December 09, 2010

ఆరెంజ్



సంగీతం: హరిస్ జయ్ రాజ్


సాహిత్యం: వనమాలి
గానం: కార్తీక్


చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా .. నిన్నే ఆపేదెలా !
చివరకి నువ్వే అలా .. వేస్తావే వలా .. నీతో వేగేదెలా !!


ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా
కొన్నాళ్ళే .. అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా !!!


చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా .. నిన్నే ఆపేదెలా !
చివరకి నువ్వే అలా .. వేస్తావే వలా .. నీతో వేగేదెలా !!


నిన్నే ఇలా .. చేరగా .. మాటే మార్చీ మాయే చెయ్యాలా
నన్నే ఇకా .. నన్నుగా .. ప్రేమంచనీ ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా .. ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా .. ఊరించేస్తూ అల్లేస్తుందే నీ సంకెలా


కొంచెం మధురము .. కొంచెం విరహము .. ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము .. కొంచెం శాంతము .. గొంతులో చాలు గరళం
కొంచెం పరువము .. కొంచెం ప్రణయము .. గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము .. కొంచెం గానము .. ఎందుకీ ఇంద్రజాలం


ఇన్నాళ్ళుగా .. సాగినా .. ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో .. గుండెతో .. స్నేహం కోరీ వెళుతున్నా
ప్రేమనే .. దాహం తీర్చే .. సాయం కోసం వేచానిలా
ఒక్కోక్షణం .. ఆ సంతోషం .. నాతో పాటు సాగేదెలా ఎలా


చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా .. నిన్నే ఆపేదెలా !
చివరకి నువ్వే అలా .. వేస్తావే వలా .. నీతో వేగేదెలా !!


ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా
కొన్నాళ్ళే .. అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా !!!


కొంచెం మధురము .. కొంచెం విరహము .. ఇంతలో నువ్వు నరకం
కొంచెం పరువము .. కొంచెం ప్రణయము .. గుండెనే కోయు గాయం
కొంచెం మధురము .. కొంచెం విరహము ..
కొంచెం పరువము .. కొంచెం ప్రణయము ..

************************************************

సాహిత్యం: వనమాలి

గానం: నరేష్ అయ్యర్


నేను నువ్వంటూ .. వేరై ఉన్నా ..
నాకీవేళా .. నీలో నేనున్నట్టుగా .. అనిపిస్తూ ఉందే వింతగా .. నాకోసం నేనే వెతికేంతగా !


నువ్వే లేకుంటే .. ఏమౌతానో ..
నీ స్నేహాన్నే .. కావాలంటున్నానుగా .. కాదంటే నామీదొట్టుగా .. ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !!


ఒకసారి చూసి నే వలచానా .. నను వీడిపోదు ఏ మగువైనా .. ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమలోతులో మునిగాకా .. నువు పైకి తేలవే సులభంగా .. ప్రాణాలైనా ఇస్తా ఏకంగా


నేను నువ్వంటూ .. వేరై ఉన్నా ..
నాకీవేళా .. నీలో నేనున్నట్టుగా .. అనిపిస్తూ ఉందే వింతగా .. నాకోసం నేనే వెతికేంతగా !


నిజాయితీ ఉన్నోడినీ .. నిజాలనే అన్నోడినీ .. అబద్దమే రుచించనీ అబ్బాయినీ
ఒకే ఒక మంచోడినీ .. రొమాన్సులో పిచ్చోడినీ .. పర్లేదులే వప్పేసుకో సరేననీ
ముసుగేసుకోదు ఏ నాడూ .. నా మనసే ఓ భామా
నను నన్నుగానే చూపిస్తూ .. కాదన్నా పోరాడేదే నా ప్రేమా !


నేను నువ్వంటూ .. వేరై ఉన్నా ..
నాకీవేళా .. నీలో నేనున్నట్టుగా .. అనిపిస్తూ ఉందే వింతగా .. నాకోసం నేనే వెతికేంతగా !


తిలోత్తమా తిలోత్తమా .. ప్రతీక్షణం విరోధమా .. ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ ఓ గ్రహాలకే వలేసినా .. దివే అలా దిగొచ్చినా .. ఇలాంటీ ఓ మగాడినే చూళ్ళేవమ్మా
ఒకనాటి తాజ్ మహలైనా .. నా ముందూ పూరిల్లే
ఇకపై గొప్ప ప్రేమికుడై .. లోకంలో నిలిచే పేరే నాదేలే !


నేను నువ్వంటూ .. వేరై ఉన్నా ..
నాకీవేళా .. నీలో నేనున్నట్టుగా .. అనిపిస్తూ ఉందే వింతగా .. నాకోసం నేనే వెతికేంతగా !

నువ్వే లేకుంటే .. ఏమౌతానో ..
నీ స్నేహాన్నే .. కావాలంటున్నానుగా .. కాదంటే నామీదొట్టుగా .. ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !!


ఒకసారి చూసి నే వలచానా .. నను వీడిపోదు ఏ మగువైనా .. ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమలోతులో మునిగాకా .. నువు పైకి తేలవే సులభంగా .. ప్రాణాలైనా ఇస్తా ఏకంగా

October 07, 2010

ఖలేజా


సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: కారుణ్య, రమేష్ వినాయగం

ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శిఖి కంఠాయ
ఓం నమో హర నాగా భరణాయా .. ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుఖ నాదా నందాయ

ఓం నమో నిఠలాక్షాయ
ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమ శైలావరణాయా .. ప్రమధాయ
ధిమి ధిమి తాండవ కేళీ లోలాయ

సదా శివా సన్యాసీ .. తాపసీ కైలాసవాసీ !
నీ పాద ముద్రలు మోసీ .. పొంగి పోయినాదె పల్లె కాశీ !!

ఏయ్ చూపుల చుక్కానీ దారిగా .. చుక్కల తివాసీ నీదిగా
చూడ చక్కని సామి దిగినాడురా .. ఏసైరా ఊరూ వాడా దండోరా

ఏ రంగుల పొంగుల పొడ లేదురా .. ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చే వాడేరా

పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల !

లోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూ
ఏయ్ నీలోనే కొలువున్నోడూ నిన్ను దాటి పోనే పోడూ

ఓం నమశ్శివ జై జై జై
ఓం నమశ్శివ జై జై జై
ఓం నమశ్శివ good to the trans and say జై జై జై
Sing along Sing శివ శంభో all the way !

సదా శివా సన్యాసీ .. తాపసీ కైలాసవాసీ !
నీ పాద ముద్రలు మోసీ .. పొంగి పోయినాదె పల్లె కాశీ !!

ఏయ్ ఎక్కడ వీడుంటే నిండుగా .. అక్కడ నేలంతా పండగా
చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా .. అడుగేసాడంట కాచే దొరలాగా

మంచును మంటను ఒక్క తీరుగా .. లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా
ఉక్కుపంచెగ ఊపిరి నిలిపాడురా .. మనకండా దండా వీడే నికరంగా

సామీ అంటే హామీ తానై ఉంటాడురా చివరంటా !

లోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూ
ఏయ్ నీలోనే కొలువున్నోడూ నిన్ను దాటి పోనే పోడూ

ఓం నమశ్శివ జై జై జై
ఓం నమశ్శివ జై జై జై
ఓం నమశ్శివ good to the trans and say జై జై జై
Sing along sing శివ శంభో all the way !

*******************************

గానం: హేమచంద్ర, శ్వేత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

పిలిచే పెదవుల పైనా .. నిలిచే మెరుపు నువ్వేనా

పిలిచే పెదవుల పైనా .. నిలిచే మెరుపు నువ్వేనా
నువ్వు చేరీ నడి ఎడారి నందనమై విరిసిందా
తనలో ఆ అనందలహరి సందడిగా ఎగసిందా
నడిచిన ప్రతిదారీ .. నదిగ మారీ .. మురిసినదా ముకుందా !

కాలం మేను మరచీ జ్ఞాపకాల్లో జారిపోయిందా
లోకం గోకులంలా మారిపోయీ మాయజరిగిందా

ఊరంతా .. ఊగిందా .. నీ చెంతా .. చేరిందా .. గోవిందా !

పిలిచే పెదవుల పైనా .. నిలిచే మెరుపు నువ్వేనా

ఈ భావం నాదేనా .. ఈనాడే తోచేనా
చిరు నవ్వోటి పూసింది నా వల్లనా ..అది నా వెంటె వస్తుంది ఎటు వెళ్ళినా
మనసును ముంచేనా .. మురిపించేనా .. మధురమే ఈ లీలా ..

నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా

ఊరంతా .. ఊగిందా .. నీ చెంతా .. చేరిందా .. గోవిందా !

నా చూపే చెదిరిందా .. నీ వైపే తరిమిందా
చిన్ని క్రిష్ణయ్య పాదాల సిరిమువ్వలా .. నన్ను నీ మాయ నడిపింది నలువైపులా
అలజడి పెంచేనా .. అలరించేనా .. లలనను ఈ వేళా

ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
ఎదలో వేణునాదం ఊయలూపే ఊహ రేపిందా

ఊరంతా .. ఊగిందా .. నీ చెంతా .. చేరిందా .. గోవిందా !

పిలిచే పెదవుల పైనా .. నిలిచే మెరుపు నువ్వేనా

August 30, 2010

1940 లో ఒక గ్రామం

సంగీతం: సాకేత్ సాయిరాం
సాహిత్యం: శ్రీకాంత్ అప్పలరాజు
గానం: అనిల్ కుమార్

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా

ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటా
ఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటా
ఏనాడైనా .. ఏ వేళైనా .. నాలోనా
ఏదేమైనా .. ఎవరేమైనా .. నీవేనే

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా !

ఈ వేళ ఎక్కడ ఉన్నావో .. ఏమేమి చేస్తూ ఉన్నావో
నాకేమో మదిలో నీ ధ్యాసే .. నీవేమో ఎపుడూ నా శ్వాసే
కాసంత కుదురే లేదాయే .. రేయంత నిదురే రాదాయే
నువు లేక కనులలో నీరేలే .. నువు రాక నిమిషం యుగమేలే
ఏ మాట విన్నా నీ పిలుపే .. యే చోట ఉన్నా నీ తలపే
విడలేను లే .. విడిపోనులే .. కడదాక నాతో నీవేలే

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా !!

నా కలల వెన్నెల నీవేనే .. నీ కనుల చీకటి కనలేనే
నా మనసు మాటే వినదేమో .. ఈ వలపు మాయే విడదేమో
నేనేమొ చేపగ మారానే .. నీవేమొ నీరై పోయావే
ఓ క్షణము విడి వడి పోయామా.. ప్రాణాలు విలవిల లాడేనే
నీ పేరు మరువను క్షణమైనా .. నీ ప్రేమ విడువను కలనైనా
కను మూసినా .. కను తెరచినా .. నగుమోమే పిలుచును ఏ వేళా

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా !!!

August 18, 2010

చేతిలో చెయ్యేసి

సంగీతం: బంటి
సాహిత్యం: చంద్రబోస్

గానం: హరిహరన్, అల్కా

పిల్లన గ్రోవి నేనై
చల్లని గాలి నువ్వై
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం ! (2)

రాగానికే రూపం ఒచ్చి
రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం !!

మొదటి సారి నిను చూడగానే .. ఆశ్చర్యరాగం
మదిని తెరిచి మాటాడగానే .. ఆహ్వానరాగం
చొరవ చేసి నను చేరగానే .. ఆందోళరాగం
చెలిమి చేయి కలిపేయగానే .. అవలీలరాగం

నవ్వులోన నవనీత రాగం .. సిగ్గులోన గిలిగింతరాగం
ఒంపులోన ఒలికింత రాగం .. ఓపలేని విపరీత రాగం
అణువుఆణువున పలికెను మనలో .. అనురాగ రాగం .. అదే ప్రాణ రాగం !!!

రాగానికే రూపం వచ్చి
రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం !

ఇరువురం దూర దూరముంటే .. ఇబ్బందిరాగం
బంధమై స్పందించుతుంటే .. నిర్బంధరాగం
పెదవి మీటి పెనవేసుకుంటే .. నిశ్శబ్దరాగం
మధుర నిధిని దోచేసుకుంటే .. నిక్షేప రాగం

తనువులోన తారంగ రాగం .. క్షణముకొక్క కేరింతరాగం
కలలోన కల్లోల రాగం .. కలిసిపోతే కళ్యాణరాగం
ఇద్దరమొకటై ముద్దుగ ఉంటే అద్వైత రాగం ..అదే మోక్షరాగం !!!

పిల్లన గ్రోవి నేనై
చల్లని గాలి నువ్వై
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం !!

*********************************************

సాహిత్యం: మౌనశ్రీ మల్లిక్

గానం: కార్తీక్, గీతా మాధురి

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం !
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ

సుధలు చిందు కావ్యం చదివా ఓ నేస్తమా
తెలుగు భాష పరువం నీవే ఓ అందమా
కలలు కనే వయసిది తెలుసా నా ప్రియతమా
కన్నె గుండె అలజడి తెలుసా నా ప్రాణమా

నువ్విలా పాడితే మది వాసంతం
నన్నిలా మీటితే ఎద సంగీతం !
హే నువ్విలా పాడితే మది వాసంతం
హే నన్నిలా మీటితే ఎద సంగీతం !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ !

విరులవాన గానం నాదీ ఓ నాదమా
నవరసాల వదనం నీదీ ఓ వేదమా
సిరులు కురులు సొగసే నాదీ ఓ ప్రణయమా
మరులుగొన్న మనసే నీదీ నా వినయమా

గుండెలో దేవిగా పూజిస్తాలే
కంటిలో పాపగా కొలువుంటాలే !
హో గుండెలో దేవిగా పూజిస్తాలే
హే కంటిలో పాపగా కొలువుంటాలే !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
హె హే మత్తుగా ఉన్నదే నీ అనురాగం

August 17, 2010

తకిట తకిట


సంగీతం: బోబో శశి
సాహిత్యం: భాస్కరభట్ల

గానం: కార్తీక్, చిన్మయి

మనసే అటో ఇటో .. ఎగిరే ఎటో ఎటో
తెలుసా ఇదేమిటో .. ఈ ఎదలో కధేమిటో
తొలి తొలి ప్రేమలోన పడి ముకలేసినది కనుకే ఇంతలా
వెనకకి రాను రాను అని నా మదీ వెతుకుతోందే నిన్నిలా .. నేరుగా ! (2)

ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నీవల్లేగా .. నువు లేకుండా తోచదు నాకే
చుట్టూరా ఎందరు ఉన్నా నీ చుట్టూనే తిరిగేస్తుందే .. ప్రాణం
సరికొత్తగ హరివిల్లేదో అరచేతులకే అందెను చూడూ నమ్మవు గానీ .. ఇది నీవల్లే
ఒట్టేసి చెప్పాలంటే నాలో ఉందీ నేనే కాను .. అంతటా నీ ఊహలే

చెలియా .. చెలియా .. నిజమా .. కలయా
నువు నాకోసం నేన్నీకోసం బహు చిత్రం గా మనబంధం కలిసెను
తరగని సిరులుగ చెరగని గురుతువి నువ్వే !!

నా గుండెల సవ్వడి వింటే నీ పేరే మరి వినిపిస్తుంది గమనించాలే .. గారడి నీదే
ఇకనుంచీ నువ్వూ నేనూ మనమే కాదా ఒకరికి ఒకరం .. తోడూ
కన్నుల్లో కొలువై ఉన్నా కలలో కూడా నీ చిరునవ్వే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే !
మనసిస్తే కాదనవంటూ నమ్మకమేదో నడిపించిందీ నన్నిలా నీ వైపుగా

వలపే వరదై .. నడకే పరుగై
నీ చూపుల్లో నీ మాటల్లో నీ మైకం లో మైమరపే కలిగెను
ఎవరిని చూసిన అది నువ్వనుకుంటానే !!

మనసే అటో ఇటో .. ఎగిరే ఎటో ఎటో
తెలుసా ఇదేమిటో .. ఈ ఎదలో కధేమిటో !!!

July 21, 2010

గోలీమార్


సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కర భట్ల

గానం: చక్రి, కౌసల్య

గుండెల్లో ...
కళ్ళల్లో ...

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తుందీ సందడి

నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని

తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ
తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ

నా పెదవంచులో నీ పిలుపున్నదీ
నీ అరచేతిలో నా బ్రతుకున్నదీ

ఇన్నాళ్ళెంత పిచ్చోణ్ణి నేను .. మనసిస్తుంటె తప్పించుకున్నా
మొత్తమ్మీద విసిగించి నిన్నూ ఏదో లాగ దక్కించుకున్నా

మనసున్నాది ఇచ్చేందుకే .. కనులున్నాయి కలిపేందుకే
అని తెలిసాక నీ ప్రేమలో .. పడిపోయానులే

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తుందీ సందడి

నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ
ఈ గిలిగింతలో నే పులకించనీ

నాకో తోడు కావాలి అంటూ ఎపుడూ ఎందుకనిపించలేదు
వద్దొద్దంటూ నే మొత్తుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో

కన్నీళ్ళొస్తె తుడిచేందుకూ .. సంతోషాన్ని పంచేందుకూ
ఎవరూ లేని జన్మెందుకూ .. అనిపించిందిలే

గుండెల్లో ఏదో సడీ .. ఉండుండీ ఓ అలజడీ
కళ్ళల్లోనూ కలబడీ .. కమ్మేస్తుందీ సందడి

నా ప్రాణం కోరింది నన్నే .. నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో .. నువ్వుంటే వస్తానని

తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడీ
తుళ్ళీ తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడీ

గుండెల్లో ...
కళ్ళల్లో ...

July 07, 2010

ఏం పిల్లో .. ఏం పిల్లడో




సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాషాశ్రీ
గానం: రంజిత్

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

ఎడబాటు గాయమే దాచీ .. నీ నవ్వులలో
సెలవంటు ఆశగా చూస్తే .. నా కన్నులలో

నా మనసు నిలవదూ .. పోవే నన్ను చూడకూ
నా ముందు కదులుతూ .. ప్రేమా నన్ను చంపకూ
ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

కన్నీటీ వానల్లో .. పన్నీటి స్నానాలే
గోరింటా పూతల్లో .. మా ప్రేమే వాడేలే
నా రాణి పాదంలో పారాణి పూస్తున్నా
ఈ పూల హారాలే గుండెల్ని కోస్తున్నా

ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

మా లోనీ ఓ ప్రేమా .. మా మాటే వింటావా
పంతాలా పందిట్లో .. ప్రేమల్లే పూస్తావా
కాలాన్నే ఆపేసీ మౌనన్ని తుంచాలే
కాదంటే మా నుండీ నీ వైనా పోవాలే

ఓ తీపి గురుతులా .. నువ్వే మాకు మిగలకూ
నీ పెద్దమనసుతో .. కలిపెయ్ జన్మజన్మకూ

తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం
నువు లేనీ ఈ సగం .. బ్రతికున్నా ఏం సుఖం

ఎడబాటు గాయమే దాచీ .. నీ నవ్వులలో
సెలవంటు ఆశగా చూస్తే .. నా కన్నులలో

నా మనసు నిలవదూ .. పోవే నన్ను చూడకూ
నా ముందు కదులుతూ .. ప్రేమా నన్ను చంపకూ
ఓ తీపి గురుతులా .. నువ్వే నన్ను దాచుకో
నీ కంటిపాపలా .. ఉంటా జన్మజన్మకూ

June 30, 2010

ఝుమ్మంది నాదం



సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కృష్ణ చైతన్య, సునీత

ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను
రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ



అరెరెరెరే .. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా
అరెరెరెరే .. ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా

ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం .. నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం

అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం .. మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం



అరెరెరెరే .. చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ
అరెరెరెరే .. ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ



ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

పైన పైన కాదూ లోన తొంగి చూడూ .. మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం

కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం



అరెరెరెరే .. చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా
అరెరెరెరే .. రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా

*************************************************

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: చైత్ర, అనూజ్ గురవర
ఏలోరే.. ఏలోరే ..
ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో



ఏం సక్కగున్నవ్ రో .. నా సొట్ట సెంపలోడ
ఏం సిక్కగున్నవ్ రో .. నా సిట్టి జుంపాలోడ (2)



పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే
రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే



ఫక్కున నువు నవ్వితే ..
ముత్యాల్ వజ్రాల్ వైడూర్యాలు ఏరుకుంటాలే మెళ్ళో ఏసుకుంటాలే !



ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా
ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా



చీర కొంగులో నన్ను కట్టుకో.. బొడ్డు లోపలా నన్ను దోపుకో
పూల దస్తిలో నన్ను పెట్టుకో .. రైక లోపల నన్ను దాచుకో



ఓహో ఎర్రని రిబ్బెన పువ్వల్లే చేసి .. నల్లని కొప్పున నన్ను చుట్టుకో



కొప్పున చుట్కుంటే లోకం చూస్తదీ .. ఆహా
రైకల పెట్కుంటే గిలిగిలైతదీ .. ఆహా
బొడ్డుల దోప్కుంటే .. మోసమైతదీ .. అమ్మొ మోసమైతదీ
ఏదో పోనీ అని వంటిగొదిలితే .. ఏస్కపోతరేమో నా ఈడు ఆడోళ్ళు !



సక్కగున్నవ్ రో.. ఏం సక్కగున్నవ్ రో .. నా సొట్ట సెంపలోడ
ఏం సిక్కగున్నవ్ రో .. నా సిట్టి జుంపాలోడ



పచ్చనాకులా పళ్ళెం పెట్టుతా .. వేడి వేడిగా బువ్వ వడ్డిస్తా
ఆవకాయలో నెయ్యి కల్పుతా .. ముద్దు పెడితె నే ముద్ద తింపిస్తా
అబ్బొబ్బొ తినుకుంటా నా ఏలు కొరికితే .. మబ్బుల్లో సెంద్రయ్య సిగ్గు సెందాడా



గోరింటా ఆకులు ముద్ద నూరుతా .. కాళ్ళకూ వేళ్ళకూ నేనే అద్దుతా
పాదాల దగ్గరనే .. సేద తీరుతా .. ఆహా సేద తీరుతా
తెల్లవారంగానే నేనే కడుగుతా .. నీ కాలి మెరుపులో పొద్దుపొడుపునే చూస్తా
 సక్కగున్నవ్ రో.. నా సొట్ట సెంపలోడ
ఏం సిక్కగున్నవ్ రో .. నా సిట్టి జుంపాలోడ



ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా
ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా



ఏలోరే.. ఏలోరే ..
ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో

యముడు


సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: సుచిత్రా కార్తీక్ కుమార్, సాగర్
సాహిత్యం: శశాంక్ వెన్నెలకంటి

నా హృదయం ఎరుగదు ఇదివరకు .. ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు .. ఈ కసి గుసగుసలే

ఇది ఏమో ఏదో ఎరుగనులే .. అయినా మధురములే
ఇది కలయా నిజమా తెలియదులే .. కొంచెం కలయై కొంచెం నిజమై ఊయలూపె ఎదనే !

నా హృదయం ఎరుగదు ఇదివరకు .. ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు .. ఈ కసి గుసగుసలే

ఎక్కడో నువ్వున్నా .. పక్కనే ఉన్నట్టుందీ
ఎప్పుడూ నిన్నొదిలీ మనసిలా .. రానంటుందీ
ఎందుకో ప్రతిమాటా .. నీ పేరులా వినబడుతుందీ
అందుకే సగవాటా .. నీ పేరులో మనసడిగిందీ

దాహమే రేపినా .. మోహమే నీవులే
తీయనీ వీణలా .. గుండెల్లో మోగావులే


నా హృదయం .. హృదయం హృదయం హృదయం హృదయం హృదయం
నా హృదయం ఎరుగదు ఇదివరకు .. ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు .. ఈ కసి గుసగుసలే

యవ్వనం నీకోసం నేర్చెలే .. వయ్యారాలూ
ఈ క్షణం నా ప్రాయం పేర్చెలే .. పూబాణాలూ
కంటిలో కాటుకలా కరిగినా .. నా స్వప్నాలే
గంటకో కోరికలా చేరనీ .. నీ కౌగిళ్ళే

బొత్తిగా మరచినా .. పడకలో నిద్దురా
ముద్దుకే మనసిలా .. పడుతుందిలే తొందరా

నా హృదయం .. నా హృదయం
నా హృదయం ఎరుగదు ఇదివరకు .. ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు .. ఈ కసి గుసగుసలే

June 23, 2010

చలాకి


గానం: కార్తీక్, సునీత
సంగీతం: వి.హరికృష్ణ
సాహిత్యం: వనమాలి


నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా
చేయి దాటి జారిపోయే కధలే నిజమా


విరిసే మదినీ .. విరిచే ప్రేమా
ఎడబాటేనా .. నీ చిరునామా !


నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా
చేయి దాటి జారిపోయే కధలే నిజమా


నను చేరే శ్వాసే నాతో వేరవుతుంటే
నడిచే ఓ శిలగానైనా జీవించాలా


ఇక సెలవని ఇరు హృదయాలూ .. గతమొక కల అనుకోవాలా
విధి నిను నను వేసిన చెరలో .. కలతే కాపలా


కనులే అలలై .. కరిగే వేళా
ఎదనే వీడీ .. ఎదురీదాలా !


నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా
చేయి దాటి జారిపోయే కధలే నిజమా


గతమంతా నీతో సాగిన దారుల్లోనా
మన పాదం చూపే గురుతే శోధిస్తున్నా


తొలివలపుకు ఆఖరి మజిలీ .. కలవని ఇరు తీరాలైతే
మనసులు ఒక జంటగ చేరీ .. వలచేదెందుకో


బ్రతికే వరకూ .. తొలిచే ప్రేమా
చితిలోనైనా .. కలిసుంటామా !


నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా
చేయి దాటి జారిపోయే కధలే నిజమా


విరిసే మదినీ .. విరిచే ప్రేమా
ఎడబాటేనా .. నీ చిరునామా !


నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా
చేయి దాటి జారిపోయే కధలే నిజమా

April 16, 2010

డార్లింగ్
















సంగీతం: జి.వి.ప్రకాష్
గానం: సూరజ్, ప్రశాంతిని

ఇంకా ఎదో .. ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్ఠాలే తెలిపేందుకూ
సంకెళ్ళతో .. బంధించకూ
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకూ

తనలో నీ స్వరం .. వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా .. ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాలే చూపించకూ

ఇంకా ఎదో .. ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్ఠాలే తెలిపేందుకూ

మేఘాల వళ్ళోనే ఎదిగిందనీ
జాబిల్లి చల్లేనా జడివాననీ
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ
నీకు పూ రేకులే గుచ్చుకోవే మరీ
తీరమే ఓరినా తీరులో మారునా .. మారదూ ఆ ప్రాణం !

ఇంకా ఎదో .. ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్ఠాలే తెలిపేందుకూ

వెళ్ళెళ్ళు చెప్పేసే .. ఏమవ్వదూ
లోలోన దాగుంటే ప్రేమవ్వదూ
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అవదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ..ఇప్పుడే ఆ అందం !

ఇంకా ఎదో .. ఇంకా ఎదో
ఇదైపోతావే ఇష్ఠాలే తెలిపేందుకూ
సంకెళ్ళతో .. బంధించకూ
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకూ

తనలో నీ స్వరం .. వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా .. ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాలే చూపించకూ

March 15, 2010

మరో చరిత్ర (2010)




సంగీతం : మిక్కీ జే మయర్
సాహిత్యం : వనమాలి
గానం : శ్వేతా పండిట్


నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

ప్రపంచమే వెలేసినా వెలేయని జ్ఞాపకమా
కనే కలే కన్నీరయ్యే నిజాలుగా మారకుమా
గతించిన క్షణాలని ముడేసిన ఆ వరమా
విధే ఇలా వలేసినా జయించును నా ప్రేమ

నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

నా మనసే విరిసే స్వరాలుగా
గతానికే నివాళీగా పదాలు పాడనీ
ఇవాళ నా ఉషొదయం జగాలు చూడనీ
ప్రతీ కల ఒ??? సుమాలు పూయనీ

********************************


సంగీతం : మిక్కీ జే మయర్
సాహిత్యం : వనమాలి
గానం : కార్తీక్


ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది

ప్రేమనే మాటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా
నీ జతే కావాలంటున్నా నిజమైనా
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా
నిడలా నిన్నలా నాలోన కలుపుకోనా
నిదురలో నువ్వేనా నిజములో నువ్వేనా
ఈ వింతలన్నీ ప్రేమేనా

I Love You I Love You I Love You
I Love You I Love You I Love You

ప్రేమనే మాటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా
నీ జతే కావాలంటున్నా నిజమైనా
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా
నిడలా నిన్నలా నాలోన కలుపుకోనా

నిన్నుకొలువుంచేస్తున్నా కంటి పాపల్లోన
కనులకే జోకొట్టేలా కలల మాటునా
జన్మలే కరింగించేలా జంటనే కలిపేనా
వెన్నెలే కురిపించే ఆ ప్రేమ దీవెన

Baby you are my sweet heart
Baby you are my sweet sweet heart

ప్రేమనే మాటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా
నీ జతే కావాలంటున్నా నిజమైనా
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా
నిడలా నిన్నలా నాలోన కలుపుకోనా

Girl I want you by my side
Oh I wanna hold you tight
Girl I wanna kiss your lips
I can feel your love

ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది

నిన్ను నా జతలో నిలిపే దేవుడే ఎదురైతే
వాడికే ఓ వరమిచ్చి సాగనంపనా
జంటగా నాతో నడిచే దేవతే నువ్వంటూ
లోకమే వినిపించేలా చాటి చెప్పనా
నిదురలో నువ్వేనా నిజములో నువ్వేనా
ఈ వింతలన్నీ ప్రేమేనా

I Love You I Love You I Love You
I Love You I Love You I Love You

ప్రేమనే మాటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా
నీ జతే కావాలంటున్నా నిజమైనా
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా
నిడలా నిన్నలా నాలోన కలుపుకోనా

అందరి బంధువయ








సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : దీప్తీ మాధురి , అనూప్ రూబెన్స్



మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని
వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో
అంతవరకు లేనిదేదో ఇంతలోనే ఐనదేమో
నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ
నన్ను నీలో నిన్ను నాలో వెతుకుతూ ఉంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

స్నేహమూ నువ్వే సంతోషమూ నువ్వే
ఆత్మలోన నువ్వే అనుభూతిలోన నువ్వే
నేను ఏరి కోరుకున్న కొత్త జన్మ నువ్వే
నాలో ప్రియ భాషా అభిలాష ఎద శ్వాసా
నీవే నీవే నీవే నీవే
నీవే అంటుంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని
వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో
అంతవరకు లేనిదేదో ఇంతలోనే ఐనదేమో
నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ
గాలిలోనే తేలిపోతు నేను వస్తుంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్



*********************


సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : అనూప్ రూబెన్స్

మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని
వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో
అంతవరకు లేనిదేదో ఇంతలోనే ఐనదేమో
నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ
గాలిలోనే తేలిపోతు నేను వస్తుంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

ఊహలో నీవే నా ఊపిరీ నీవే
ఆశలోన నీవే ణా ధ్యాశలోన నీవే
ప్రాణ వీణ మీటుతున్న ప్రేమ పాట నీవే
నా లోపల నీవే కళ నివే కధ నీవే
కలవరిస్తూ పలకరిస్తూ చేరువవుతుంటే

కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

మళ్ళీ మళ్ళీ రమ్మనీ....

కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు


March 12, 2010

వరుడు


సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వేటూరి
గానం: సోనూ నిగం, శ్రేయా ఘోషాల్


బహుశా ఓ చంచలా .. ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా .. చూపులో చూపుగా !

అయినా కావచ్చులే .. ఒకటై పోవచ్చులే
ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే .. యే దూరమైనా చేరువై


బహుశా ఓ చంచలా .. ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా .. చూపులో చూపుగా !

కనుపాపల్లో నిదురించీ .. కల దాటిందీ తొలి ప్రేమా
తొలి చూపుల్లో చిగురించీ .. మనసిమ్మందీ మన ప్రేమా


కలగన్నానూ .. కవినైనానూ .. నిను చూసీ
నిను చూసాకే .. నిజమైనానూ .. తెర తీసీ

బహుశా ఈ ఆమనీ .. పిలిచిందా రమ్మనీ
ఒకటైతే కమ్మనీ .. పల్లవే పాటగా !

అలలై రేగే అనురాగం .. అడిగిందేమో ఒడిచాటూ
ఎపుడూ ఏదో అనుభంధం .. తెలిసిందేమో ఒకమాటూ

మధుమాసాలే మన కోశాలై .. ఇటురానీ
మన ప్రాణాలే శతమానాలై .. జతకానీ

తొలిగా చూసానులే .. చెలిగా మారానులే
కలలే కన్నానులే .. కలిసే ఉన్నానులే
నా నీవులోనే నేనుగా !

బహుశా ఓ చంచలా .. ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా .. చూపులో చూపుగా !


*********************************

సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : హేమచంద్ర

కలలు కావులే కలయిక లిక
కరిగిపోవు ఈ కధలిక లిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదిరిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీ కోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నానీ నీడై పోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట

ఓ సఖీ నా ఆశకి వరమైనా కావే
నాకు నీ సావాసమే కావాలి
ఓ చెలీ నా ప్రేమకీ ఉసురైనా కావే
ఒంటరీ ప్రాణమేం కావాలి
ఎన్నాళ్ళైనా ప్రేమిస్తూ ఉంటాను నేను నేనుగానే ఏమైనా
ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితాన నాదానా

మేఘ్హమై ఆ మెరుపునే వెంటాడే వేళ
గుండెలో నీరెండలే చెలరేగాల
అందుతూ చేజారినా చేమంతీ మాల
అందనీ దూరాలకే నువ్ పోనేల
తెగించాను నీ కోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయాన
తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీ్తో ఏకం అవుతా ఏమైనా

కలలు కావులే కలయిక లిక
కరిగిపోవు ఈ కధలిక లిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదిరిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీ కోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నానీ నీడై పోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట


ఏ మాయ చేసావే (2010)



సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంతశ్రీరామ్


గానం: కార్తీక్

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై ..
వెంటనే రా.. వెలుగై రా .. నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా .. నను చేరీ నాతో రా !

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై ..
వెంటనే రా.. వెలుగై రా .. నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా .. నను చేరీ నాతో రా !

వయసే నిన్నే వలచీ .. వసంతమున కోకిలై తీయంగ కూసీ
ఈ శిశిరమున మూగబోయిన నిన్నే చూస్తుందే .. జాలేసీ !
ఏమో ఏమో ఉందో చిగురించే క్షణమే

వెంటనే రా.. వెలుగై రా .. నిజమయ్యే కలవై రా !
నడిపించే అడుగై రా .. నను చేరీ నాతో రా !!


********************************

గానం: కార్తీక్, శ్రేయా ఘోషాల్

"పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనముతో .. నీ మదినీ .. బంధించా మన్నించు ప్రియా !"

తరిమే వరమా..
తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు.. నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..
ఓ ఓ ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..

ఏ .. మో .. ఏమో .. ఏమవుతుందో
ఏ ..దే..మైనా .. నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇంకపైనా .. వింటున్నావా ప్రియా !


గాలిలో తెల్లకాగితం లా .. నేనలా తేలియాడుతుంటే
నన్నే ఆపీ నువ్వే వ్రాసిన .. ఆ పాటలనే వింటున్నా

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

ఆద్యంతం ఏదో అనుభూతీ
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిదీ
భూతలం కన్నా వెనుకటిదీ
కాలంతోనా పుట్టిందీ.. కాలంలా మారే
మనసే లేనిది ప్రేమా !

రా ఇలా .. కౌగిళ్ళలో .. నిన్ను దాచుకుంటా
నీ దానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోనా..
ఎవరిని తలువని వేళలోనా

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా ..
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా ..
ఓ ఓ ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..
***********************************

విజయ్ ప్రకాష్, సుజానే, బ్లేజ్

ఈ హృదయం .. కరిగించి వెళ్ళకే
నా మరు హృదయం అది నిన్ను వదలదే !


ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వల
హో నిన్న కాక మొన్న వచ్చి యే మాయ చేసావే పిల్లిమొగ్గలేసిందిలా

హోసాన .. గాలుల్లో నీ వాసనా
హోసాన .. పూవుల్లో నిను చూసినా
ఏ సందు మారినా ఈ తంతు మారునా .. నా వల్ల కాదు నన్ను నేను ఇంక ఎంత ఆపినా !

హోసా .. ఊపిరినే వదిలేస్తున్నా
హోసా .. ఊహల్లో జీవిస్తున్నా
హోసా .. ఊపిరినే వదిలేస్తున్నా !

రంగురంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనె ఉన్నావుగా
హా తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లె పైపైన అందకుండ ఉంటావుగా

హోసాన .. ఆ మబ్బు వానవ్వదా
హోసాన .. ఆ కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవా ఈ చింత తీర్చవా .. ఏ వంట నీకు నేను అంత కాని వాణ్ణి కాదుగా !

హలో .. హలో .. హలో .. యో హోసాన

హోసా .. ఆయువునే వదిలేస్తున్నా
హోసా .. ఆశల్లో జీవిస్తున్నా
హోసా .. ఆయువునే వదిలేస్తున్నా !

ఈ హృదయం .. కరిగించి వెళ్ళకే
నా మరు హృదయం అది నిన్ను వదలదే (2)

March 10, 2010

కేడి (2010)



సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: అరిజిత్ సింగ్, నేహా కక్కర్


నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !
ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !!

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !

మెల్లగా మెల మెల్లగా నా మనసులొ విరబూసెనే నీ జ్ఞాపకాలే .. నీ జ్ఞాపకాలే
మెరుపులా నువు నవ్వుతూ అణువణువునా చేసావులే నీ సంతకాలే .. నీ సంతకాలే
నీతోనే నా పాదం .. నా ప్రాణం .. సాగిపోనీ
మౌనంగా కాలం .. కలకాలం .. ఆగిపోనీ

ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !!

కొత్తగా సరికొత్తగా ఈ లోకమే కనిపించెనే నీ రాకతోనే .. నీ రాకతోనే
ఎప్పుడో నేనెప్పుడో నీ రూపమే దాచానుగా నా గుండెలోనే .. నా గుండెలోనే
చూసానే నేడే .. ఈనాడే .. ప్రేమ జాడే
అందంగా నాకే .. అందాడే .. అందగాడే

ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !!

March 04, 2010

వియ్యాలవారి కయ్యాలు (2007)

సంగీతం:
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: సునీత, రాజు


నీలాల నీకళ్ళూ...
నాప్రేమ సంకెళ్ళూ..
అందంగా వందేళ్ళు..
బంధించవా..ఓ ప్రియతమా !

నీ వేడి కౌగిళ్ళూ..
లోలోన తాకిళ్ళూ..
వెచ్చంగ వెయ్యేళ్ళు..
లాలించవా..నా ప్రాణమా !

I just wanna be close to you

నీ గుండెల్లో.. చోటెంతుందో..ఆ నింగి చెప్పిందిలే
నీ మాటల్లో.. మత్తెందుదో..ఈ గాలి చెప్పిందిలే

ఏకమౌతున్న ఈలోయ చెప్పింది..హాయి ఎంతుందనీ
విచ్చుకుంటున్న ఈపూలు మౌనంగా...
నాకు చెప్పాయి మనసంత నువ్వేననీ..

నీలాల నీకళ్ళూ...
నాప్రేమ సంకెళ్ళూ..
అందంగా వందేళ్ళు..
బంధించవా..ఓ ప్రియతమా !

I just wanna be close to you

నీతో ఉంటే..నీరెండైనా..వెన్నెలౌతుందిలే
నీతోడుంటే ఏ రేయైనా..వేకువౌతుందిలే

నువ్వు నా సొంతమౌతుంటే..నా శ్వాస వెల్లువౌతుందిలే
జంటగా నిన్ను చేరాక నా ఈడూ
కోటిజన్మాలనే కోరుకుంటుందిలే

నీలాల నీకళ్ళూ...
నాప్రేమ సంకెళ్ళూ..
అందంగా వందేళ్ళు..
బంధించవా..ఓ ప్రియతమా !

నీ వేడి కౌగిళ్ళూ..
లోలోన తాకిళ్ళూ..
వెచ్చంగ వెయ్యేళ్ళు..
లాలించవా..నా ప్రాణమా !

తులసి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం: సాగర్, చిత్ర


నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే..క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం

అడుగునౌతాను..నీ వెంట నేనూ..తోడుగా నడవగా చివరి దాకా
గొడుగునౌతాను..ఇకపైన నేనూ..బాధలో నిన్నిలా తడవనీకా

నిన్నొదిలి క్షణమైన అసలుండలేను..చిరునవ్వునౌతాను పెదవంచునా..
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే..తొలిసిగ్గు నేనవ్వనా !

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుంటే తనువంత సూర్యోదయం

హా..వెన్నెలౌతాను..ప్రతి రేయి నేను..చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతాను..నీలోన నేను..ఎన్నడూ నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ..నేనుండిపోతాను పారాణిలా
చిరుచెమట పడుతుంటే నీ నుదుటిపైనా..వస్తాను చిరుగాలిలా !

మున్నా (2007)

సంగీతం: హరిస్ జయరాజ్
సాహిత్యం: కందికొండ
గానం: సాధనా సర్గం, నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్


మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
నీ రూపూ రేఖల్లోనా .. నేనుండీ వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా..నా చిత్రం చిత్రించెయినా..
కనుపాపైపోనా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

నీవే తోడని నిజంగా..నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే..అయిపోయే ఇక క్షణమే

తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా
నువ్వు మార్చేసావే నా ఈ వరసా

ఓ సోనా వెన్నెల సోనా..రేపావే అల్లరి చానా
చెక్కిల్లో చుక్కైపోనా..చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా..ముంగిట్లో ముగ్గైరానా
ముద్దుల్తో ముంచేసెయ్ నా..కౌగిలికే రానా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

కూసే కోయిల స్వయంగా..వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే..మౌనంగా మది మురిసే

కలిసా కలిసా నీతో కలిసా
నీలో నిండీ అన్నీ మరిచా
హో నీలో నిండీ అన్నీ మరిచా

ఓ సోనా వెన్నెల సోనా..నీవైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా..నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా..నీ గుందె చప్పుడులోనా
నా ప్రాణం నింపానమ్మా..నిను చేరానమ్మా !

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
ఓ మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా
ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా