకెళ్ళాకా
వెళ్ళాకా వెళ్ళాకా పొరిగింట్లోకే వెళ్ళాకా


ఏదో ఓ సినిమాకి..ఆపైన గినిమాకి
సాంగో ఓ గీంగో సింగించేసాక
తాపీగా కాఫీకి..తరువాత గీఫీకి
కప్పో ఓ గిప్పో సిప్పించేసాకా
అటు నించి డిస్చోకి..ఆ ఆ ఆ ఆ
ఆడాకా గిస్కోకి .. సమ గప గప మనిదని గమ పని సా !


సినిమాకి కాఫీకి డిస్కోకి వెళ్ళాకా.. ఆ మూడు అయిపోయాకా
మూడంటే గుర్తొచ్చి మూడేదో వచ్చేసి..నీ మూడు పెంచేసాకా


..అదంతా ఎంతో సస్పెన్సూ..కధంతా ఎంతో సస్పెన్సూ

రామ రామ రామ..రామ సీత హరె రామ
జై బోలో హరి కృష్ణ..కృష్ణ కృష్ణ కృష్ణ.. We love it !


నిన్నే నే ప్రేమించి..ఇంకొంచెం గీమించి
వయసో అది గియసో తెగ వేధించాకా
నిన్నే నే మురిపించి .. మరికొంచెం గిరిపించి
మనసో అది గినసో నీకందించాకా
మాటల్తో మెప్పించీ..హ్మ్ .. హ్మ్ .. హ్మ్
ముద్దుల్తో గిప్పించీ.. సమ గప గప మనిదని గమ పని సా !


ప్రేమించీ మురిపించీ..ఇంచించు మెప్పించీ.. ఆ మూడు జరిపించాకా
ఓ మూడు ముళ్ళేసి..ఆ మూడు రాత్రుల్లో..నీ మూడు తెప్పించాకా
..అదంతా ఎంతో సస్పెన్సూ..కధంతా ఎంతో సస్పెన్సూ

December 12, 2008

సిరిసంపదలు (1962)

సంగీతం: మాస్టర్ వేణు
గానం: ఘంటసాల, పి.సుశీలఈ పగలు రేయిగా..పండు వెన్నెలగ మారినదేమి చెలీ..ఆ కారణమేమి చెలీ
ఆఁ..ఊఁ
వింతకాదు నా చెంతనున్నది..వెండి వెన్నెల జాబిలీ..నిండుపున్నమి జాబిలీ
ఓ..ఓ..ఓ..

మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
అహా..ఒహో..అహా..ఆ..ఆ


మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు
హ్మ్ ..


వెండి వెన్నెల జాబిలీ..నిండుపున్నమి జాబిలీ
కన్నులు తెలిపే కథలనెందుకు..రెప్పలార్చియే మార్చేవు..
ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఓ ఓ ఓ


కన్నులు తెలిపే కథలనెందుకు..రెప్పలార్చియే మార్చేవు..
చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని ఝడిసేవు
ఓహోహో


వెండి వెన్నెల జాబిలీ..నిండుపున్నమి జాబిలీ
అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
హ హ హ


అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకర్ధము చూపేను
ఆహా


వెండి వెన్నెల జాబిలీ..నిండుపున్నమి జాబిలీ

December 11, 2008

నేనింతే (2008)సంగీతం: చక్రి

సాహిత్యం: కందికొండ
గానం: నిలయిని, చక్రి

నువ్వంటేనే చచ్చేంత పిచ్చి ..గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి .. నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి

ఎన్ కాదల్ ఉనకూ పురియుదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా

ప్రేమించమంటు నను చంపేస్తావే .. వద్దంటున్నా వినవా
నీ హద్దు దాటి నా పైపైకొస్తే అయిపోదా ఇక గొడవా
నా మనసునే రగిలించమాకే !

నమ్మవే .. ఏం చెప్పినా .. నా ప్రాణమే నువ్వే
కళ్ళలో .. లోగిళ్ళలో .. నీ రూపమే నిండే

నువ్వంటేనే చచ్చేంత పిచ్చి ..గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి .. నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి

మనసులో .. జరిగెలే .. తీయనీ .. రాపిడీ
తనువులో .. మొదలయే .. వెచ్చనీ .. ఒరిపిడీ

నవ్వించేసి ఉడికిస్తవే .. కసి పుట్టించి కాల్చేస్తవే
పొమ్మంటుంటె రమ్మంటవే .. వయ్యారాలు ఒలికిస్తవే

నే వస్తుంటె మమకారమై .. వెళ్తున్నావు నువు దూరమై
చంపేస్తావు పెనుభారమై !

చెల్లమే ఎన్ చెల్లమే .. నినైవిల్ నీ కలందాయె
మెల్లమే ఎన్ మెల్లమే .. నిగల్విల్ నీ కరిందాయె

నువ్వంటేనే చచ్చేంత పిచ్చి ..గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి .. నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి

పగలిలా .. స్వప్నమై .. ఏమిటీ అల్లరీ
రేయిలో .. ఆలాపనై .. చేస్తవే అలజడీ

వదిలేయంటే పెనవేస్తవే .. పెదవే పట్టి కొరికేస్తవే
చూపుల్తోటి చురకేస్తవే .. కైపెక్కించి కాటేస్తవే

నే వచ్చాను హిమబిందువై .. ముంచేసెయ్ రా నువు సింధువై
కలిసుందాము అనుబంధమై !

శ్వాశమే ఎన్ శ్వాశమే .. ఎన్ పేడై ఉనక్కాగా
నేసమే ఎన్ నేసమే .. ఒరు వాయా ఎనక్కాగా

నువ్వంటేనే చచ్చేంత పిచ్చి ..గుండెల్లోన దూరావు గుచ్చి
ఏంచేసావో మాయల్లో ముంచి .. నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి

ఎన్ కాదల్ ఉనకూ పురియుదా .. నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా !


********************************************************

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రఘు కుంచె

Oh no no no .. no no no
Oh no no no .. no no no
ఏదోలా ఉందే నువ్వే లేకా ..
ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా ..
ఏం చెయ్యాలో పాలుపోకా ..
ఉన్నా నీ కల్లో నిదర్రాకా ..

Oh no no no .. no no no
నువ్వే నా సంతోషం
నువు గిల్లావే నా ప్రాణం !

I miss you .. Oh I Miss you
I miss you ! (2)

ఏదోలా ఉందే నువ్వే లేకా ..
ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా ..

మిలమిల మిలమిల మెరుపుల తారా
కలలకు కళకళ చిలికిన తారా
తళతళ తళతళ తలుకుల తారా
కళకళ నగవుల చిలిపి సితారా

ఏవంటే ఎందుకంటే కారణాలే లేవంటా
నాకంటే ఇష్ఠమంటా నువ్వంటా
నా కంటి ముందే ఉంటే చాలనుకున్నా
నువు దూరమైతే ఏదో అయిపోతున్నా

Oh no no no .. no no no
నువ్వే నా సంతోషం
నువు గిల్లావే నా ప్రాణం !

Oh I miss you .. Oh I Miss you
I miss you ! (2)

ఏదోలా ఉందే నువ్వే లేకా .. ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా !

నిగనిగ సొగసులు కురిసిన తారా
చనువుగ మనసును తడిపిన తారా
తలపుల తలుపును కదిపిన తారా
ఎదసడి పలికిన వలపు సితారా

తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితారా నువ్వుండాలే పైనా

Oh no no no .. no no no
నువ్వే నా సంతోషం
నువు గిల్లావే నా ప్రాణం !

Oh I miss you .. Oh I Miss you
I miss you ! (2)

ఏదోలా ఉందే నువ్వే లేకా .. ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా !
ఏం చెయ్యాలో పాలుపోకా .. ఉన్నా నీ కల్లో నిదర్రాకా ..

Oh no no no .. no no no !
Oh no no no .. no no no !!

December 08, 2008

శశిరేఖాపరిణయం (2008)సంగీతం: మణిశర్మ, విద్యాసాగర్

సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకునీ .. కొలువుంచే మంత్రం నీవవనీ

ప్రతీ పూట పువ్వై పుడతా .. నిన్నే చేరి మురిసేలా
ప్రతీ అడుగు కోవెల అవుతా .. నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేదనవనీ !

నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు మేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏల వలసిన దొరవూ నువ్వే

రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామ సుందరా
మనసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా !

ఆ.. ఆ .. నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాశ వీణలోని మధురిమ నీవే సుమా
గంగపొంగు నాపగలిగిన కైలాసమా
కొంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంత కరిగించీ ధారపోయనా
ఆయువంత వెలిగించీ .. హారతీయనా

నిన్నే నిన్నే నిన్నే ..
ఓ .. నిన్నే నిన్నే నిన్నే !


***************************

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైంధవి


ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం

ఉబికి వస్తుంటే సంతోషం .. అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనూ .. నా వెనుక తానూ
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం !

ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం

ముల్లులా బుగ్గను చిదిమిందా ..
మెల్లగా సిగ్గును కదిపిందా ..
వానలా మనసును తడిపిందా ..
వీణలా తనువును తడిమిందా (2)

చిలిపి కబురు ఏం విందో .. వయసుకేమి తెలిసిందో
చిలిపి కబురు ఏం విందో .. వయసుకేమి తెలిసిందో
ఆదమరుపో .. ఆటవిడుపో .. కొద్దిగా నిలబడి చూద్దాం

ఓ క్షణం ..
అంటే .. కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే .. ఎదురు తిరిగింది నా హృదయం !


*************************************

సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాహుల్ నంబియార్

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా

కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన భ్రాంతివో
కలవనిపించిన కాంతవో .. ఓ ఓ ఓ
మతి మరపించిన మాయవో
మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా

శుభలేఖలా .. నీ కళా .. స్వాగతిస్తుందో
శశిరేఖలా .. సొగసెటో .. లాగుతూ ఉందో
తీగలా .. అల్లగా .. చేరుకోనుందో
జింకలా .. అందకా .. జారిపోనుందో

మనసున తుంచిన కోరికా
పెదవుల అంచును దాటకా
అదుముతు ఉంచకె అంతగా .. ఓ ఓ ఓ
అనుమతినివ్వని ఆంక్షగా
నిలబడనివ్వని కాంక్షగా
తికమక పెట్టకె ఇంతగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా

మగపుట్టుకే .. చేరనీ .. మొగలి జడలోనా
మరుజన్మగా .. మారనీ .. మగువ మెడలోనా హో
దీపమై .. వెలగనీ .. తరుణి తిలకానా
పాపనై .. ఒదగనీ .. పడతి ఒడిలోనా

నా తలపులు తన పసుపుగా
నా వలపులు పారాణిగా
నడిపించిన పూదారిగా .. ఓ ఓ ఓ
ప్రణయము విలువే కొత్తగా
పెనిమిటి వరసే కట్టగా
బతకన నేనే తానుగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా


**************************

సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: జై

ఓ ..గుండెల్లో గోలీసోడా .. బుస్సంటూ పొంగిందంటే
వళ్ళంతా ఆడా ఈడా .. ఝలక్కు రావాలంతే
కళ్ళల్లో కోకా కోలా .. కస్సంటూ పైకొస్తుంటే
చూపుల్లో సంతోషాలా .. చమక్కు చిందాలంతే

ఓ మెరుపుల్లో ఉయ్యాలూగే .. మురిపెం నాకొచ్చిందంటే
మేఘాలే నాదగ్గరికీ .. ఉరుక్కు వస్తాయంతే

డిలక్ డిలక్ డీలాలా ..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా .. అడక్కుమళ్ళా (2)

ఓ గుండెల్లో గోలీసోడా .. బుస్సంటూ పొంగిందంటే
వళ్ళంతా ఆడా ఈడా .. ఝలక్కు రావాలంతే

తుళ్ళే తువ్వాయిలా ఆటల్లో
తుళ్ళింతే రమ్మందీ నన్నీరోజూ
చిన్నీ చిల్లాయిల కూతల్లో
లల్లాయి వింటుంటే ఎంతో మోజు

పసిపాపాయికి రుసుమెంతివ్వనూ
తనకేరింత కాసింత నేర్పేందుకూ
నదిలో చేపకీ ముడుపేమివ్వనూ
తనతో పాటు ఆ లోతు చూపేందుకూ

డిలక్ డిలక్ డీలాలా ..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా .. అడక్కుమళ్ళా (2)

పచ్చా ఓణీలను చేనమ్మా .. చుట్టూరా చుట్టింది ఈ పల్లెల్లో
ఎన్నో వర్ణాలతో సందెమ్మా .. కళ్ళాపే చల్లింది ఆకాశంలో
అటు ఓ అందమూ .. ఇటు పూగంధమూ
ఎటు వెళ్ళాలి పాదాలు తూనీగలై
సరదా సంపదా .. వెనకేసేందుకూ
ఒకటే జన్మ నాకుంది ఈ నేలపై

డిలక్ డిలక్ డీలాలా ..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా .. అడక్కుమళ్ళా (2)


*****************************************

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: రంజిత్

ఓ సారి నా వైపు చూశావూ .. కాసేపు నా గుండె కోసావూ
అందాల బాణాలు వేశావూ .. దాదాపు ప్రాణాలు తీశావూ
ఏ మంత్రమేసీ .. ఏ మాయ చేసీ .. ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ .. ఏకంగా నన్నే .. నా నుండి దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా (2)

ఓ సారి నా వైపు చూశావూ .. కాసేపు నా గుండె కోసావూ
అందాల బాణాలు వేశావూ .. దాదాపు ప్రాణాలు తీశావూ

ఓ చెలీ ఓ చెలీ .. ఓ చెలీ నా చెలీ
ఓ చెలీ ఓ చెలీ .. ఓ చెలీ నా చెలీ

నిన్నా ఎంచకా ఉన్నా .. మొన్నా దర్జాగా ఉన్నా .. ఇవ్వాళ ఏమైందే
గాలే కాటేసినట్టూ .. పూలే కరిచేసినట్టూ .. ఏదేదొ అవుతుందే
ఎర్రా ఎర్రాని చెంపల్లో ..సింధూరాలెన్నో చేరాయీ
ఉర్రూతలూగే ఊహల్లో .. గంధాలే నింపుతున్నాయీ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా (2)

ఓ సారి నా వైపు చూశావూ .. కాసేపు నా గుండె కోసావూ
అందాల బాణాలు వేశావూ .. దాదాపు ప్రాణాలు తీశావూ

ఓ చెలీ ఓ చెలీ .. ఓ చెలీ నా చెలీ
ఓ చెలీ ఓ చెలీ .. ఓ చెలీ నా చెలీ

ఇంకా నా వల్ల కాదూ .. ఇంకో క్షణమైనా నన్నూ .. నేనాపలేనేమో
నీకై ఆరాటలన్నీ .. నాతో పారాడుతుంటే .. నే తాళలేనమ్మో
నీ నోట రాని నా పేరే .. నాదైనా నాకే చేదేలే
నీ సొంతం కాని ఈ జన్మే .. నీరంటూ లేని గోదారే

ఓ సారి నా వైపు చూశావూ .. కాసేపు నా గుండె కోసావూ
అందాల బాణాలు వేశావూ .. దాదాపు ప్రాణాలు తీశావూ
ఏ మంత్రమేసీ .. ఏ మాయ చేసీ .. ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ .. ఏకంగా నన్నే .. నా నుండి దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా (2)


*********************************************

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైంధవి

ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పలేనంది ఏ వైనం
కలతపడుతుందే లోలోనా .. కసురుంటుందే నా పైనా
తన గుబులు నేనూ .. నా దిగులు తానూ
కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం !

ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పలేనంది ఏ వైనం

పచ్చగా ఉన్నా పూదోటా .. నచ్చడం లేదే ఈ పూటా
మెచ్చుకుంటున్నా ఊరంతా .. గిచ్చినట్టుందే నన్నంతా (2)

ఉండలేను నెమ్మదిగా .. ఎందుకంటే తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా .. ఎందుకంటే తెలియదుగా
తప్పటడుగో .. తప్పు అనుకో
తప్పదే తప్పుకు పోదాం ..

తక్షణం ..
అంటూ .. అడ్డుపడుతుంది ఆరాటం
పదమంటూ .. నెట్టుకెడుతోంది నను సైతం !