April 23, 2009

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే!

సాహిత్యం : చంద్రబోస్
గానం : కార్తీక్, గాయత్రి


నా మనసుకి ప్రాణం పోసీ..
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ.. ఓ ఓ ఓ ఓ ఓ

ఒహొ హొ ఓ ఓ ఓ ఓ

నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి..ఓ ఓ ఓ ఓ ఓ


నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముందే పరచి
ఉన్నావు లోకం మరిచి


నా మనసుకి ప్రాణం పోసీ..
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ.. ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ


నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయే మాయే మాయే


నీ అడుగుకు ఆకులు పువులాయే
నీ కులుకికి కాకులు కవులాయే
నీ కలలకి నీ కథలకి
కదలాడే హాయే హాయే


అందంగా నన్నే పొగిడి
అటుపైన ఏదో అడిగి
నా మనసునె ఒక సరసులో అలజడులే సృష్టించావే


నా మనసుకి ప్రాణం పోసీ..
నీ మనసును కానుక చేసీ
నిలిచావే ప్రేమను పంచీ.. ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ


ఒక మాట ప్రేమగ పలకాలే
ఒక అడుగు జత పడి నడవలే
ఆ గురుతులు నా గుండెలో...
ప్రతి జన్మలో పదిలం పదిలం


ఒక సారి ఒడిలో ఒదగలే
ఎద పైన నిదుర పోవాలే
తీయ తీయని నీ స్మృతులతో...
బ్రతికేస్తా నిమిషం నిమిషం


నీ ఆశలు గమనించాలే
నీ ఆత్రుత గుర్తించాలే
ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే


************************************

సాహిత్యం : కులశేఖర్
గానం : ఉదిత్ నారాయణ్


Can you feel her?
Is your heart speaking to her?
Can you feel the love?
Yes!


ఏమైందీ ఈ వేళా..ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిట పట చినుకే ఈ వేళా
చెలి కులుకులు చూడగానే..చిరు చెమటలు పోయెనేలా


ఏ శిల్పి చెక్కెనీ శిల్పం .. సరికొత్తగా ఉది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం .. మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం .. వానలోన ఇంత దాహం !


చినుకులలో వాన విల్లూ..నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ..వెల వెల వెల బోయెనే
తన సొగసే తీగ లాగా..నా మనసే లాగెనే
అది మొదలూ ఆమెవైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో..ఉషోదయం .. ఇవాళిలా ఎదురే వస్తే


చిలిపి కనులు తాళమేసే..చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాట పాడే..తనువు మరిచి ఆటలాడే


ఏమైందీ ఈ వేళా..ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిట పట చినుకే ఈ వేళా
చెలి కులుకులు చూడగానే..చిరు చెమటలు పోయెనేలా


ఆమె అందమే చూస్తే..మరి లెదులేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే..ఎద మోయలేదు ఆ పులకింతా
తన చిలిపి నవ్వుతోనే..పెను మాయ చేసేనా
తన నడుము వంపులోనే..నెలవంక పూచెనా


కనుల ఎదుటే కలగ నిలిచా..కలలు నిజమై జగము మరిచా
మొదటి సారీ మెరుపు చూసా..కడలిలాగే ఉరకలేసా


********************************************
సాహిత్యం : కందికొండ


Hi ! Are you single?
I am your drink ! J
Hey Let’s go out man!
Your place or mine?


చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
పసి నడుమే నయగారా..అడుగేసే నను చేరా


చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా


సిమ్హమల్లే పొగరు ఉందీ..నన్ను గిచ్చీ చంపుతుందీ
చక్కిలి నొక్కా..చేరర పక్కా


హే వన్నె చిన్నె ఉన్న కన్నె..లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా..నీ పరువం మడతడి పోవులే
అంత మగసిరి నీలోనా..ఉన్నది కద మరి రావా
చప్పునొచ్చెయ్ .. వహ్చ్చి వాటెయ్ .. చురకలే వేసేయ్


అంతగ త్వరపడలేనులే..నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కధకళి ఆటలే.. పాడుకో చలిగిలి పాటలే


చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా


హే రూపు చూపీ కవ్విస్తారూ..గుండె పిండీ చంపుతారూ
మగువల జన్మా..అరె ఏవిటిర బ్రహ్మా
హో అవును అంటే కాదు అనిలే..కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకు పోవులే..మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీ పైనా..అల్ల్రి పెరిగెను నవ్వునా
దాచలేకా చెప్పలేకా ఏమిటో తడబాటూ


గుప్పెడు మనసున ఆశలూ..నెరవేరవు పూర్తిగ ఊహలూ
చెప్పకు పొడి పొడి మాటలే..అనుకున్నది అందితె హాయిలే

No comments: