October 27, 2008

పదహారేళ్ళ వయసు (1978)

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి

సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే (2)

సిరిమల్లె పువ్వా

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందె కాడ నా చందమామ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా

కొండల్లో కోనల్లో కూ యన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే

చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా

No comments: