April 22, 2009

నాని

సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హరిహరన్, హరిణి



వస్తా నీ వెనుక..ఎటైనా కాదనకా..ఇస్తా కానుకగా..ఏదైనా లేదనకా
వేగం పెంచి..వలపును పెంచే వేడుక ఇది కనుకా..హే వేడుక ఇది కనుకా..
మైమరపించి..మమతను పంచే వెచ్చని ముచ్చటగా..వెచ్చని ముచ్చట..వెచ్చని ముచ్చటగా..


కన్నుల్లో నీ రూపం .. గుండెల్లో నీ స్నేహం
కన్నుల్లో నీ రూపం .. గుండెల్లో నీ స్నేహం


కన్నుల్లో నీ రూపం ..ఇకపైన నా ప్రాణం .. ఇకపైన నా ప్రాణం
ఈ జన్మ నీ సొంతం.. ఈ బొమ్మ నీ నేస్తం
విడవకు ఏ నిముషం .. విడవకు ఏ నిముషం


వస్తా నీ వెనుక..ఎటైనా కాదనకా..ఇస్తా కానుకగా..ఏదైనా లేదనకా
నర నరం మీటే ప్రియ స్వరం వింటే
నర నరం మీటే ప్రియ స్వరం వింటే..
కాలం నిలబడదే.. కాలం నిలబడదే..
కలలన్నీ నిజమేగా..నిజమంటి కలలాగా..
కలలన్నీ నిజమేగా..నిజమంటి కలలాగా..
వొడిలో ఒకటైతే.. వొడిలో ఒకటైతే..


వస్తా నీ వెనుక..ఎటైనా కాదనకా..ఇస్తా కానుకగా..ఏదైనా లేదనకా


****************************************

సాహిత్యం : సిరివెన్నెల
గానం : హరిహరన్, పూర్ణిమ



నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే
నువ్వు నేను లోకమంటే మనమే అందామా
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను
ఇంతకంటె ఎందుకనుకుందామా!


ఇస్తమొచ్చినట్టు ఉందాం మనకి తోచినట్టు చేద్దాం
ఇస్తమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
ఈ ఏకాంతం మనకే సొంతం
ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం


నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే
నువ్వు నేను లోకమంటే మనమే అందామా
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను
ఇంతకంటె ఎందుకనుకుందామా!


gotta get gotta get gotta get up
if you wanna be a lady and you can never be free
gotta get gotta get gotta get up
if you really wanna be strong take a look at me
get up get up we're never alone
get up get up we're standing alone
get up get up we're never alone
get up get up we're standing alone
calling all the ladies all the young ladies
calling all the girls to sing along
tell me can you hear me
can you see me clearly
while i make you sing this happy happy song


చంటిపాప లాంటి మనసున్నవాడు
కొంటె కృష్ణుడల్లె మహ తుంటరోడు
మన్మధుడికంటె గొప్ప అందగాడు
నా మదినే దోచేసాడు
ఎవరే అంతటి మొనగాడు
ఏడే ఎక్కడ ఉన్నాడు
వాడేనా నీ జతగాడు
వదిలేస్తావా నాతోడు
సరిసాటి లేని ఆ మగవాడు
ఒకడంటె ఒకడే ఉన్నాడు
ఇటు చూడిలాగ నా కంటి పాపలో నువ్వే ఆ ఒకడూ


నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే
నువ్వు నేను లోకమంటే మనమే అందామా
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను
ఇంతకంటె ఎందుకనుకుందామా!


చందమామ సిగ్గుపడి తప్పుకోని సిగ్గులేని జంట ఇది అనుకోని
చుక్కనైన నిన్ను చూసి చుక్కలోనె ఆకాశం లో దాక్కోనీ
అందం ఉన్నది నీకోసం ఇందా అన్నది సావాసం
నీతోనే నా కైలసం నువ్వేగా నా సంతోషం
ఇంకొక్కసారిలా ఈ సత్యం ఒట్టేసి చెప్పనీ నీ స్నేహం
సుడిగాలి లాగ చెలరేగిపోద మరి నాలో ఉత్సాహం


నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే
నువ్వు నేను లోకమంటే మనమే అందామా
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను
ఇంతకంటె ఎందుకనుకుందామా!


ఇస్తమొచ్చినట్టు ఉందాం మనకి తోచినట్టు చేద్దాం
ఇస్తమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
ఈ ఏకాంతం మనకే సొంతం
ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం


******************************************

సాహిత్యం : చంద్రబోస్
గానం : సాధన సర్గం, ఉన్నికృష్ణన్



పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ..కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ..కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ


మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ


నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ


నా ఆలి అమ్మగా అవుతుండగా..జో లాలి పాడనా..కమ్మగా..కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ..కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ


పొత్తిల్లో ఎదిగే బాబు..నా వొళ్ళో ఒదిగే బాబు..ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగుని పట్టేవాడు..నా కడుపున పుట్టే వాడు..ఇద్దరికీ ప్రేమ అందించనా


నా చిన్ని నాన్ననీ..వాడి నాన్ననీ..నూరేళ్ళు సాకనా..చల్లగా..చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసికూనా..ముద్దుల కన్నా జో..జో
బంగరు తండ్రీ..జో..జో..బజ్జో లాలి జో..
పలికే పదమే వినక కనులారా నిదురపో..
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి


ఎదిగీ ఎదగని ఓ పసికూనా..ముద్దుల కన్నా జో..జో
బంగరు తండ్రీ..జో..జో..బజ్జో లాలి జో.. బజ్జో లాలి జో.. బజ్జో లాలి జో..

No comments: