October 28, 2008

పంతులమ్మ (1977)


సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి

గానం: బాలు, పి.సుశీల


మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం ఆ.. ఆ
ఆ.. ఆ
యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాల దశ దిషాంతాల సుమ సుగంధాల బ్రహ్మార నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

జాబిలి కన్నా నా చెలి మిన్నా పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చెరగలనో
మనసున మామతై కడతేరగలనూ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ
తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమనీ
కలిసే దాకా అనుకోలేదు తీయని స్నేహమనీ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
సంసారం సంగీతం

****************************


గానం: బాలు

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఎలదేటిపాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే

తొలిపూత నవ్వే వనదేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే

అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే


****************************

గానం: బాలు

ఎడారిలో కోయిలా
తెల్లారనీ రేయిలా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

'పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే..
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే !'

ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే శిల అయితే మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే విరబూసినా మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూత
రగిలింది ఈ రాలుపూతా.. విధిరాతచేతా.. నా స్వర్ణసీతా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

'కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్ !
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ !!'

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాటా.. చెలిలేని పాటా.. ఒక చేదుపాటా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

****************************

గానం: పి.సుశీల


మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ
మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడై నాడు..ఆ..

తలచిన వారికి తారకరాముడు
పిలిచిన పలికే చెలికాడు సైబోడు
కోలువై ఉన్నాడు కోదండరాముడు
మన తోడుగా .. నీడగా .. రఘురాముడు

మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

కడకు బోయను ఆది కవిని చేసిన పేరు
గరళ కంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపర సాధనకు ఇరువైన పేరు
శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు
హనుమ ఎదలొ భక్తి ఇనుమడించిన పేరు
రామ రామ అంటే కామికమే తీరు
కలకాలము మమ్ము కాపాడు పేరు

మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

1 comment:

ఓ బ్రమ్మీ said...

కొన్ని పాటల మాటలు మనస్సుని సేద దీరుస్తాయి అంటారు .. అలాగే కొన్ని పాటల రాగాలు మనస్సుకి స్వాంతన చేకూరుస్తాయంటారు.. కానీ ఈ రెండూ కలసి మేళవించుకున్న పాటలు కొన్ని మాత్రమే.. అలాంటి వాటిల్లో ఇవి చేరతాయని నా అభిప్రాయం