October 26, 2008

కేక (2008)

సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

Love you .. I love you
Love you .. I love you
Love you .. I love you
Love you .. I love you

నువ్వే ..
నా కన్నుల్లోన నువ్వే ..
నా గుండెల్లోన నువ్వే ..
నా ప్రాణంలో నువ్వే
నువ్వే ..
నా మౌనంలోన నువ్వే ..
నా మాటల్లోన నువ్వే ..
నా ఆటల్లో నువ్వే

ఒకరి చిలిపి తనమే .. ఒకరి చెలిమి గుణమే
ఒదిగి మనకు మనమే .. ప్రణయమైన క్షణమే

Love you .. I love you
Love you .. I love you
Love you .. I love you
Love you .. I love you

నువ్వే ..
నా పాదంలోన నువ్వే ..
నా పరుగుల్లోన నువ్వే ..
నా పయనంలో నువ్వే
నువ్వే ..
నా దారుల్లోన నువ్వే ..
నా దాహంలోన నువ్వే ..
నలుదిక్కుల్లో నువ్వే
మనసు జతను వెతికే .. చెలిమి కొరకె బ్రతికే
అలసి అడుగు తిరిగే .. కలల కడలి కరిగే

Love you .. I love you
Love you .. I love you
Love you .. I love you
Love you .. I love you

నువ్వే ..
నా లోకంలోన నువ్వే
నా స్వప్నంలోన నువ్వే
నా శూన్యంలో నువ్వే
నువ్వే ..
నాకందరిలోన నువ్వే
నాకన్నిట్లోన నువ్వే
ఈ కన్నీట్లో నువ్వే
కధల మలుపు ముగిసే .. ఎదల పెదవి ఎగసే
పడుచు వలపు తెలిసే .. పడని ముడులు బిగిసే
Love you .. I love you
Love you .. I love you
Love you .. I love you
**********************************
గానం: హరిహరన్, కౌసల్య
సాహిత్యం: వేటూరి

' ఫెళ ఫెళమని ఉరిమిన వేళ .. నువ్వే గుర్తొస్తావు
తొలకరి చినుకులు కురిసిన వేళ .. నువ్వే గుర్తొస్తావు
హరివిల్లు కనపడిన వేళ .. నువ్వే గుర్తొస్తావు
గుసగుస గాలులు వీచిన వేళ .. నువ్వే గుర్తొస్తావు
నువ్వే గుర్తొస్తావు .. గుర్తొస్తావు .. గుర్తొస్తావు ! '

చిట్టి చిలకవో .. చందమామవో
(అందమైన చందమామ అందుకుంటే అందుతుందనేలకొచ్చి వాలుతుంద .. నీకు పిచ్చి పట్టుకుందా?)

మెరుపు తీగవో .. చిలిపి తారవో
(ఆశలెన్నో రేగుతున్నా తార నీకు దక్కుతుందామెరుపు ముద్దు నీకు పెట్టి వయసు హద్దు దాటుతుందా ?)

మెరిసే మేఘం కురిసేదెప్పుడో
కురిసే వర్షం వెలిసేటప్పుడే
ముసురుకున్నదీ ఏదో చిలిపి కోరికా
ముదరనివ్వకూ కధలే చాలు చాలికా

చిట్టి చిలకవో .. చందమామవో
మెరుపు తీగవో .. చిలిపి తారవో

మెరిసే .. తొలకరిలో .. నిను కనులారా చూశా
చలిలో .. గిలిగిలిలో .. కొసమెరుపులు ఆరేశా
ముసిరే గాలివానలలో .. ముదిరే ముద్దు పిలుపులలో
తడిసే వాన చినుకులలో .. పడకూ మత్తు కవితలలో
వాన విల్లు ఏడు రంగులే చిలికే .. కన్నె పాప వేడి పొంగులే
ఊహలోన ఊయలూగితే తమకూ .. దిక్కు ఇంక ఎండమావులే
ఆడపిల్ల మాటలే ఆందమైన మాయలే
అర్ధమైతె చాలులే అంతకంత హాయిలే

చిట్టి చిలకవో .. చందమామవో
మెరుపు తీగవో .. చిలిపి తారవో

ఉరికే .. వయసులలో .. తొలి గిలిగింతల వానా
చినుకే .. చిటపటగా .. దరువేసెను మదిలోనా
కనులే గీటు మబ్బులకే .. కసిగా ఉంది ఉరుములతో
గొడవే కాస్త ముదిరెనులే .. గొడుగే పట్టు వయసులలో
వానదేవుడొచ్చినప్పుడే వయసే .. మొక్కు తీర్చుకోక తప్పదూ
చినుకు తేలు కుట్టినప్పుడే జతగా .. మంత్రమేసుకోక తప్పదూ
కుర్రకారు జోరులో కోతలింక మానుకో
దారితప్పకుండ నువ్వు వళ్ళు దగ్గరుంచుకో

చిట్టి చిలకవో .. చందమామవో
మెరుపు తీగవో .. చిలిపి తారవో

మెరిసే మేఘం కురిసేదెప్పుడో
కురిసే వర్షం వెలిసేటప్పుడే
ముసురుకున్నదీ ఏదో చిలిపి కోరికా
ముదరనివ్వకూ కధలే చాలు చాలికా

చిట్టి చిలకవో .. చందమామవో
మెరుపు తీగవో .. చిలిపి తారవో

**************************

గానం : హేమచంద్ర ,కౌసల్యా

అడిగావా మాటైనా ....వదిలావా జాడైనా
ఇపుడైనా నా మనసు....మగవాడా నీకే తెలుసు
తెలిసేలా ఏదైనా ...పలికావా ఎపుడైనా
నీదేనా నా మనసు....నిజమెదో నీకూ తెలుసు

ఎలా ఎలా నువ్వు చేరావో నా వరకూ
నువ్వే కదా నడిపించావు ప్రతి అడుగూ
ఆగవే ఓ చిరునవ్వా…దాగలేనంటున్నావా
అలక తెర దాటిస్తావా..కిలకిలా పైకొస్తావా

తెలిసేలా ఏదైనా పలికావా ఎపుడైనా నీదేనా నా మనసు నిజమేదో నీకూ తెలుసు

అన్నం కూడా తినక.... కనురెప్పైనా పడక ....ఉన్నానింకా నువ్వెళ్లిపోయాక
అన్యాయంగా అనమాక వదిలానా ఒంటరిగా నీ తలపుల్లో నిత్యం ఉన్నాగా
నీ వ్యాపకాలు ఎన్నున్నా....నా జ్ఞాపకాలు కొన్నైనా ....నీకపుడపుడైనా ఎదురై వచ్చేనా
తన గుండెల సడినెవరైనా గుర్తిస్తారా ఎపుడైనా నువు మరుపొచ్చావా తలవాలనుకున్నా
కాదనను నా కంటిలో నువ్వు నలుసైనా నను ఇంకేవైపు చూణ్ణీకా
జోరీగై నీ చెవిలో కొలువైపోనా వేరెవ్వరి పేరూ విన్నీకా
తుమ్మెదై కాటేస్తున్నాకమ్మగా ఉందనుకోనా
సంకెలై కట్టేస్తున్నాచక్కగా బందీ కానా

అడిగావా మాటైనా వదిలావా జాడైనా ఇపుడైనా నా మనసు మగవాడా నీకే తెలుసు

మళ్లీ కలిసేదాకా ఆశే మాత్రం లేక గాల్లో తిరిగా దారేం తెలీక
సందేహం ఏం లేక ముందే అనుకున్నాగా నేడో రేపో తప్పదు నీ రాక
నీ ప్రేమెంతటిదో తెలిసీ నా ప్రేమకు రాదా జేలసీ ఆ నమ్మకమేదీ తనకని సిగ్గేసి
నీ సర్వం నాకిచ్చేసి నను గర్వించేలా చేసి మన చెలిమిని అలుసుగ చూడకు దయ చేసి
కాస్తైనా కలతలా తడిపడనీయకుండా గొడుగవనా నీ నీడక్కూడా
దాస్తాగా నా మది చాటున జన్మంతా నువ్వైనా నీక్కనపడకుండా
చేర్చుకో నీ చెరలోన పారిపోనే నెరజాణా
ఎప్పుడూ సరదాకైనా తప్పుకోకే ఇటు పైనా
అడిగావా మాటైనా వదిలావా జాడైనా ఇపుడైనా నా మనసు హయ్యో మగవాడా నీకే తెలుసు

No comments: