October 24, 2008

ఆనంద్

సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: కె.ఎం.రాధాకృష్ణన్, శ్రేయా ఘోషల్

నువ్వేనా..నా నువ్వేనా
నువ్వేనా..నాకు నువ్వేనా

సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభతమేనా
మాటలాడే చూపులన్ని మౌన రాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా..ఆ
ఆనందమేనా..ఆనందమేనా !

నువ్వేనా..నా నువ్వేనా
నువ్వేనా..నాకూ నువ్వేనా

మేఘమల్లె సాగి వచ్చి..దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి..మెరిసి మాయమౌతావు
కలలేనా..కన్నీరేనా

తేనెటీగ లాగ కుట్టి..తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన..దారమల్లె దాగుతావు
నేనేనా..నీ రూపేనా

చేరువైన..దూరమైన..ఆనందమేనా
చేరువైన..దూరమైన..ఆనందమేనా
ఆనందమేనా..ఆనందమేనా !

నువ్వేనా..నా నువ్వేనా
నువ్వేనా..నాకు నువ్వేనా

కోయిలల్లె వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటె నవ్వుతావు
ఏ రాగం ..ఇది ఏ తాళం

మసక ఎన్నెలల్లె నీవు..ఇసుక తిన్నె చేరుతావు
గస గసాల కౌగిలింత..గుస గుసల్లే మారుతావు
ప్రేమంటే..నీ ప్రేమేనా

చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా..ఆనందమేనా !

నువ్వేనా..నా నువ్వేనా
నువ్వేనా..నాకు నువ్వేనా


**************************************************************


గానం: హరిహరన్

ఎదలో గానం .. పెదవే మౌనం
సెలవన్నాయి కలలు .. సెలఏరైన కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో..అలజడిలో (2)


కట్టు కధలా ఈ మమతే కలవరింతా
కాలమొక్కటే కలలకైన పులకరింతా
శిల కూడ చిగురించే విధి రామయణం
విధికైన విధి మార్చే కధ ప్రేమాయణం
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా


ఎదలో గానం .. పెదవే మౌనం
సెలవన్నాయి కలలు .. సెలఏరైన కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో..అలజడిలో


శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులో ఎగసిన ఊసులు
మూగే మనుసులో అవి మూగవై
తడి తడి వయ్యరాలెన్నో
ప్రియా ప్రియా అన్న వేళలోన..శ్రీ గౌరీ



ఎదలో గానం .. పెదవే మౌనం
సెలవన్నాయి కలలు .. సెలఏరైన కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో..అలజడిలో

No comments: