April 23, 2009

కార్తీక్

సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం: శ్రీధర్
గానం: భీం శంకర్

మనసు మనసు కోసం మౌనంగా తపించే వయసులో
కనులు కలల కోసం కాలాన్నే వెంటాడే తపస్సులో
తొలి మంచు తెరలలో వికసించే ఉదయమై
తొలి చూపు ప్రేమలో కరుణించే హృదయమై
నీవు పుట్టింది నాకోసమేనా.. నేను పుట్టింది నీ కోసమేనా !

మనసు మనసు కోసం మౌనంగా తపించే వయసులో
కనులు కలల కోసం కాలాన్నే వెంటాడే తపస్సులో

అలలుగా కదిలాయి..నీ వాలుచూపులు నా దేహ తీరాలలో
కలలుగా మెరిసాయి..నీ దోరనవ్వులు నా కళ్ళ లోకాలలో
నా గుండె ఆశ ఎగసింది నిను చూసీ
నా గొంతులో పాట పూసింది నిను చూసీ

మనసు మనసు కోసం మౌనంగా తపించే వయసులో
కనులు కలల కోసం కాలాన్నే వెంటాడే తపస్సులో

మబ్బుల్లో వెలిగింది.. ఒక మంచు దీపం నా స్వప్న లోకాలలో
వెన్నెలై కురిసింది.. ఆ ప్రేమ రూపం నాలోని చీకట్లలో
నీ ఊహలో మేను ఎగసింది గగనాన
నీ ధ్యాసలో హాయి పొంగింది హృదయాన

మనసు మనసు కోసం మౌనంగా తపించే వయసులో
కనులు కలల కోసం కాలాన్నే వెంటాడే తపస్సులో
తొలి మంచు తెరలలో వికసించే ఉదయమై
తొలి చూపు ప్రేమలో కరుణించే హృదయమై
నీవు పుట్టింది నాకోసమేనా.. నేను పుట్టింది నీ కోసమేనా !

మనసు మనసు కోసం మౌనంగా తపించే వయసులో
కనులు కలల కోసం కాలాన్నే వెంటాడే తపస్సులో

*********************************************
గానం: సందీప్, ఉష

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా
ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

హృదయాలు పాడే ఈ ప్రేమ గీతం సాగే సదా

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

ఏ మాయ చేసింది ఈ జాబిలమ్మ
ఏ మాయ చేసింది ఈ జాబిలమ్మ
ఏ మత్తు చల్లింది ఈ వెన్నెలమ్మ
ఎదలో సితారా..పలికే ఈ వేళా..నాలోని లోకాన నీ గానమే

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

చిరుగాలిలా నన్ను తాకింది ప్రేమా
చిరుగాలిలా నన్ను తాకింది ప్రేమా
సిరిమల్లెలా మనస్సు దోచింది ప్రేమా
ప్రేమంటే నీవే..ప్రేమించరావే..నీ ప్రేమ నా శ్వాసగా మారగా

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

నువు లేక క్షణమైన నేనుండలేనూ..
నువు లేక క్షణమైన నేనుండలేనూ..
నువు తోడు లేకున్న నే నేను కానూ..
ఏ జన్మకైనా నీ నీడ చాలు..ఆపైన కోరేది ఏముందిలే
ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

No comments: