October 27, 2009

మహాత్మ (2009)

Powered by eSnips.com


సాహిత్యం: సిరివెన్నెల
గానం: బాలు
సంగీతం : విజయ్ ఆంథోనీ

రఘుపతి రాఘవ రాజారాం .. పతిత పావన సీతారాం !
ఈశ్వర అల్లా తేరో నాం .. సబుకో సన్మతి దే భగవాన్ !!

ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ (2)

కరెన్సీ నోటు మీదా .. ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ

ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

రామనామమే తలపంతా .. ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్షా స్వతంత్ర్య కాంక్షా .. ఆకృతి దాల్చిన అవధూతా
అపురూపం ఆ చరితా !

కర్మయోగమే జన్మంతా .. ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీతా
ఈ బోసినోటి తాతా !!

మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తీ
సత్యాహింసల మార్గజ్యోతీ !
నవశకానికే నాందీ !!

రఘుపతి రాఘవ రాజారాం .. పతీత పావన సీతారాం !
ఈశ్వర అల్లా తేరో నాం .. సబుకో సన్మతి దే భగవాన్ !! (2)

గుప్పెడు ఉప్పును పోగేసీ .. నిప్పుల ఉప్పెనగా చేసీ
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేతా
సిసలైన జగజ్జేతా !

చరఖాయంత్రం చూపించీ .. స్వదేశి సూత్రం నేర్పించీ
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపితా
సంకల్పబలం చేతా !!

సూర్యుడస్తమించని రాజ్యానికి .. పడమర దారిని చూపిన క్రాంతీ
తూరుపు తెల్లారని నడిరార్తికి స్వేచ్చాభానుడి ప్రభాత కాంతీ
పదవులు కోరని పావన మూర్తీ !
హృదయాలేలిన చక్రవర్తీ !!

ఇలాంటి నరుడొక ఇలా తలంపై నడయాడిన నాటి సంగతీ
నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండీ

" సర్వజన హితం నా మతం
అంటరానితనాన్ని, అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం
హే .. రామ్ ! "

*************************************

గానం: కార్తీక్, సంగీత
సాహిత్యం : సిరివెన్నెల
సంగితం : విజయ్ ఆంథోనీ

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!

హే నీ ఎదట నిలిచే వరకూ .. ఆపదట తరిమే పరుగూ
ఏ పనట తమతో తనకూ .. తెలుసా హో!
నీ వెనక తిరిగే కనులూ .. చూడవట వేరే కలలూ
ఏ మాయ చేసావసలూ .. సొగసా !!

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!

పరాకులో పడిపోతుంటే .. కన్నె వయసు కంగారూ
అరే అరే అంటూ వచ్చీ తోడు నిలబడూ
పొత్తిళ్ళల్లో పసిపాపల్లే .. పాతికేళ్ళ మగ ఈడూ
ఎక్కెకెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ

ఆకాసమే ఆపలేనీ చినుకు మాదిరీ .. నీకోసమే దూకుతోందీ చిలిపి లాహిరీ
ఆవేశమే ఓపలేని వేడీ ఊపిరీ .. నీతో సావసమే కోరుతోంది ఆదుకోమరీ

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!

ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరూ
మధురమైన కబురందిందే కలత పడకు బంగారూ
పెదివితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరూ

గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!

హే నీ ఎదట నిలిచే వరకూ .. ఆపదట తరిమే పరుగూ
ఏ మాయ చేసావసలూ .. సొగసా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!

ఏక్ నిరంజన్ (2009)


Powered by eSnips.comసంగీతం: మణిశర్మ
గానం: రంజిత్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

అమ్మా లేదు నాన్నా లేడు .. అక్కా చెల్లి తంబీ లేరు.. ఏక్ నిరంజన్ !
పిల్లా లేదు పెళ్ళీ లేదు .. పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు .. ఏక్ నిరంజన్ !!

ఊరే లేదు .. నాకూ పేరే లేదు .. నీడ అలేదు .. నాకే తోడూ లేదు
నేనెవరికి గుర్తే రాను .. ఎక్కిళ్ళే రావసలే
నాకంటూ ఎవరూ లేరే .. కన్నీళ్ళే లేవులే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే !

అమ్మా లేదు నాన్నా లేడు .. అక్కా చెల్లి తంబీ లేరు.. ఏక్ నిరంజన్ !
పిల్లా లేదు పెళ్ళీ లేదు .. పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు .. ఏక్ నిరంజన్ !!

కేరాఫ్ ప్లాట్ఫాం .. సన్నాఫ్ బాడ్ టైం .. ఆవారా డాట్ కాం
హే దమ్మర దం .. టన్స్ ఆఫ్ ఫ్రీడం .. మనకదేగా ప్రాబ్లం
అరె డేటాఫ్ బర్తే తెలియదే .. నే గాలికి పెరిగాలే
హే జాలీ జోలా ఎరగనే .. నా గోలేదో నాదే

తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే

పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే !

అమ్మా లేదు నాన్నా లేడు .. అక్కా చెల్లి తంబీ లేరు.. ఏక్ నిరంజన్ !
తట్టా లేదు బుట్టా లేదు .. బుట్ట కింద గుడ్డు పెట్టే పెట్టా లేదు .. ఏక్ నిరంజన్ !!

దిల్లిష్ బాడీ ఫుల్లాఫ్ ఫీలింగ్ నో వన్ ఈజ్ కేరింగ్
దట్స్ ఓకే యార్ చల్తా హై నేనే నా డార్లింగ్
ఏ కాకా చాయే అమ్మలా నను లేరా అంటుందీ
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుందీ

రోజంతా నాతో నేనే కల్లోనూ నేనేలే
తెల్లారితే మళ్ళీ నేనే తేడానే లేదేలే

పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే !

అమ్మా లేదు నాన్నా లేడు .. అక్కా చెల్లి తంబీ లేరు.. ఏక్ నిరంజన్ !
కిస్సూ లేదు మిస్సూ లేదు .. కస్సు బుస్సు లాడే లస్కూ లేదు .. ఏక్ నిరంజన్ !!

******************************************************


గానం: మాళవిక

సాహిత్యం : భాస్కరభట్ల
సంగీతం : మణిశర్మ

ఎవరూ లేరని అనకు .. తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
ఎపుడూ ఒంటరి అనకూ .. నీతోనే చావూ బ్రతుకూ
కంటికి రెప్పై ఉంటాలే తుది వరకూ

ప్రేమతోటి చెంప నిమరనా ..గుండే చాటు బాధ చెరపనా
నీ ఊపిరే అవ్వనా !
గడిచిన కాలమేదో గాయపరిచినా .. జ్ఞాపకాల చేదు మిగిలినా
మైమరపించే హాయవ్వనా !

ఒట్టేసి నేను చెబుతున్నా .. వదిలుండలేను క్షణమైనా
నీ సంతోషానికి హామీ ఇస్తున్నా !!

ఎవరూ లేరని అనకు .. తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ..

నా మనసే నీకివ్వనా .. నీలోనే సగమవ్వనా
అరచేతులు కలిపే చెలిమే నేనవనా
ముద్దుల్లో ముంచేయనా .. కౌగిలిలో దాచెయ్యనా
నా కన్నా ఇష్ఠం నువ్వే అంటున్నా

దరికొస్తే తల తుడిచే చీరంచుగ నేనే మారనా
అలిసొస్తే ఎపుడైనా నా ఒడినే ఊయల చేస్తానంటున్నా !

ఎవరూ లేరని అనకు .. తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ

నిను పిలిచే పిలుపవ్వనా .. నిను వెతికే చూపవ్వనా
నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవనా
నిను తలచే తలపవ్వనా .. నీ కధలో మలుపవ్వనా
ఏడడుగుల బంధం నీతో అనుకోనా

మనసంతా దిగులైతే .. నిను ఎత్తుకు సముదాయించనా
నీ కోసం తపనపడే .. నీ అమ్మా నాన్నా అన్నీ నేనవనా !

ఎవరూ లేరని అనకు .. తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ

**********************************
గానం: హేమచంద్ర, గీతా మాధురి

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణిశర్మ

గుండెల్లో .. గుండెల్లో

గుండెల్లో గిటారు మోగించావే
నాకేవేవో సిల్లీ ధాట్స్ నేర్పించావే

చూపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాసు వేసేసావే

చెలియా నీపై నే ఫిక్సయ్యేలా చేసావే
??? నా మైండంతా లాగేసావే
లెఫ్ట్ రైట్ టాప్ టు బాటం నచ్చేసావే
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే

గుండెల్లో ..
గుండెల్లో గిటారు మోగించావే
నాకేవేవో సిల్లీ ధాట్స్ నేర్పించావే

చూపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాసు వేసేసావే

సున్నాలా ఉన్నా నా పక్కన ఒకటయ్యావే
ఎర వేసి వల్లోకి నను లాగేసిందీ నువ్వే
ఖాళీ దిల్లోనా దేవతలా దిగిపోయావే
తెరతీసే సరదాకీ పిలుపందించిందీ నువ్వే

అనుకోకున్నా నకన్నీ నువ్వైపోయావే
ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే

నరనరాల ఏక్ తార వినిపించావే
నా స్వరాన ప్రేమ పాట పలికించావే

గుండెల్లో ..

గుండెల్లో ..
నా కేవేవో ..
చూపుల్తో ..
నీ మాటల్తో ..

యమ్మా ఏం ఫిగరో తెగ హాటనిపించేసావే
నువు కూడా పిలగాడా నన్నెంతో కదిలించావే
జియా జిజారే చెయి వాటం చూపించావే
నువు కూడా నన్నేరా ఇట్టాగే దోచేసావే

కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే
ఎదలోయల్లో చిరుజల్లై నను తడిపేసావే
అందమైన మత్తుమందు నువ్వే నువ్వే
అందుకున్న ప్రేమ విందు నువ్వయ్యావే

గుండెల్లో ..
గుండెల్లో గిటారు మోగించావే
నాకేవేవో సిల్లీ ధాట్స్ నేర్పించావే

చూపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాసు వేసేసావే

గుండెల్లో .. గుండెల్లో

************************


గానం: కార్తీక్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణిశర్మ

సమీరా.. సమీరా ..
సమీరా.. సమీరా ..

ఒక్కసారి ఐ లవ్ యూ అనవే సచ్చిపోతా
ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా
నువ్వొక్కసారి 143 అనవే రాలిపోతా
నీ లవ్వు కన్న లక్కేదీ లేదని రేగిపోతా

యహ సైట్లు ఏ కోట్లు వద్దు నా కోహినూరు నువ్వంటా
ఏ పాట్లు రాని అగచాట్లు రాని నీ ప్రేమతో బ్రతికేస్తా

నిను దేవతల్లే పూజిస్తా
ఓ దెయ్యమల్లే సాధిస్తా
నువ్వు లొంగనంటే ఏం చేస్తా
నే బ్రహ్మచారిగా పుచ్చిపోతా
సమీరా.. సమీరా ..
సమీరా.. సమీరా ..

నీ ఇంటిముందు టెంటు వేసుకుంటా .. మైకు పెట్టి రచ్చ రచ్చ చేస్తా
అప్పుడైనా తిట్టుకుంటు చెప్పవే ఐ లవ్ యూ !
వీధి వీధి పాదయాత్ర చేస్తా .. సంతకాలు లక్ష సేకరిస్తా
అందుకైనా మెచ్చుకుంటు అనవే 1..4..3

అసలెందుకంట నేనంటే మంట తెగ చిటపటమంటావే
కొవ్వున్న చోట లవ్వుంటదంట అది నిజమని అనుకోవే
బతి మాలీ గతి మాలీ అడిగా నిన్నే

సమీరా.. సమీరా ..
సమీరా.. సమీరా ..

దండమెట్టి నిన్ను కాక పడతా .. దండలేసి కోకనట్సు కొడతా
వెయ్యి పేర్లు దండకాలు చదువుతూ ప్రేమిస్తా !
తిండి మాని బక్కచిక్కిపోతా .. మందు దమ్ము అన్ని మానుకుంటా
ఏడుకొండలెక్కి గుండుకొడతా ఏటేటా

నీకోసమింత నే చేస్తున్నదంత నువు చూసీ చూడవుగా
ఏ మాయసంత అని తిప్పుకుంటూ పోతే నే వదలనుగా
వెనకొస్తా.. విసిగిస్తా .. నువు మారేదాకా

October 14, 2009

రెచ్చిపో


Powered by eSnips.comసంగీతం : మణిశర్మ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : రంజీత్ ,శ్వేతా

తొలి తొలిగా మనసు వెనుక కధ మొదలయినది
తొందరగా బయట పడకా దాచేస్తున్నది
ఎదో ఎదో ఎదోలా ఉంటోంది నీ వల్లేనా
ఈ మైకం కమ్మింది నాకే తెలియక నాలో తికమక
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ

తొలి తొలిగా మనసు వెనుక కధ మొదలయినది
తొందరగా బయట పడకా దాచేస్తున్నది

నా బుజ్జి గుండెలో తుఫానౌతున్నది
అదో రకం పిచ్చెక్కుతున్నది
ఒళ్ళంతా మత్తుగా గమత్తుగున్నది
అమాంతము మారింది పద్దతి
నిన్నే పడగొడతది
మతే చెడగొడతది
మనసే చిలకై ఎగిరిపోతోంది ఏంటిది
ఎగిరి ఎగిరి తిరిగి రమ్మన్నా రాదది

అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ

తొలి తొలిగా మనసు వెనుక కధ మొదలయినది
తొందరగా బయట పడకా దాచేస్తున్నది

నా చీర కట్టుకి సిగ్గెక్కువయినది
నీ చూపులో ఏం మాయ ఉన్నది
పెదాలు ఇప్పుడే తడారుతున్నవి
ఇన్నాళ్ళుగా ఏ రోజూ లేనిది
అలాగే ఉంటాది
అయస్కాంతం లాంటిది
నదిలో పడవై తరలి పోతోంది నా మది
సుడిలో దిగకే పైకి రానివ్వదే అది

అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ
అంతేలే అంతేలే ఈ ప్రేమ ఈ ప్రేమ

తొలి తొలిగా మనసు వెనుక కధ మొదలయినది
తొందరగా బయట పడకా దాచేస్తున్నది


*******************************************************


సంగీతం : మణిశర్మ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : హేమచందర్ ,శ్వేతాGive me a chance baby
Give me a chance baby

గాలైనా వద్దులే నీరైనా వద్దులే
నీ ప్రేమే లేనిదే ఈ ప్రాణం వద్దులే

నీ సంగతి తెలుసులే ఎదవ్వేషాలొద్దులే
నువ్వెంత పొగిడినా పడిపోనులే

Give me one chance oh baby
Give me one chance oh baby

చెప్పేదినవే oh baby ooh ooh ya

గాలైనా వద్దులే నీరైనా వద్దులే
నీ ప్రేమే లేనిదే ఈ ప్రాణం వద్దులే

నిన్ను చూడగా పొద్దుతిరుగుడు పువ్వులా
నెమ్మదిగా మరి నా మది నీకై తిరిగిలే
ఇంత మొండిగా వీణ్ణేట్టా పుట్టించావురా
వదిలెయ్ మన్నా వదలడు ఓరి దేవుడా
నా కన్నా ముదురు కదా
ఆ విషయం ఇపుడే తెలిసిందా
వాదించే ఓపిక నాకింక లేదులే
నీ ప్రేమ బుట్టలో పడిపోనులే
Give me one chance oh baby
Give me one chance oh baby

చెప్పేదినవే oh baby ooh ooh ooh ya

No way no way no way no way
don't waste your time ooh oooh ooh ya

జాలే కలగదా రాజీ మాత్రం కుదరదా
మనిషివి కాదా ఏపుగ పెరిగిన చెట్టువా
సోది ఆపవా చూయింగమ్ లా వదలవా
కాన్వెంట్ లోన మాటలు నేర్చిన కోతివా
ఊ అంటే అలుసు కదా
ఏమైనా నువ్వు మారవా నువ్వింక
నాఇష్టం నాదిలే నీ సలహాలొద్దులే
నువు తీసే గోతిలో పడిపోనులే
Give me one chance oh baby
Give me one chance oh baby

చెప్పేదినవే oh baby ooh ooh ooh ya