October 24, 2008

అనుమానాస్పదం

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వంశీ
గానం: ఉన్ని కృష్ణన్, శ్రేయా ఘోషల్


ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదూ

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదూ

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా !

నిదురే రాదూ..రాత్రంతా కలలు నేసె నాకూ
వినగలనంటే తమాషగ ఒకటి చెప్పనా ?
:) చెప్పు !

ఇంద్రధనసు కిందా కూర్చుని మాట్లాడదాం
అలాగే చందమామతోటి కులాసా ఊసులాడదాం

వింటూంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటీ కధనం ?

పొరపాటు..కధకాదు..
గతజన్మలోన జాజిపూల సువాసనేమో !

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా !

పూవుల నదిలో..అందం గా నడుచుకుంటు పోనా
ఊహల రచనే.. తీయంగా చేసి తిరిగి రానా
వెన్నెల పొడిని నీ చెంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకీ అద్ది ఆడనా

అదేంటో మైకమే నను వదలినా పొద జరగదూ నిజమో

జడివానా..కురవాలీ..
ఎదలోయలోకి జారి పోయి దారి చూడూ !

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా !

No comments: