October 24, 2008

చక్రం

సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చక్రి

ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా

నా పేరు నీ ప్రేమనీ..నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ..నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా

నేను అనీ..లేను అనీ..చెబితె ఏం చేస్తావూ
నమ్మననీ..నవ్వుకొనీ..చాల్లె పొమ్మంటావూ
నీ మనసులోని ఆశగా..నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్సగా..తగిలేది నేననీ
నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ
తల ఆన్చి నీగుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా

నీ అడుగై నడవడమే..పయనమన్నది పాదం
నిను విడిచీ బతకడమే..మరణమన్నది ప్రాణం
నువు రాక ముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలి పోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా..నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ..నీకైన తెలుసా అనీ
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ..నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ..నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని..

ఒకే మాటా..
ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా


********************************

గానం: కౌసల్య

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా
అందించనీ అధిరే అధరాంజలి..బంధించనీ కాలాన్నీ కౌగిలీ
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి..మంటల్లె నను మరిగించాలి

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా

తలుపేసుకుంటే .. నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే .. స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నర నరమునా
ఇక నా వశము కాకుంది యమ యాతనా
లేని పోని నిందలు గాని..హాయిగానే ఉందని గాని
ఉన్నమాట నీతో చెప్పనీ

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా

అమ్మాయినంటూ .. నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు .. గుండెల్లోకే చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసు కంది మన్మధలేఖ..కెమ్ముమంది కమ్మని కేక
వయసు కందిపోయే వేడిగా..

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా
అందించనీ అధిరే అధరాంజలి..బంధించనీ కాలాన్నీ కౌగిలీ
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి..మంటల్లె నను మరిగించాలి

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా


******************************************

గానం: శ్రీ

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

కవినై..కవితనై..భార్యనై..భర్తనై
కవినై..కవితనై..భార్యనై..భర్తనై
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ..

వంటరినై అనవరతం .. ఉంటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై..
వెన్నెల పూతల మంటను నేనై..
రవినై..శశినై..దివమై..నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ

వంటరినై ప్రతినిముషం .. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల..హరిణాల్ని హరిణాల..చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని..ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది

గాలిపల్లకీ లోన తరలినా పాట పాప ఊరేగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె

నా హృదయమే నా లోగిలీ..
నా హృదయమే నా పాటకి తల్లీ..
నా హృదయమే నాకు ఆలి..
నా హృదయములో ఇది సినీ వాలి..

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది


***********************************

No comments: