October 24, 2008

సత్యం

సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: వేణు

మధురమే..మధురమే..మధురమే..
ఈ కనులకి కలలు మధురమే..సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై..నీ నవ్వే తేనెల వానై..నా కోసం వస్తే మధురమే..
ఆ..నన్నే తడిపేస్తే మధురమే

నీకోసం నే రాసే చిరుపాటైనా మధురమే
నాకోసం నువు పలికే అరమాటైనా మధురమే..
నీకోసం నే రాసే చిరుపాటైనా మధురమే
నాకోసం నువు పలికే అరమాటైనా మధురమే..

లిపి లేని..సడి లేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించే ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే..నీ దరహాసం మధురమే
ఉంటే..నువ్వుంటే ఆ శూన్యం అయినా మధురమే..మధురమే

మధురమే..మధురమే..మధురమే..
ఈ కనులకి కలలు మధురమే..సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై..నీ నవ్వే తేనెల వానై..నా కోసం వస్తే మధురమే..
ఆ..నన్నే తడిపేస్తే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే

ఉదయాన ఉదయించే ఆ సూర్యుడు ఎరుపు మధురమే
రేయంతా వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి ఎరుపు మధురమే..చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే..తను రాల్చే ఆ కన్నీరైనా మధురమే..మధురమే
మధురమే..మధురమే..మధురమే..

ఈ కనులకి కలలు మధురమే..సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై..నీ నవ్వే తేనెల వానై..నా కోసం వస్తే మధురమే..
ఆ..నన్నే తడిపేస్తే మధురమే

****************************************

I am in Love.. I am in Love..I am in Love with you

కనులలో.. దాచినా.. కావ్యమే నువ్వూ

కావేరి కదిలితే..మేఘాలు ఉరిమితే..మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే..ఈ నేల చేరిన..చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరటం కొరకే !

I am in Love.. I am in Love..I am in Love with you

కనులలో.. దాచినా.. కావ్యమే నువ్వూ

కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్న ప్రాణమా
వెన్నెల్లో గోదారీ..నువ్వే నా వయ్యారీ..నే నీటి చుక్కైపోవాలీ
నవ్వేటి సింగారీ..వెళ్ళొద్దు చేజారీ..నిను చేరి మురిసిపోవాలీ

చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయీ
నిను నేను చేరుకుంటే హాయీ !

నీవు ఎదురుగ నిలిచి ఉండగ మాట దాటదు పెదవినీ
నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు సోకెను మనసునీ

నీ చెంత చేరాలీ స్వర్గాన్నే చూడాలీ..నేనీలో నిండిపోవాలీ !
నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో..నిలువెల్లా నేనే తడవాలీ !

నాలోని ప్రేమా ఏనాటికైనా నీకే అంకితమవ్వనీ
నీకే అంకితమవ్వనీ !

No comments: