April 03, 2009

శ్రీరామదాసు (2006)

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


ఓం శ్రీరామ రామ రామేతి
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
రమే రామే మనోరమే
సహస్త్రనామ తత్తుల్యం
సహస్త్రనామ తత్తుల్యం
రామనామ వరాననే


****************

ఓం .. ఓం .. ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః !

అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కధగా..సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సమపదగా
వెలసిన దక్షిణ సాకేతపురీ..

అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

రాం .. రాం .. రాం .. రాం
రామనామ జీవన నిర్మిత్రుడు పునః దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడూ
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువూ

త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడూ

ధరణిపతియే ధరకు అల్లుడై..
శంఖచక్రములు అటు ఇటు కాగా..
ధనుర్బాణములు తనువై పోగా..
సీతాలక్ష్మణ సమితుడై..
కొలువు తీరె కొండంత దేవుడూ..

శిలగా మళ్ళీ మలచీ..
శిరమును నీవే నిలచీ..
భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ

వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే
శంఖం శరం దక్షిణే.
విఘ్రాణం జలజాత పత్ర నయనం
భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం
సౌమిత్రి యుక్తం భజే !

అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ


*************************************

రామా..శ్రీరామా..కోదండ రామా !
ఎంతో రుచిరా
ఎంతో రుచిరా !

శ్రీరామ ఓ రామ..శ్రీరామా !

శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

కదళీ ఖర్జూరాది ఫలముల కన్ననూ
కదళి ఖర్జూరాది ఫలముల కన్ననూ
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

నవసర పరమాన్న నవనీతముల కన్న
అధికమౌ నీ నామ మేమి రుచిరా

శ్రీరామ ..
అహ శ్రీరామ
ఓ రామ..ఓ రామ

శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా

శ్రీరామ..ఓ రామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా !


**********************************

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు

ఇదె సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె

ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే

మాయల బంగారు లేడి మాయని గురుతులివే

పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్ళివే

దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే

అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే

ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమీ
మరి నా రామునికీడ నిలువ నీడ లేదిదేమీ
నిలువ నీడ లేదిదేమీ !


*******************************

అంతా రామమయం !
ఈ జగమంతా రామమయం !!
రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !!
అంతా రామమయం !!!

అంతరంగమున ఆత్మారాముడు..
రామ రామ రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
అంతా రామమయం !!

ఓం నమో నారాయణాయ !
ఓం నమో నారాయణాయ !!
ఓం నమో నారాయణాయ !!!

అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !

రామ రామ రామ రామ రామ రామ రామ !

సిరికిన్ జెప్పడు..శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు..అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ..
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ..
గజప్రాణావనోత్సాహియై !


******************************************

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా

శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా

రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా
ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా

హనుమత్సేవిత నిజపద రామా..సీతా ప్రాణా ధారక రామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా


*********************************************

తండ్రిమాటను నిలుపగా
రాముండు అడవులకు పయనమయ్యే
నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే !

ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అనె రాముడూ !
నీడనే వదిలిపెట్టీ మీరెలా వెళ్ళగలరనెను సీతా !


**********************************

అల్లా .. శ్రీరామా !

శుభకరుడు..సురుచిరుడు..భవహరుడు..భగవంతుడెవడూ..
కళ్యాణగుణగణుడు..కరుణా ఘనాఘనుడు ఎవడూ..
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ..
ఆనందనందనుడు..అమృతరసచందనుడు..రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ !

తాగరా శ్రీరామనామామృతం .. ఆ నామమే దాటించు భవసాగరం !
తాగరా శ్రీరామనామామృతం .. ఆ నామమే దాటించు భవసాగరం !!

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ..

ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ..

ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తీ !

తాగరా .. తాగరా శ్రీరామనామామృతం .. ఆ నామమే దాటించు భవసాగరం !

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పూ..

ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పూ..

ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ..
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పూ !

తాగరా .. తాగరా శ్రీరామనామామృతం .. ఆ నామమే దాటించు భవసాగరం !


*******************************************************

శ్రీరఘునందన..సీతా రమణా !
శ్రితజనపోషక రామా !
కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామా !

ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామా !
నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా !

వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా !
భాసుర వర సద్గుణములు కల్గిన భధ్రాద్రీశ్వర రామా !

ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామా !

జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం ..
జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం ..
జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం ..


********************************************************

కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ !
కలలో నీ నామ స్మరణా ..మరువ చక్కని తండ్రీ !
పిలిచిన పలుకవేమి..పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి. కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ !
పలుకే..

పలుకే బంగారమాయెనా..కోదండపాణి.. పలుకే బంగారమాయెనా..

ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రీ !

పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయెనా.. పలుకే బంగారమాయెనా..
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భధ్రాచల వర రామ దాసపోషా !

పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయెనా.. పలుకే బంగారమాయెనా..

పలుకే బంగారమాయెనా..కోదండపాణి.. పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి. కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ !
పలుకే బంగారమాయెనా.. పలుకే బంగారమాయెనా..


***************************************

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే ..
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే ..

నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా..జననీ జానకమ్మా !
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే ..

లోకాంతరంగుడు..శ్రీకాంత నిను గూడి..ఏకాంతమున ఏక శయ్యానున్నా వేళ
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే ..

ఆద్రీజావినుతూడు..భధ్రగిరీశుడు..నిద్రా మేల్కొనూ వేళ..నెరతలో భోధించి
నను బ్రోవమనీ..నను బోర్వమనీ..
నను బ్రోవమని చెప్పవే..
సీతమ్మ తల్లీ !


****************************************************

ఇక్ష్వాకు కుల తిలకా..ఇకనైన పలుకవే
రామచంద్రా..నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా !

చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా !
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా !

లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా !
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా !

సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకమూ రామచంద్రా !
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !

కలికీతు రాయి నీకూ కొలుపుగా జేయిస్తినీ..రామచంద్రా !
నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా !
లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా !
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా !
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా !


****************************************

దాశరధీ..కరుణా పయోనిధీ !

నువ్వే దిక్కని నమ్మడమా..నీ అలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా..రామకోటి రచియించడమా

సీతారామస్వామి..నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి..నీ దర్శనమియ్యవిదేమి
దాశరధీ..కరుణా పయోనిధీ !

గుహుడు నీకు చుట్టమా..గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా..ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా..
నీ దర్శనమే ఇమ్మంటిని కానీ !

ఏల రావు ? నన్నేల రావు? నన్నేల ఏల రావూ ?

సీతారామస్వామీ..
సీతారామస్వామి..నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి..నీ దర్శనమియ్యవిదేమి

రామ..రసరమ్య ధామ..రమణియ నామ
రఘువంశసోమ..రణరంగభీమ..రాక్షసవిరామ
కననీయ కామ..సౌందర్య సీమ..నీరదశ్యామ
నిజభుజోద్దామ ..భూజనలలామ..భువనజయ రామ
పాహి భద్రాద్రి రామ..పాహీ !

దక్షణ రక్షణ..విశ్వ విలక్షణ..ధర్మ విచక్షణ
గోదారి కలిసెనేమిరా !
డాండడడాండడనినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి
నే పొగడు నీ అభయవ్రతమేదిరా !
ప్రేమరసాంతరంగ హృదయంగమ శుంగ శుభంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ
సుసంగ సత్య సారంగ సుశృతి విహంగ పాపపుధుసంగ విభంగా !
భూతల పతంగా !
మధు మంగళరూపము చూపవేమిరా !

గరుడగమన రారా !
గరుడగమన రారా !


********************************************************************

చరణములే నమ్మితీ..నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ..నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ..

వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ..

పావన రామ నామ సుధా రస పానము చేసే దెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నెంచే దెన్నటికో

రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జరరామా

చంచల గుణములు మాని సదా నిశ్చల మదియై నుండే దెన్నటికో
పంచ తత్వములు తారక నామము పఠియించుట నాకెన్నటికో

రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జరరామా

నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ వృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ వృందలోలం

జలజ సంభవాది వినుతా..

జలజ సంభవాది వినుతా..
జలజ సంభవాది వినుతా..
జలజ సంభవాది వినుతా..
జలజ సంభవాది వినుతా..
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం

నందబాలం భజరే నందబాలం
బౄందావన వాసుదేవ వృందలోలం
నందబాలం భజరే నందబాలం
బౄందావన వాసుదేవ వృందలోలం

శ్రీరామ నామం మరువాం మరువాం .. సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం .. సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం ..
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం ..
దేవుని గుణములు తలుతాం తలుతాం ..
దేవుని గుణములు తలుతాం తలుతాం ..
శ్రీరామ నామం మరువాం మరువాం .. సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం

శ్రీరామ నామం మరువాం మరువాం .. సిద్దము యమునికి వెరువాం వెరువాం

హే జై జై రామా..జానకి రామా
జై జై రామా..జానకి రామా
పావన నామా..పట్టాభి రామా
పావన నామా..పట్టాభి రామా
నిత్యము నిన్నే..కొలిచెద రామా
అహ నిత్యము నిన్నే..కొలిచెద రామా
ఆహా రామా..అయోధ్య రామా
ఆహా రామా..అయోధ్య రామా
రామా రామా..రఘుకుల సోమా
అహ రామా రామా..రఘుకుల సోమా
జై జై రామా..జానకి రామా
జై జై రామా..జానకి రామా
జై జై రామా..జానకి రామా

రామా..రామా !


****************************

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే !
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః !

భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా !
భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా !

వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా !
వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా !

సతత రామ దాస పోషకా..శ్రీ రామచంద్ర వితత భద్రగిరి నివేశకా !
భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా !
బాహు మధ్య విలసితేంద్రియా..
బాహు మధ్య విలసితేంద్రియా..

కోదండరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ !
కోదందరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ !

తల్లివి నీవే..తండ్రివి నీవే..దాతవు నీవే..దైవము నీవే !
కోదండరామా కోదండరామా రామ రామ కోందండరామ !

దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా !
దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా !

దశరధ రామా గోవిందా !

దశముఖ సం హార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖ చక్రధరా !
దశరధ రామా గోవిందా !

తక్కువేమి మనకూ..రాముండొక్కడుండు వరకూ !
తక్కువేమి మనకూ..రాముండొక్కడుండు వరకూ !

ఒక్క తోడుగా భగవంతుండు మును చక్రధారియై చెంతనె ఉండగ
తక్కువేమి మనకూ..రాముండొక్కడుండు వరకూ !
తక్కువేమి మనకూ..రాముండొక్కడుండు వరకూ !

జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా
జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా

పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
పాహి రామప్రభో !

శ్రీమన్మహాగుణ స్తోమాభి రామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామప్రభో !
సుందరాకార మన్మందిరాద్ధార సీతేందిరా సం యుతానంద రామప్రభో !
పాహి రామప్రభో !
పాహి రామప్రభో !
పాహి రామప్రభో !


***************************************************

ఓం గం క్లీం లక్ష్మీ గణపతయే నమః !
శ్రీరాఘవం ! దశరధాత్మజ మప్రమేయం !
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం !
ఆజానుభాహుం అరవిందదళాయతాక్షం !
రామం నిశాచర వినాశకరం నమామీ !
ఓం !

No comments: