సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరాం, గోపికా పూర్ణిమ
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..చెలీ ఇదేం అల్లరీ
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది..అరే ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా..పేరు కైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..చెలీ ఇదేం అల్లరీ
నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది ..నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది..నీదే కదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్న
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా..
ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..చెలీ ఇదేం అల్లరీ
కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది.. నువ్వూ అలా వస్తు ఉంటావనీ
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది.. చెలీ నీకై చూస్తు ఉంటాననీ
మనసు మునుపు ఎపుడూ ఇంతా ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనింది ఈ వింతా ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఎమి చెస్తున్నా పరాకే అడుగడుగునా..
ఓ దీని పేరేనా ప్రేమా అనే ప్రియ భావనా
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది..అరే ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా..పేరు కైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
No comments:
Post a Comment