October 26, 2008

7G బృందావన్ కాలనీ

సాహిత్యం: ఎ.ఎం.రత్నం, శివ గణేష్
సంగీతం : యువన్ శంకర్ రాజా

గానం : శ్రేయా ఘోశాల్

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటినినీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా
నీకై నేను బ్రతికి ఉంటిని
నీలో నన్ను చూసుకొంటిని

కొలువు తీరు తరువుల నీడ....చెప్పుకొనును మన కధనెపుడు
రాలిపోయిన పూల గంధమా ఆ ఆ ఆ........
రాక తెలుపు మువ్వల సడిని .....తలచుకొనును దారులు ఎపుడు

పగిలిపోయిన గాజుల అందమా ఆ ఆ ఆ.......
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీచేత

వడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తోలి స్వపం చాలులే ప్రియతమా కనులు తెరువుమా

మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో

జగము కరుగు రూపే కరుగునా ఆ ఆ ఆ ........
చెరిగిపోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో

నీదు చూపు నన్ను మరచునా ఆ ఆ ఆ .........
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు

కళ్ళ ముందు సాక్షాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తానీకై నేను బ్రతికి ఉంటినినీలో నన్ను చూసుకొంటిని


***************************************************************

Male version : Kay Kay

తలచి తలచి చూసా వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసి చదువవేళ కాలి పోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నిలో నన్ను చూసుకొంటిని

కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగె ఏమని తెలుప
రాలిపొయిన పూల మౌనమా ఆ ఆ ఆ......
రాక తెలుపు మువ్వల సడిని దారులడిగె ఏమని తెలుప
పగిలిపొయిన గాజులు పలుకునా ఆ ఆ ఆ........
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ
ఒడిన వాలి కధలను చెప్ప సఖియ నేడు ఏదీ
తొలి స్వప్నం ముగియక మునుపే నిదురే చెదిరెలే

తలచి చూసా వలచి విడిచి నడిచానీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నిలో నన్ను చూసుకొంటిని

మధురమైన మాటలు ఎన్నోమారుమ్రోగే చెవిలో నిత్యం
కట్టెకాలు మాటే కాలునా ఆ ఆ ఆ....
చెరిగి పోని చూపులు నన్నుప్రశ్నలడిగే రేయి పగలు
ప్రాణం పోవు రూపం పోవునా ఆ ఆ ఆ....
వెంట వచ్చు నీడ కూడా మంట కలిసి పోవు
కళ్ళ ముందు సాక్షాలున్నా నమ్మ లేదు నేను
ఒక సారి కనిపిస్తావని బ్రతికే ఉంటిని

*************************************

గానం: కార్తీక్

కన్నుల బాసలు తెలియవులే..కన్నెల మనసులు
ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే..చేతులు సంద్రాన్ని మూయలేవులే
ఇవి అద్దాల మనసు కాదులె..చేతులు సంద్రాన్ని మూయలేవులే

గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్న గానీ..మనసు మాత్రం మారదులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే

అనుదినమూ ఇక తపియించే..యువకుల మనసులు తెలియవులే

హే.. కన్నుల బాసలు తెలియవులే..కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే..చేతులు సంద్రాన్ని మూయలేవులే

అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే
కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగూ..దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురుగుకు తెలియదులే
కళ్ళు నీకు సొంతమట..కడగళ్ళు నాకు సొంతమట

అల కడలి దాటగనే..నురుగులిక వొడ్డుకు సొంతమటా

కన్నుల బాసలు తెలియవులే..కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే..చేతులు సంద్రాన్ని మూయలేవులే

లోకాన పడుచులు ఎందరున్ననూ..మనసు ఒకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా..అది ప్రాణం తోనే ఆటాడులే
మంచుబిందువొచ్చి ఢీకొనగా..ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
యే ఉప్పెనొచ్చినా కొండ మిగులును..చెట్లు చేమలు

నవ్వు వచ్చులే..ఏడుపొచ్చులే..ప్రేమలో రెండూ కలిసే వచ్చులే

ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినమూ ఇక తపియించే..యువకుల మనసులు తెలియవులే

కన్నుల బాసలు..హే..కన్నుల బాసలు తెలియవులే..కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే..చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే

దెబ్బలెన్నీ తిన్న గానీ..మనసు మాత్రం మారదులే


*******************************************************************

గానం : హరీష్ రాఘవేంద్ర , మధుమిత


కలలు గనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ ఆ .......
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం
వెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము
లోకం లో తియ్యని భాషా శలయం లో పలికే భాషా
మెలమెల్లగ వినిపించే ఘోషా ఆ ఆ ఆ .....
కలలు గనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా


తడికాని కాళ్ళతోటీ కడలికేది సంభంధం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుభంధం
ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలుగనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
కల్లోన కొన్ని హద్దులు ఉండును స్నేహం లో అవి ఉండవులే
ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే


కలలు గనే కాలాలు కరగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గులే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే
తెల్లవారు ఘాముల్లన్నీ నిద్రలేక తెలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తొచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించి
గుండేల్లో ఏవో గుసగుసలు వినిపించె
అపుడపుడు చిరు కోపం రాగా నలిగెను ఎందుకు అంచులారా
భుకంపం అది తట్టుకోగలము అధికంపం అది తట్టుకోలేం

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గులే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

No comments: