December 29, 2009

అదుర్స్ !

సంగీతం: దేవిశ్రీప్రసాద్

నా కళ్ళల్లోనా చూపులు నీతోనే
నా కాళ్ళల్లోనా పరుగులు నీతోనే
నా పెదవుల్లోనా ముద్దులు నీతోనే
నా గుండెల్లోనా ధక్ ధక్ నీతోనే

నా ఊహలు అన్నీ నీతోనే
నా ఊసులు అన్నీ నీతోనే
రా రేయీ పగలూ హాయీ దిగులూ అన్నీ నీతోనే !

నీతోనే .. నీతోనే .. నీతోనే .. నీతోనే !

నా కళ్ళల్లోనా చూపులు నీతోనే
నా కాళ్ళల్లోనా పరుగులు నీతోనే

ఇష్ఠం అన్నది ఉందంటే .. కష్ఠం అన్నది ఎంతున్నా
కలిపేస్తుంది ఎపుడూ నీతోనే .. నీతోనే !
తీరం అన్నది ఉందంటే .. దూరం అన్నది ఎంతున్నా
చేరుస్తుంది నన్నే నీతోనే .. నీతోనే !!

నా కోరికలన్నీ నీతోనే
నా తీరికలన్నీ నీతోనే
నా ఆటా పాటా వేటా బాటా అన్నీ నీతోనే !

నీతోనే .. నీతోనే .. నీతోనే .. నీతోనే !

హే అందం అన్నది ఎంతున్నా .. నువు కాదంటే అది సున్నా
అందం చందం అంతా నీతోనే .. నీతోనే!
గాయం అన్నది కాకుంటే .. ప్రాయం ఉన్నా లేనట్టే
సాయంకాలం సాయం నీతోనే .. నీతోనే !!

నా వేడుకలన్నీ నీతోనే
నా కూడికలన్నీ నీతోనే
నాతో నేనూ లేనే లేనూ అన్నీ నీతోనే !

నీతోనే .. నీతోనే .. నీతోనే .. నీతోనే !

***************************

గానం: హరిహరన్

నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమః
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః
నీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమః
మేలుజాతి కోహినూరు సొగసుకు ఓం నమః

ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా
ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
ఇటు నను నరికే నిగనిగకే చాంగుభళా

ఓ మనసే మరిగే సలసల
వయసే విర్గే ఫెళ ఫెళ
మతులే చెదిరే లా మహ బాగుందే నీ వంటి వాస్తుకళా

చంద్రకళా..
One more time
చంద్రకళా..
That's the way we like it !

చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా

ఓ ఓ ఓ కులుకులకు పత్రం పుష్పం .. తళుకులకు అష్ఠొత్తరం
ya .. that's the way I wann it
చమకులకు ధూపం దీపం .. నడకలకు నీరాజనం
yeh .. that's the way to do it

అడుగుకో పువ్వై పుడతా నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా అనునిత్యం నిను అంటుకు తిరిగేలా

ఓ చంద్రకళా..
One more time
చంద్రకళా..
That's the way we like it !

ఓ పురుషులను పగబట్టేలా .. సొగసు పొడి వెదజల్లకే
Ya.. This is the way I ???
వయసు మడి గది దాటేలా .. వగలతో వలలల్లకే
Yeh ..??
నీకేసి చూస్తే ధగ ధగ దరువేస్తుందే దిల్ తబలా
శివకాసి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా

ఓ చంద్రకళా..
One more time
చంద్రకళా..
That's the way we like it !
చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా !

******************************

Where is that?
What is that?
Where is that?
What is that?

Where is the పంచెకట్టు.. where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
What is this suit boot .. what is this French cut
What is this gulf scent చారీ


I don’t want పంచెకట్టు.. I don’t want పిలకజుట్టు
I don’t want నిలువుబొట్టు పోరీ
I like this suit boot.. I like this French cut
I like this gulf scent పోరీ

Farex baby లా ఉండే నువ్వూ .. RDX బాంబల్లే అయిపోయావే
నీ Rolex body తో మాచ్ అయ్యేలా .. జర remix అయి వచ్చేసానే

where is that?
ఇప్పేసా
where is that?
కట్ చేసా
where is that?
చెరిపేసా

Where is the పంచెకట్టు.. where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot.. I like this French cut
I like this gulf scent పోరీ

C H A R I is chari .. He is gonna say brand new story
C H A R I is chari .. అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ


రాహుకాలం చూడందే తెల్లారీ .. మంచినీళ్ళైనా ముట్టని ఓ చారీ
Good morning అన్నవే పెదవుల్తో మితి మీరీ
అరె sentimental గా సుకుమారీ.. నే fox tail తొక్కానే కాల్ జారీ
ఆ లక్కేదో నా కిక్కు పెంచిందే .. luck మారీ

హే .. సేమ్యా ఉప్మాలా ఉండే నువ్వు .. Chinese noodles లా change అయ్యావే
femina miss లాంటి నీకోసమే నే ఇస్టైలు మార్చేసానే !

where is that?
ఇప్పేసా
where is that?
కట్ చేసా
where is that?
చెరిపేసా

Where is the పంచెకట్టు.. where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ

I like this suit boot.. I like this French cut
I like this gulf scent పోరీ

Rewind చేసీ చూస్తే మరీ .. స్వాతిముత్యం లాంటిది నీ history
Romance లో నీకింత scene ఉందా .. బ్రహ్మచారీ
నా daily మంత్రాలు పొలమారీ .. ఎపుడేం చేసానో నోరు జారి
నా flashback మటాషై మారానిలా .. పోరీ

హే ఎర్రబస్ లాగా ఉండే నువ్వూ .. air bus లాగా style అయ్యావే
mecanas gold లాంటి నీ beauty కి నేను పోటీగా పోటెత్తానే !

where is that?
ఇప్పేసా
where is that?
కట్ చేసా
where is that?
చెరిపేసా

Where is the పంచెకట్టు.. where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot.. I like this French cut
I like this gulf scent పోరీ

C H A R I is chari .. He is gonna say brand new story
C H A R I is chari .. అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ

December 18, 2009

ప్రవరాఖ్యుడు



సంగీతం : కీరవాణి
గానం : శివాణి ,ఆనుజ్ గురువారా
సాహిత్యం : చైతన్య ప్రసాద్


ఏమైపోయానో ఏమైపొతున్నానో
నీతోనే సావాసం మొదలెట్టాకా
నీ నీడది నా పేరే అని తెలిసాకా
మాటాడాలంటు చూడాలంటు చేరాలంటు తాకాలంటు
నీలో ఏకం కావాలంటు ......ఆలోచిస్తూ...... ఆలోచిస్తు
ఏమైపోయానో ఏమైపోతున్నానో ....

ఏ ఏ ఏ ....ఏ చోట తిరిగినా నీ రూపే కనపడుతోంది
ఏం చెయ్యను ఏంచెయ్యను ఏంచెయ్యను

ఏ ఏ ఏ ....ఏ గాలి తాకినా నువ్వు తాకినట్టే ఉంది
కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్

Oh My Love Deep in Love
Don't know how tell me now


నువ్వుంటే స్వర్గం అంటూ
లేకుంటే శూన్యం అంటూ
నా మనసే నన్నే వెలి వేస్తుంటే
నీ దగ్గరకే తరిమేస్తుంటే

ఏమైపోయానో ఏమైపోతున్నానో .....



ఏ ఏ ఏ.....ఏకాంత వేళలో నా జంట కలవయ్యిందీ
నువ్వేనా నువ్వేనా నువ్వేనా నువ్వేనా

ఏ ఏ ఏ....ఏ జన్మ బంధమో ఈనాడు జత కమ్మంది
ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా

Oh My Love Mad in Love
Don't know how tell me now


కను తెరిచే నిదురిస్తున్నా
నిదురిస్తు నడిచేస్తున్నా
ఇక స్వప్నం ఏదో సత్యం ఏదో
తేడా తెలియని ఆరాటం లో
ఏమైపోయానో ఏమైపోతున్నానో
.....

December 16, 2009

Leader




గానం: నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్
సాహిత్యం: వేటూరి
సంగీతం: మిక్కీ జే మేయర్

అవుననా.. కాదనా.. నాదనా.. ఓ ఓ ఓ
లేదనా .. రాదనా .. వేదనా .. ఓ ఓ ఓ
మూగవైనా .. రాగమేనా
నీటిపైనా .. రాతలేనా

అవుననా.. కాదనా.. నాదనా.. ఓ ఓ ఓ
లేదనా .. రాదనా .. వేదనా .. ఓ ఓ ఓ

తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు
కన్ను నీరూ వెల్లువైతే వెన్నెలే కాబోలూ
నింగి నేలా ఏకమైనా పొద్దులో సింధూరాలు
నీకు నేనూ చేరువైనా ఎందుకో దూరాలు

దొరికిందీ .. దొరికిందీ .. తోడల్లే దొరికిందీ హో
కలిసిందీ .. కలిసిందీ .. కనుచూపే కలిసిందీ (2)

ఇందుకేనా .. ప్రియా
ఇందుకేనా !

అవుననా.. కాదనా.. నాదనా.. ఓ ఓ ఓ
లేదనా .. రాదనా .. వేదనా .. ఓ ఓ ఓ

ఆ .. ఆ .. ఆ .. ఆ
ఆశలన్నీ మాసిపోయీ ఆమనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్నీ బాధలే పూసేలా
పూలజడలో తోకచుక్కా గుట్టుగా ఉయ్యాలూగే
రాసలీలా రక్తధారా బాధలై పోయేలా

తెలిసిందీ .. తెలిసిందీ .. నిజమేదో తెలిసిందీ
కురిసింది .. విరిసింది .. మెరుపేదో మెరిసిందీ (2)

అందుకేనా .. ప్రియా
ఇందుకేనా !

అవుననా.. కాదనా.. నాదనా.. ఓ ఓ ఓ
లేదనా .. రాదనా .. వేదనా .. ఓ ఓ ఓ