March 31, 2009

ఆకాశమంత .. I love my Daughter !

" జీవితం .. యాంత్రికంగా, వేగంగా సాగుతుంది.

మొదటి ప్రేమ .. మొదటి ముద్దు .. మొదటి గెలుపు ఇలా 30 సంవత్సరాల జీవితం లో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం !

అందులోనూ ముఖ్యమైన ఘట్టం తల్లిగానో, తండ్రిగానో మారే సమయం !
పుట్టిన బిడ్డను మొట్టమొదటి సారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం .. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం ..

పెళ్ళికాని వాళ్ళు మీరు పుట్టినపుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి.

మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి.
ఆహా ఇదే ఇదే అని అంటారు ..."

- ప్రకాష్ రాజ్

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: అనంత శ్రీరాం

గానం: మధు బాలకృష్ణన్

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా

మేఘాల పల్లకి తెప్పిస్తా .. లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా .. చల్లనీ హాయినందిస్తా (2)

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా

అడుగులే పడుతుంటే .. ఎదనిలా తడుతుంటే
మధురమౌ భావాలేవో మోగే లోలోనా ..
పలుకులే పైకొస్తే .. చిలిపిగా పిలుపిస్తే
పులకలే పదులై వేలై పొంగే నాలోనా ..

లాలిపాటే నేనై .. లాలపోసే వాణ్ణై
లాలనే నింపనా లేత హృదయానా !

మేఘాల పల్లకి తెప్పిస్తా .. లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా .. చల్లనీ హాయినందిస్తా

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా

ఎగురుతూ నీ పాదం .. ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపూ .. అలుగుతూ కాసేపూ
అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం

క్షణములెన్నౌతున్నా .. వయసు ఎంతొస్తున్నా
పాపవే పాపవే నాన్న నయనానా !

మేఘాల పల్లకి తెప్పిస్తా .. లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా .. చల్లనీ హాయినందిస్తా

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా
*************************************
"ఒక పువ్వు వికసించటం, మరో పువ్వు వాడిపోవటం లాగానే బంధమూ-ఎడబాటు.
మనం పెంచుకున్న బంధాన్ని హఠాత్తుగా పంచుకోవటానికి ఎవరో వచ్చే తీరతారు. మొదట ఆశ్చర్యపోయినా, తరువాత అలవాటు పడిపోతాం. అయినా, ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళు మనల్ని వదలి వెళ్ళిపోతే, మనమేం చెయ్యాలి? "

- ప్రకాష్ రాజ్

సాహిత్యం: అనంతశ్రీరాం
గానం: ఎస్.పి.బాలు

దూరం కావాలా నన్నే విడిచీ .. వేరై పోవాలా అన్నీ మరిచీ

దూరం కావాలా నన్నే విడిచీ .. వేరై పోవాలా అన్నీ మరిచీ
ఎప్పుడూ ఒదిగే ఎదపై విసిగీ ..
దూరం కావాలా నన్నే విడిచీ .. వేరై పోవాలా అన్నీ మరిచీ

వేలుని వీడని చేతుల వత్తిడి ఇంకా మరి గురుతుందే
లాలికి వాలిన రెప్పల సవ్వడి ఇంకా వినిపిస్తుందే
గుండెల అంచున పాదము తాకిడి ఇంకా నను తడిమిందే
పూటకి పూటకి పండగలౌ గతమింకా తరిమిందే

ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నువ్వే లోకం
నీ నాన్నగా నా ప్రేమలో ఉందా లోపం
వేరే దారే వెతికీ ..

దూరం కావాలా నన్నే విడిచీ .. వేరై పోవాలా అన్నీ మరీచి

నమ్మిన వెంటనే తొందర పాటున నువ్వే మనసిచ్చావా
నా ప్రతి ఊపిరి నీ ప్రాణములో ఉంచానని మరిచావా
నాన్నని మించిన చల్లని ప్రేమని నీకే పంచిస్తాడా
కన్నుల చాటున మెల్లగ పెంచిన నిన్నే తను కాస్తాడా

నే కోరిన తీరాలనే చూశావేమో
నీ దారిలో ఆ తీరమే చేరావేమో
అయినా అయినా వెళుతూ ..

దూరం కావాలా నన్నే విడిచీ .. వేరై పోవాలా అన్నీ మరిచీ
ఎప్పుడూ ఒదిగే ఎదపై విసిగీ ..
దూరం కావాలా నన్నే విడిచీ .. వేరై పోవాలా అన్నీ మరిచీ

2 comments:

Radhika said...

Hello Venugaru, patala pallaki emaipoyindaa anukunnaanu. kotta pallakii chaalaa chaalaa baavundi.

aa mallepoovu pic adii chala pleasant ga unnadi.
nice.

and the first lyric about a dad's love is beautiful.

వేణూశ్రీకాంత్ said...

లిరిక్స్ బాగున్నాయ్ వేణు గారు. నాకు ఇంకా వినే అవకాశం దొరక లేదు. ఈ రోజే ప్రయత్నిస్తాను.