October 29, 2008

పెద్దరికం (1992)

సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: బాలు, చిత్ర

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా !

నీ ఆశలన్నీ నా శ్వాసలైనా .. ఎంత మోహమో
ఓ ఓ ఓ .. నీ ఊసులన్నీ నా బాసలైనా .. ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా .. ఆ ఆ ఆ
సుడిగాలినైనా ఒడి చేరనా .. ఓ ఓ ఓ ఓ
నీడల్లే నీ వెంట నేనుంటా .. నా ప్రేమ సామ్రాజ్యమా !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా !

పెదవుల్ని తడితే పుడుతుంది తేనే .. తియ తియ్యగా
ఓ ఓ ఓ .. కౌగిట్లో పడితే పుడుతుంది వానా .. కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసెయ్యనా .. ఓ ఓ ఓ ఓ
ఏకాంత సేవా చేసేయనా .. ఓ ఓ ఓ ఓ
వెచ్చంగ చలి కాచుకోవాలా .. నీ గుండె లోగిళ్ళలో !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !

*************************************

గానం: బాలు, చిత్ర
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా
విలాసాల దారి కాచా ....సరగాలా గాలమేసా
కులాసాల పూలు కోసా....వయ్యారాల మాల వేసా
మరో నవ్వు ఋవ్వరాదటే
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ

మల్లెపూల మంచమేసీ హుషారించనా

జమాయించి జాజిమొగ్గా నిషా చూడనా

తెల్ల చీర టెక్కులేవో చలాయించనా

విర్ర వీగు కుర్రవాణ్ణి నిభాయించనా

అతివకు ఆత్రము తగదటగా
తుంటరి చేతులు విడువవుగా .. మనసు పడే .. పడుచు ఒడీ !
ఓ ఓ ఓ ఓ .. ఓ ఓ ఓ ఓ
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ

కోరమీసమున్న వాడి కసే చూడనా
దోర దోర జామపళ్ళ రుచే చూపనా
కొంగు చాటు హంగులన్నీ పటాయించనా
రెచ్చి రేగు కుర్రదాన్ని ఖుమాయించనా

పరువము పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగా .. తధిగిణతోం మొదలెడదాం !

ఓ ఓ ఓ ఓ .. ఓ ఓ ఓ ఓ
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ
ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా

***********************************************

గానం: కె.జె.ఏసుదాస్

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం (2)
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం

ఒడిలో పెరిగిన చిన్నారినీ .. ఎరగా చేసినదా ద్వేషమూ
కధ మారదా ..ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే .. కసిగా శిశువుని కుమ్మితే (2)
అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయేనా !

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం !

విరిసీ విరియని పూదోటలో .. రగిలే మంటలు చల్లారవా
ఆర్పేదెలా .. ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే .. వెలుగే చీకటి మూగితే (2)
పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా !

ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా .. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా .. ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం !

1 comment:

Unknown said...

chala manchi songs post chesaaaru thanks