సంగీతం : హారీస్ జయరాజ్
సాహిత్యం : వేటూరి
గానం: నరేష్ ఆయ్యర్ , ప్రశాంతిని
మొన్న కనిపించావు మైమరచిపోయానే
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నేన్ని నాళ్ళయినా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
నీ పొద్దే నా తోడు వచ్చేయి ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
నీ పొద్దే నా తోడు వచ్చేయి ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను హత్తుకోక పోతానా అందగాడ
నీడ బోలె వెంబడి ఉంటా తోడూగా చెలీ
పొగవలె పరుగున వస్తా తాకనే చెలీ
వేడుకలు కలలునూలు వింతవో చెలి
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నేన్ని నాళ్ళయినా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే
కడలి నీళ్ళు పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు జిల్లుమంటోందే ఈ వేళలో
తల వాల్చే ఎడడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావే పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే
హృదయమంతా నిన్నే కన్నా దరికి రాకనే
నువ్వు లేక నాకూ లేదు లోకమన్నది
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నేన్ని నాళ్ళయినా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
నీ పొద్దే నా తోడు వచ్చేయి ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
నీ పొద్దే నా తోడు వచ్చేయి ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జతవెన్నెలా ....వెన్నెలా ...వెన్నెలా
No comments:
Post a Comment