సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కళ్యాణి మాలిక్, సునీత
నువ్వు నిజం .. నీ నవ్వు నిజం .. నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు .. ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం .. నా ప్రేమ నిజం .. ఇది పిచ్చితనం అనకు
అన్నా మనసు మాట వినదు..విన్నా అవును కాదు అనదు
నీలో నా సంతకం ..చెరిపే వీల్లేదుగా ..నాలో నీ జ్ఞాపకం ..కరిగే కల కాదుగా
నువ్వూ నేనూ రెండక్షరాలుగా..మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా..పిలిపించుకోగా
ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్ఠపదులు..వెంటే పడవా అష్ఠదిశలూ
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంట లేని ఎదలో మనకే తగులుతుంది ఉసురు
చెబితే వినవే ఎలా..ఎగసే నిట్టూర్పులూ
చలితో అణిచేదెలా..రగిలే చిరుగాలులూ
నువ్వూ నేనూ రెండక్షరాలుగా..మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా..పిలిపించుకోగా
ఎప్పటికీ నను తప్పుకునే వీలివ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు..కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవే నల నల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు..చూస్తూ మేలుకోవు కనులు
మనసే దోస్తే ఎలా..
కనకే ఈ సంకెలా..
వొడిలో పడితే ఎలా..అడుగే కదిలేదెలా
నువ్వూ నేనూ రెండక్షరాలుగా మారాలిగా..ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా..ఇకపైన కొత్తగా..మన పేరుగా పిలిపించుకోగా
No comments:
Post a Comment