October 26, 2008

గుండె ఝల్లుమంది (2008)

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: శివ దత్త

గానం: గీతా మాధురి

నీ నుదుటి చిరు చెమట .. కొనగోట మీట ..
నా పెదవిపైన బడి కదులుతూ నన్ను కవ్విస్తూ .. చెవులూరించినపుడు..
నాల్క జిల్లుమంది.. నా గుండె ఝల్లుమందీ
నా గుండె ఝల్లుమందీ !

*******************************

సాహిత్యం: శివ దత్త
గానం: గీతా మాధురి, జై శ్రీనివాస్

పావడ కాస్త పైకి లేపి నువు కోవెల వాకిలి దాటుతుంటే
కోవెల వాకిలి దాటుతుంటే
నీ కాలి గొలుసులో వేలాడే ఒక మువ్వ ఘల్లుమంది
నా గుండె ఝల్లుమంది గుండె ఝల్లుమంది !

వర్షం లో నిలువెల్ల తడుస్తూ విదిలించిన వాల్జెడలో జారీ
విదిలించిన వాల్జెడలో జారీ
ఆ చిరు చినుకులు నా చెంపలపై బడి వళ్ళు జిల్లుమంది
నా గుండె ఝల్లుమంది గుండె ఝల్లుమంది .. ది .. ది .. ది !

వళ్ళంతా నువు కళ్ళు చేసుకుని చూస్తున్నది నా తడిసిన వళ్ళని
చూస్తున్నది నా తడిసిన వళ్ళనీ
తెలిసిన క్షణమే నన్నేదో కొత్త సిగ్గు అల్లుకుందీ
నా గుండె ఝల్లుమంది గుండె ఝల్లుమంది .. ఈ .. ఈ .. ఈ !

ఎగురుతు నువు పండందుకొనుటలో ఎగసిపడే నీ సొగసులనీ
ఎగసిపడే నీ సొగసులనీ తొంగి తొంగి నే చూస్తూ ఉంటే చెంప చెళ్ళుమందీ
నా గుండె ఝల్లుమంది గుండె ఝల్లుమంది .. ఝల్లుమంది !

*****************************************************

సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: ఎం.ఎం.కీరవాణి, ఉష, భార్గవి పిళ్ళై

తిట్టుకుంటేనే .. కొట్టుకుంటేనే .. అప్పుడప్పుడూ ఒక్కటై చేసుకుంటేనే
ప్రేమలో టేస్టూ అర్ధమయ్యేదీ .. అనుభవించేదీ .. ఎంజాయ్ చేసేదీ !
ముట్టుకుంటేనే .. తట్టుకుంటేనే .. గట్టిగట్టిగా వళ్ళు హత్తుకుంటేనే

ప్రేమలో టేస్టూ అర్ధమయ్యేదీ .. అనుభవించేదీ .. ఎంజాయ్ చేసేదీ !

అర్ధమయ్యేదీ .. అనుభవించేదీ .. ఎంజాయ్ చేసేదీ !
True Love .. True Love .. True Love .. True Love ..
True Love .. True Love .. True Love .. True Love ..

నేనంటే నీకెంత ఇష్థం ?
కష్ఠం .. కష్ఠం .. చెప్పడం కష్ఠం .. కష్ఠం
చెప్పకుంటే నీకే నష్ఠం
ఇష్ఠం .. అందుకే ఇష్ఠం

ఎంతిష్ఠమో చెప్పవోయ్ !
చెప్పమ్మా !
అరె చెప్పరా !

వేళపాళా లేకా నీక్కూడా తిరిగేటంతా ..
ఓ !వాలంటైన్స్ డే లా రోజూ నీకూ అనిపించేటంతా
ఇంకా?
ఈత చెట్టంత

తాటి చెట్టంత
రాజధానిలో బుద్ద విగ్రహం అంత
ఏడుకొండలంత
ఎవరెస్టంత
చందమామంత
ఆకాశం అంతా !
ఇష్ఠం .. ఇష్ఠం .. ఇష్ఠం .. ఇష్ఠం !
ఎవరెస్టంత .. చందమామంత ..ఆకాశం అంతా !

True Love .. True Love .. True Love .. True Love ..
TrueLove .. True Love .. True Love .. True Love ..

లాగించవో ఫ్రెంచ్ కిస్సూ .. లిప్సూ .. షాంపైన్ కప్సూ
కొట్టుకుందాం కొంటె చీర్సూ .. వార్సూ .. టంగ్ తో వార్సూ
యుద్ధం చేసుకుందామా?

చేసుకుందామా !
ఏ యుద్ధం చేసుకుందాం .. రా ?

ప్రేమదేశాన్నంతా ఈ రోజే గెలిచే యుద్ధం
గుండె లోపల విరహాన్నంతా చంపేసే యుద్ధం
కంటితో యుద్ధంచెంపతో యుద్ధం

కౌగిలింతలో వీపు గిచ్చుతూ యుద్ధం
సిగ్గుతో యుద్ధం
అగ్గితో యుద్ధం
ధ్రిల్ కోసం యుద్ధం
యుద్ధం .. యుద్ధం .. యుద్ధం .. యుద్ధం
సిగ్గుతో యుద్ధం ..అగ్గితో యుద్ధం ..ధ్రిల్ కోసం యుద్ధం

Tounge War .. Tounge War .. Tounge War .. Tounge War ..
Tounge War .. Tounge War .. Tounge War .. Tounge War ..

No comments: